News
News
X

TS PECET Result: తెలంగాణ పీఈ‌సెట్‌ ఫలి‌తాలు వెల్లడి, ర్యాంకు కార్డులు ఇలా డౌన్‌లోడ్ చేసుకోండి!

ఉన్నత విద్యా‌మం‌డలి చైర్మన్‌ ఆర్‌ లింబాద్రి, మహ‌త్మా‌గాంధీ వీసీ సీహెచ్‌ గోపా‌ల్‌‌రెడ్డి మాస‌బ్‌‌ట్యాం‌క్‌‌లోని ఉన్నత విద్యా‌మం‌డలి కార్యా‌ల‌యంలో పీఈ‌సెట్‌ ఫలి‌తాలను విడు‌దల చేశారు.

FOLLOW US: 
 
తెలంగాణ ఫిజి‌కల్‌ ఎడ్యు‌కే‌షన్‌ ఎంట్రెన్స్‌ టెస్ట్‌ (పీ‌ఈ‌సెట్‌) 2022 ఫలి‌తాలు సెప్టెంబరు 24న  వెలువడ్డాయి. ఉన్నత విద్యా‌మం‌డలి చైర్మన్‌ ఆర్‌ లింబాద్రి, మహ‌త్మా‌గాంధీ వీసీ సీహెచ్‌ గోపా‌ల్‌‌రెడ్డి మాస‌బ్‌‌ట్యాం‌క్‌‌లోని ఉన్నత విద్యా‌మం‌డలి కార్యా‌ల‌యంలో మధ్యాహ్నం 3.30 గం‌ట‌లకు ఫలితాలను విడు‌దల చేశారు. పరీక్షలకు హాజరైన అభ్యర్థులు వెబ్‌సైట్ ద్వారా తమ ఫలితాలను చూసుకోవచ్చు. పీడీఎఫ్ ఫార్మాట్‌లో ఫలితాలను అధికారులు విడుదల చేశారు.  పీఈసెట్ ర్యాంకు కార్డులను కూడా ఉన్నత విద్యామండలి అందుబాటులోకి తెచ్చింది. అభ్యర్థులు తమ హాల్‌టికెట్ నెంబర్, పుట్టిన తేదీ వివరాలు నమోదుచేసి ర్యాంకు కార్డు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. 

TS PECET 2022 ఫలితాల కోసం క్లిక్ చేయండి..

News Reels

TS PECET - 2022 RANK CARD

అండర్‌ గ్రాడ్యుయేషన్‌ ఆఫ్‌ ఫిజికల్‌ ఎడ్యుకేషన్ ‌(యూజీడీపీఈడీ), బ్యాచిలర్‌ ఆఫ్‌ ఫిజికల్‌ ఎడ్యుకేషన్ ‌(బీపీఈడీ) కోర్సుల్లో ప్రవేశానికి రాష్ట్రవ్యాప్తంగా 6 కేంద్రాల్లో సెప్టెంబరు 21న ఫిజికల్‌ ఈవెంట్స్‌ పరీక్షలు నిర్వహించారు. ఈ పరీక్షలకు మొత్తం 3,659 మంది దరఖాస్తు చేసుకోగా 2,340 మంది హాజరయ్యారు.
సెప్టెంబరు 21న ఉదయం 7 గంటలకు రాష్ట్ర వ్యాప్తంగా ఆయా కేంద్రాల్లో ఈ పరీక్షలు నిర్వహించారు. ఒకే రోజు పురుషులకు, మహిళలకు వేర్వేరుగా పరీక్షలు నిర్వహించారు. సెట్‌ చైర్మన్‌గా ఎంజీయూ వీసీ ప్రొఫెసర్‌ సీహెచ్‌.గోపాల్‌రెడ్డి, కన్వీనర్‌గా ఎంజీయూ డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ ఫిజికల్‌ ఎడ్యుకేషన్‌ డీన్‌ ప్రొఫెసర్‌ వి.సత్యనారాయణ వ్యవహరిస్తున్నారు.

పరీక్ష నిర్వహించిన కేంద్రాలివే..

మహాత్మాగాంధీ యూనివర్సిటీ, నల్లగొండ.

శ్రీకృష్ణ కాలేజ్‌ ఆఫ్‌ ఫిజికల్‌ ఎడ్యుకేషన్‌, శ్రీనాథపురం, అనుముల మండలం, నల్లగొండ జిల్లా.
.
ఎంఎంఆర్‌ కాలేజ్‌ ఆఫ్‌ ఫిజికల్‌ ఎడ్యుకేషన్‌, చౌటుప్పల్‌, యాదాద్రి భువనగిరి జిల్లా.

సిద్దార్థ కాలేజ్‌ ఆఫ్‌ ఫిజికల్‌ ఎడ్యుకేషన్‌, వినోభానగర్‌, ఇబ్రహీంపట్నం, రంగారెడ్డి జిల్లా.

వాగ్దేవి కాలేజ్‌ ఆఫ్‌ ఫిజికల్‌ ఎడ్యుకేషన్‌, బొల్లికుంట, వరంగల్‌ అర్బన్‌ జిల్లా.

వేదా కాలేజ్‌ ఆఫ్‌ ఫిజికల్‌ ఎడ్యుకేషన్‌, కొండపాక, సిద్దిపేట.

Also Read:  ఐసెట్‌ కౌన్సెలింగ్ షెడ్యూలు విడుదల, ముఖ్యతేదీలివే!

తెలంగాణ ఐసెట్‌ కౌన్సెలింగ్‌ షెడ్యూల్‌ సెప్టెంబరు 19న విడుదలైంది. ప్రకటించిన షెడ్యూలు ప్రకారం అక్టోబర్‌ 10 నుంచి ఐసెట్ కౌన్సెలింగ్ ప్రారంభంకానుంది. ఐసెట్-2022 పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులకు అక్టోబరు 10 నుంచి 13 వరకు ధ్రువపత్రాలను పరిశీలించనున్నారు. అక్టోబర్‌ 10 నుంచి 15వ తేదీ వరకు వెబ్‌ ఆప్షన్లు నమోదుకు అవకాశం కల్పించారు. ఇక వెబ్ ఆప్షన్లు నమోదుచేసుకున్న అభ్యర్థులకు అక్టోబరు 18న ఎంబీఏ, ఎంసీఏ అభ్యర్థులకు మొదటి విడుదల సీట్లు కేటాయించనున్నారు. 
ఐసెట్ పరీక్ష, కౌన్సెలింగ్ షెడ్యూలు కోసం క్లిక్ చేయండి..

Also Read:  జేఎన్‌టీయూహెచ్‌లో పార్ట్ టైమ్ పీజీ కోర్సులు, చివరితేది ఎప్పుడంటే?
హైదరాబాద్‌లోని జవహర్‌లాల్ నెహ్రూ టెక్నలాజికల్ యూనివర్సిటీ 2022-23 విద్యా సంవత్సరానికి ఎంటెక్, ఎంబీఏ పార్ట్‌టైమ్ పీజీ కోర్సుల్లో ప్రవేశాలకు దరఖాస్తులు కోరుతోంది. సరైన అర్హతలున్న అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. అక్టోబరు 17 వరకు దరఖాస్తుల సమర్పణకు అవకాశం ఉంది. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు నవంబరు 15 నుంచి 17 వరకు ప్రవేశ పరీక్ష నిర్వహిస్తారు.
కోర్సులు, ముఖ్యమైన తేదీల కోసం క్లిక్ చేయండి..

మరిన్ని విద్యాసంబంధ వార్తల కోసం క్లిక్ చేయండి..

Published at : 24 Sep 2022 06:32 PM (IST) Tags: Education News exam results TS PECET 2022 Result PECET Result Telangana State Physical Education Common Entrance Test Result

సంబంధిత కథనాలు

మిరపకాయలకు ఓ హిస్టరీ ఉందన్న విషయం మీకు తెలుసా.? అసలు మిర్చీ ఎందుకు కారంగా ఉంటుంది?

మిరపకాయలకు ఓ హిస్టరీ ఉందన్న విషయం మీకు తెలుసా.? అసలు మిర్చీ ఎందుకు కారంగా ఉంటుంది?

IIT Job Placements: వార్నీ రోజుకు లక్ష రూపాయల జీతమా, ఏంది భయ్యా ఇదీ?

IIT Job Placements: వార్నీ రోజుకు లక్ష రూపాయల జీతమా, ఏంది భయ్యా ఇదీ?

APEAPCET 2022 Counselling: నేటి నుంచి 'ఫార్మసీ' కోర్సుల్లో ప్రవేశాలకు కౌన్సెలింగ్, సీట్ల కేటాయింపు ఎప్పుడంటే?

APEAPCET 2022 Counselling: నేటి నుంచి 'ఫార్మసీ' కోర్సుల్లో ప్రవేశాలకు కౌన్సెలింగ్, సీట్ల కేటాయింపు ఎప్పుడంటే?

తెలంగాణ ఎడ్‌సెట్ తుది విడత సీట్ల కేటాయింపు పూర్తి!

తెలంగాణ ఎడ్‌సెట్ తుది విడత సీట్ల కేటాయింపు పూర్తి!

AP LAWCET: డిసెంబరు 3 నుంచి 'ఏపీ లాసెట్‌-2022' కౌన్సెలింగ్‌, సీట్ల కేటాయింపు ఎప్పుడంటే?

AP LAWCET: డిసెంబరు 3 నుంచి 'ఏపీ లాసెట్‌-2022' కౌన్సెలింగ్‌, సీట్ల కేటాయింపు ఎప్పుడంటే?

టాప్ స్టోరీస్

NRI Hospital Godava : ఎన్నారై ఆస్పత్రి డైరక్టర్ల మధ్య గొడవలే కొంప ముంచాయా ? ఈడీ, ఐటీ దాడుల వెనుక అసలేం జరిగింది ?

NRI Hospital Godava : ఎన్నారై ఆస్పత్రి డైరక్టర్ల మధ్య గొడవలే కొంప ముంచాయా ? ఈడీ, ఐటీ దాడుల వెనుక అసలేం జరిగింది ?

Nellore Janasena : నెల్లూరులో జనసేన పరిస్థితి ఏంటి? పార్టీ నేతలతో నాగబాబు భేటీ!

Nellore Janasena : నెల్లూరులో జనసేన పరిస్థితి ఏంటి?  పార్టీ నేతలతో నాగబాబు భేటీ!

కొత్త దర్శకుడికి అవకాశం ఇచ్చిన సాయి ధరమ్ తేజ్ - నయా సినిమా షురూ!

కొత్త దర్శకుడికి అవకాశం ఇచ్చిన సాయి ధరమ్ తేజ్ - నయా సినిమా షురూ!

MP GVL Narsimharao : ఏప్రిల్ నాటికి ఏపీలో 5G సేవలు, విశాఖ నుంచి మూడు వందే భారత్ ట్రైన్స్ - ఎంపీ జీవీఎల్

MP GVL Narsimharao : ఏప్రిల్ నాటికి ఏపీలో 5G సేవలు, విశాఖ నుంచి మూడు వందే భారత్ ట్రైన్స్ - ఎంపీ జీవీఎల్