News
News
X

TS ICET 2022 Counselling: ఐసెట్‌ కౌన్సెలింగ్ షెడ్యూలు విడుదల, ముఖ్యతేదీలివే!

ఐసెట్-2022 పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులకు అక్టోబరు 10 నుంచి 13 వరకు ధ్రువపత్రాలను పరిశీలించనున్నారు. అక్టోబర్‌ 10 నుంచి 15వ తేదీ వరకు వెబ్‌ ఆప్షన్లు నమోదుకు అవకాశం కల్పించారు.

FOLLOW US: 

తెలంగాణ ఐసెట్‌ కౌన్సెలింగ్‌ షెడ్యూల్‌ సెప్టెంబరు 19న విడుదలైంది. ప్రకటించిన షెడ్యూలు ప్రకారం ఐసెట్-2022 పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులు అక్టోబరు 8 నుంచి 12 వరకు ధ్రువపత్రాల పరిశీలనకు స్లాట్ బుకింగ్ చేసుకోవాల్సి ఉంటుంది. అక్టోబరు 10 నుంచి 13 వరకు ధ్రువపత్రాల పరిశీలన చేపట్టనున్నారు. అక్టోబర్‌ 10 నుంచి 15 వరకు వెబ్‌ ఆప్షన్లు నమోదుకు అవకాశం కల్పించారు. వెబ్ ఆప్షన్లు నమోదుచేసుకున్న అభ్యర్థులకు అక్టోబరు 18న మొదటి విడత సీట్లు కేటాయించనున్నారు. 


అక్టోబరు 23 నుంచి తుదివిడత కౌన్సెలింగ్..

అక్టోబరు 23 నుంచి ఐసెట్‌ తుదివిడత కౌన్సెలింగ్‌ నిర్వహించనున్నారు. అక్టోబరు 23 నుంచి 25 వరకు తుదివిడుత వెబ్‌ ఆప్షన్ల నమోదుకు అవకాశం ఉంటుంది. అక్టోబరు 28న ఎంబీఏ, ఎంసీఏ తుదివిడుత సీట్ల కేటాయిస్తారు. ఇక అక్టోబరు 28 రోజునే స్పాట్‌ అడ్మిషన్ల కోసం అధికారులు మార్గదర్శకాలు విడుదల చేయనున్నారు. 

కౌన్సెలింగ్ పూర్తి షెడ్యూలు ఇదే..♦ అక్టోబరు 8 నుంచి 12 వరకు ధ్రువపత్రాల పరిశీలనకు స్లాట్ బుకింగ్

♦ అక్టోబరు 10 నుంచి 13 వరకు అభ్యర్థుల ధ్రువపత్రాల పరిశీలన

♦ అక్టోబరు 10 నుంచి 15 వరకు వెబ్ ఆప్షన్ల నమోదు

♦ అక్టోబరు 18న ఎంబీఏ, ఎంసీఏ తొలి విడత సీట్ల కేటాయింపు

♦ అక్టోబరు 23 నుంచి ఐసెట్ తుది విడత కౌన్సెలింగ్ ప్రక్రియ ప్రారంభం

♦ అక్టోబరు 23 నుంచి 25 వరకు తుది విడత వెబ్ ఆప్షన్లు

♦ అక్టోబరు 28న ఎంబీఏ, ఎంసీఏ తుది విడత సీట్ల కేటాయింపు

♦ అక్టోబరు 28న స్పాట్ అడ్మిషన్ల మార్గదర్శకాలు విడుదల


ఏడాది పరీక్ష జులై 27, 28 తేదీల్లో మొత్తం నాలుగు సెషన్లలో ఐసెట్-2022 పరీక్ష నిర్వహించిన విష‌యం తెలిసిందే. పరీక్ష కోసం తెలంగాణలో 62, ఆంధ్రప్రదేశ్‌లో 4 మొత్తంగా 66 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. పర్యవేక్షణ కోసం 66 మంది చీఫ్‌ సూపరింటెండెంట్లను, 75 మంది అబ్జర్వర్లను నియమించి వరంగల్‌లోని కాకతీయ యూనివర్సిటీ పరీక్షలు నిర్వహించింది.

ఈ పరీక్ష రాసేందుకు తెలంగాణ, ఏపీల్లో కలిపి 90.56 శాతం మంది అభ్యర్థులు హాజరయ్యారు. పరీక్ష కోసం 75,952 మంది దరఖాస్తు చేసుకోగా 68,781 మంది అభ్యర్థులు పరీక్షకు హాజరయ్యారు. వీరిలో 7,171 మంది పరీక్షకు గైర్హాజరయ్యారు. పరీక్షకు హాజరైనవారిలో 61,613 మంది అభ్యర్థులు అర్హత సాధించారు. మొత్తం 89.58 శాతం ఉత్తీర్ణత సాధించారు. ఐసెట్ పరీక్షకు సంబంధించిన ఆన్సర్‌ కీని ఆగస్టు 4న విడుదల చేశారు. ఆన్సర్‌ కీపై  ఆగస్టు 8 వరకు అభ్యంతరాలు స్వీకరించారు. తాజాగా ఆగస్టు 27న ఫలితాలు వెల్లడించారు. తాజాగా కౌన్సెలింగ్ షెడ్యూలును ప్రకటించారు.

 

ICET - ఈ కోర్సులతో ఉత్తమ భవిత:

ఎంసీఏ:
ఐటీ రంగంలో స్థిరపడాలనుకునేవారికి ఎంసీఏ సరైన ఎంపిక అని చెప్పవచ్చు. ఇందుకు మ్యాథ్స్ పై పట్టు ప్రాక్టికల్ ఓరియంటేషన్, ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ ఉన్నవారు ఈ రంగాన్నే ఎంచుకోవచ్చు. ఇందులో ఎక్కువ టెక్నాలజీతో పని చేయాల్సి ఉంటుంది. కాబట్టి టెక్నాలజీలో వస్తున్న మార్పులకు ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ దానిపై అవగాహన అధ్యయనం చేయగలగాలి. ప్రస్తుతం మార్కెట్లో కమ్యూనికేషన్ స్కిల్స్ ఉన్న అభ్యర్థులకు ఎక్కువగా అవకాశాలు లభిస్తున్నాయి. ఎంసీఏ పూర్తి చేసుకున్న వారికి ప్రధానంగా ఉపాధి కల్పించేది సాఫ్ట్ వేర్ రంగమే. ఈ కోర్స్ లో చేరినప్పటి నుంచే ప్రోగ్రామింగ్, నైపుణ్యాలపై దృష్టి సారించాలి. ఈ రంగంలో వస్తున్న నూతన ఆవిష్కరణలు, పరిశోధనలు ఎప్పటికప్పుడు బేరీజు వేసుకోవాలి.

జాబ్ మార్కెట్లో బీటెక్‌తో పోటీ పడాల్సి ఉంటుంది. అందుకు అనుగుణంగా కావల్సిన నైపుణ్యాలకు ప్రాధాన్యమిస్తూ సైన్స్ ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ ,బ్లాక్ ఛైన్ టెక్నాలజీ, ఆటోమేషన్, రోబోటిక్స్ తదితర టెక్నాలజీల ముందు వరుసలో నిలుస్తాయి. పరిశ్రమలకు అనుగుణంగా ఆర్ ప్రోగ్రామింగ్ సేల్స్ ఫోర్స్ టెక్నాలజీ, సైబర్ సెక్యూరిటీ, యాప్ డెవలప్మెంట్, ఆండ్రాయిడ్ డెవలప్మెంట్, మొబైల్ అప్లికేషన్ డెవలప్మెంట్ వంటి కోర్సుల్లో ప్రావీణ్యం అవసరం. క్యాంపస్ ఇంటర్వ్యూల్లో ఎంపికైతే మంచి జీతంతో పాటు చక్కటి కెరీర్ను పొందవచ్చు.


ఎంబీఏ
:
నేటి యువతను ఎక్కువగా ఆకర్షిస్తున్న కోర్సుల్లో ఎంబీఏ (మాస్టర్ ఆఫ్ బిజినెస్ మేనేజ్‌మెంట్) మొదటి మూడు స్థానాల్లో కచ్చితంగా ఉంటుంది. ఈ కోర్సు చేయడం వల్ల కార్పొరేట్ రంగంలోని కీలక బాధ్యతలు నిర్వహించాల్సి ఉంటుంది. ఈ రంగంపై ఆసక్తితో పాటు నాయకత్వ లక్షణాలు ఉన్నవారు ఇందులో త్వరగా రాణిస్తారు. బిజినెస్ స్కిల్స్, టీం మేనేజ్‌మెంట్, టీమ్ లీడింగ్ సామర్థ్యం, ప్రణాళిక, భవిష్యత్ పరిణామాలను అంచనా వేయడం, బృందా పనితీరును మెరుగు పరిచే ఎలా తీర్చిదిద్దడం, సమస్యలు వచ్చినప్పుడు కారణాలు అన్వేషించి, ఇంటర్ పర్సనల్ స్కిల్స్ ఉన్నవారు ఈ కోర్సును ఎంచుకోవచ్చు. ఎంబీఏ పూర్తి చేసిన వారు బిజినెస్ మేనేజర్లు, సీఈఓ, అంతేకాకుండా ఎంటర్ప్రెన్యూర్ గా మారవచ్చు.

ఎంబీఏలో మార్కెటింగ్, హెచ్ఆర్ ,ఫైనాన్స్ తదితర స్పెషలైజేషన్లు ఉంటాయి. ఈ కోర్సు రాణించాలంటే కేస్ స్టడీలను పరిశీలించాలి. అంతేకాకుండా మార్కెట్‌ అవసరాలకు అనుగుణంగా కమ్యూనికేషన్ స్కిల్స్, సాఫ్ట్ స్కిల్స్, ఇంగ్లిష్ భాషపై పట్టు మెరుగుపరుచుకోవాలి. అంతేకాకుండా ఎంచుకున్న స్పెషలైజేషన్‌పై ప్రత్యేక ప్రావీణ్యం సంతరించుకోవడంతో పాటు, ప్రాజెక్ట్‌వర్క్ చేయాలి. కార్పొరేట్ రంగంలో ఎందుకు వ్యక్తిగత చొరవ కూడా ఉండాలి.

ప్రతి సంవత్సరం ఎంబీఏ పూర్తి చేసుకొని పెద్ద సంఖ్యలో బయటికి వస్తున్నారు. ఉద్యోగాలు మాత్రం కొందరికే లభిస్తున్నాయి. ఎందుకంటే దీని సరిపడా నైపుణ్యాలు కొంతమంది లోనే ఉంటున్నాయి. కాబట్టి అలా నేర్చుకునే వారికి న్యూమరికల్ ఎబిలిటీ, ఇంగ్లీష్, కమ్యూనికేషన్ స్కిల్స్ అవసరం. అలా నేర్చుకున్నవారికి బ్యాంకింగ్, ఫార్మ్, అగ్రికల్చర్, ఇన్సూరెన్స్ ,హెల్త్, ఎఫ్ఎంసీజీ వంటి రంగాల్లో వివిధ స్థాయిల్లో అవకాశాలు లభిస్తాయి.

 

Also Read:

అంబేడ్కర్ వర్సిటీ ప్రవేశాల దరఖాస్తు గడువు మరోసారి పొడిగింపు, చివరితేది ఎప్పుడంటే?
అంబేడ్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం డిగ్రీ (బీఏ/బీకాం/బీఎస్సీ), పీ.జీ(ఎంఏ, ఎంకామ్, ఎమ్మెస్సీ, ఎంబీఏ, బీఎల్ఐఎస్‌సీ, ఎంఎల్ఐఎస్‌సీ, పీజీ డిప్లొమా, పలు సర్టిఫికెట్) కోర్సుల్లో ప్రవేశాల గడువును అధికారులు పొడిగిస్తూ నిర్ణయం తీసుకున్నారు. సెప్టెంబరు 30 వరకు ప్రవేశాల దరఖాస్తుకు అవకాశం కల్పించారు. రెండు తెలుగు రాష్ట్రాల్లోని విద్యార్థులు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవచ్చు. 
కోర్సుల వివరాలు, దరఖాస్తు కోసం క్లిక్ చేయండి..

 

Also Read:

జేఎన్‌టీయూహెచ్‌లో పార్ట్ టైమ్ పీజీ కోర్సులు, చివరితేది ఎప్పుడంటే
హైదరాబాద్‌లోని జవహర్‌లాల్ నెహ్రూ టెక్నలాజికల్ యూనివర్సిటీ 2022-23 విద్యా సంవత్సరానికి ఎంటెక్, ఎంబీఏ పార్ట్‌టైమ్ పీజీ కోర్సుల్లో ప్రవేశాలకు దరఖాస్తులు కోరుతోంది. సరైన అర్హతలున్న అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. అక్టోబరు 17 వరకు దరఖాస్తుల సమర్పణకు అవకాశం ఉంది. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు నవంబరు 15 నుంచి 17 వరకు ప్రవేశ పరీక్ష నిర్వహిస్తారు.
కోర్సులు, ముఖ్యమైన తేదీల కోసం క్లిక్ చేయండి..

 

మరిన్ని విద్యాసంబంధ వార్తల కోసం క్లిక్ చేయండి..

Published at : 20 Sep 2022 06:33 AM (IST) Tags: Education News TS ICET 2022 Counselling Dates ICET 2022 Counselling Schedule ICET Counselling Dates

సంబంధిత కథనాలు

TS PECET Result: తెలంగాణ పీఈ‌సెట్‌ ఫలి‌తాలు వెల్లడి, ర్యాంకు కార్డులు ఇలా డౌన్‌లోడ్ చేసుకోండి!

TS PECET Result: తెలంగాణ పీఈ‌సెట్‌ ఫలి‌తాలు వెల్లడి, ర్యాంకు కార్డులు ఇలా డౌన్‌లోడ్ చేసుకోండి!

CUET PG Final Key: సీయూఈటీ పీజీ తుది ఆన్సర్ కీ విడుదల, ఇలా చెక్ చేసుకోండి!

CUET PG Final Key: సీయూఈటీ పీజీ తుది ఆన్సర్ కీ విడుదల, ఇలా చెక్ చేసుకోండి!

PECET Result: నేడు పీఈ‌సెట్‌ ఫలి‌తాలు వెల్లడి, ఇక్కడ చూసుకోండి!

PECET Result: నేడు పీఈ‌సెట్‌ ఫలి‌తాలు వెల్లడి, ఇక్కడ చూసుకోండి!

Pragathi Scholarship: మహిళా 'ప్రతిభ'కు చేయూత 'ప్రగతి' స్కాలర్‌షిప్‌!! దరఖాస్తు చేసుకోండి, అర్హతలివే!

Pragathi Scholarship: మహిళా 'ప్రతిభ'కు చేయూత 'ప్రగతి' స్కాలర్‌షిప్‌!! దరఖాస్తు చేసుకోండి, అర్హతలివే!

KNRUHS Admissions: బీఎస్సీ-నర్సింగ్, బీపీటీ కోర్సులకు దరఖాస్తు చేసుకోండి, పూర్తి వివరాలు ఇలా!

KNRUHS Admissions: బీఎస్సీ-నర్సింగ్, బీపీటీ కోర్సులకు దరఖాస్తు చేసుకోండి, పూర్తి వివరాలు ఇలా!

టాప్ స్టోరీస్

YSRCP ఎమ్మెల్యే శ్రీ‌దేవికి షాక్, సొంత పార్టీ నేత‌లే అవినీతి ఆరోప‌ణ‌లు - మొదట్నుంచీ వివాదాలే

YSRCP ఎమ్మెల్యే శ్రీ‌దేవికి షాక్, సొంత పార్టీ నేత‌లే అవినీతి ఆరోప‌ణ‌లు - మొదట్నుంచీ వివాదాలే

Mann Ki Baat Highlights: చండీగఢ్ విమానాశ్రయానికి భగత్ సింగ్ పేరు- ప్రకటించిన మోదీ

Mann Ki Baat Highlights: చండీగఢ్ విమానాశ్రయానికి భగత్ సింగ్ పేరు- ప్రకటించిన మోదీ

Chittoor Fire Accident: రేణిగుంటలో భారీ అగ్ని ప్రమాదం, ఇద్దరు చిన్నారులు సహా ముగ్గురు మృతి - డాక్టర్ సజీవదహనం

Chittoor Fire Accident: రేణిగుంటలో భారీ అగ్ని ప్రమాదం, ఇద్దరు చిన్నారులు సహా ముగ్గురు మృతి - డాక్టర్ సజీవదహనం

Balakrishna : 'జల్సా' రికార్డులు బ్రేక్ చేసిన బాలకృష్ణ 'చెన్నకేశవరెడ్డి'

Balakrishna : 'జల్సా' రికార్డులు బ్రేక్ చేసిన బాలకృష్ణ 'చెన్నకేశవరెడ్డి'