News
News
X

BRAOU: అంబేడ్కర్ వర్సిటీ ప్రవేశాల దరఖాస్తు గడువు మరోసారి పొడిగింపు, చివరితేది ఎప్పుడంటే?

బీఆర్ అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీ ప్రవేశ దరఖాస్తు గడువు మరోసారి పొడిగించారు. అయితే అభ్యర్థులు అభ్యర్థన మేరకు ప్రవేశ దరఖాస్తు గడువును పొడిగించినట్లు తెలుస్తోంది.

FOLLOW US: 

అంబేడ్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం డిగ్రీ (బీఏ/బీకాం/బీఎస్సీ), పీ.జీ(ఎంఏ, ఎంకామ్, ఎమ్మెస్సీ, ఎంబీఏ, బీఎల్ఐఎస్‌సీ, ఎంఎల్ఐఎస్‌సీ, పీజీ డిప్లొమా, పలు సర్టిఫికెట్) కోర్సుల్లో ప్రవేశాల గడువును అధికారులు పొడిగిస్తూ నిర్ణయం తీసుకున్నారు. సెప్టెంబరు 30 వరకు ప్రవేశాల దరఖాస్తుకు అవకాశం కల్పించారు. రెండు తెలుగు రాష్ట్రాల్లోని విద్యార్థులు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవచ్చు. ఇప్పటికే రెండుసార్లు దరఖాస్తు గడువును పొడిగించిన సంగతి తెలిసిందే. అయితే అభ్యర్థులు అభ్యర్థన మేరకు ప్రవేశ దరఖాస్తు గడువును మరోసారి పొడిగించారు.

అయితే రూ.500 ఆలస్య రుసుముతో దరఖాస్తు గడువు ముగిసిన తర్వాత కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. ప్రస్తుతానికి సెప్టెంబరు 30 వరకు ఎలాంటి ఆలస్య రుసుము చెల్లించాల్సిన అవసరంలేదు. ఆయా కోర్సుల్లో చేరడానికి, విద్యార్హతలు, ఫీజు తదితర వివరాలను సమీపంలోని అధ్యయన కేంద్రాన్ని సందర్శించాల్సి ఉంటుంది. పూర్తి వివరాల కోసం వెబ్‌సైట్‌ చూడవచ్చు. మరిన్ని వివరాలకు 7382929570/580/590/600, 040-23680290/ 291/294/295 నంబర్లలో సంప్రదించవచ్చు.

కోర్సుల వివరాలు..

 

1) డిగ్రీ కోర్సులు: బీఏ, బీకామ్, బీఎస్సీ.

2) పీజీ కోర్సులు: ఎంఏ (జర్నలిజం & మాస్ కమ్యూనికేషన్, ఎకనామిక్స్, హిస్టరీ, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, పొలిటికల్ సైన్స్, సోషియాలజీ, ఇంగ్లిష్, తెలుగు, హిందీ, ఉర్దూ),  ఎంఎస్సీ (మ్యాథమెటిక్స్/అప్లైడ్ మ్యాథమెటిక్స్, సైకాలజీ, బోటనీ, కెమిస్ట్రీ, ఎన్విరాన్‌మెంటల్ సైన్స్, ఫిజిక్స్, జువాలజీ), ఎంకామ్, ఎంబీఏ, ఎంఎల్ఐఎస్సీ, బీఎల్‌ఐఎస్సీ.

3) పీజీ డిప్లొమా కోర్సులు: ఎన్విరాన్‌మెంటల్ స్టడీస్, రైటింగ్ ఇన్ మాస్ మీడియా (తెలుగు), హ్యూమన్ రైట్స్, కల్చర్ అండ్ హెరిటేజ్ టూరిజం, ఉమెన్స్ స్టడీస్.


4) సర్టిఫికేట్ కోర్సులు: ఫుడ్ అండ్ న్యూట్రీషన్, లిటరసీ అండ్ కమ్యూనిటీ డెవలప్‌మెంట్, ఎన్జీవోస్ మేనేజ్‌మెంట్, ఎర్లీ చైల్డ్‌హుడ్ కేర్ అండ్ ఎడ్యుకేషన్.


అర్హతలు:
 

* డిగ్రీ కోర్సులకు ఇంటర్ లేదా తత్సమాన విద్యార్హత ఉండాలి. నేషనల్ ఓపెన్ స్కూల్ నుంచి ఇంటర్ చదివినా అర్హులే. 

* పీజీ కోర్సులకు ఏదైనా డిగ్రీ అర్హత ఉంటే సరిపోతుంది. ఎంకామ్ కోర్సుకు మాత్రం బీబీఏ, బీబీఎం, బీఏ(కామర్స్) ఉండాలి. సైన్స్ సబ్జెక్టులకు కూడా సంబంధిత విభాగంలో డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. 

* పీజీడిప్లొమా, సర్టిఫికేట్ కోర్సులకు ఏదైనా విభాగంలో డిగ్రీ ఉండాలి.


ముఖ్యమైన తేదీలు..


* ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 30.06.2022

* ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరితేది: 30.09.2022.


డిగ్రీ కోర్సుల్లో ప్రవేశ సమాచారం కోసం క్లిక్ చేయండి..


పీజీ కోర్సుల్లో ప్రవేశ సమాచారం కోసం క్లిక్ చేయండి..


పీజీ రెండో సంవత్సరం ప్రవేశ సమాచారం కోసం క్లిక్ చేయండి..

 

Admission Notification


Website

 

Also Read:

UPSC: సివిల్ సర్వీసెస్ మెయిన్ ఎగ్జామ్ హాల్‌టికెట్లు వచ్చేశాయ్, పరీక్షలు ఎప్పుడంటే?
సివిల్ సర్వీసెస్ మెయిన్స్ 2022 పరీక్షల హాల్‌టికెట్లను యూపీఎస్సీ విడుదల చేసింది. యూపీఎస్సీ అధికారిక వెబ్‌సైట్‌లో హాల్‌టికెట్లను అందుబాటులో ఉంచింది. ప్రిలిమ్స్ పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులు  మెయిన్ పరీక్ష కోసం తమ హాల్‌టికెట్లను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. సివిల్స్ ప్రిలిమినరీ పరీక్షలో అర్హత సాధించిన 11,845 మంది అభ్యర్థులు మెయిన్స్ పరీక్షలకు హాజరుకానున్నారు.
పూర్తివివరాల కోసం క్లిక్ చేయండి..

 

Also Read:

FCI Recruitment 2022: ఎఫ్‌సీఐలో 5 వేలకుపైగా ఉద్యోగాలు!
ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎఫ్ సీఐ) జూనియర్ ఇంజినీర్, అసిస్టెంట్ గ్రేడ్ III,  ఇతరుల దరఖాస్తుల కోసం అధికారిక నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. ఆసక్తితో పాటు అర్హత ఉన్న అభ్యర్థులు సెప్టెంబర్ 6వ తేదీ నుంచి ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చని వివరించింది. అయితే ఎఫ్సీఐ 2022 రిక్రూట్మెంట్ కు సంబంధించిన ముఖ్యమైన తేదీలు, విద్యార్హతలు, వయోపరిమితి, జీతం వివరాలు మరియు దరఖాస్తు రుసుము వంటి  అన్ని వివరాల 
నోటిఫికేషన్ తదితర వివరాల కోసం క్లిక్ చేయండి.. 

 

మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి...

 

మరిన్ని విద్యాసంబంధ వార్తల కోసం క్లిక్ చేయండి..

Published at : 16 Sep 2022 10:45 AM (IST) Tags: Education News BRAOU Admissions BRAOU UG Admissions BRAOU Admission Notification 2022 Dr. B. R. AMBEDKAR OPEN UNIVERSITY

సంబంధిత కథనాలు

RGUKT Counselling: అక్టోబరు 12 నుంచి ట్రిపుల్‌ ఐటీ ప్రవేశాలకు కౌన్సెలింగ్!

RGUKT Counselling: అక్టోబరు 12 నుంచి ట్రిపుల్‌ ఐటీ ప్రవేశాలకు కౌన్సెలింగ్!

GATE 2023 Registration: 'గేట్-2023' దరఖాస్తుకు నేడే ఆఖరు, ఆలస్యరుసుముతో చివరితేది ఎప్పుడంటే?

GATE 2023 Registration: 'గేట్-2023' దరఖాస్తుకు నేడే ఆఖరు, ఆలస్యరుసుముతో చివరితేది ఎప్పుడంటే?

GATE 2023 Registration: రేపటితో 'గేట్-2023' దరఖాస్తుకు ఆఖరు, ఆలస్యరుసుముతో చివరితేది ఎప్పుడంటే?

GATE 2023 Registration: రేపటితో 'గేట్-2023' దరఖాస్తుకు ఆఖరు, ఆలస్యరుసుముతో చివరితేది ఎప్పుడంటే?

Medical Seats : వైద్య విద్యార్థులకు గుడ్ న్యూస్, బీ-కేటగిరి సీట్లలో 85 శాతం స్థానికులకే!

Medical Seats : వైద్య విద్యార్థులకు గుడ్ న్యూస్, బీ-కేటగిరి సీట్లలో 85 శాతం స్థానికులకే!

TS ICET 2022 Counselling: ఐసెట్ కౌన్సెలింగ్ నోటిఫికేషన్ వచ్చేసింది, అందుబాటులో వెబ్‌సైట్!

TS ICET 2022 Counselling: ఐసెట్ కౌన్సెలింగ్ నోటిఫికేషన్ వచ్చేసింది, అందుబాటులో వెబ్‌సైట్!

టాప్ స్టోరీస్

Revant Vs KTR : తెలంగాణ ఉద్యమంలో మీరెక్కడ ? సోషల్ మీడియాలో రేవంత్ వర్సెస్ కేటీఆర్ !

Revant Vs KTR :  తెలంగాణ ఉద్యమంలో మీరెక్కడ ? సోషల్ మీడియాలో రేవంత్ వర్సెస్ కేటీఆర్ !

Bandla Ganesh: 'భార్యని, బిడ్డల్ని ప్రేమించనోడు అసలు మనిషేనా' - పూరీ జగన్నాథ్‌పై బండ్ల గణేష్ కామెంట్స్!

Bandla Ganesh: 'భార్యని, బిడ్డల్ని ప్రేమించనోడు అసలు మనిషేనా' - పూరీ జగన్నాథ్‌పై బండ్ల గణేష్ కామెంట్స్!

The Ghost: 'డబ్బు, సక్సెస్, సంతోషం కంటే శత్రువులనే ఎక్కువ సంపాదిస్తుంది' - 'ది ఘోస్ట్' కొత్త ట్రైలర్!

The Ghost: 'డబ్బు, సక్సెస్, సంతోషం కంటే శత్రువులనే ఎక్కువ సంపాదిస్తుంది' - 'ది ఘోస్ట్' కొత్త ట్రైలర్!

5G Launch India: 5G సేవల్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ, ఇండియన్ మొబైల్ కాంగ్రెస్‌లో ఆవిష్కరణ

5G Launch India: 5G సేవల్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ, ఇండియన్ మొబైల్ కాంగ్రెస్‌లో ఆవిష్కరణ