TG CETs 2025: తెలంగాణలో ప్రవేశ పరీక్షల తేదీలు ఖరారు, ఏ ఎగ్జామ్ ఎప్పుడంటే?
Telangana CETs: తెలంగాణలో నిర్వహించే వివిధ ప్రవేశ పరీక్షల షెడ్యూలును ఉన్నత విద్యామండలి విడుదల చేసింది.ఎంసెట్, ఈసెట్, లాసెట్, పీజీసెట్, ఐసెట్, ఎడ్‌సెట్, పీజీఈ సెట్ తేదీలను ప్రకటించింది.
Telangana Common Entrance Tests 2025: తెలంగాణలో 2025-26 విద్యాసంవత్సరానికి సంబంధించి వివిధ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే ఉమ్మడి ప్రవేశ పరీక్షల (కామన్ ఎంట్రెన్స్ టెస్టులు) షెడ్యూలును ఉన్నత విద్యామండలి జనవరి 15న ప్రకటించింది. అయితే ఆయా పరీక్షల నిర్వహణకు సంబంధించి.. దరఖాస్తు చేసుకోవడానికి రిజిస్ట్రేషన్ ఫీజు ఇతర వివరాలతో కూడిన వివరణాత్మక నోటిఫికేషన్లను సంబంధిత సెట్ కన్వీనర్లు ప్రకటిస్తారు. వేర్వేరుగా నోటిఫికేషన్లు వెలువడతాయి..
ప్రకటించిన షెడ్యూలు ప్రకారం.. ఏప్రిల్ 29 నుంచి జూన్ 19 మధ్య ఎంట్రెన్స్ టెస్టులు నిర్వహించనున్నారు. ఈ షెడ్యూలు ప్రకారం ఏప్రిల్ 29 నుంచి మే 5 వరకు టీజీఈఏపీసెట్ (TG EAPCET 2025) పరీక్షలు నిర్వహించనున్నారు. ఇందులో ఏప్రిల్ 29, 30 తేదీల్లో అగ్రికల్చర్, ఫార్మా కోర్సుల్లో ప్రవేశాలకు; మే 2 నుంచి 5 వరకు ఇంజినీరింగ్ ప్రవేశాల కోసం పరీక్షలు నిర్వహించనున్నారు. జేఎన్‌టీయూ హైదరాబాద్ పరీక్షల నిర్వహణ బాధ్యతను చేపట్టంది. ఈఏపీసెట్ కన్వీనర్‌గా ప్రొఫెసర్ బి. డీన్ కుమార్ వ్యవహిరించనున్నారు.
➥ డిప్లొమా విద్యార్థులు ఇంజినీరింగ్, ఫార్మా కోర్సుల్లో రెండో సంవత్సరంలో చేరేందుకు నిర్వహించే ఈసెట్ (TG ECET) మే 12న జరగనుంది. ఉస్మానియా యూనివర్సిటీ నిర్వహించే ఈసెట్ కన్వీనర్‌గా ఓయూ ఇంజినీరింగ్ కాలేజీ ప్రిన్సిపల్ ప్రొఫెసర్ చంద్రశేఖర్ వ్యవహరించనున్నారు.
➥ బీఈడీ ప్రవేశాల కోసం జూన్ 1న ఎడ్ సెట్ జరగనుంది. కాకతీయ యూనివర్సిటీ నిర్వహించే ఎడ్‌సెట్ (TG EDCET) కన్వీనర్‌గా కేయూ ప్రొఫెసర్ బి.వెంకట్రామిరెడ్డి వ్యవహరించనున్నారు.
➥ ఎల్‌ఎల్‌బీ ప్రవేశాల కోసం లాసెట్, ఎల్ఎల్ఎం కోసం పీజీఎల్ సెట్ పరీక్షలు జూన్ 6న నిర్వహిస్తారు. లాసెట్, పీజీఎల్ సెట్ (TG LAWCET/ PGLCET)నిర్వహణ బాధ్యతలు ఉస్మానియా విశ్వవిద్యాలయానికి అప్పగించి.. కన్వీనర్‌గా ప్రొఫెసర్ బి.విజయలక్ష్మి వ్యవహరించనున్నారు.
➥ ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాల కోసం జూన్ 8, 9 తేదీల్లో ఐసెట్ (TG ICET) పరీక్ష నిర్వహించనున్నారు. ఐసెట్‌ను నల్గొండలోని మహాత్మగాంధీ యూనివర్సిటీ నిర్వహించనుంది. ఐసెట్ కన్వీనర్‌గా ప్రొఫెసర్ అలువాల రవి వ్యవహరించనున్నారు.
➥ ఎంటెక్, ఎంఫార్మసీ కోర్సుల కోసం జూన్ 16 నుంచి 19 వరకు పీజీఈసెట్ (PG ECET) నిర్వహించనున్నారు. జేఎన్టీయూహెచ్ నిర్వహించే పీజీఈసెట్ కన్వీనర్‌గా ప్రొఫెసర్ ఎ.అరుణ కుమారి వ్యవహరించనున్నారు.
➥ వ్యాయామ విద్య(ఫిజికల్ ఎడ్యుకేషన్) కోర్సులు డీపీఈడీ, బీపీఈడీ కోర్సుల్లో ప్రవేశాల కోసం జూన్ 11 నుంచి 14 వరకు పీఈసెట్ (TG PECET) నిర్వహిస్తారు. పాలమూరు యూనివర్సిటీ నిర్వహించే పీఈసెట్ కన్వీనర్‌గా ప్రొఫెసర్ ఎన్.ఎస్.దిలీప్ ఉన్నారు. పీఈసెట్ మినహా మిగతా ఎంట్రన్స్‌లన్నింటినీ ఆన్‌లైన్ విధానంలో నిర్వహించనున్నారు.
ప్రవేశ పరీక్ష | పరీక్ష తేదీ | కన్వీనర్ | యూనివర్సిటీ |
ఈఏపీసెట్ | ఏప్రిల్ 29 నుంచి మే 5 వరకు | బి. డీన్ కుమార్ | జేఎన్‌టీయూహెచ్ |
ఈసెట్ | మే 12 | చంద్రశేఖర్ | ఉస్మానియా యూనివర్సిటీ |
ఎడ్‌సెట్ | జూన్ 1న | బి.వెంకట్రామిరెడ్డి | కాకతీయ యూనివర్సిటీ |
లాసెట్, పీజీఎల్ సెట్ | జూన్ 6న | బి.విజయలక్ష్మి | ఉస్మానియా యూనివర్సిటీ |
ఐసెట్ | జూన్ 8, 9 తేదీల్లో | అలువాల రవి | మహాత్మగాంధీ యూనివర్సిటీ |
పీజీఈసెట్ | జూన్ 16 నుంచి 19 వరకు | ఎ.అరుణ కుమారి | జేఎన్టీయూహెచ్ |
పీఈసెట్ | జూన్ 11 నుంచి 14 వరకు | ఎన్.ఎస్.దిలీప్ | పాలమూరు యూనివర్సిటీ |