News
News
X

TS NMMS Notification: తెలంగాణ ఎన్‌ఎంఎంఎస్ నోటిఫికేషన్ వచ్చేసింది! పరీక్ష ఎప్పుడంటే?

తెలంగాణ రాష్ట్రంలో 2022-23 విద్యా సంవత్సరానికి గాను  నేషనల్‌ మీన్స్  కమ్‌ మెరిట్‌ స్కాలర్‌షిప్ పరీక్ష డిసెంబరు 12న నిర్వహించనున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో 8వ తరగతి చదువుతున్న విద్యార్థులు అర్హులు.

FOLLOW US: 
 

తెలంగాణ రాష్ట్రంలో 2022-23 విద్యా సంవత్సరానికి గాను  నేషనల్‌ మీన్స్  కమ్‌ మెరిట్‌ స్కాలర్‌షిప్ (NMMS) పరీక్ష డిసెంబరు 12న నిర్వహించనున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఎనిమిదో తరగతి చదువుతున్న విద్యార్థులు ఈ పరీక్ష రాయడానికి అర్హులు. దరఖాస్తు చేసుకోవడానికి అక్టోబ‌రు 28 వరకు గడువు ఉంది. తెలుగు, హిందీ, ఉర్దూ, ఆంగ్ల మాధ్యమాల్లో పరీక్ష ప్రశ్నపత్రాలు ఉంటాయి. ప్రతి రెవెన్యూ డివిజన్‌లో పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు. ఆసక్తి ఉన్న విద్యార్థులు ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులను సంప్రదించి, దరఖాస్తు చేసుకోవచ్చు.

ఆర్థికంగా వెనుకబడిన, ప్రతిభగల విద్యార్థులను ఆదుకొనేందుకు కేంద్ర ప్రభుత్వం నేషనల్ మీన్స్ కమ్ మెరిట్ స్కాలర్‌షిప్(ఎన్ఎంఎంఎస్) పథకాన్ని అమలు చేస్తోంది. 9వ తరగతి నుంచి ఇంటర్ వరకు చదివే పేద విద్యార్థులను ప్రోత్సహించేందుకు ఏటా ఉపకారవేతనాన్ని అందిస్తోంది. పరీక్షకు సంబంధించిన ప్రకటనను ఏపీ డైరెక్టరేట్ ఆఫ్ గవర్నమెంట్ ఎగ్జామినేషన్స్ విభాగం తాజాగా విడుదల చేసింది. ఈ పథకానికి ఎంపికైన విద్యార్థులకు నెలకు రూ.1000 చొప్పున ఏడాదికి మొత్తం రూ.12,000 స్కాలర్‌షిప్‌గా అందిస్తారు. 9వ తరగతి నుంచి ఇంటర్ పూర్తయ్యే వరకు వీరికి స్కాలర్‌షిప్ అందుతుంది.

 

:: Also Read :: AP - NMMS: పేద విద్యార్థులకు వరం - ఎన్ఎంఎంఎస్ ఉపకారవేతనం, ఎంపిక ఇలా!

News Reelsవివరాలు..

✶ నేషనల్ మీన్స్ కమ్ మెరిట్ స్కాలర్‌షిప్ స్కీమ్: 2022-23 (తెలంగాణ)

అర్హతలు:
✦ ఏడో తరగతిలో కనీసం 55 శాతం మార్కులు పొందిన విద్యార్థులు పరీక్ష రాయడానికి అర్హులు. తుది  ఎంపిక సమయం నాటికి ఎనిమిదో తరగతిలో 55 శాతం మార్కులు పొంది ఉండాలి. ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు 50 శాతం మార్కులు ఉంటే సరిపోతుంది.
✦ ప్రభుత్వ, ఎయిడెడ్, స్థానిక సంస్థల పాఠశాలల్లో రెగ్యులర్ విధానంలో చదవుతూ ఉండాలి.
✦ కుటుంబ వార్షికాదాయం రూ.3,50,000 మించకూడదు.

దరఖాస్తు విధానం:  రాష్ట్ర ప్రభుత్వ సెకండరీ ఎడ్యుకేషన్ బోర్డు వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో విద్యార్థుల దరఖాస్తులను ఆయా స్కూళ్లు సమర్పించాలి. అనంతరం ఆ దరఖాస్తుల ప్రింటవుట్లను, ధ్రువీకరణ పత్రాలను డీఈవోలకు పంపాలి. ప్రతి విద్యార్థికి పరీక్ష ఫీజు రూ.100 ఎస్‌బీఐ చలానా రూపంలో జతచేయాలి.

దరఖాస్తు ఫీజు: రూ.100. ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు రూ.50 చెల్లిస్తే సరిపోతుంది.

ఎంపిక విధానం: రాత పరీక్ష ద్వారా విద్యార్థులను స్కాలర్‌షిప్‌కు ఎంపిక చేస్తారు.

రాత పరీక్ష విధానం: ఈ స్కాలర్‌షిప్స్‌కు అర్హులైన అభ్యర్థులను ఎంపిక చేసేందుకు రాష్ట్రస్థాయిలో రెండు పేపర్ల రాత పరీక్షలు నిర్వహిస్తారు. 

✦ మెంటల్‌ ఎబిలిటీ టెస్ట్‌(మ్యాట్‌):
ఈ పేపర్‌లో వెర్బల్, నాన్‌ వెర్బల్‌ రీజనింగ్, క్రిటికల్‌ థింకింగ్‌ నుంచి 90ప్రశ్నలు–90 మార్కులకు ఉంటాయి.

✦ స్కాలాస్టిక్‌ అప్టిట్యూడ్‌ టెస్ట్‌(శాట్‌): ఈ పేపర్‌లోనూ 90ప్రశ్నలు –90 మార్కులకు ఉంటాయి. ఏడు, ఎనిమిది తరగతుల స్థాయి లో బోధించిన సైన్స్, సోషల్, మ్యాథ్స్‌ సబ్జెక్టుల నుంచి ప్రశ్నలు అడుగుతారు.

పరీక్ష సమయం: ఒక్కో పేపరుకు 90 నిమిషాల సమయాన్ని కేటాయిస్తారు.

కనీస అర్హత మార్కులు: 
రెండు పరీక్ష(మ్యాట్, శాట్‌)ల్లో సగటున జనరల్‌ అభ్యర్థులకు 40 శాతం (36) మార్కులు, ఎస్సీ/ఎస్టీ విద్యార్థులకు 32 శాతం (29)మార్కులను కనీస అర్హత మార్కులుగా నిర్ణయించారు. జిల్లాను యూనిట్‌గా తీసుకొని రాష్ట్ర ప్రభుత్వ నిబంధనల మేరకు కేటగిరీల వారీగా ఎస్సీ/ఎస్టీ/బీసీ/దివ్యాంగులకు రిజర్వేషన్‌ ప్రకారం అర్హత పొందిన విద్యార్థుల మెరిట్‌ లిస్ట్‌ తయారు చేస్తారు.


ముఖ్యమైన తేదీలు...

➦ ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 12.10.2022.

➦ ఆన్‌లైన్  దరఖాస్తుకు  ఫీజు చెల్లింపు ప్రారంభం: 12.10.2022.

➦ పరీక్ష ఫీజు చెల్లింపు చివరితేదీ: 28.10.2022.

➦ ప్రిన్సిపల్స్ ద్వారా విద్యార్థులు దరఖాస్తు చేసేందుకు చివరి తేదీ: 29.10.2022.

➦ దరఖాస్తు ఫారాలు, ధ్రువపత్రాలను డీఈవో కార్యాలయంలో అందజేసేందుకు చివరితేది: 01.11.2022.

NMMS పరీక్ష తేదీ: 18-12-2022.

 

NMMSE-2022-23 NOTIFICATIONNew

NMMSE Online Application New

NMMSE-2022-23 PRESS NOTENew

 

NMMSE-2022-23 HM INSTRCUTIONS New

 

:: Also Read ::

NTSE: ఎన్‌టీఎస్‌ స్కాలర్‌షిప్‌ పథకం నిలిపివేత! కొత్త స్కాలర్‌షిప్ రూ.5 వేలు?
దేశంలో ప్రతిష్ఠాత్మకంగా భావించే 'నేషనల్‌ టాలెంట్‌ సెర్చ్‌ పరీక్ష (NTSE)'ను కేంద్రం నిలిపివేసింది. కేంద్ర విద్యాశాఖ నుంచి ఆమోదం లభించే వరకు దాన్ని నిలిపివేస్తున్నట్లు  'నేషనల్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఎడ్యుకేషనల్‌ రీసెర్చ్‌ & ట్రైనింగ్‌' (NCERT) ప్రకటించింది. ఈ ఏడాది స్కాలర్‌షిప్‌ పథకం కొనసాగించాలా? వద్దా? అన్నదానిపై కేంద్రం నుంచి స్పష్టమైన ఆదేశాలు రాలేదని, అందువల్లే ప్రతిభావంతుల ఎంపిక నిమిత్తం నిర్వహించే పరీక్షను నిలిపివేసినట్లు NCERT తెలిపింది.
పూర్తిసమాచారం కోసం క్లిక్ చేయండి..

జగనన్న విదేశీ విద్యా దీవెన దరఖాస్తు గడువు పొడిగింపు, ఎన్నిరోజులంటే?
విదేశీ విశ్వవిద్యాలయాలు/విద్యా సంస్థల్లో పీజీ, పీహెచ్‌డీ, ఎంబీబీఎస్‌ అభ్యసించాలనుకునే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, ఈబీసీ, కాపు విద్యార్థులకు నిర్దేశించిన 'జగనన్న విదేశీ విద్యాదీవెన' పథకం దరఖాస్తు గడువును అక్టోబరు 30 వరకు పొడిగించారు. వాస్తవానికి సెప్టెంబరు 30తో గడువు ముగియగా.. మరో నెలపాటు పెంచారు. 
జగనన్న విదేశీ విద్యా దీవెన పథకం పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..


COVID Scholarships: కొవిడ్‌ స్కాలర్‌షిప్‌ ప్రోగ్రామ్, వీరికి ప్రత్యేకం!!

ఆదిత్య బిర్లా క్యాపిటల్‌ ఫౌండేషన్‌ సామాజిక బాధ్యతలో భాగంగా కొవిడ్‌తో తల్లిదండ్రులను కోల్పోయిన విద్యార్థుల కోసం ‘కొవిడ్‌ స్కాలర్‌షిప్‌ ప్రోగ్రామ్‌’ను ప్రకటించింది. ఒకటో తరగతి నుంచి ఇంటర్‌, డిగ్రీ, ప్రొఫెషనల్ డిగ్రీ చదివే వారు ఈ స్కాలర్‌షిప్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. వచ్చిన దరఖాస్తుల నుంచి విద్యార్థుల పరిస్థితిని అంచనావేసి షార్ట్‌లిస్ట్‌ రూపొందిస్తారు. తర్వాత వీరికి టెలిఫోనిక్‌ ఇంటర్వ్యూ, డాక్యుమెంట్స్‌ వెరిఫికేషన్‌ నిర్వహించి, ఎంపికైనవారికి స్కాలర్‌షిప్ అందజేస్తారు.
స్కాలర్‌షిప్ పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..

Pragathi Scholarship: మహిళా 'ప్రతిభ'కు చేయూత 'ప్రగతి' స్కాలర్‌షిప్‌!! దరఖాస్తు చేసుకోండి, అర్హతలివే!
మహిళలను సాంకేతిక విద్యలో ప్రోత్సహించేందుకు ఉద్దేశించిన ‘ప్రగతి స్కాలర్‌షిప్‌’  నోటిఫికేషన్‌ వెలువడింది.  ‘ఆలిండియా కౌన్సిల్‌ ఫర్‌ టెక్నికల్‌ ఎడ్యుకేషన్‌ (ఏఐసీటీఈ)’ ఏటా ఈ ఉపకారవేతనం అందిస్తోంది. డిప్లొమా, డిగ్రీ కోర్సులు చదువుతున్న అర్హులైన అమ్మాయిలకు ఈ స్కీమ్ కింద ఆర్థికసాయం అందిస్తారు. కుటుంబ వార్షికాదాయం రూ.8 లక్షలకు మించకూడదు.  ఒక కుటుంబం నుంచి ఇద్దరు అమ్మాయిలు ఈ అవకాశాన్ని వినియోగించుకోవచ్చు. సరైన అర్హతలున్న మహిళలు ఆన్‌లైన్ ద్వారా తమ దరఖాస్తులు సమర్పించాలి. అకడమిక్‌ మెరిట్‌ ఆధారంగా స్కాలర్‌షిప్ అభ్యర్థుల ఎంపిక ఉంటుంది.
స్కాలర్‌షిప్ పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..


మరిన్ని విద్యాసంబంధ వార్తల కోసం క్లిక్ చేయండి..

Published at : 13 Oct 2022 03:57 PM (IST) Tags: Education News Scholarships NMMS 2022-23 TS NMMS Exam Date Telangana NMMS Exam Date AP NMMS Exam

సంబంధిత కథనాలు

IIT Placements: 'ఐఐటీ'ల్లో కొలువుల కోలాహలం, రికార్డు స్థాయిలో నియామకాలు, రూ.కోట్లలో వేతన ప్యాకేజీలు!

IIT Placements: 'ఐఐటీ'ల్లో కొలువుల కోలాహలం, రికార్డు స్థాయిలో నియామకాలు, రూ.కోట్లలో వేతన ప్యాకేజీలు!

BTech Admissions: ఇంజినీరింగ్ ప్రవేశాలు ఈసారి భారీగానే, కారణమిదే!

BTech Admissions: ఇంజినీరింగ్ ప్రవేశాలు ఈసారి భారీగానే, కారణమిదే!

లిప్‌స్టిక్ లేని కాలంలో ఏం పూసుకునేవాళ్లో తెలుసా? చూస్తే షాక్ అవుతారు!

లిప్‌స్టిక్ లేని కాలంలో ఏం పూసుకునేవాళ్లో తెలుసా? చూస్తే షాక్ అవుతారు!

AP Inter Exam Fee: ఇంటర్‌ సెకండియర్ పరీక్ష ఫీజు చెల్లించేందుకు 19 వరకు అవకాశం! ఆలస్య రుసుముతో ఎప్పటివరకంటే?

AP Inter Exam Fee: ఇంటర్‌ సెకండియర్ పరీక్ష ఫీజు చెల్లించేందుకు 19 వరకు అవకాశం! ఆలస్య రుసుముతో ఎప్పటివరకంటే?

మిరపకాయలకు ఓ హిస్టరీ ఉందన్న విషయం మీకు తెలుసా.? అసలు మిర్చీ ఎందుకు కారంగా ఉంటుంది?

మిరపకాయలకు ఓ హిస్టరీ ఉందన్న విషయం మీకు తెలుసా.? అసలు మిర్చీ ఎందుకు కారంగా ఉంటుంది?

టాప్ స్టోరీస్

CM Jagan Review : ఒక్క పైసా కూడా తగ్గకుండా మద్దతు ధర, ధాన్యం సేకరణపై సీఎం జగన్ కీలక ఆదేశాలు

CM Jagan Review : ఒక్క పైసా కూడా తగ్గకుండా మద్దతు ధర, ధాన్యం సేకరణపై సీఎం జగన్ కీలక ఆదేశాలు

Guntur Knife Attack: గుంటూరు జిల్లాలో ప్రేమోన్మాది ఘాతుకం, వైద్య విద్యార్థిని దారుణహత్య - కారణం ఏంటంటే!

Guntur Knife Attack: గుంటూరు జిల్లాలో ప్రేమోన్మాది ఘాతుకం, వైద్య విద్యార్థిని దారుణహత్య - కారణం ఏంటంటే!

Minister Mallareddy : కిట్టీ పార్టీ వ్యాఖ్యలపై మంత్రి మల్లారెడ్డి వివరణ, సారీ అంటూ వీడియో రిలీజ్!

Minister Mallareddy : కిట్టీ పార్టీ వ్యాఖ్యలపై మంత్రి మల్లారెడ్డి వివరణ, సారీ అంటూ వీడియో రిలీజ్!

Naga Chaitanya: మరదలితో నాగచైతన్య - రెస్టారెంట్‌లో ఫుడ్ వీడియో చేసిన వెంకటేష్ కూతురు!

Naga Chaitanya: మరదలితో నాగచైతన్య - రెస్టారెంట్‌లో ఫుడ్ వీడియో చేసిన వెంకటేష్ కూతురు!