COVID Scholarships: కొవిడ్ స్కాలర్‌షిప్ ప్రోగ్రామ్, వీరికి ప్రత్యేకం!!
ఒకటో తరగతి నుంచి ఇంటర్, డిగ్రీ, ప్రొఫెషనల్ డిగ్రీ చదివే వారు ఈ స్కాలర్‌షిప్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. వచ్చిన దరఖాస్తుల నుంచి విద్యార్థుల పరిస్థితిని అంచనావేసి షార్ట్‌లిస్ట్ రూపొందిస్తారు.
ఆదిత్య బిర్లా క్యాపిటల్ ఫౌండేషన్ సామాజిక బాధ్యతలో భాగంగా కొవిడ్‌తో తల్లిదండ్రులను కోల్పోయిన విద్యార్థుల కోసం ‘కొవిడ్ స్కాలర్‌షిప్ ప్రోగ్రామ్’ను ప్రకటించింది. ఒకటో తరగతి నుంచి ఇంటర్, డిగ్రీ, ప్రొఫెషనల్ డిగ్రీ చదివే వారు ఈ స్కాలర్‌షిప్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. వచ్చిన దరఖాస్తుల నుంచి విద్యార్థుల పరిస్థితిని అంచనావేసి షార్ట్‌లిస్ట్ రూపొందిస్తారు. తర్వాత వీరికి టెలిఫోనిక్ ఇంటర్వ్యూ, డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ నిర్వహించి, ఎంపికైనవారికి స్కాలర్‌షిప్ అందజేస్తారు.
వివరాలు..
* కొవిడ్ స్కాలర్‌షిప్ ప్రోగ్రామ్
ఎవరు అర్హులు?
ఒకటో తరగతి నుంచి ఇంటర్/ పన్నెండోతరగతి/ సాధారణ డిగ్రీ/ ప్రొఫెషనల్ డిగ్రీల వరకు చదువుతున్నవారు అప్లయ్ చేసుకోవచ్చు. కుటుంబ వార్షికాదాయం రూ.6లక్షలకు మించకూడదు. సంస్థ ఉద్యోగుల పిల్లలు దరఖాస్తుకు అనర్హులు.
స్కాలర్‌షిప్ ఎంత?
ఒకటోతరగతి నుంచి ఎనిమిదో తరగతి వరకు చదివే విద్యార్థులకు ఏడాదికి రూ.24,000; తొమ్మిదోతరగతి నుంచి ఇంటర్/ పన్నెండో తరగతి వరకు చదువుతున్నవారికి ఏడాదికి రూ.30,000 ఇస్తారు. సాధారణ డిగ్రీ చదివేవారికి రూ.36,000; ప్రొఫెషనల్ డిగ్రీలు చేసేవారికి రూ.60,000 ఇస్తారు. తరగతి/ కోర్సును అనుసరించి సంబంధిత మొత్తాన్ని విద్యార్థి బ్యాంక్ అకౌంట్‌లో ఒకేసారి జమ చేస్తారు. ఈ మొత్తాన్ని విద్యార్థులు ట్యూషన్ ఫీజు, హాస్టల్ ఫీజు, భోజనం, ఇంటర్నెట్, స్టేషనరీ, ఆన్‌లైన్ లెర్నింగ్ ఖర్చుల నిమిత్తం వినియోగించుకోవాల్సి ఉంటుంది. విద్యార్థులకు వారి అవసరం మేరకు లైఫ్ స్కిల్ సెషన్స్, కెరీర్ గైడెన్స్, కౌన్సెలింగ్ వంటివి నిర్వహిస్తారు.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.
ఎంపిక విధానం: వచ్చిన దరఖాస్తులు పరిశీలించి విద్యార్థుల పరిస్థితిని అంచనావేసి షార్ట్‌లిస్ట్ రూపొందిస్తారు. తరవాత టెలిఫోనిక్ ఇంటర్వ్యూ, డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ నిర్వహించి అర్హులకు స్కాలర్‌షిప్ ఇస్తారు.
ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరితేదీ: నవంబరు 10
దరఖాస్తుకు జతచేయాల్సిన పత్రాలు..
* కిందటి తరగతి/ కోర్సుకు సంబంధించిన మార్కుల పత్రాలు.
* ఆధార్ కార్డ్/ ఓటర్ కార్డ్డ్/ డ్రైవింగ్ లైసెన్స్/ పాన్ కార్డ్.
* ప్రస్తుతం చదువుతున్న తరగతి/ కోర్సు ప్రవేశానికి సంబంధించిన వివరాలు.
* మరణించిన తల్లిదండ్రులకు సంబంధించిన హాస్పిటల్ రిసీట్స్, డాక్టర్ ప్రిస్ర్కిప్షన్, కొవిడ్ టెస్ట్ రిపోర్ట్, మెడికల్ బిల్స్, హాస్పిటల్ డిశ్చార్జ్ సమ్మరి.
* బ్యాంక్ అకౌంట్ వివరాలు.
* విద్యార్థి ఫొటో.
Notification & Online Application
ఇవీ చదవండి
NMMS scholarship 2022: పేద విద్యార్థులకు వరం - ఎన్ఎంఎంఎస్ ఉపకారవేతనం, ఎంపిక ఇలా!
ఆర్థికంగా వెనుకబడిన, ప్రతిభగల విద్యార్థులను ఆదుకొనేందుకు కేంద్ర ప్రభుత్వం నేషనల్ మీన్స్ కమ్ మెరిట్ స్కాలర్‌షిప్(ఎన్ఎంఎంఎస్) పథకాన్ని అమలు చేస్తోంది. 9వ తరగతి నుంచి ఇంటర్ వరకు చదివే పేద విద్యార్థులను ప్రోత్సహించేందుకు ఏటా ఉపకారవేతనాన్ని అందిస్తోంది. పరీక్షకు సంబంధించిన ప్రకటనను ఏపీ డైరెక్టరేట్ ఆఫ్ గవర్నమెంట్ ఎగ్జామినేషన్స్ విభాగం తాజాగా విడుదల చేసింది. ఈ పథకానికి ఎంపికైన విద్యార్థులకు నెలకు రూ.1000 చొప్పున ఏడాదికి మొత్తం రూ.12,000 స్కాలర్‌షిప్‌గా అందిస్తారు. 9వ తరగతి నుంచి ఇంటర్ పూర్తయ్యే వరకు వీరికి స్కాలర్‌షిప్ అందుతుంది.
నేషనల్ మీన్స్ కమ్ మెరిట్ స్కాలర్‌షిప్ స్కీమ్ పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..
Pragathi Scholarship: మహిళా 'ప్రతిభ'కు చేయూత 'ప్రగతి' స్కాలర్‌షిప్!! దరఖాస్తు చేసుకోండి, అర్హతలివే!
మహిళలను సాంకేతిక విద్యలో ప్రోత్సహించేందుకు ఉద్దేశించిన ‘ప్రగతి స్కాలర్‌షిప్’ నోటిఫికేషన్ వెలువడింది. ‘ఆలిండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్ (ఏఐసీటీఈ)’ ఏటా ఈ ఉపకారవేతనం అందిస్తోంది. డిప్లొమా, డిగ్రీ కోర్సులు చదువుతున్న అర్హులైన అమ్మాయిలకు ఈ స్కీమ్ కింద ఆర్థికసాయం అందిస్తారు. కుటుంబ వార్షికాదాయం రూ.8 లక్షలకు మించకూడదు. ఒక కుటుంబం నుంచి ఇద్దరు అమ్మాయిలు ఈ అవకాశాన్ని వినియోగించుకోవచ్చు. సరైన అర్హతలున్న మహిళలు ఆన్‌లైన్ ద్వారా తమ దరఖాస్తులు సమర్పించాలి. అకడమిక్ మెరిట్ ఆధారంగా స్కాలర్‌షిప్ అభ్యర్థుల ఎంపిక ఉంటుంది.
స్కాలర్‌షిప్ పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..