అన్వేషించండి

Inter Supplementary Results: నేడే తెలంగాణ ఇంటర్‌ సప్లిమెంటరీ పరీక్షల ఫలితాల వెల్లడి, ఇలా చూసుకోండి

TGBIE Inter Supply Results: తెలంగాణలో ఇంటర్మీడియెట్‌ అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలు జూన్‌ 24 వెలువడనున్నాయి. మధ్యాహ్నం 2 గంటలకు ఫలితాలను విడుదల చేయనున్నారు.

TG Inter Supplementary Results: తెలంగాణలో ఇంటర్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలు నేడు (జూన్ 24) విడుదలకానున్నాయి. మధ్యాహ్నం 2 గంటలకు ఫలితాలను విడుదల చేయనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా మే 24 నుంచి జూన్ 3 వరకు నిర్వహించిన ఇంటర్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలకు ఈ ఏడాది దాదాపు 4.5 లక్షల మంది హాజరైనల్లు తెలుస్తోంది. ఇందులో సప్లిమెంటరీ పరీక్షలకు హాజరైన విద్యార్థులతోపాటు, ఇంటర్ మొదటి సంవత్సరం ఇంప్రూవ్‌మెంట్ పరీక్షలకు హాజరైన విద్యార్థులు కూడా ఉన్నారు. ఇంటర్ బోర్డు అధికారిక వెబ్‌సైట్‌తోపాటు ఇతర వెబ్‌సైట్‌లలోనూ ఫలితాలను అందుబాటులో ఉంచనున్నారు.

ఇంటర్ సప్లిమెంటరీ ఫలితాలు ఇలా చూసుకోండి..

➥ ఇంటర్ సప్లిమెంటరీ ఫలితాల కోసం మొదట ఇంటర్ బోర్డు అధికారిక వెబ్‌సైట్‌లోకి వెళ్లాలి.- https://tsbie.cgg.gov.in/  

➥ ఇంటర్ ఫస్ట్, సెకండ్ ఇయర్ సప్లిమెంటరీ మే/జూన్ - 2024 ఫలితాలకు సంబంధించిన లింక్ మీద క్లిక్ చేయాలి. 

➥ అక్కడ వచ్చే పేజీలో విద్యార్థులు తమ  హాల్‌టికెట్ నెంబర్‌తో పాటు పుట్టిన తేదీ వివరాలను నమోదు చేసి SUBMIT బటన్‌పై క్లిక్ చేయాలి.

➥ వివరాలు నమోదుచేయగానే విద్యార్థి మార్కుల వివరాలు కంప్యూటర్ స్క్రీన్ మీద కనిపిస్తాయి.

➥ విద్యార్థులు తమ ఫలితాలను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

సప్లిమెంటరీ ఫలితాల కోసం వెబ్‌సైట్.. 

గత అనుభవాల నేపథ్యంలో పరీక్షల మూల్యాంకనంలో ఎలాంటి తప్పులు జరగకుండా అధికారులు అన్ని జాగ్రత్తలు తీసుకున్నారు. విద్యార్థుల మార్కుల డీకోడింగ్, ఆన్‌లైన్‌లో మార్కుల నమోదు ప్రక్రియ పూర్తికావడంతో ఫలితాల వెల్లడికి ఇంటర్ బోర్డు ఏర్పాట్లు చేస్తోంది. ఒకటికి రెండుసార్లు పరిశీలించిన తర్వాత ఫలితాలను అప్‌లోడ్ చేశారు. మార్కుల నమోదుతో పాటు ఎలాంటి సాంకేతికపరమైన ఇబ్బందులు రాకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. జవాబు పత్రాలను మూడేసి సార్లు క్షుణ్నంగా పరిశీలించారు.  

పరీక్షలకు 4.5 లక్షల మంది..
ఈ ఏడాది ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలతోపాటు, ఫస్టియర్ ఇంప్రూవ్‌మెంట్ కోసం రాసిన విద్యార్థులు దాదాపు 4.5 లక్షల మంది వరకు ఉన్నారు. ఇప్పటికే ఎప్‌సెట్ పరీక్ష ఫలితాలు వెల్లడి కావడం, మరోవైపు దోస్త్ రెండు విడతల కౌన్సెలింగ్ ప్రక్రియ పూర్తయింది. ఇంటర్ పాసైన విద్యార్థులు ఎప్‌సెట్ అర్హత ఉంటే.. ఇంజినీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాలు పొందడానికి అర్హత పొందుతారు. ఎప్‌సెట్ అర్హత లేనవారు దోస్త్ ద్వారా డిగ్రీ కోర్సుల్లో చేరే అవకాశం ఉంటుంది. 

తెలంగాణలో ఈ ఏడాది ఫిబ్రవరి 28 నుంచి మార్చి 19 వరకు ఇంటర్ వార్షిక పరీక్షలు నిర్వహించిన సంగతి తెలిసిందే. పరీక్షలకు మొత్తం 9.80 లక్షలకుపైగా విద్యార్థులు హాజరయ్యారు. ఇందులో 4.78 లక్షల మంది ఇంటర్ మొద‌టి సంవత్సరం విద్యార్థులు, 4.43 లక్షల మంది ద్వితీయ సంవత్సరం విద్యార్థులు ఉన్నారు. ఇక ఒకేషనల్ కోర్సులకు సంబంధించి మొదటి సంవత్సరం 48,277 మంది విద్యార్థులు, ద్వితీయ సంవత్సరం 46,542 మంది విద్యార్థులు ఉన్నారు. ఇంటర్‌ ప్రథమ, ద్వితీయ ఫలితాలను ఏప్రిల్ 24న ఒకేసారి విడుదల చేశారు. తెలంగాణ ఇంటర్ ఫస్టియర్‌లో 60.01 మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించగా, సెకండియర్ విద్యార్థులు 64.19 శాతం పాసయ్యారు. సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలను కూడా ఫస్టియర్, సెకండియర్ విద్యార్థులకు ఒకేసారి వెల్లడించనున్నారు.

మరిన్ని విద్యాసంబంధ వార్తల కోసం క్లిక్ చేయండి..

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

IND vs SA 4th T20I Highlights: తిలక్ వర్మ, శాంసన్ సెంచరీలతో దక్షిణాఫ్రికాపై భారత్ ఘన విజయం, 3-1తో టీ20 సిరీస్ కైవసం
తిలక్ వర్మ, శాంసన్ సెంచరీలతో దక్షిణాఫ్రికాపై భారత్ ఘన విజయం, 3-1తో టీ20 సిరీస్ కైవసం
Andhra News: ఐఐటీ మద్రాసుతో ఏపీ ప్రభుత్వం కీలక ఒప్పందాలు - ముఖ్యాంశాలివే!
ఐఐటీ మద్రాసుతో ఏపీ ప్రభుత్వం కీలక ఒప్పందాలు - ముఖ్యాంశాలివే!
Mike Tyson vs Jake Paul Boxing Live Streaming: 58 ఏళ్ల మైక్ టైసన్, 27 ఏళ్ల జేక్ పాల్‌ నేటి బాక్సింగ్ మ్యాచ్‌పై ఉత్కంఠ, స్ట్రీమింగ్ ఎక్కడంటే!
58 ఏళ్ల మైక్ టైసన్, 27 ఏళ్ల జేక్ పాల్‌ నేటి బాక్సింగ్ మ్యాచ్‌పై ఉత్కంఠ, స్ట్రీమింగ్ ఎక్కడంటే!
KTR News: రాజ్యాంగేతర శక్తిగా సీఎం రేవంత్ సోదరుడు, అధికారులకు సైతం ఫోన్లోనే ఆదేశాలు: కేటీఆర్
రాజ్యాంగేతర శక్తిగా సీఎం రేవంత్ సోదరుడు, అధికారులకు సైతం ఫోన్లోనే ఆదేశాలు: కేటీఆర్
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

ఆదిలాబాద్ జిల్లాలో పత్తి కొనుగోళ్ళపై ABP గ్రౌండ్ రిపోర్ట్సైబర్ క్రైమ్‌కి స్కామర్, వీడియో కాల్ పిచ్చ కామెడీ!గుడిలోకి చొరబడ్డ ఎలుగుబంట్లు, బెదిరిపోయిన భక్తులుDaaku Maharaaj Teaser | Nandamuri Balakrishna తో బాబీ ఏం ప్లాన్ చేశాడో | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
IND vs SA 4th T20I Highlights: తిలక్ వర్మ, శాంసన్ సెంచరీలతో దక్షిణాఫ్రికాపై భారత్ ఘన విజయం, 3-1తో టీ20 సిరీస్ కైవసం
తిలక్ వర్మ, శాంసన్ సెంచరీలతో దక్షిణాఫ్రికాపై భారత్ ఘన విజయం, 3-1తో టీ20 సిరీస్ కైవసం
Andhra News: ఐఐటీ మద్రాసుతో ఏపీ ప్రభుత్వం కీలక ఒప్పందాలు - ముఖ్యాంశాలివే!
ఐఐటీ మద్రాసుతో ఏపీ ప్రభుత్వం కీలక ఒప్పందాలు - ముఖ్యాంశాలివే!
Mike Tyson vs Jake Paul Boxing Live Streaming: 58 ఏళ్ల మైక్ టైసన్, 27 ఏళ్ల జేక్ పాల్‌ నేటి బాక్సింగ్ మ్యాచ్‌పై ఉత్కంఠ, స్ట్రీమింగ్ ఎక్కడంటే!
58 ఏళ్ల మైక్ టైసన్, 27 ఏళ్ల జేక్ పాల్‌ నేటి బాక్సింగ్ మ్యాచ్‌పై ఉత్కంఠ, స్ట్రీమింగ్ ఎక్కడంటే!
KTR News: రాజ్యాంగేతర శక్తిగా సీఎం రేవంత్ సోదరుడు, అధికారులకు సైతం ఫోన్లోనే ఆదేశాలు: కేటీఆర్
రాజ్యాంగేతర శక్తిగా సీఎం రేవంత్ సోదరుడు, అధికారులకు సైతం ఫోన్లోనే ఆదేశాలు: కేటీఆర్
Sabarimala Temple: శబరిమల అయ్యప్ప దర్శనాలు ప్రారంభం - ఏ సమయాల్లో దర్శించుకోవచ్చంటే?
శబరిమల అయ్యప్ప దర్శనాలు ప్రారంభం - ఏ సమయాల్లో దర్శించుకోవచ్చంటే?
Musi River: అచ్చం మూసీలాగే దక్షిణ కొరియాలోని హాన్ నది - పరిశీలించిన తెలంగాణ శాసన బృందం
అచ్చం మూసీలాగే దక్షిణ కొరియాలోని హాన్ నది - పరిశీలించిన తెలంగాణ శాసన బృందం
CM Chandrababu: 'ఏపీ మొత్తం అప్పు రూ.9.74 లక్షల కోట్లు' - వైసీపీ ఆర్థిక ఉగ్రవాదం సృష్టించిందని సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం
'ఏపీ మొత్తం అప్పు రూ.9.74 లక్షల కోట్లు' - వైసీపీ ఆర్థిక ఉగ్రవాదం సృష్టించిందని సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం
Special Trains: అయ్యప్ప భక్తులకు గుడ్ న్యూస్ - తెలుగు రాష్ట్రాల నుంచి శబరిమలకు ప్రత్యేక రైళ్లు
అయ్యప్ప భక్తులకు గుడ్ న్యూస్ - తెలుగు రాష్ట్రాల నుంచి శబరిమలకు ప్రత్యేక రైళ్లు
Embed widget