అన్వేషించండి

TS Inter Results: తెలంగాణ ఇంటర్ విద్యార్థులకు అలర్ట్, ఈసారి ముందుగానే ఫలితాల వెల్లడి, రిజల్ట్స్ ఎప్పుడంటే?

తెలంగాణలో ఈసారి ఇంటర్ ఫలితాలు త్వరగానే వెలువడవచ్చు. ఎన్నికల ప్రక్రియ ఇబ్బంది కలగకుంగా ఏప్రిల్ చివరి వారంలో ఫలితాలు విడుద‌ల చేయాలని అధికారులు భావిస్తున్నారు.

Telangana Intermediate Results 2024: తెలంగాణలో ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలను ఫిబ్రవరి 28 నుంచి మార్చి 19 వరకు నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈసారి పరీక్షలకు దాదాపు 9 లక్షల మంది విద్యార్థులు హాజరయ్యారు. ఇందులో.. 4,78,527 మంది మొద‌టి సంవత్సరం విద్యార్థులు కాగా.. 4,43,993 మంది ద్వితీయ సంవత్సరం విద్యార్థులు ఉన్నారు. పరీక్షల ప్రక్రియ ముగియడంతో జవాబు పత్రాల మూల్యాంకనంపై ఇంటర్ బోర్డు దృష్టి సారించింది. ఇప్పటికే ఈ ప్రక్రియ ప్రారంభంకాగా.. పేప‌ర్ వాల్యూయేషన్ వేగంగా సాగుతోంది.

దేశంలో సార్వత్రిక ఎన్నికల కారణంగా.. ఈసారి ఇంటర్ పరీక్షల మూల్యాంకాన్ని త్వరగా పూర్తిచేసి, ఫలితాలను కూడా త్వరగా విడుదల చేయాలని ఇంటర్మీడియట్ బోర్డు ప్రయత్నిస్తోంది. ఎంసెట్‫తో పాటు ఇతర పరీక్షల దృష్ట్యా వీలైనంత త్వరగా వాల్యూయేషన్ ప్రక్రియ పూర్తిచేయాలని చూస్తోంది. వీలైతే ఏప్రిల్ మూడోవారం లేదా చివరి వారంలో ఇంటర్ పరీక్షల ఫలితాలు విడుదలయ్యే అవకాశం ఉంది

మూల్యాంకనంలో తప్పులొద్దు.. సిబ్బందికి ఇంటర్ బోర్డు వార్నింగ్
మూల్యాంకన ప్రక్రియను మొత్తం నాలుగు దశల్లో పూర్తి చేసేందుకు కార్యాచరణను రూపొందించారు. ఇప్పటికే మొదటి విడత వాల్యూయేషన్ ప్రక్రియ పూర్తి అయింది. ప్రస్తుతం రెండో విడత వాల్యూయేషన్ నడుస్తుంది. ఈ నెలాఖారులోపు నాలుగు విడుతలను పూర్తి చేసేలా ప్లాన్ రూపొందించారు అధికారులు. జవాబు పత్రాల మూల్యాంకనంలో సిబ్బంది ఎలాంటి తప్పులు చేయవద్దని ఇంటర్ బోర్డు హెచ్చరించింది. గత అనుభవాల దృష్ట్యా.. ఈసారి ఎలాంటి వాటికి అవకాశం ఇవ్వొద్దని సూచించింది. పూర్తిస్థాయిలో క్షుణ్ణంగా జవాబు పత్రాలను పరిశీలించిన తర్వాతే.. మార్కులను ఎంట్రీ చేయాలని సిబ్బందికి దిశానిర్దేశం చేసింది. వాల్యూయేషన్ ప్రక్రియను మానిటరింగ్ చేసేందుకు ప్రత్యేక అధికారులను కూడా నియమించింది. ఈసారి కొత్తగా సంగారెడ్డి జిల్లాలోనూ వాల్యూయేషన్ సెంటర్ ను అందుబాటులోకి తీసుకొచ్చారు. మొత్తంగా చూస్తే గత ఏడాదితో పోల్చితే.. ఈసారి సాధ్యమైనంత త్వరగా ఫలితాల విడుదల ప్రక్రియను పూర్తి చేయాలని ఇంటర్ బోర్డు భావిస్తోంది.

ALSO READ:

TS POLYCET 2024: టీఎస్ పాలీసెట్‌ అభ్యర్థులకు అలర్ట్‌, పరీక్ష షెడ్యూలులో మార్పు, కొత్త తేదీ ఇదే!
తెలంగాణలో పాలిసెట్ 2024 వాయిదా పడింది. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో పాలిటెక్నిక్‌ కామన్‌ ఎంట్రెన్స్‌ టెస్ట్‌ (TS POLYCET)ను వాయిదా వేస్తున్నట్లు సాంకేతిక విద్యాశాఖ మార్చి 20న ఒక ప్రకటనలో తెలిపింది. షెడ్యూల్‌ ప్రకారం మే 17న పాలీసెట్‌ ప్రవేశ పరీక్ష నిర్వహించాల్సి ఉండగా.. మే 24కి వాయిదా వేస్తున్నట్లు రాష్ట్ర సాంకేతిక విద్యాశాఖ, శిక్షణ మండలి కార్యదర్శి ఏ పుల్లయ్య తెలిపారు. దేశవ్యాప్తంగా లోక్‌సభ ఎన్నికలు ఏడు దశల్లో నిర్వహించనున్న విషయం తెలిసిందే. తెలంగాణలో నాలుగో విడుతలో ఎన్నికలు జరుగనున్నాయి. నాలుగో విడతలో మే 13న లోక్‌సభ ఎన్నికలకు పోలింగ్‌ జరుగనుండగా.. ఏప్రిల్‌ 18 నుంచి 25 వరకు నామినేషన్ల స్వీకరణ కార్యక్రమం కొనసాగనున్నది. మే 26న నామినేషన్ల పరిశీలన,  మే 29 వరకు ఉపసంహరణకు గడువు ఇచ్చింది. జూన్ 4న ఫలితాలు వెలువడనున్నాయి.
పాలిసెట్ దరఖాస్తు, పరీక్ష వివరాల కోసం క్లిక్ చేయండి..

మరిన్ని విద్యాసంబంధ వార్తల కోసం క్లిక్ చేయండి...

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Samantha Father Death: సమంత ఇంట్లో విషాదం... తండ్రిని కోల్పోయిన స్టార్ హీరోయిన్
సమంత ఇంట్లో విషాదం... తండ్రిని కోల్పోయిన స్టార్ హీరోయిన్
Telangana News: ఉద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త, వారికి సైతం సమానంగా చెల్లింపు
Telangana News: ఉద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త, వారికి సైతం సమానంగా చెల్లింపు
Pawan Kalyan: తూర్పు తీరంలో దేశ భద్రతకు ముప్పు, ఉగ్రవాది కసబ్ ఎలా వచ్చాడు- పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు
తూర్పు తీరంలో దేశ భద్రతకు ముప్పు, ఉగ్రవాది కసబ్ ఎలా వచ్చాడు- పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు
Audi Q7 Facelift: ఆడీ క్యూ7 ఫేస్‌లిఫ్ట్ వచ్చేసింది - ధర ఎంత? ఫీచర్లు ఎలా ఉన్నాయి?
ఆడీ క్యూ7 ఫేస్‌లిఫ్ట్ వచ్చేసింది - ధర ఎంత? ఫీచర్లు ఎలా ఉన్నాయి?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

మురళి కృష్ణుడి అలంకారంలో  శ్రీప‌ద్మావ‌తి అమ్మవారునర్సుపై కొడవలితో దాడి, లవర్ పనే..! సీసీటీవీ వీడియోఊరి మీద విరుచుకుపడి ప్రాణాలు తీసేసిన పెద్దపులిISKCON Monk Chinmoy Krishna Das Arrest In Bangladesh | బంగ్లాదేశ్ లో మైనార్టీలపై హింసకు ఇదే నిదర్శనం | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Samantha Father Death: సమంత ఇంట్లో విషాదం... తండ్రిని కోల్పోయిన స్టార్ హీరోయిన్
సమంత ఇంట్లో విషాదం... తండ్రిని కోల్పోయిన స్టార్ హీరోయిన్
Telangana News: ఉద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త, వారికి సైతం సమానంగా చెల్లింపు
Telangana News: ఉద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త, వారికి సైతం సమానంగా చెల్లింపు
Pawan Kalyan: తూర్పు తీరంలో దేశ భద్రతకు ముప్పు, ఉగ్రవాది కసబ్ ఎలా వచ్చాడు- పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు
తూర్పు తీరంలో దేశ భద్రతకు ముప్పు, ఉగ్రవాది కసబ్ ఎలా వచ్చాడు- పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు
Audi Q7 Facelift: ఆడీ క్యూ7 ఫేస్‌లిఫ్ట్ వచ్చేసింది - ధర ఎంత? ఫీచర్లు ఎలా ఉన్నాయి?
ఆడీ క్యూ7 ఫేస్‌లిఫ్ట్ వచ్చేసింది - ధర ఎంత? ఫీచర్లు ఎలా ఉన్నాయి?
Kakinada Pawan Kalyan: కాంప్రమైజ్ అయిపోయారా - రైస్ స్మగ్లింగ్‌లో టీడీపీ ఎమ్మెల్యేపై పవన్ ఆగ్రహం - కాకినాడ పోర్టులో తనిఖీలు
కాంప్రమైజ్ అయిపోయారా - రైస్ స్మగ్లింగ్‌లో టీడీపీ ఎమ్మెల్యేపై పవన్ ఆగ్రహం - కాకినాడ పోర్టులో తనిఖీలు
Lagacharla Land Acquisition:: లగచర్ల భూసేకరణ రద్దు- తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం 
లగచర్ల భూసేకరణ రద్దు- తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం 
Pawan Delhi: నాలుగు రోజులు ఢిల్లీలో పవన్ పాలిటిక్స్ - జాతీయ రాజకీయాల వైపు అడుగేస్తున్నారా ?
నాలుగు రోజులు ఢిల్లీలో పవన్ పాలిటిక్స్ - జాతీయ రాజకీయాల వైపు అడుగేస్తున్నారా ?
Tiger Attack Komaram Bheem Asifabad District News: కొమురంభీం జిల్లాలో దారుణం- పెద్దపులి దాడిలో మహిళ మృతి- భయాందోళనలో స్థానికులు
కొమురంభీం జిల్లాలో దారుణం- పెద్దపులి దాడిలో మహిళ మృతి- భయాందోళనలో స్థానికులు
Embed widget