News
News
వీడియోలు ఆటలు
X

కాసేపట్లో తెలంగాణ ఇంటర్ ఫలితాలు- ఈసారి మూల్యాంకనం ఎలా చేశారంటే?

వాల్యుయేషన్ త్వరగా పూర్తి చేయడానికి ఇంటర్ బోర్డు అధికారులు వినూత్న పద్ధతి అనుసరించారు. దాదాపు 35 లక్షల ఆన్సర్‌ షీట్ల మూల్యాంకనం కోసం ఆన్‌స్క్రీన్ డిజిటల్ మూల్యాంకన విధానాన్ని బోర్డు అమలు చేసింది.

FOLLOW US: 
Share:

తెలంగాణలో ఈసారి ఇంటర్‌ మూల్యాంకనానికి విభిన్న పద్దతి అనుసరించారు. దీంతో ఫలితాలు ఎలా వస్తాయో అన్న ఉత్కంఠ నెలకొంది. ఇంటర్ ప్రధాన పరీక్షలు మార్చి 29న ముగిసిన సంగతి తెలిసిందే. బ్రిడ్జి కోర్సు విద్యార్థులకు ఏప్రిల్ 4తో పూర్తయ్యాయి. ఈ ఏడాది రాష్ట్రవ్యాప్తంగా ఇంటర్‌ ప్రథమ సంవత్సరం నుంచి 4,82,677 మంది విద్యార్థులు, ద్వితీయ సంవత్సరం నుంచి 4,65,022 మంది విద్యార్థులు కలిపి మొత్తం 9,47,699 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారు. 

ఇంట‌ర్ ఫ‌లితాల కోసం http://telugu.abplive.com , http://tsbie.cgg.gov.in , http://results.cgg.gov.in వెబ్‌సైట్‌లలో అందుబాటులో ఉంటాయి. అసలు ఇంటర్ రిజల్ట్స్ ఎలా తెలుసుకోవాలి

ఇంటర్ తరగతి ఫలితాలను ఇలా చెక్ చేసుకోండి
తెలంగాణ  ఇంటర్‌  రిజల్ట్స్ ఇలా చెక్ చేసుకోండి (How To Check TS Inter Results 2023)
Step 1: ఇంటర్ విద్యార్థులు మొదట తెలంగాణ ఇంటర్‌ బోర్డ్ అధికారిక వెబ్ సైట్ tsbie.cgg.gov.inను సందర్శించాలి
Step 2: హోం పేజీలో టీఎస్ ఇంటర్‌ రిజల్ట్స్ (TS Inter Results 2023) లింక్ మీద క్లిక్ చేయండి 
Step 3: విద్యార్థుల హాల్ టికెట్ నెంబర్, పుట్టిన తేదీ (Date of Birth) ఎంటర్ చేయండి
Step 4: వివరాలు నమోదు చేసిన తరువాత సబ్మిట్ బటన్ మీద క్లిక్ ఇవ్వండి
Step 5: మీ స్క్రీన్ మీద విద్యార్థి ఇంటర్‌ ఫలితాలు కనిపిస్తాయి. TS Inter Results 2023 Marks మెమోను పీడీఎఫ్ రూపంలో డౌన్‌లోడ్ చేసుకోండి
Step 6: డౌన్‌లోడ్ చేసుకున్న ఇంటర్‌ రిజల్ట్స్‌ పీడీఎఫ్‌ను భవిష్యత్ అవసరాల కోసం ప్రింటౌట్ తీసి పెట్టుకోవడం బెటర్.

త్వరగా మూల్యాంకన ప్రక్రియ పూర్తి చేయాలని భావించిన ఇంటర్ బోర్డు అధికారులు ఒక వినూత్న పద్ధతిని అనుసరించారు. దాదాపు 35 లక్షల జవాబు పత్రాలను మూల్యాంకనం చేయడానికి ఆన్‌స్క్రీన్ డిజిటల్ మూల్యాంకన విధానాన్ని బోర్డు అమలు చేసింది. ఫలితాల ప్రక్రియను పకడ్బంధీగా కొనసాగించేందుకు ఇంటర్ బోర్డు అన్ని జాగ్రత్తలు తీసుకుంది. 

తెలంగాణ 1,473 పరీక్షా కేంద్రాల్లో ఇంటర్ పరీక్షలు నిర్వహించారు. ఇందులో ప్రభుత్వ జూనియర్‌ కాలేజీలు, ఎయిడెడ్ కాలేజీలు కలుపుకుని 614, ప్రయివేటు జూనియర్‌ కాలేజీలు 859 ఉన్నాయి. ఇంటర్ పరీక్షల సమయంలో విద్యార్థుల కోసం రాష్ట్ర యంత్రాంగం ప్రత్యేకంగా టెలీ మానస్ టోల్ ఫ్రీ నెంబర్ 14416 ను ఏర్పాటు చేసింది. పరీక్షల సమయంలో ఆందోళనకు, టెన్షన్ కు గురయ్యే విద్యార్థులు 14416 టోల్ ఫ్రీ నెంబర్ కు కాల్ చేస్తే మానసిక నిపుణులు, వైద్యులు ఉచిత కౌన్సిలింగ్ ఇచ్చారు. ఈ సదుపాయంపై విద్యార్థుల్లో విస్తృత ప్రచారం కల్పించారు. రాష్ట్ర స్థాయిలో కంట్రోల్ రూం ఏర్పాటు చేశారు. 

విద్యార్థులపై పెరుగుతున్న ఒత్తిడిని దృష్టిలో పెట్టుకొని ఇంటర్ సిలబస్‌లో చాలా మార్పులు చేసిన అధికారులు ఎంసెట్‌లో కూడా మార్పులు తీసుకొచ్చారు. ఇంజినీరింగ్‌, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే ఎంసెట్‌లో సిలబస్‌ను తగ్గించారు. మే 10 నుంచి జరిగే పరీక్షలో ఫస్టియర్‌ నుంచి 70 శాతం, సెకండియర్‌లో 100 శాతం సిలబస్‌ నుంచి ప్రశ్నలు రానున్నాయి. ఈ మేరకు సిలబస్‌ను ఎంసెట్‌ వెబ్‌సైట్‌లో పొందుపరిచారు.  

గతేడాది రిజల్ట్స్‌ చూస్తే... 

గతేడాది తెలంగాణ పదో తరగతి పరీక్షా ఫలితాల్లో పెద్ద ఎత్తున ఉత్తీర్ణత శాతం నమోదైంది. ఏకంగా 90 శాతం మంది విద్యార్థులు పాసయ్యారు. వీరిలో బాలుర ఉత్తీర్ణత శాతం 87.61 కాగా, బాలికల ఉత్తీర్ణత శాతం 92.45 గా ఉంది. జిల్లాల వారీగా చూస్తే సిద్దిపేట జిల్లా మొదటి స్థానంలో 97.87 శాతం ఉత్తీర్ణతతో తొలి స్థానంలో నిలిచింది. హైదరాబాద్ జిల్లా 79 శాతంతో చివరి స్థానంలో ఉండిపోయింది.

Published at : 09 May 2023 10:12 AM (IST) Tags: Intermediate results Telangana inter TS Inter Results Telangana Inter Results 2023 Telangana Inter news Inter Results Today

సంబంధిత కథనాలు

AP PG CET: ఏపీ పీజీ సెట్‌-2023 హాల్‌టికెట్లు విడుదల, పరీక్షల షెడ్యూలు ఇలా!

AP PG CET: ఏపీ పీజీ సెట్‌-2023 హాల్‌టికెట్లు విడుదల, పరీక్షల షెడ్యూలు ఇలా!

NEET UG 2023: వెబ్‌సైట్‌లో నీట్ యూజీ రెస్పాన్స్ షీట్లు, త్వరలోనే ఆన్సర్ కీ!

NEET UG 2023: వెబ్‌సైట్‌లో నీట్ యూజీ రెస్పాన్స్ షీట్లు, త్వరలోనే ఆన్సర్ కీ!

JEE Advanced: జేఈఈ అడ్వాన్స్‌డ్‌ పరీక్ష ప్రారంభం, తెలుగు రాష్ట్రాల నుంచి ఎంతమంది రాస్తున్నారంటే?

JEE Advanced: జేఈఈ అడ్వాన్స్‌డ్‌ పరీక్ష ప్రారంభం, తెలుగు రాష్ట్రాల నుంచి ఎంతమంది రాస్తున్నారంటే?

NMMS RESULTS: ఏపీ ఎన్‌ఎంఎంఎస్‌-2023 ఫలితాలు విడుదల, డైరెక్ట్ లింక్ ఇదే!

NMMS RESULTS: ఏపీ ఎన్‌ఎంఎంఎస్‌-2023 ఫలితాలు విడుదల, డైరెక్ట్ లింక్ ఇదే!

ఎన్టీఆర్‌ హైస్కూల్‌లో ఉచిత విద్యకు దరఖాస్తుల ఆహ్వానం, ఎంపిక ఇలా!

ఎన్టీఆర్‌ హైస్కూల్‌లో ఉచిత విద్యకు దరఖాస్తుల ఆహ్వానం, ఎంపిక ఇలా!

టాప్ స్టోరీస్

Gudivada Amarnath: రైల్వే మంత్రితో మంత్రి అమర్నాథ్ భేటీ, ఏపీ సీఎం జగన్ ను అభినందించిన అశ్విని వైష్ణవ్

Gudivada Amarnath: రైల్వే మంత్రితో మంత్రి అమర్నాథ్ భేటీ, ఏపీ సీఎం జగన్ ను అభినందించిన అశ్విని వైష్ణవ్

Coromandel Express Accident: మృతుల సంఖ్య 288 కాదు, 275 - రెండు సార్లు లెక్కపెట్టడం వల్లే కన్‌ఫ్యూజన్

Coromandel Express Accident: మృతుల సంఖ్య 288 కాదు, 275 - రెండు సార్లు లెక్కపెట్టడం వల్లే కన్‌ఫ్యూజన్

Bhola Mania Song : వన్ అండ్ ఓన్లీ బిందాస్ భోళా, మెగాస్టార్ వస్తే స్విచ్ఛాన్ గోల - ఫస్ట్ సాంగ్ విన్నారా?

Bhola Mania Song : వన్ అండ్ ఓన్లీ  బిందాస్ భోళా, మెగాస్టార్ వస్తే స్విచ్ఛాన్ గోల - ఫస్ట్ సాంగ్ విన్నారా?

Telangana Rains: ఒక్కసారిగా మారిన వాతావరణం, హైదరాబాద్ సహా పలు జిల్లాల్లో మోస్తరు వర్షం - 3 రోజులపాటు ఎల్లో అలర్ట్

Telangana Rains: ఒక్కసారిగా మారిన వాతావరణం, హైదరాబాద్ సహా పలు జిల్లాల్లో మోస్తరు వర్షం - 3 రోజులపాటు ఎల్లో అలర్ట్