అన్వేషించండి

Inter Fee: ఇంటర్ పరీక్ష ఫీజు చెల్లించడానికి మరో అవకాశం, ఎప్పటివరకంటే?

Inter Fee: తెలంగాణలో ఇంటర్ వార్షిక పరీక్షల ఫీజు గడువును ఇంటర్మీడియట్ బోర్డు (TSBIE) పొడిగించింది. ఆలస్య రుసుము రూ.2,500తో ఫీజు చెల్లించేందుకు అవకాశం కల్పించింది.

Telangana Inter Exam Fee: తెలంగాణ(Telangana)లో ఇంటర్ వార్షిక పరీక్షల ఫీజు గడువును ఇంటర్మీడియట్ బోర్డు (TSBIE) పొడిగించింది. ఆలస్య రుసుము రూ.2,500తో ఫీజు చెల్లించేందుకు అవకాశం కల్పించింది. విద్యార్థులు జనవరి 3 వరకు ఫీజు చెల్లించవచ్చని ఇంటర్ బోర్డ్ ప్రకటించింది. ఈ అవకాశాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని కోరింది. ఇంటర్ మొదటి, ద్వితీయ సంవత్సరంలో కొన్ని కోర్సుల్లో కలిపి 10.59 లక్షల మంది విద్యార్థులు ఉండగా.. ఫీజు చెల్లింపు గడవు ముగిసేనాటికి 9.77 లక్షల మంది విద్యార్థులు ఫీజు చెల్లించారు. ఇంకా 82 వేల మంది విద్యార్థులు ఫీజు చెల్లించాల్సి ఉంది. ఈ క్రమంలో మరోసారి ఫీజు చెల్లించేందుకు అవకాశం ఇచ్చింది ఇంటర్ బోర్డు.  ఇంట‌ర్ రెగ్యుల‌ర్ విద్యార్థులు రూ. 500 ప‌రీక్ష ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. ఇంట‌ర్ ద్వితీయ సంవ‌త్సరం చ‌దువుతున్న సైన్స్ గ్రూపుల విద్యార్థులు ప్రాక్టిక‌ల్ ప‌రీక్షల నిమిత్తం అద‌నంగా రూ. 210 చెల్లించాల్సి ఉంటుంది. ఒకేష‌న‌ల్ విద్యార్థులు రూ. 710 చెల్లించాల్సి ఉంటుంది.

ఈ ఏడాది రాష్ట్రవ్యాప్తంగా ఇంటర్మీడియట్‌ ప్రథమ, ద్వితీయ సంవత్సరాలకు సంబంధించి 10,59,233 మంది విద్యార్థులు వివిధ కాలేజీల్లో అడ్మిషన్లను పొందారు. వీరిలో 8,99,041 మంది విద్యార్థులు నిర్ణీత గడువులోపే పరీక్ష ఫీజులు చెల్లించారు. మరో 61,005 మంది విద్యార్థులు రూ.100 ఫైన్‌తో, 8,638 మంది విద్యార్థులు రూ.500ల ఫైన్‌తో, 5,212 మంది విద్యార్థులు రూ.1000 ఫైన్‌తో, 3,144 మంది విద్యార్థులు రూ.2000 ఫైన్‌తో చెల్లించారు. ఇప్పటి వరకు మొత్తంగా 9,77,040 మంది విద్యార్థులు మార్చి -2024 పరీక్ష ఫీజులను చెల్లించినట్లు ఇంటర్మీడియట్‌ బోర్డు వెల్లడించింది.

పరీక్ష ఫీజు వివరాలు ఇలా..

🔰 ఇంట‌ర్ రెగ్యుల‌ర్ విద్యార్థులు రూ. 500 ప‌రీక్ష ఫీజుగా చెల్లించాలి. 

🔰 ఇంట‌ర్ ద్వితీయ సంవ‌త్సరం చ‌దువుతున్న సైన్స్ గ్రూపుల విద్యార్థులు ప్రాక్టిక‌ల్ ప‌రీక్షల నిమిత్తం అద‌నంగా రూ.210 చెల్లించాల్సి ఉంటుంది. 

🔰 ఒకేష‌న‌ల్ విద్యార్థులైతే రూ. 710 చెల్లించాలి.  

🔰 నవంబరు 14 నుంచి 30 వరకు ఫీజు ఆలస్యరుసుము లేకుండా ఫీజు చెల్లించవచ్చు. 

🔰 రూ. 100 ఆల‌స్య రుసుముతో డిసెంబ‌ర్ 2 నుంచి 6 వరకు పరీక్ష ఫీజు చెల్లించవచ్చు. (డిసెంబరు 12 వరకు పొడిగించారు).

🔰 రూ. 100 ఆల‌స్య రుసుంతో డిసెంబ‌ర్ 12 వరకు పరీక్ష ఫీజు చెల్లించవచ్చు.

🔰 రూ.500 ఆల‌స్య రుసుంతో డిసెంబర్ 14 నుంచి 17 వ‌ర‌కు పరీక్ష ఫీజు చెల్లించవచ్చు.

🔰 రూ. 1000 ఆల‌స్య రుసుంతో డిసెంబ‌ర్ 19 నుంచి 22 వరకు పరీక్ష ఫీజు చెల్లించవచ్చు.

🔰 రూ. 2000 ఆల‌స్య రుసుంతో తెలియాల్సి ఉంది.

పరీక్షల షెడ్యూలు వెల్లడి..
తెలంగాణ స్టేట్ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ 2024 మార్చిలో జరగనున్న ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్ష టైమ్ టేబుల్‌ను డిసెంబరు 28న విడుదల చేసిన సంగతి తెలిసిందే. షెడ్యూల్ ప్రకారం, ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరం పరీక్షలను ఫిబ్రవరి 28 నుండి మార్చి 18 వరకు.. ద్వితీయ సంవత్సరం పరీక్షలను ఫిబ్రవరి 29 నుంచి మార్చి 19 వరకు నిర్వహించనున్నారు. ఇంటర్ ద్వితీయ సంవత్సరం విద్యార్థులకు ఫిబ్రవరి 1 నుంచి 15 వరకు ప్రాక్టికల్ పరీక్షలు నిర్వహించనున్నారు. ఆయాతేదీల్లో ప్రతిరోజు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్షలను నిర్వహించనున్నారు. 

ఇంటర్‌ ఫస్టియర్‌ పరీక్షలు..

➥ 28-02-2024: సెకండ్‌ లాంగ్వేజ్‌ పేపర్‌-I

➥ 01-03-2024: ఇంగ్లిష్‌ పేపర్‌-I

➥ 04-03-2024: మ్యాథమెటిక్స్‌ పేపర్‌-IA, బాటనీ పేపర్‌-I, పొలిటికల్‌ సైన్స్‌ పేపర్‌-I

➥ 06-03-2024: మ్యాథమేటిక్స్‌ పేపర్‌-IB, జువాలజీ పేపర్‌-I, హిస్టరీ పేపర్‌-I

➥ 11-03-2024: ఫిజిక్స్‌ పేపర్‌-I, ఎకనామిక్స్‌ పేపర్‌-I

➥ 13-03-2024: కెమిస్ట్రీ పేపర్‌-I, కామర్స్‌ పేపర్‌-I

➥ 15-03-2024: పబ్లిక్‌ అడ్మినిస్ట్రేషన్‌ పేపర్‌-I, బ్రిడ్జి కోర్స్‌ మ్యాథ్స్‌ పేపర్‌-I

➥ 18-03-2024: మోడర్న్‌ లాంగ్వేజ్‌ పేపర్‌-I, జియోగ్రఫీ పేపర్‌-I

ఇంటర్‌ సెకండ్‌ పరీక్షలు..

➥ 29-02-2024: సెకండ్‌ లాంగ్వేజ్‌ పేపర్‌-II

➥ 02-03-2024: ఇంగ్లిష్‌ పేపర్‌-II

➥ 05-03-2024: మ్యాథమెటిక్స్‌ పేపర్‌-IIA, బాటనీ పేపర్‌-II, పొలిటికల్‌ సైన్స్‌ పేపర్‌-II

➥ 07-03-2024: మ్యాథమెటిక్స్‌ పేపర్‌-IIB, జువాలజీ పేపర్‌-II, హిస్టరీ పేపర్‌-II

➥ 12-03-2024: ఫిజిక్స్‌ పేపర్‌-II, ఎకనామిక్స్‌ పేపర్‌-II

➥ 14-03-2024: కెమిస్ట్రీ పేపర్‌-II, కామర్స్‌ పేపర్‌-II

➥ 16-03-2024: పబ్లిక్‌ అడ్మినిస్ట్రేషన్‌ పేపర్‌-II, బ్రిడ్జి కోర్స్‌ మ్యాథ్స్‌ పేపర్‌-II

➥ 19-03-2024: మోడర్న్‌ లాంగ్వేజ్‌ పేపర్‌-II, జియోగ్రఫీ పేపర్‌-II  

ALSO READ:

ఏపీ ఓపెన్ స్కూల్ టెన్త్, ఇంటర్ పరీక్షల షెడ్యూలు వెల్లడి, పరీక్ష ఫీజు వివరాలు ఇలా
ఏపీలో సార్వత్రిక విద్యాపీఠం(APOSS) పదోతరగతి, ఇంటర్మీడియట్‌ పబ్లిక్‌ పరీక్షల షెడ్యూలు విడుదలైంది. ప్రకటించిన షెడ్యూలు ప్రకారం మార్చి 18 నుంచి 27 వరకు పరీక్షలను  నిర్వహించనున్నారు. ఆయా తేదీల్లో మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు పరీక్షలు నిర్వహించనున్నారు. అదేవిధంగా ఇంటర్ విద్యార్థులకు మార్చి 30 నుంచి ఏప్రిల్‌ 3 వరకు ప్రాక్టికల్‌ పరీక్షలు నిర్వహిస్తారు. ప్రాక్టికల్ పరీక్షలు ఉదయం, మధ్యాహ్నం రెండు సెషన్లలో జరుగుతాయి. విద్యార్థులు జనవరి 5 నుంచి ఫిబ్రవరి 19 వరకు ఆన్‌లైన్‌ విధానంలో పరీక్ష ఫీజు చెల్లించాలి. ఒక్కో సబ్జెక్టుకు రూ.25 ఆలస్యరుసుముతో జనవరి 20 నుంచి 27 వరకు, ఒక్కో సబ్జెక్టుకు రూ.50 ఆలస్యరుసుముతో జనవరి 28 నుంచి ఫిబ్రవరి 3 వరకు ఫీజు చెల్లించవచ్చు. 
పరీక్షల పూర్తి షెడ్యూలు కోసం క్లిక్ చేయండి..

మరిన్ని విద్యాసంబంధ వార్తల కోసం క్లిక్ చేయండి...

టాప్ హెడ్ లైన్స్

Telangana Govt Good News: జీవో 59 దరఖాస్తుదారులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్‌‌‌న్యూస్‌, క్రమబద్ధీకరణకు అనుమతి
జీవో 59 దరఖాస్తుదారులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్‌‌‌న్యూస్‌, క్రమబద్ధీకరణకు అనుమతి
TVK Wins Tamil Nadu By Polls: తమిళనాడు ఉప ఎన్నికల్లో టీవీకే ఘన విజయం.. సీఎం విజయ్ పాలనకు రాలిన ఓట్లు
తమిళనాడు ఉప ఎన్నికల్లో టీవీకే ఘన విజయం.. సీఎం విజయ్ పాలనకు రాలిన ఓట్లు
Nobel Peace Prize 2026: భారత సంతతి మహిళ నవనీతమ్ పిళ్లైకి నోబెల్ శాంతి పురస్కారం.. ఆమె బ్యాక్‌గ్రౌండ్ ఇదే
భారత సంతతి మహిళ నవనీతమ్ పిళ్లైకి నోబెల్ శాంతి పురస్కారం.. ఆమె బ్యాక్‌గ్రౌండ్ ఇదే
EYES Web Series Review - 'ఐస్' వెబ్ సిరీస్ రివ్యూ: సోనీలివ్ ఓటీటీలో మలయాళ వెబ్ సిరీస్... తెలుగులోనూ స్ట్రీమింగ్
'ఐస్' వెబ్ సిరీస్ రివ్యూ: సోనీలివ్ ఓటీటీలో మలయాళ వెబ్ సిరీస్... తెలుగులోనూ స్ట్రీమింగ్

వీడియోలు

Morne Morkel Backs Vaibhav Suryavanshi | వైభవ్ పై మోర్నీ మోర్కెల్ ఆసక్తికర వ్యాఖ్యలు
USA Pacer Ali Khan Wide Ball | వైడ్ బాల్ నేరుగా సిక్స్ వెళ్ళిన వైనం! అమెరికా బౌలర్ అరుదైన రికార్డ్
India vs Pakistan Asian Games 2026 Final | భారత్ - పాకిస్థాన్ మ్యాచ్‌లో షేక్ హ్యాండ్ ఉంటుందా?
Gautam Gambhir Slams Flat Pitches vs WI | పిచ్‌ల తీరుపై గౌతమ్ గంభీర్ తీవ్ర అసహనం
Ishan Kishan Knock in Asian Games 2026 | శ్రీలంకపై ఘన విజయం సాధించి ఫైనల్‌లోకి భారత్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana Govt Good News: జీవో 59 దరఖాస్తుదారులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్‌‌‌న్యూస్‌, క్రమబద్ధీకరణకు అనుమతి
జీవో 59 దరఖాస్తుదారులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్‌‌‌న్యూస్‌, క్రమబద్ధీకరణకు అనుమతి
TVK Wins Tamil Nadu By Polls: తమిళనాడు ఉప ఎన్నికల్లో టీవీకే ఘన విజయం.. సీఎం విజయ్ పాలనకు రాలిన ఓట్లు
తమిళనాడు ఉప ఎన్నికల్లో టీవీకే ఘన విజయం.. సీఎం విజయ్ పాలనకు రాలిన ఓట్లు
Nobel Peace Prize 2026: భారత సంతతి మహిళ నవనీతమ్ పిళ్లైకి నోబెల్ శాంతి పురస్కారం.. ఆమె బ్యాక్‌గ్రౌండ్ ఇదే
భారత సంతతి మహిళ నవనీతమ్ పిళ్లైకి నోబెల్ శాంతి పురస్కారం.. ఆమె బ్యాక్‌గ్రౌండ్ ఇదే
EYES Web Series Review - 'ఐస్' వెబ్ సిరీస్ రివ్యూ: సోనీలివ్ ఓటీటీలో మలయాళ వెబ్ సిరీస్... తెలుగులోనూ స్ట్రీమింగ్
'ఐస్' వెబ్ సిరీస్ రివ్యూ: సోనీలివ్ ఓటీటీలో మలయాళ వెబ్ సిరీస్... తెలుగులోనూ స్ట్రీమింగ్
AI Abuse Prevention: ఏఐని వేధించడం ఇక కుదరదు.. క్లాడ్ కోసం ఆంథ్రోపిక్ కఠిన నిబంధనలు
ఏఐని వేధించడం ఇక కుదరదు.. క్లాడ్ కోసం ఆంథ్రోపిక్ కఠిన నిబంధనలు
Gade Saikrishna Custodial Death Case: గాదె సాయికృష్ణది కస్టడీ హత్యే! దుప్పట్లో చుట్టి తరలించి మృతదేహం దహనం.. కోర్టుకు సిట్ ఛార్జిషీటు 
గాదె సాయికృష్ణది కస్టడీ హత్యే! దుప్పట్లో చుట్టి తరలించి మృతదేహం దహనం.. కోర్టుకు సిట్ ఛార్జిషీటు 
BC Reservations In AP: బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు పార్టీ పరంగానైనా అమలు చేస్తాం: టీడీపీ కీలక ప్రకటన
బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు పార్టీ పరంగానైనా అమలు చేస్తాం: టీడీపీ కీలక ప్రకటన
Spiderman Brand New Day OTT : మరో ఓటీటీలోకి స్పైడర్ మ్యాన్ - ఏయే ప్లాట్ ఫామ్స్‌లో స్ట్రీమింగ్ అవుతుందంటే?
మరో ఓటీటీలోకి స్పైడర్ మ్యాన్ - ఏయే ప్లాట్ ఫామ్స్‌లో స్ట్రీమింగ్ అవుతుందంటే?
Embed widget