అన్వేషించండి

ICET Result: నేడే తెలంగాణ ఐసెట్‌ ఫలితాలు, రిజల్ట్స్ వెల్లడి సమయమిదే?

తెలంగాణలో ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన 'టీఎస్ ఐసెట్‌-2023' పరీక్ష ఫలితాలు జూన్ 29న వెలువడనున్నాయి. జూన్‌ 29 మధ్యాహ్నం 3.30గంటలకు విడుదల చేయనున్నారు.

తెలంగాణలో ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన 'టీఎస్ ఐసెట్‌-2023' పరీక్ష ఫలితాలు జూన్ 29న వెలువడనున్నాయి. జూన్‌ 29 మధ్యాహ్నం 3.30గంటలకు విడుదల చేయనున్నట్టు కన్వీనర్‌ పి.వరలక్ష్మి జూన్ 28న ఒక ప్రకటనలో తెలిపారు.

వరంగల్‌లోని కాకతీయ యూనివర్సిటీ రాష్ట్ర వ్యాప్తంగా మే 26, 27 తేదీల్లో నిర్వహించిన ఐసెట్ పరీక్షకు దాదాపు 70వేల మందికి పైగా విద్యార్థులు హాజరయ్యారు. ఫలితాలను అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచనున్నారు. ఫలితాలతోపాటు ఐసెట్ ఫైనల్ ఆన్సర్ కీని కూడా విడుదల చేయనున్నారు.

ఫలితాల కోసం వెబ్‌సైట్   https://icet.tsche.ac.in/ 

పరీక్ష విధానం: 
మొత్తం 200 మార్కులకు ఐసెట్ ఆన్‌లైన్ ప్రవేశ పరీక్ష నిర్వహిస్తారు. పరీక్షలో మొత్తం 200 ప్రశ్నలు ఉంటాయి. పరీక్ష సమయం 150 నిమిషాలు. పరీక్షలో మూడు సెక్షన్లు (సెక్షన్-ఎ, బి, సి) ఉంటాయి. వీటిలో సెక్షన్-ఎ: అనలిటికల్ ఎబిలిటీ-75 ప్రశ్నలు-75 మార్కులు, సెక్షన్-బి: మ్యాథమెటికల్ ఎబిలిటీ-75 ప్రశ్నలు-75 మార్కులు, సెక్షన్-సి: కమ్యూనికేషన్  ఎబిలిటీ-50 ప్రశ్నలు-50 మార్కులు ఉంటాయి.

ICET - ఈ కోర్సులతో ఉత్తమ భవిత:

ఎంసీఏ:
ఐటీ రంగంలో స్థిరపడాలనుకునేవారికి ఎంసీఏ సరైన ఎంపిక అని చెప్పవచ్చు. ఇందుకు మ్యాథ్స్ పై పట్టు ప్రాక్టికల్ ఓరియంటేషన్, ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ ఉన్నవారు ఈ రంగాన్నే ఎంచుకోవచ్చు. ఇందులో ఎక్కువ టెక్నాలజీతో పని చేయాల్సి ఉంటుంది. కాబట్టి టెక్నాలజీలో వస్తున్న మార్పులకు ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ దానిపై అవగాహన అధ్యయనం చేయగలగాలి. ప్రస్తుతం మార్కెట్లో కమ్యూనికేషన్ స్కిల్స్ ఉన్న అభ్యర్థులకు ఎక్కువగా అవకాశాలు లభిస్తున్నాయి. ఎంసీఏ పూర్తి చేసుకున్న వారికి ప్రధానంగా ఉపాధి కల్పించేది సాఫ్ట్ వేర్ రంగమే. ఈ కోర్స్ లో చేరినప్పటి నుంచే ప్రోగ్రామింగ్, నైపుణ్యాలపై దృష్టి సారించాలి. ఈ రంగంలో వస్తున్న నూతన ఆవిష్కరణలు, పరిశోధనలు ఎప్పటికప్పుడు బేరీజు వేసుకోవాలి.

జాబ్ మార్కెట్లో బీటెక్‌తో పోటీ పడాల్సి ఉంటుంది. అందుకు అనుగుణంగా కావల్సిన నైపుణ్యాలకు ప్రాధాన్యమిస్తూ సైన్స్ ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ ,బ్లాక్ ఛైన్ టెక్నాలజీ, ఆటోమేషన్, రోబోటిక్స్ తదితర టెక్నాలజీల ముందు వరుసలో నిలుస్తాయి. పరిశ్రమలకు అనుగుణంగా ఆర్ ప్రోగ్రామింగ్ సేల్స్ ఫోర్స్ టెక్నాలజీ, సైబర్ సెక్యూరిటీ, యాప్ డెవలప్మెంట్, ఆండ్రాయిడ్ డెవలప్మెంట్, మొబైల్ అప్లికేషన్ డెవలప్మెంట్ వంటి కోర్సుల్లో ప్రావీణ్యం అవసరం. క్యాంపస్ ఇంటర్వ్యూల్లో ఎంపికైతే మంచి జీతంతో పాటు చక్కటి కెరీర్ను పొందవచ్చు.

ఎంబీఏ:
నేటి యువతను ఎక్కువగా ఆకర్షిస్తున్న కోర్సుల్లో ఎంబీఏ (మాస్టర్ ఆఫ్ బిజినెస్ మేనేజ్‌మెంట్) మొదటి మూడు స్థానాల్లో కచ్చితంగా ఉంటుంది. ఈ కోర్సు చేయడం వల్ల కార్పొరేట్ రంగంలోని కీలక బాధ్యతలు నిర్వహించాల్సి ఉంటుంది. ఈ రంగంపై ఆసక్తితో పాటు నాయకత్వ లక్షణాలు ఉన్నవారు ఇందులో త్వరగా రాణిస్తారు. బిజినెస్ స్కిల్స్, టీం మేనేజ్‌మెంట్, టీమ్ లీడింగ్ సామర్థ్యం, ప్రణాళిక, భవిష్యత్ పరిణామాలను అంచనా వేయడం, గ్రూప్ డిస్కషన్ పనితీరును మెరుగు పరిచే ఎలా తీర్చిదిద్దడం, సమస్యలు వచ్చినప్పుడు కారణాలు అన్వేషించి, ఇంటర్ పర్సనల్ స్కిల్స్ ఉన్నవారు ఈ కోర్సును ఎంచుకోవచ్చు. ఎంబీఏ పూర్తి చేసిన వారు బిజినెస్ మేనేజర్లు, సీఈఓ, అంతేకాకుండా ఎంటర్ప్రెన్యూర్ గా మారవచ్చు.

ఎంబీఏలో మార్కెటింగ్, హెచ్ఆర్ ,ఫైనాన్స్ తదితర స్పెషలైజేషన్లు ఉంటాయి. ఈ కోర్సు రాణించాలంటే కేస్ స్టడీలను పరిశీలించాలి. అంతేకాకుండా మార్కెట్‌ అవసరాలకు అనుగుణంగా కమ్యూనికేషన్ స్కిల్స్, సాఫ్ట్ స్కిల్స్, ఇంగ్లిష్ భాషపై పట్టు మెరుగుపరుచుకోవాలి. అంతేకాకుండా ఎంచుకున్న స్పెషలైజేషన్‌పై ప్రత్యేక ప్రావీణ్యం సంతరించుకోవడంతో పాటు, ప్రాజెక్ట్‌వర్క్ చేయాలి. కార్పొరేట్ రంగంలో ఎందుకు వ్యక్తిగత చొరవ కూడా ఉండాలి.

ప్రతి సంవత్సరం ఎంబీఏ పూర్తి చేసుకొని పెద్ద సంఖ్యలో బయటికి వస్తున్నారు. ఉద్యోగాలు మాత్రం కొందరికే లభిస్తున్నాయి. ఎందుకంటే దీని సరిపడా నైపుణ్యాలు కొంతమంది లోనే ఉంటున్నాయి. కాబట్టి అలా నేర్చుకునే వారికి న్యూమరికల్ ఎబిలిటీ, ఇంగ్లీష్, కమ్యూనికేషన్ స్కిల్స్ అవసరం. అలా నేర్చుకున్నవారికి బ్యాంకింగ్, ఫార్మ్, అగ్రికల్చర్, ఇన్సూరెన్స్ ,హెల్త్, ఎఫ్ఎంసీజీ వంటి రంగాల్లో వివిధ స్థాయిల్లో అవకాశాలు లభిస్తాయి.

మరిన్ని విద్యాసంబంధ వార్తల కోసం క్లిక్ చేయండి..

Join Us on Telegram: https://t.me/abpdesamofficial

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Sri Reddy Arrest?: పోసాని అరెస్ట్ తర్వాత టార్గెట్ శ్రీ రెడ్డి... బూతులకు తగిన మూల్యం చెల్లించక తప్పదా?
పోసాని అరెస్ట్ తర్వాత టార్గెట్ శ్రీ రెడ్డి... బూతులకు తగిన మూల్యం చెల్లించక తప్పదా?
Telangana Latest News: రేవంత్ రెడ్డి ఆర్‌ఎస్‌ఎస్‌ సీఎం- మోదీతో కలిసి బీఆర్ఎస్‌పై కుట్రలు- కవిత సంచలన వ్యాఖ్యలు
రేవంత్ రెడ్డి ఆర్‌ఎస్‌ఎస్‌ సీఎం- మోదీతో కలిసి బీఆర్ఎస్‌పై కుట్రలు- కవిత సంచలన వ్యాఖ్యలు
Posani Krishan Murali Arrest: నటుడు పోసాని కృష్ణమురళి అరెస్టుపై జగన్ స్పందన ఇదే!
నటుడు పోసాని కృష్ణమురళి అరెస్టుపై జగన్ స్పందన ఇదే!
Hyderabad Latest News: దేవాదాయశాఖ పరిధిలోకి ఛార్మినార్ భాగ్యలక్ష్మి ఆలయం, ఇకపై పక్కా లెక్కలు చెప్పాల్సిందే!
దేవాదాయశాఖ పరిధిలోకి ఛార్మినార్ భాగ్యలక్ష్మి ఆలయం, ఇకపై పక్కా లెక్కలు చెప్పాల్సిందే!
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

TVK Vijay First Anniversary Speech in Telugu | ఒకడు ఫాసిజం..ఇంకోడు పాయసం..మాటల దాడి చేసిన విజయ్ | ABP DesamMS Dhoni Morse Code T Shirt Decoded | చెన్నై అడుగుపెట్టిన ధోని..ఊహించని షాక్ ఇచ్చాడు | ABP DesamSri Mukha Lingam  Temple History | శివుడు లింగం రూపంలో కాకుండా ముఖరూపంలో కనిపించే ఆలయం | ABP DesamTirumala Kshethra Palakudu Rudrudu Temple | కోనేటి రాయుడి క్షేత్రానికి కాపలా ఈయనే | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Sri Reddy Arrest?: పోసాని అరెస్ట్ తర్వాత టార్గెట్ శ్రీ రెడ్డి... బూతులకు తగిన మూల్యం చెల్లించక తప్పదా?
పోసాని అరెస్ట్ తర్వాత టార్గెట్ శ్రీ రెడ్డి... బూతులకు తగిన మూల్యం చెల్లించక తప్పదా?
Telangana Latest News: రేవంత్ రెడ్డి ఆర్‌ఎస్‌ఎస్‌ సీఎం- మోదీతో కలిసి బీఆర్ఎస్‌పై కుట్రలు- కవిత సంచలన వ్యాఖ్యలు
రేవంత్ రెడ్డి ఆర్‌ఎస్‌ఎస్‌ సీఎం- మోదీతో కలిసి బీఆర్ఎస్‌పై కుట్రలు- కవిత సంచలన వ్యాఖ్యలు
Posani Krishan Murali Arrest: నటుడు పోసాని కృష్ణమురళి అరెస్టుపై జగన్ స్పందన ఇదే!
నటుడు పోసాని కృష్ణమురళి అరెస్టుపై జగన్ స్పందన ఇదే!
Hyderabad Latest News: దేవాదాయశాఖ పరిధిలోకి ఛార్మినార్ భాగ్యలక్ష్మి ఆలయం, ఇకపై పక్కా లెక్కలు చెప్పాల్సిందే!
దేవాదాయశాఖ పరిధిలోకి ఛార్మినార్ భాగ్యలక్ష్మి ఆలయం, ఇకపై పక్కా లెక్కలు చెప్పాల్సిందే!
Nagarjuna: మా అక్కినేని కుటుంబానికి ఆయనొక స్తంభం... అభిమాని మృతిపై నాగార్జున ఎమోషనల్ పోస్ట్
మా అక్కినేని కుటుంబానికి ఆయనొక స్తంభం... అభిమాని మృతిపై నాగార్జున ఎమోషనల్ పోస్ట్
Pithapuram Latest News: పవన్‌ ఇలాఖాలో భూకబ్జా ఆరోపణలు- పోరాటానికి సిద్ధమన్న వామపక్షాలు
పవన్‌ ఇలాఖాలో భూకబ్జా ఆరోపణలు- పోరాటానికి సిద్ధమన్న వామపక్షాలు
Ram Pothineni: రైటర్‌గా మారిన రామ్ పోతినేని... మహేష్ బాబు సినిమాలో లవ్ సాంగ్ రాసిన హ్యాండ్సమ్ హీరో
రైటర్‌గా మారిన రామ్ పోతినేని... మహేష్ బాబు సినిమాలో లవ్ సాంగ్ రాసిన హ్యాండ్సమ్ హీరో
Universal Pension Scheme: సార్వత్రిక పింఛన్‌ పథకంతో ఉన్న స్కీమ్స్‌ పోతాయా? - మోదీ ప్రభుత్వం ఆలోచన ఏంటీ?
సార్వత్రిక పింఛన్‌ పథకంతో ఉన్న స్కీమ్స్‌ పోతాయా? - మోదీ ప్రభుత్వం ఆలోచన ఏంటీ?
Embed widget