అన్వేషించండి

ICET Result: తెలంగాణ ఐసెట్‌ ఫలితాలు విడుదల, ఇక్కడ చూసుకోండి!

టీఎస్ ఐసెట్‌-2023' పరీక్ష ఫలితాలు జూన్ 29న విడుదలైనవి. వరంగల్‌ కాకతీయ యూనివర్సిటీలో ఉన్నత విద్యామండలి చైర్మన్‌ ప్రొఫెసర్‌ ఆర్‌ లింబాద్రి విడుదల చేశారు.

తెలంగాణలో ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన 'టీఎస్ ఐసెట్‌-2023' పరీక్ష ఫలితాలు జూన్ 29న విడుదలైనవి. జూన్‌ 29 మధ్యాహ్నం 3.30 గంటలకు హనుమకొండ కాకతీయ యూనివర్సిటీలో ఉన్నత విద్యామండలి చైర్మన్‌ ప్రొఫెసర్‌ ఆర్‌ లింబాద్రి, టీఎస్‌ఐసీఈటీ చైర్మన్‌ ప్రొఫెసర్‌ తాటికొండ రమేశ్‌, కాకతీయ విశ్వవిద్యాలయం వైస్‌ చాన్సలర్‌ ప్రొఫెసర్‌ వీ వెంకట రమణ, ఉన్నత విద్యామండలి వైస్‌ చైర్మన్‌ ఎస్‌కే మహమూద్‌, టీఎస్‌సీహెచ్‌ఈ సెక్రెటరీ శ్రీనివాసరావు విడుదల చేశారు. ఐసెట్‌లో నూకల శరణ్‌కుమార్‌ అనే విద్యార్థి మొదటి ర్యాంకు సాధించారు. సాయి నవీన్‌, రవిజేత వరుసగా రెండు, మూడు ర్యాంకులు సాధించారు. ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశానికి మే 26, 27 తేదీల్లో తెలంగాణలో 16, ఏపీలోని నాలుగు కేంద్రాల్లో పరీక్ష నిర్వహించిన విషయం తెలిసిందే. 70,900 మంది విద్యార్థులు పరీక్షకు హాజరయ్యారు. 

ఐసెట్‌ ర్యాంకు కార్డు కోసం క్లిక్ చేయండి..

పరీక్ష విధానం: 
మొత్తం 200 మార్కులకు ఐసెట్ ఆన్‌లైన్ ప్రవేశ పరీక్ష నిర్వహిస్తారు. పరీక్షలో మొత్తం 200 ప్రశ్నలు ఉంటాయి. పరీక్ష సమయం 150 నిమిషాలు. పరీక్షలో మూడు సెక్షన్లు (సెక్షన్-ఎ, బి, సి) ఉంటాయి. వీటిలో సెక్షన్-ఎ: అనలిటికల్ ఎబిలిటీ-75 ప్రశ్నలు-75 మార్కులు, సెక్షన్-బి: మ్యాథమెటికల్ ఎబిలిటీ-75 ప్రశ్నలు-75 మార్కులు, సెక్షన్-సి: కమ్యూనికేషన్  ఎబిలిటీ-50 ప్రశ్నలు-50 మార్కులు ఉంటాయి.

ICET - ఈ కోర్సులతో ఉత్తమ భవిత:

ఎంసీఏ:
ఐటీ రంగంలో స్థిరపడాలనుకునేవారికి ఎంసీఏ సరైన ఎంపిక అని చెప్పవచ్చు. ఇందుకు మ్యాథ్స్ పై పట్టు ప్రాక్టికల్ ఓరియంటేషన్, ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ ఉన్నవారు ఈ రంగాన్నే ఎంచుకోవచ్చు. ఇందులో ఎక్కువ టెక్నాలజీతో పని చేయాల్సి ఉంటుంది. కాబట్టి టెక్నాలజీలో వస్తున్న మార్పులకు ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ దానిపై అవగాహన అధ్యయనం చేయగలగాలి. ప్రస్తుతం మార్కెట్లో కమ్యూనికేషన్ స్కిల్స్ ఉన్న అభ్యర్థులకు ఎక్కువగా అవకాశాలు లభిస్తున్నాయి. ఎంసీఏ పూర్తి చేసుకున్న వారికి ప్రధానంగా ఉపాధి కల్పించేది సాఫ్ట్ వేర్ రంగమే. ఈ కోర్స్ లో చేరినప్పటి నుంచే ప్రోగ్రామింగ్, నైపుణ్యాలపై దృష్టి సారించాలి. ఈ రంగంలో వస్తున్న నూతన ఆవిష్కరణలు, పరిశోధనలు ఎప్పటికప్పుడు బేరీజు వేసుకోవాలి.

జాబ్ మార్కెట్లో బీటెక్‌తో పోటీ పడాల్సి ఉంటుంది. అందుకు అనుగుణంగా కావల్సిన నైపుణ్యాలకు ప్రాధాన్యమిస్తూ సైన్స్ ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ ,బ్లాక్ ఛైన్ టెక్నాలజీ, ఆటోమేషన్, రోబోటిక్స్ తదితర టెక్నాలజీల ముందు వరుసలో నిలుస్తాయి. పరిశ్రమలకు అనుగుణంగా ఆర్ ప్రోగ్రామింగ్ సేల్స్ ఫోర్స్ టెక్నాలజీ, సైబర్ సెక్యూరిటీ, యాప్ డెవలప్మెంట్, ఆండ్రాయిడ్ డెవలప్మెంట్, మొబైల్ అప్లికేషన్ డెవలప్మెంట్ వంటి కోర్సుల్లో ప్రావీణ్యం అవసరం. క్యాంపస్ ఇంటర్వ్యూల్లో ఎంపికైతే మంచి జీతంతో పాటు చక్కటి కెరీర్ను పొందవచ్చు.

ఎంబీఏ:
నేటి యువతను ఎక్కువగా ఆకర్షిస్తున్న కోర్సుల్లో ఎంబీఏ (మాస్టర్ ఆఫ్ బిజినెస్ మేనేజ్‌మెంట్) మొదటి మూడు స్థానాల్లో కచ్చితంగా ఉంటుంది. ఈ కోర్సు చేయడం వల్ల కార్పొరేట్ రంగంలోని కీలక బాధ్యతలు నిర్వహించాల్సి ఉంటుంది. ఈ రంగంపై ఆసక్తితో పాటు నాయకత్వ లక్షణాలు ఉన్నవారు ఇందులో త్వరగా రాణిస్తారు. బిజినెస్ స్కిల్స్, టీం మేనేజ్‌మెంట్, టీమ్ లీడింగ్ సామర్థ్యం, ప్రణాళిక, భవిష్యత్ పరిణామాలను అంచనా వేయడం, గ్రూప్ డిస్కషన్ పనితీరును మెరుగు పరిచే ఎలా తీర్చిదిద్దడం, సమస్యలు వచ్చినప్పుడు కారణాలు అన్వేషించి, ఇంటర్ పర్సనల్ స్కిల్స్ ఉన్నవారు ఈ కోర్సును ఎంచుకోవచ్చు. ఎంబీఏ పూర్తి చేసిన వారు బిజినెస్ మేనేజర్లు, సీఈఓ, అంతేకాకుండా ఎంటర్ప్రెన్యూర్ గా మారవచ్చు.

ఎంబీఏలో మార్కెటింగ్, హెచ్ఆర్ ,ఫైనాన్స్ తదితర స్పెషలైజేషన్లు ఉంటాయి. ఈ కోర్సు రాణించాలంటే కేస్ స్టడీలను పరిశీలించాలి. అంతేకాకుండా మార్కెట్‌ అవసరాలకు అనుగుణంగా కమ్యూనికేషన్ స్కిల్స్, సాఫ్ట్ స్కిల్స్, ఇంగ్లిష్ భాషపై పట్టు మెరుగుపరుచుకోవాలి. అంతేకాకుండా ఎంచుకున్న స్పెషలైజేషన్‌పై ప్రత్యేక ప్రావీణ్యం సంతరించుకోవడంతో పాటు, ప్రాజెక్ట్‌వర్క్ చేయాలి. కార్పొరేట్ రంగంలో ఎందుకు వ్యక్తిగత చొరవ కూడా ఉండాలి.

ప్రతి సంవత్సరం ఎంబీఏ పూర్తి చేసుకొని పెద్ద సంఖ్యలో బయటికి వస్తున్నారు. ఉద్యోగాలు మాత్రం కొందరికే లభిస్తున్నాయి. ఎందుకంటే దీని సరిపడా నైపుణ్యాలు కొంతమంది లోనే ఉంటున్నాయి. కాబట్టి అలా నేర్చుకునే వారికి న్యూమరికల్ ఎబిలిటీ, ఇంగ్లీష్, కమ్యూనికేషన్ స్కిల్స్ అవసరం. అలా నేర్చుకున్నవారికి బ్యాంకింగ్, ఫార్మ్, అగ్రికల్చర్, ఇన్సూరెన్స్ ,హెల్త్, ఎఫ్ఎంసీజీ వంటి రంగాల్లో వివిధ స్థాయిల్లో అవకాశాలు లభిస్తాయి.

మరిన్ని విద్యాసంబంధ వార్తల కోసం క్లిక్ చేయండి..

Join Us on Telegram: https://t.me/abpdesamofficial

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

YS Jagan Birthday: వైఎస్ జగన్‌కు బర్త్‌డే విషెస్ చెప్పిన పవన్ కళ్యాణ్, షర్మిల సహా పలువురు ప్రముఖులు
వైఎస్ జగన్‌కు బర్త్‌డే విషెస్ చెప్పిన పవన్ కళ్యాణ్, షర్మిల సహా పలువురు ప్రముఖులు
WhatsApp GhostPairing scam: వాట్సాప్‌లో కొత్త రకం మోసం... ఘోస్ట్ పేయిరింగ్ అంటే ఏంటి? ఎలా తప్పించుకోవాలి
వాట్సాప్‌లో కొత్త రకం మోసం... ఘోస్ట్ పేయిరింగ్ అంటే ఏంటి? ఎలా తప్పించుకోవాలి
Shambhala Trailer : సైన్స్ Vs శాస్త్రం - ఆ ఊరిలో దెయ్యాలున్నాయా?... ఆసక్తికరంగా 'శంబాల' ట్రైలర్
సైన్స్ Vs శాస్త్రం - ఆ ఊరిలో దెయ్యాలున్నాయా?... ఆసక్తికరంగా 'శంబాల' ట్రైలర్
Shubman Gill: శుభమన్ గిల్‌ను డ్రాప్ చేయడంపై బిగ్ అప్డేట్.. షాకింగ్ విషయం వెలుగులోకి!
శుభమన్ గిల్‌ను డ్రాప్ చేయడంపై బిగ్ అప్డేట్.. షాకింగ్ విషయం వెలుగులోకి!

వీడియోలు

Ind vs Pak Under 19 Asia Cup | నేడు ఆసియా అండర్‌-19 ఫైనల్‌
Rohit Sharma T20 World Cup | హిట్మ్యాన్ లేకుండా తొలి వరల్డ్ కప్
Ishan Kishan about T20 World Cup | ప్రపంచ కప్‌ ఎంపికైన ఇషాన్ కిషన్ రియాక్షన్
Sanju Samson about Opener Place | ఓపెనర్ ప్లేస్ సంజు రియాక్షన్ ఇదే
Sanju Samson For T20 World Cup 2026 | మొత్తానికి చోటు దక్కింది...సంజూ వరల్డ్ కప్పును శాసిస్తాడా | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
YS Jagan Birthday: వైఎస్ జగన్‌కు బర్త్‌డే విషెస్ చెప్పిన పవన్ కళ్యాణ్, షర్మిల సహా పలువురు ప్రముఖులు
వైఎస్ జగన్‌కు బర్త్‌డే విషెస్ చెప్పిన పవన్ కళ్యాణ్, షర్మిల సహా పలువురు ప్రముఖులు
WhatsApp GhostPairing scam: వాట్సాప్‌లో కొత్త రకం మోసం... ఘోస్ట్ పేయిరింగ్ అంటే ఏంటి? ఎలా తప్పించుకోవాలి
వాట్సాప్‌లో కొత్త రకం మోసం... ఘోస్ట్ పేయిరింగ్ అంటే ఏంటి? ఎలా తప్పించుకోవాలి
Shambhala Trailer : సైన్స్ Vs శాస్త్రం - ఆ ఊరిలో దెయ్యాలున్నాయా?... ఆసక్తికరంగా 'శంబాల' ట్రైలర్
సైన్స్ Vs శాస్త్రం - ఆ ఊరిలో దెయ్యాలున్నాయా?... ఆసక్తికరంగా 'శంబాల' ట్రైలర్
Shubman Gill: శుభమన్ గిల్‌ను డ్రాప్ చేయడంపై బిగ్ అప్డేట్.. షాకింగ్ విషయం వెలుగులోకి!
శుభమన్ గిల్‌ను డ్రాప్ చేయడంపై బిగ్ అప్డేట్.. షాకింగ్ విషయం వెలుగులోకి!
World Bank Loan For Pakistan: పాకిస్తాన్ కు 700 మిలియన్ డాలర్ల సహాయం అందించిన ప్రపంచ బ్యాంకు
పాకిస్తాన్ కు 700 మిలియన్ డాలర్ల సహాయం అందించిన ప్రపంచ బ్యాంకు
Bigg Boss 9 Telugu : బిగ్‌బాస్ డే 104 రివ్యూ... బిగ్ బాస్ హౌస్ లో సెలబ్రిటీల సందడి... కళ్యాణ్ తలకు గాయం... చివర్లో సీజన్ 10 ట్విస్ట్
బిగ్‌బాస్ డే 104 రివ్యూ... బిగ్ బాస్ హౌస్ లో సెలబ్రిటీల సందడి... కళ్యాణ్ తలకు గాయం... చివర్లో సీజన్ 10 ట్విస్ట్
Kondagattu Temple: పవన్ కళ్యాణ్ చొరవతో కొండగట్టు ఆలయానికి రూ.35 కోట్లు.. బండి సంజయ్ హర్షం
పవన్ కళ్యాణ్ చొరవతో కొండగట్టు ఆలయానికి రూ.35 కోట్లు.. బండి సంజయ్ హర్షం
TVS తొలి అడ్వెంచర్‌ బైక్‌ Apache RTX 300: నిజ జీవితంలో ఎంత మైలేజ్‌ ఇస్తుందంటే?
TVS Apache RTX 300 మైలేజ్‌ టెస్ట్‌: సిటీలో, హైవేపైనా అదరగొట్టిన తొలి అడ్వెంచర్‌ బైక్‌
Embed widget