అన్వేషించండి

Telangana Education Commission: తెలంగాణలో కొత్త విద్యా కమిషన్ ఏర్పాటు, ఉత్తర్వులు జారీచేసిన ప్రభుత్వం

Telangana: తెలంగాణలో ప్రీప్రైమరీ నుంచి సాంకేతిక విద్య, యూనివర్సిటీ స్థాయి విద్య వరకు నూతన విద్యావిధానాన్ని రూపొందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా ‘తెలంగాణ విద్యా కమిషన్‌'ను ఏర్పాటు చేసింది.

New Education Commission in Telangana: తెలంగాణ విద్యా వ్యవ‌స్థలో మార్పులకు ప్రభుత్వం శ్రీకారం చుట్టిన సంగతి తెలిసిందే. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైన నాటి నుంచి విద్యా కమిషన్‌ను ఏర్పాటు చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి వెల్లడించగా... ఎట్టకేలకు అది కార్యరూపం దాల్చింది. ఈ మేరకు తెలంగాణ విద్యా కమిషన్ ఏర్పాటు చేస్తూ.. విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం సెప్టెంబరు 3న ఉత్తర్వులు (జీవో 27) జారీ చేశారు. రెండేళ్ల కాలపరిమితితో ఈ కమిషన్‌ పనిచేయనుంది. కొత్తగా ఏర్పాటు కాబోయే ఈ కమిషన్‌కు త్వరలోనే ఛైర్మన్, ముగ్గురు సభ్యులను నియమించనున్నారు. వీరితోపాటు హెచ్‌వోడీ స్థాయి ఐఏఎస్‌ అధికారిని మెంటర్‌ సెక్రటరీగా నియమించనున్నారు. కమిషన్ కార్యాలయాన్ని సచివాలయం లేదా ప్రజాభవన్‌లో ఏర్పాటు చేయాలని భావిస్తున్నారు. 

రాష్ట్రంలో విద్యాసంస్థల్లో నాణ్యమైన విద్య బోధ‌న‌, నైపుణ్య శిక్షణ‌, ఉపాధి క‌ల్పన‌కు త‌మ ప్రభుత్వం క‌ట్టుబ‌డి ఉంద‌ని సీఎం రేవంత్ రెడ్డి గతంలో పలు పర్యాయాలు స్పష్టంచేశారు. ఇందుకోసం రాష్ట్రంలో విద్యా వ్యవ‌స్థ బ‌లోపేతంపై చ‌ర్చించేందుకు విద్యావేత్తల‌తో గతంలో భేటీ నిర్వహించిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగానే తాజాగా విద్యా కమిషన్ ఏర్పాటుకు పచ్చజెంగా ఊపారు.

సమగ్ర విధానాల రూపకల్పనే లక్ష్యంగా..
ప్రీ-ప్రైమరీ నుంచి వర్సిటీ విద్య వరకు సమగ్ర విధానాల రూపకల్పన లక్ష్యంగా ఈ కమిషన్‌ పనిచేయనుంది. ప్రభుత్వానికి సిఫారసులు చేసేందుకు కమిషన్ వివిధ భాగస్వామ్య పక్షాలతో విస్తృత సంప్రదింపులు జరపొచ్చు. లక్ష్యాల సాధనకు అవసరమైతే నిపుణులను, కన్సల్టెంట్లను, వృత్తి నిపుణులను నియమించుకోవచ్చు. డిప్యుటేషన్ లేదా ఓడీపై విద్యాశాఖలోని ఉద్యోగుల సేవలను వినియోగించుకునే వెసులుబాటు కల్పించారు. ఈ కమిషన్‌కు రాష్ట్ర బడ్జెట్ నుంచి నిధులను కేటాయించనున్నారు. అదేవిధంగా ప్రైవేట్ రంగంతోపాటు వివిధ భాగస్వామ్య పక్షాల నుంచి విరాళాలు కూడా పొందొచ్చు.  

రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాల్లో పబ్లికేషన్ల సంఖ్య తగ్గడం, పరిశోధన కార్యకలాపాలు కుంటుపడుతుండటంతో.. మార్కెట్‌ అవసరాలకు కావాల్సిన నిపుణుల కొరత ఏర్పడుతుంది. ఈ సమస్యలను అధిగమించేందుకు రాష్ట్ర ప్రభుత్వం విద్యారంగంలో సమగ్ర మార్పులకు రోడ్‌మ్యాప్‌ను ఖరారు చేయనుంది. ఆ బాధ్యతలను విద్యాకమిషన్‌కు అప్పగించింది. ఉన్నత విద్యలో నాణ్యతా ప్రమాణాలు పెంచడమే లక్ష్యంగా ఈ కమిషన్‌ ప్రభుత్వానికి సూచనలు చేయనుంది.

కమిషన్ నిర్వర్తిచే విధులు..
➥ విద్యావ్యవస్థలో నాణ్యతకు అవసరమైన విధానాలను రూపొందించి ప్రభుత్వానికి సిఫారసు చేయడం. 
➥ ప్రాథమిక నుంచి ఉన్నత విద్య వరకు తరగతికి తగిన నైపుణ్యాలుండేలా విద్యార్థులను తయారు చేయడం. 
➥ శిశు విద్య, పాఠశాలల్లో నాణ్యమైన విద్యకు కృషి. ప్రధానంగా విద్యార్థుల సమగ్రాభివృద్ధిపై దృష్టి. ఉన్నత విద్యాసంస్థలైన కళాశాలలు, విశ్వవిద్యాలయాల్లో నాణ్యమైన విద్య అందించడం. 
➥ విద్యారంగంలో మార్పులను ఆకళింపు చేసుకొని... దానికి అనుగుణంగా విధానపరమైన నిర్ణయాలను తీసుకోవడంపై ప్రభుత్వానికి సలహాలు ఇవ్వడం. 
➥విధాన పత్రాల రూపకల్పనకు సంప్రదింపులు, మార్గదర్శకాలు, నిబంధనలు, పైలట్ అధ్యయనాలు తదితర వాటి కోసం ఈ కమిషన్ సహకరించనుంది. ➥ విద్యాసంస్థల్లో అప్రెంటిస్‌షిప్, ఉద్యోగ నైపుణ్యాలను అనుసంధానం చేయడం. 
➥ నైతిక విద్యను అందిస్తూ ఉత్తమ, బాధ్యతాయుత ప్రపంచ పౌరులుగా తీర్చిదిద్దడం. ఎప్పటికప్పుడు విద్యారంగానికి సంబంధించి అవసరమైన పరిశీలన చేసి సిఫారసులు చేయడం. 

మరిన్ని విద్యాసంబంధ వార్తల కోసం క్లిక్ చేయండి..

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Lagacharla Incident: లగచర్ల ఘటన - మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి సహా 24 మందికి బెయిల్
లగచర్ల ఘటన - మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి సహా 24 మందికి బెయిల్
KTR Letter To Revanth: అవకతవకలు జరగలే, అసెంబ్లీలో చర్చకు సిద్ధమా? సీఎం రేవంత్‌కు కేటీఆర్ సవాల్
అవకతవకలు జరగలే, అసెంబ్లీలో చర్చకు సిద్ధమా? సీఎం రేవంత్‌కు కేటీఆర్ సవాల్
Maruti Suzuki Ertiga: బెస్ట్ మైలేజీ ఇచ్చే సెవెన్ సీటర్ కారు ఇదే - ఫ్యామిలీకి పర్‌ఫెక్ట్ ఛాయిస్!
బెస్ట్ మైలేజీ ఇచ్చే సెవెన్ సీటర్ కారు ఇదే - ఫ్యామిలీకి పర్‌ఫెక్ట్ ఛాయిస్!
Ashwin Retirement:
"స్పిన్ గోట్" అల్విదా, టీమిండియా బ్యాక్ బోన్ అశ్విన్
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

ఆటోలో అసెంబ్లీకి, కేటీఆర్ సహా బీఆఎర్ఎస్ ఎమ్మెల్యేల నిరసనరేవంత్ ఎక్కడికెళ్లినా సెక్యూరిటీని పెట్టుకో, లేకుంటే కొడతారుఎడతెరపి లేకుండా వర్షం, డ్రాగా ముగిసిన గబ్బా టెస్ట్అలిగిన అశ్విన్, అందుకే వెళ్లిపోయాడా?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Lagacharla Incident: లగచర్ల ఘటన - మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి సహా 24 మందికి బెయిల్
లగచర్ల ఘటన - మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి సహా 24 మందికి బెయిల్
KTR Letter To Revanth: అవకతవకలు జరగలే, అసెంబ్లీలో చర్చకు సిద్ధమా? సీఎం రేవంత్‌కు కేటీఆర్ సవాల్
అవకతవకలు జరగలే, అసెంబ్లీలో చర్చకు సిద్ధమా? సీఎం రేవంత్‌కు కేటీఆర్ సవాల్
Maruti Suzuki Ertiga: బెస్ట్ మైలేజీ ఇచ్చే సెవెన్ సీటర్ కారు ఇదే - ఫ్యామిలీకి పర్‌ఫెక్ట్ ఛాయిస్!
బెస్ట్ మైలేజీ ఇచ్చే సెవెన్ సీటర్ కారు ఇదే - ఫ్యామిలీకి పర్‌ఫెక్ట్ ఛాయిస్!
Ashwin Retirement:
"స్పిన్ గోట్" అల్విదా, టీమిండియా బ్యాక్ బోన్ అశ్విన్
Prasad Behara Arrest: నటికి వేధింపులు, ఫేమస్ యూట్యూబర్ ప్రసాద్ బెహరా అరెస్ట్, 14 రోజులు రిమాండ్
నటికి వేధింపులు, ఫేమస్ యూట్యూబర్ ప్రసాద్ బెహరా అరెస్ట్, 14 రోజులు రిమాండ్
Telangana TET Exam Dates: తెలంగాణ టెట్ అభ్యర్థులకు అలర్ట్, ఎగ్జామ్ షెడ్యూల్ విడుదల
తెలంగాణ టెట్ అభ్యర్థులకు అలర్ట్, ఎగ్జామ్ షెడ్యూల్ విడుదల
DHOP Song Promo: ఊపు తెప్పించే ‘దోప్’ సాంగ్ వచ్చేసింది - రామ్ చరణ్, కియారా కిర్రాక్ స్టెప్స్!
ఊపు తెప్పించే ‘దోప్’ సాంగ్ వచ్చేసింది - రామ్ చరణ్, కియారా కిర్రాక్ స్టెప్స్!
Allu Arvind: శ్రీతేజ్‌ను కిమ్స్‌లో పరామర్శించిన అల్లు అరవింద్ - కుటుంబాన్ని పూర్తిగా ఆదుకుంటామని హామీ
శ్రీతేజ్‌ను కిమ్స్‌లో పరామర్శించిన అల్లు అరవింద్ - కుటుంబాన్ని పూర్తిగా ఆదుకుంటామని హామీ
Embed widget