SKLTSHU Admissions: శ్రీకొండా లక్ష్మణ్ హార్టికల్చర్ యూనివర్సిటీలో డిప్లొమా కోర్సు - ప్రవేశాలకు ఇవీ అర్హతలు
SKLTSHU: ములుగులోని శ్రీకొండా లక్ష్మణ్ తెలంగాణ స్టేట్ హార్టికల్చరల్ యూనివర్సిటీ రెండేళ్ల డిప్లొమా కోర్సులో ప్రవేశాలకు ఆసక్తి ఉన్న విద్యార్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది.
![SKLTSHU Admissions: శ్రీకొండా లక్ష్మణ్ హార్టికల్చర్ యూనివర్సిటీలో డిప్లొమా కోర్సు - ప్రవేశాలకు ఇవీ అర్హతలు Sri Konda Laxman Telangana State Horticultural University has released notification for admissions into Diploma course check details here SKLTSHU Admissions: శ్రీకొండా లక్ష్మణ్ హార్టికల్చర్ యూనివర్సిటీలో డిప్లొమా కోర్సు - ప్రవేశాలకు ఇవీ అర్హతలు](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/06/19/248bdee88c8e86d55787449064488c611718778727567522_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
SKLTSHU Diploma Admissions 2024: సిద్దిపేట జిల్లా ములుగులోని శ్రీకొండా లక్ష్మణ్ తెలంగాణ స్టేట్ హార్టికల్చరల్ యూనివర్సిటీ, 2024-25 విద్యా సంవత్సరానికిగాను రెండేళ్ల డిప్లొమా కోర్సులో ప్రవేశానికి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా మొత్తం 200 సీట్లలో ప్రవేశాలు కల్పిస్తారు. వీటిల్లో యూనివర్సిటీ పాలిటెక్నిక్ కళాశాలల్లో 120 సీట్లు, అనుబంధ పాలిటెక్నిక్‌లలో 80 సీట్లు అందుబాటులో ఉన్నాయి. వీటిలో 60 శాతం సీట్లను గ్రామీణ విద్యార్థులకు, 40 శాతం సీట్లను పట్టణ ప్రాంత విద్యార్థులకు కేటాయించారు.
పదోతరగతి లేదా తెలంగాణ పాలిసెట్ ఉత్తీర్ణులైనవారు దరఖాస్తుకు అర్హులు. ఇంటర్ ఫెయిల్ అయిన విద్యార్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. ఇంటర్ పాసైనా లేదా ఇతర ఏదైనా డిగ్రీ ఉన్నవారు దరఖాస్తు చేసుకునేందుకు వీల్లేదు. ఆఫ్‌లైన్ విధానంలో దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. దరఖాస్తు ప్రక్రియ జూన్ 15న ప్రారంభంకాగా.. జులై 15న సాయంత్రం 5 గంటల్లోగా దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. దరఖాస్తు ఫీజుగా ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ అభ్యర్థులు రూ.600 చెల్లించాలి. మిగతా అభ్యర్థులు రూ.1100 చెల్లిస్తే సరిపోతుంది. అభ్యర్థులకు ఏమైనా సందేహాలుంటే 9652456779 / 8333981354 నెంబర్లలో సంప్రదించవచ్చు.
వివరాలు..
➥ డిప్లొమా ఇన్ హార్టికల్చర్ ప్రవేశాలు
సీట్ల సంఖ్య: : 200.
కోర్సు వ్యవధి: 2 సంవత్సరాలు.
మాధ్యమం (మీడియం): ఇంగ్లిష్.
సీట్లు: యూనివర్సిటీ పాలిటెక్నిక్‌లు-120 సీట్లు; అనుబంధ పాలిటెక్నిక్‌లు- 80 సీట్లు.
✪ యూనివర్సిటీ పాలిటెక్నిక్‌లు..
➢ హార్టికల్చర్ పాలిటెక్నిక్ - ఆదిలాబాద్ (ఆదిలాబాద్ జిల్లా): 40 సీట్లు
➢ హార్టికల్చర్ పాలిటెక్నిక్ - రామగిరిఖిల్లా (పెద్దపల్లి జిల్లా): 40 సీట్లు
➢ హార్టికల్చర్ పాలిటెక్నిక్ - కొల్లాపూర్ (నాగర్ కర్నూలు జిల్లా): 40 సీట్లు
✪ అనుబంధ పాలిటెక్నిక్‌లు..
➢ గంట గోపాల్‌రెడ్డి హార్టికల్చర్ పాలిటెక్నిక్ - గడ్డిపల్లి (సూర్యాపేట జిల్లా): 40 సీట్లు
➢ విశ్వధరణి హార్టికల్చర్ పాలిటెక్నిక్ - తొర్రూర్ (మహబూబాబాద్ జిల్లా): 40 సీట్లు
అర్హత: పదోతరగతి లేదా తెలంగాణ పాలిసెట్ ఉత్తీర్ణులైనవారు దరఖాస్తుకు అర్హులు. ఇంటర్ ఫెయిల్ అయిన విద్యార్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. ఇంటర్ పాసైనా లేదా ఇతర ఏదైనా డిగ్రీ ఉన్నవారు దరఖాస్తు చేసుకునేందుకు వీల్లేదు.
వయోపరిమితి: 31.12.2024 నాటికి 15 - 22 సంవత్సరాల మధ్య ఉండాలి.
దరఖాస్తు ఫీజు: ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ అభ్యర్థులు రూ.600, మిగతా అభ్యర్థులు రూ.1100 చెల్లించాలి. ప్రవేశాలు కోరువారు "The Comptroller, SKLTSHU payable at Mulugu, Siddipet" పేరిట డిడి తీయాలి.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా. వెబ్‌సైట్ నుంచి దరఖాస్తు డౌన్‌లోడ్ చేసుకోవాలి. దరఖాస్తు నింపి, డిడి వివరాలు నమోదుచేసి, నిర్ణీత గడువులోగా సంబంధిత చిరునామాలో సమర్పించాల్సి ఉంటుంది.
ఎంపిక విధానం: పదోతరగతి మార్కులు లేదా పాలిసెట్ ర్యాంకు ఆధారంగా ప్రవేశాలు కల్పిస్తారు. మొదట సైన్స్ సబ్జెక్టులో మార్కులను పరిగణనలోకి తీసుకుంటారు. ఆ తర్వాత వరుసగా మ్యాథమెటిక్స్, ఇంగ్లిష్, తెలుగు, సోషల్, హిందీ మార్కులను పరిగణనలోకి తీసుకుంటారు. ఒకవేళ సమానమైన మార్కులు వస్తే.. వయోపరిమితిని లెక్కలోకి తీసుకుంటారు.
కౌన్సెలింగ్ సమయంలో కలిగి ఉండాల్సిన ఒరిజినల్ సర్టిఫికేట్లు..
- పదోతరగతి లేదా తత్సమాన మార్కుల మెమో
- పాలిసెట్ -2024 ర్యాంకు కార్డు
- 4 - 10వ తరగతి వరకు బోనఫైడ్/స్టడీ సర్టిఫికేట్లు
- అవసరమైనవారికి నాన్-మున్సిపల్ ఏరియా సర్టిఫికేట్ (FORM-I)
- సోషల్ స్టేటస్ సర్టిఫికేట్ (బీసీ/ఎస్సీ/ఎస్టీలకు)
- EWS సర్టిఫికేట్ (2024-25)
- ఫిజికల్లీ ఛాలెంజ్‌డ్ సర్టిఫికేట్
- చిల్ట్రన్ ఆఫ్ ఆర్మ్‌డ్ పర్సనల్ సర్టిఫికేట్/డిఫెన్స్ పర్సనల్ సర్టిఫికేట్
- NCC సర్టిఫికేట్
- స్పోర్ట్స్ అండ్ గేమ్స్ సర్టిఫికేట్
చిరునామా:
Sri Konda Laxman Telangana State Horticultural University
Mulugu (V&M), Siddipet Dist-502 279.
దరఖాస్తు సమర్పణకు చివరి తేదీ: 15.07.2024.
Diploma Notification
SKLTSHU Diploma 2024-25 Form-1
Application for Diploma In Horticulture AY 2024
Diploma Horticulture Prospectus 2024-25
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)