(Source: ECI/ABP News/ABP Majha)
SCTIMST: ఎస్‌సీటీఐఎంఎస్‌టీ, త్రివేండ్రంలో పీజీ డిప్లొమా, డిప్లొమా, పోస్ట్ డాక్టోరల్ కోర్సులు
త్రివేండ్రంలోని శ్రీ చిత్ర తిరునల్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ మెడికల్ సైన్సెస్ అండ్ టెక్నాలజీ 2023-24 విద్యా సంవత్సరానికి సంబంధించి వివిధ కోర్సుల్లో ప్రవేశానికి నోటిఫికేషన్ విడుదల చేసింది.
త్రివేండ్రంలోని శ్రీ చిత్ర తిరునల్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ మెడికల్ సైన్సెస్ అండ్ టెక్నాలజీ 2023-24 విద్యా సంవత్సరానికి సంబంధించి వివిధ కోర్సుల్లో ప్రవేశానికి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా డిప్లొమా, పీజీ డిప్లొమా, పోస్ట్ డాక్టోరల్, నర్సింగ్ డిప్లొమా, సర్టిఫికేట్ కోర్సుల్లో ప్రవేశాలు కల్పించనున్నారు. కోర్సులవారీగా విద్యార్హతలు నిర్ణయించారు. సరైన అర్హతలున్నవారు పోస్ట్ డాక్టోరల్ ఫెలోషిప్ కోర్సుకు నవంబరు 15లోగా, ఇతర కోర్సులకు అక్టోబరు 4లోగా దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది.
వివరాలు..
* ఎస్‌సీటీఐఎంఎస్‌టీ ప్రవేశాలు
➥ పోస్ట్ డాక్టోరల్ ఫెలోషిప్ (పీడీఎఫ్- డీఎం/ ఎంసీహెచ్/ డీఎన్‌బీ తర్వాత)
➥ పోస్ట్ డాక్టోరల్ సర్టిఫికేట్ కోర్సు
➥ పీజీ డిప్లొమా
➥ డిప్లొమా
➥ స్పెషాలిటీ నర్సింగ్ డిప్లొమా ప్రోగ్రామ్
➥ అడ్వాన్స్‌డ్ సర్టిఫికెట్ ప్రోగ్రామ్
అర్హత: సంబంధిత విభాగంలో డిగ్రీ, పీజీ ఉత్తీర్ణులై ఉండాలి.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.
ఎంపిక విధానం: ప్రవేశ పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా.
దరఖాస్తు ఫీజు: రూ.800. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు రూ.640 చెల్లించాలి.
ముఖ్యమైన తేదీలు..
➥ ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ (పీడీఎఫ్ ప్రోగ్రామ్) చివరి తేదీ:15.11.2023.
➥ ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ (తదితర ప్రోగ్రామ్స్) చివరి తేదీ:04.10.2023.
Admission Notice for PhD Program
ALSO READ:
జీఎన్‌ఎం కోర్సులో ప్రవేశాలకు నోటిఫికేషన్, ఇంటర్ అర్హత చాలు
తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ, ప్రైవేట్ నర్సింగ్ కళాశాలల్లో 2023-24 విద్యా సంవత్సరానికి జనరల్ నర్సింగ్ అండ్ మిడ్‌వైఫరీ (జీఎన్‌ఎం) ట్రైనింగ్ కోర్సులో ప్రవేశాలకు సంబంధించి తెలంగాణ రాష్ట్ర డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా రాష్ట్రంలోని 6 ప్రభుత్వ, 162 ప్రైవేటు నర్సింగ్ కళాశాలల్లో జీఎన్ఎం కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తారు. ఇంటర్ ఉత్తీర్ణులైన పురుష, మహిళా అభ్యర్థులు సెప్టెంబర్ 16లోగా దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. ఇంటర్ మార్కులు, రిజర్వేషన్ల ప్రకారం సీటు కేటాయిస్తారు.
కోర్సు వివరాల కోసం క్లిక్ చేయండి..
సెప్టెంబరు 16న 'USA ఎడ్యుకేషన్ ఫెయిర్', విదేశీ విద్య ఆశించేవారికి చక్కని అవకాశం
అమెరికాలో ఉన్నత విద్య ఆశించే విద్యార్థులకు ఇదొక సదావకాశం. ఓరియంట్ స్పెక్ట్రా ఆధ్వర్యంలో సెప్టెంబరు 16న ఉచిత 'USA ఎడ్యుకేషన్ ఫెయిర్' నిర్వహించనున్నారు. ఇందులో పాల్గొనే అభ్యర్థులకు 24 గంటల్లోనే ప్రవేశాలు పొందే అవకాశం కల్పించనున్నారు. ఎలాంటి దరఖాస్తు ఫీజు ఉండదు. అదేవిధంగా ఉచిత విమాన టికెట్ పొందే అవకాశం కూడా పొందవచ్చు. విద్యార్థులకు స్కాలర్‌షిప్ అవకాశాలు కూడా కల్పించనున్నారు. ఇందుకు హైదరాబాద్,కూకట్‌పల్లిలోని హోట్ అభినందన్ గ్రాండ్ వేదిక కానుంది.
పూర్తివివరాల కోసం క్లిక్ చేయండి..
ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్‌లో సర్టిఫికేట్ ప్రోగ్రామ్, అర్హతలివే!
కోల్‌కతాలోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్, 2024-25 విద్యా సంవత్సరానికిగానను సర్టిఫికేట్ ప్రోగ్రామ్‌లో ప్రవేశానికి నోటిఫికేషన్ విడుదల చేసింది. 50 శాతం మార్కులతో ఏదైనా విభాగంలో డిగ్రీతో పాటు సంబంధిత రంగంలో మేనేజర్ స్థాయిలో కనీసం మూడేళ్ల పని అనుభవం ఉండాలి. (లేదా) పీజీ (ఇంజినీరింగ్, ఆర్కిటెక్చర్, మెడిసిన్, ఫార్మాస్యూటికల్, అగ్రికల్చర్, హార్టికల్చర్)తో పాటు సంబంధిత రంగంలో మేనేజర్ స్థాయిలో రెండేళ్ల పని అనుభవం ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. అభ్యర్థులు నవంబరు 15లోగా దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది.
కోర్సు పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..