AP Sankranthi Holidays: ఏపీలో స్కూళ్లకు, కాలేజీలకు సంక్రాంతి పండగ సెలవులు ఎన్నిరోజులంటే?
Sankranti Holidays In AP: ఏపీలో ఎవరికైన కొత్త ఏడాది ప్రారంభ నెల జనవరి అనగానే అందరికీ ముందుగా గుర్తొచ్చేవి సంక్రాంతి సెలవులే. ఈసారి ఏపీలోని పాఠశాలలకు 4 నుంచి 6 రోజులపాటు సెలవులు ఉండే అవకాశం ఉంది.
AP Pongal Holidays: ఏపీలో ఎవరికైన కొత్త ఏడాది ప్రారంభ నెల జనవరి అనగానే అందరికీ ముందుగా గుర్తొచ్చేవి సంక్రాంతి సెలవులే. ఈసారి ఏపీలోని పాఠశాలలకు 4 నుంచి 6 రోజులపాటు సెలవులు ఉండే అవకాశం ఉంది. ప్రభుత్వం ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన జారీచేయలేదు. అయితే అకడమిక్ క్యాలెండర్ ప్రకారం జనవరి 9 నుంచి 18 వరకు సంక్రాంతి సెలవులు ప్రకటించారు. అయితే అన్నిరోజులు సెలవులు ఉండే అవకాశం కనబడటంలేదు. తుఫాను నేపథ్యంలో సెలవులు ఇచ్చిన నేపథ్యంలో.. సంక్రాంతి సెలవులు తగ్గే అవకాశం ఉంది.
ఈసారి జనవరి 13న రెండో శనివారం, జనవరి 14న భోగి పండగ (ఆదివారం), జనవరి 15న సంక్రాంతి పండగ వచ్చింది. అలాగే జనవరి 16న ఆప్షనల్ హాలిడే ఇచ్చారు. దీంతో పాటు స్కూల్స్, కాలేజీలకు మరో రెండు రోజులు పాటు అదనం సెలవులు ఇచ్చే అవకాశం ఉంది.. దాంతో మొత్తంగా ఆరు రోజులు సెలవులు వచ్చే అవకాశం ఉంది..ఇంకా ఈనెలలో నాలుగు ఆదివారాలు, కలిపితే బోలెడు సెలవులు ఈ నెలలో రానున్నాయి. కాగా.. జనవరి 25న ఆదివారం, జనవరి 26న రిపబ్లిక్ డే రావడంతో మరోసారి వరుస సెలవులు విద్యార్థులకు రానున్నాయి. ఆంధ్రప్రదేశ్‌లో మొత్తంగా చూస్తే 2024 జనవరి నెలలో దాదాపు 11 నుంచి 13 రోజులు పాటు సెలవులు రానున్నాయి.
ఇంటర్ కాలేజీలకు నాలుగు రోజులే..
రాష్ట్రంలోని ఇంటర్ కాలేజీలకు ఈసారి నాలుగు రోజులపాటు సంక్రాంతి సెలవులు ఉండనున్నాయి. జనవరి 13 నుంచి 16 వరకు సెలవులు ఇవ్వనున్నారు. ఈ మేరకు ఇంటర్ బోర్డు నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఇంటర్ అకడమిక్ క్యాలెండర్ ప్రకారం జనవరి 11 నుంచి 17 వరకు ఇంటర్ కళాశాలలకు సంక్రాంతి సెలవులు ప్రకటించారు. అయితే వారంరోజులకు బదులుగా కేవలం నాలుగు రోజులు మాత్రమే సెలవులు ఉండే అవకాశం ఉంది
ఆంధ్రప్రదేశ్‌లో వచ్చే ఏడాది(2024) సాధారణ సెలవుల జాబితాను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది. ఈ మేరకు నవంబరు 30న అధికారిక ఉత్తర్వులు జారీ చేసిన సంగతి తెలిసిందే. జాతీయ సెలవులు, పండుగలు కలిపి ప్రభుత్వ కార్యాలయాలకు వచ్చే ఏడాది మొత్తం 20 రోజులను సాధారణ సెలవులు, మరో 17 రోజులు ఐచ్ఛిక సెలవులుగా(Optional Holidays) ప్రకటించింది. జనవరి 15, 16ను సాధారణ సెలవుల జాబితాలో చేర్చింది. భోగి, అంబేడ్కర్ జయంతి ఆదివారం, దుర్గాష్టమి రెండో శనివారం వచ్చాయని తెలిపింది. ఏప్రిల్ 9న ఉగాది సెలవుగా ప్రకటించింది.
ప్రభుత్వం విడుదల చేసిన ప్రకారం.. జనవరి 15న మకర సంక్రాంతి, 16న కనుమ పండుగ సెలవులను ప్రకటించింది. జనవరి 26న రిపబ్లిక్ డే, మార్చి 3న మహా శివరాత్రి, మార్చి 25న హోళీ, మార్చి 29న గుడ్ ఫ్రై డే సెలవులుంటాయని ప్రకటిస్తున్నట్లు ఉత్తర్వులో స్ఫష్టం చేశారు. ఏప్రిల్ 5న బాబు జగ్జీవన్‌రాం జయంతి, 9న ఉగాది, 11న రంజాన్, 17న శ్రీరామ నవమి, జూన్ 17న బక్రీద్ సెలవులుంటాయని తెలియజేసింది. జూలై 17న మొహర్రం, ఆగస్టు 15 ఇండిపెండెన్స్ డే, 26 శ్రీ కృష్ణాష్టమి, సెప్టెంబర్ 7న వినాయక చవితి సెలవులు, 16న ఈద్-ఉల్-ఉన్-నబీ పండుగల సందర్భంగా సెలవులను అమలు చేయనున్నట్లు ఏపీ ప్రభుత్వం స్పష్టం చేసింది. అక్టోబర్ 2న గాంధీ జయంతి, అక్టోబర్ 11న దుర్గాష్టమి, 31న దీపావళి, డిసెంబర్ 25న క్రిస్మస్ సెలవులు ఉంటాయని వెల్లడించింది . వీటితో పాటు మరో 17 ఐచ్ఛిక సెలవుల తేదీలను ప్రకటించింది .
ఆదివారాలు, రెండో శనివారాలకు అదనంగా ప్రభుత్వ కార్యాలయాలకు ఇచ్చే ఇతర సెలవులతో కూడి జాబితాను ప్రభుత్వం ఇవాళ విడుదల చేసింది. పండుగలు, వేడుకలు, ఇతర సందర్భాలు ఇందులో ఉన్నాయి. వీటిని ప్రభుత్వ సంస్ధలు, కార్పోరేషన్లతో పాటు ప్రభుత్వం కింద పని చేసే అన్ని సంస్ధలు, ఉద్యోగులకు వర్తింప చేస్తూ ఆదేశాలు ఇచ్చింది. ముస్లింల పండుగలైన రంజాన్, బక్రీద్, మొహర్రం, మిలాద్ ఉన్ నబీలకు కూడా ఇందులోనే సెలవులు ప్రకటించినప్పటికీ ఏదైనా మార్పు ఉంటే అప్పుడు మార్చుకునేందుకు వీలు కల్పించింది.
తెలంగాణలో సెలువులు ఇలా..
తెలంగాణలోని పాఠశాలలకు సంక్రాంతి పండుగ సెలవులను ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. సంక్రాంతి పండుగ నేపథ్యంలో.. జనవరి 12 నుంచి 17 వరకు సెలవులు (Sankranthi Holidays) ఉంటాయని ప్రభుత్వం బుధవారం (జనవరి 3) ఒక ప్రకటనలో తెలిపింది. కాగా జనవరి 13న 2వ శనివారం కాగా.. జనవరి 14న భోగి, జనవరి 15న సంక్రాంతి, జనవరి 16న కనుమ పండుగలు ఉన్నాయి. మిషనరీ స్కూళ్లకు మినహా అన్ని స్కూళ్లకు ఈ సెలవులు వర్తిస్తాయని పేర్కొంది. సంక్రాంతి సెలువులు జనవరి 12 నుంచి ప్రారంభం కానున్నాయి.. జనవరి 13న రెండో శనివారం, తర్వాత జనవరి 14న ఆదివారం భోగి పండుగ కాగా.. జనవరి 15న సోమవారం సంక్రాంతి పర్వదిన వస్తోంది. ఇక, జనవరి16న కనుమ పండగ ఉంది. కాగా, జనవరి 17న ప్రభుత్వం పాఠశాలలకు అదనంగా సెలవు ఇచ్చింది. దీంతో ఆరు రోజుల పాటు స్కూల్స్‌కు హాలీడేస్ వస్తున్నాయి.