AP RGUKT: ట్రిపుల్‌ఐటీ 'ఫేజ్-3' ఎంపిక జాబితా విడుదల, కౌన్సెలింగ్ ఎప్పుడంటే?
అధికారిక వెబ్‌సైట్‌లో కేటగిరీలవారీగా ఎంపిక జాబితాలను అందుబాటులో ఉంచారు. వీటిలో జనరల్ కేటగిరీలో 254 మంది అభ్యర్థులు, స్పెషల్ కేటిగిరీ కింద 5 మంది, ఎన్‌సీసీ కేటగిరీ కింద 40 మంది అభ్యర్థులు ఎంపికయ్యారు.
ఏపీలో రాజీవ్ గాంధీ వైజ్ఞానిక సాంకేతిక విశ్వవిద్యాలయం(ఆర్జీయూకేటీ) పరిధిలోని ట్రిపుల్ ఐటీ క్యాంపస్‌లలో ప్రవేశానికి సంబంధించి 'ఫేజ్-3' కౌన్సెలింగ్‌కు ఎంపికైన అభ్యర్థుల జాబితా నవంబర్ 9న విడుదలైంది. అధికారిక వెబ్‌సైట్‌లో కేటగిరీలవారీగా ఎంపిక జాబితాలను అందుబాటులో ఉంచారు. వీటిలో జనరల్ కేటగిరీలో 254 మంది అభ్యర్థులు, స్పెషల్ కేటిగిరీ కింద 5 మంది, ఎన్‌సీసీ కేటగిరీ కింద 40 మంది అభ్యర్థులు ఎంపికయ్యారు.
ఇడుపులపాయ, ఒంగోలు, నూజివీడు, శ్రీకాకుళం క్యాంపస్‌లలో ఈడబ్ల్యూఎస్ కోటాతో కలిపి 4,400 సీట్లు ఉండగా.. 44,208 మంది దరఖాస్తు చేశారు. నాలుగు క్యాంపస్‌లలో ఖాళీగా ఉన్న 266 సీట్ల భర్తీకి నవంబరు 14న నూజివీడు ట్రిపుల్ ఐటీలో కౌన్సెలింగ్ నిర్వహిస్తున్నట్లు వర్సిటీ కులపతి ఆచార్య కేసీరెడ్డి తెలిపారు. నాలుగు ట్రిపుల్ ఐటీల్లో ఎన్‌సీసీ కోటా కింద 40, క్రీడల కోట కింద 20 సీట్లు, రెండు విడతల కౌన్సెలింగ్ అనంతరం 206 సీట్లు మిగిలిపోయాయన్నారు. ఎన్‌సీసీ, క్రీడల కోటా సీట్లు సైతం
నవంబర్ 14నే భర్తీ చేస్తామన్నారు. ఫేజ్-3 కౌన్సెలింగ్‌కు హాజరయ్యే అభ్యర్థులు కాల్ లెటర్‌ను వెబ్‌సైట్‌లో డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. విద్యార్థులు తమ RGUKT అప్లికేషన్ నెంబరు, పదోతరగతి హాల్‌టికెట్ నెంబరు వివరాలు నమోదుచేసి కాల్ లెటర్ డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
Phase-3 Provisional Selection List (General)
Phase-3 Provisional Selection List (NCC)
Phase-3 Provisional Selection List (Special Categories)
Download Call Letter for Phase-3 Counselling
సందేహాల పరిష్కారానికి స్పెషల్ హెల్ప్ డెస్క్
నవంబరు 14 నుంచి ప్రారంభమయ్యే కౌన్సెలింగ్ కోసం హాజరయ్యే విద్యార్థుల సౌకార్యార్థం ప్రత్యేక హెల్ప్‌లైన్ ఏర్పాటు చేశారు. ఫోన్ నెంబర్లు 97035 42597, 97054 72597 లేదా ఈమెయిల్ email to admissions@rgukt.in ద్వారా సంప్రదించవచ్చు. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు హెల్ప్ డెస్క్ అందుబాటులో ఉంటుంది. కాల్ లెటర్‌లో RGUKT అప్లికేషన్ నెంబరు, పేరు, పదోతరగతి హాల్‌టికెట్ నెంబర్, ఫోన్ నెంబరు లాంటి వివరాల్లో సందేహాలుంటే సరిచేసుకోవచ్చు.
:: Also Read ::
APRJC: ఏపీ ప్రభుత్వ కీలక నిర్ణయం, గురుకుల కాలేజీల్లో కొత్త కోర్సులు!
ఏపీలోని గురుకులాల్లో ఇంటర్మీడియట్‌లో డిమాండ్ లేని ఎంఈసీ స్థానంలో సైన్స్ కోర్సులను ప్రవేశపెట్టాలని సాంఘిక సంక్షేమశాఖ నిర్ణయించింది. వచ్చే విద్యాసంవత్సరం నుంచే ఈ కొత్త కోర్సులు ప్రారంభించేలా చూడాలని మంత్రి మేరుగు నాగార్జున ఈ మేరకు అధికారులను ఆదేశించారు. ఎస్సీ గురుకులాల కార్యకలాపాలపై నవంబరు 7న సచివాలయంలో జరిగిన సమావేశంలో మంత్రి నాగార్జున అధికారులతో పలు అంశాలపై సమీక్ష జరిపారు. ఈ సందర్భంగా మంత్రి నాగార్జున మాట్లాడుతూ.. ఇంటర్ లో ఎంపీసీ, బైపీపీ వంటి సైన్స్ సీట్ల కోసం పోటీ పడుతున్న విద్యార్థులు ఎంఇసి సీట్లలో చేరడానికి ముందుకు రాని కారణంగానే సీట్లు ఖాళీగా మిగిలే పరిస్థితి ఏర్పడుతోందని చెప్పారు.
కొత్త కోర్సుల పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..
ఐఎన్ఐ సెట్ - 2023 అడ్మిట్ కార్డులు వచ్చేశాయ్! ఇలా డౌన్‌లోడ్ చేసుకోండి!
పీజీ వైద్య కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే 'ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ నేషనల్ ఇంపార్టెన్స్ కంబైన్డ్ ఎంట్రన్స్ టెస్ట్ (ఐఎన్ఐ-సెట్)- జనవరి 2023 సెషన్' అడ్మిట్ కార్డులను 'ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్-ఎయిమ్స్' నవంబరు 7న విడుదల చేసింది. అధికారిక వెబ్‌సైట్‌లో హాల్‌టికెట్లను అందుబాటులో ఉంచారు. ప్రవేశ పరీక్ష కోసం దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు తమ ఐడీ, పాస్‌వర్డ్ వివరాలను నమోదుచేసి అడ్మిట్ కార్డులు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
అడ్మిట్ కార్డుల కోసం క్లిక్ చేయండి...