అన్వేషించండి

APRJC: ఏపీ ప్రభుత్వ కీలక నిర్ణయం, గురుకుల కాలేజీల్లో కొత్త కోర్సులు!

ఏపీలోని గురుకులాల్లో ఇంటర్మీడియట్‌లో డిమాండ్‌ లేని ఎంఈసీ స్థానంలో సైన్స్‌ కోర్సులను ప్రవేశపెట్టాలని సాంఘిక సంక్షేమశాఖ నిర్ణయించింది. వచ్చే విద్యాసంవత్సరం నుంచే ఈ కొత్త కోర్సులు ప్రారంభించనున్నారు.

ఏపీలోని గురుకులాల్లో ఇంటర్మీడియట్‌లో డిమాండ్‌ లేని ఎంఈసీ స్థానంలో సైన్స్‌ కోర్సులను ప్రవేశపెట్టాలని సాంఘిక సంక్షేమశాఖ నిర్ణయించింది. వచ్చే విద్యాసంవత్సరం నుంచే ఈ కొత్త కోర్సులు ప్రారంభించేలా చూడాలని మంత్రి మేరుగు నాగార్జున ఈ మేరకు అధికారులను ఆదేశించారు. ఎస్సీ గురుకులాల కార్యకలాపాలపై నవంబరు 7న సచివాలయంలో జరిగిన సమావేశంలో మంత్రి నాగార్జున అధికారులతో పలు అంశాలపై సమీక్ష జరిపారు. ఈ సందర్భంగా మంత్రి నాగార్జున మాట్లాడుతూ.. ఇంటర్‌ లో ఎంపీసీ, బైపీపీ వంటి సైన్స్‌ సీట్ల కోసం పోటీ పడుతున్న విద్యార్థులు ఎంఇసి సీట్లలో చేరడానికి ముందుకు రాని కారణంగానే సీట్లు ఖాళీగా మిగిలే పరిస్థితి ఏర్పడుతోందని చెప్పారు.

ఈ నేపథ్యంలో గురుకులాల్లో అంతగా డిమాండ్‌లేని ఎంఈసీ కోర్సు స్థానంలో విద్యార్థులు ఎక్కువగా కోరుకుంటున్న ఎంపీసీ, బైపీసీ సీట్లను ప్రవేశపెట్టాలని అధికారులకు మంత్రి సూచించారు. వచ్చే విద్యా సంవత్సరం నుంచే కొత్త కోర్సులు ప్రారంభమైయ్యేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. విద్యార్థులకు జాబ్‌ గ్యారెంటీ ఇచ్చే మెడికల్‌ ల్యాబ్‌ టెక్నీషియన్‌ వంటి కోర్సులను జిల్లా కేంద్రాల్లో అందుబాటులోకి తీసుకురావాలని కోరారు. గురుకులాల్లో మొత్తం 1.17 లక్షల సీట్లు ఉండగా వీటిలో ప్రస్తుతం 1.09 లక్షల సీట్లు భర్తీ కావడం జరిగిందని చెప్పారు. ఖాళీగా మిగిలిపోయిన సీట్లలో ఎక్కువగా ఇంటర్మీడియట్‌కు చెందిన సీట్లే ఉన్నాయని తెలిపారు.

ప్రస్తుతం ఎస్సీ గురుకులాల్లో విద్యా ప్రమాణాలను మరింతగా మెరుగుపర్చడానికి అమలు చేస్తున్న విధానాలపై ప్రిన్సిపాళ్లు, డీసీఓలు దృష్టి పెట్టేలా చూడాలని మంత్రి సూచించారు. ఈ నేపథ్యంలోనే విజయనగరం, శ్రీకాకుళం, చిత్తూరు, అనంతపురం జిల్లాలపై ప్రత్యేకంగా దృష్టిసారించాలని సూచించారు. బాగా చదివి మంచి మార్కులు సాధించే విద్యార్థులకు తరగతుల స్థాయిలో ప్రోత్సాహక బహుమతులను ఇచ్చే పథకాన్ని తీసుకురావాలని సూచించారు.

రాష్ట్ర వ్యాప్తంగా 189 గురుకులాల్లో 181 గురుకులాలకు సొంత భవనాలు ఉన్నాయని, మిగిలిన 8 గురుకులాలకు సంబంధించిన భవన నిర్మాణాలు వివిధ దశల్లో ఉన్నాయని అధికారులు వివరించగా కొత్త భవనాల నిర్మాణాలను శీఘ్రగతిన పూర్తి చేయాలని మంత్రి సూచించారు. రాష్ట్రంలో శిధిలావస్థకు చేరినట్లుగా గుర్తించిన మరో 13 భవనాల నిర్మాణాన్ని కూడా వచ్చే ఏడాది చేపట్టాలని నాగార్జున అధికారులను ఆదేశించారు.

గురుకులాల్లో పని చేస్తున్న పార్ట్‌ -టైం టీ-చర్ల వేతనాలను సవరించే విషయాన్ని రాబోయే బీఓజీ సమావేశంలో పెట్టి తీర్మానించాలని మంత్రి కోరారు. గురుకులాల్లో ఎస్సీ ఎస్టీ బ్యాక్‌ లాగ్‌ పోస్టులను, కేర్‌ టేకర్లు, లైబ్రేరియన్‌ ఖాళీలను భర్తీ చేయడానికి చర్యలు తీసుకోవాలని మంత్రి అధికారులను ఆదేశించారు. గురుకులాల్లో విద్యార్థుల ఆరోగ్య పరిరక్షణ, క్యాంపస్‌ క్లీనింగ్‌ కోసం చేపడుతున్న స్పెషల్‌ డ్రైవ్‌ తదితర కార్యక్రమాలను మంత్రి సమీక్షించి సూచనలు చేసారు. 

 

Also Read:

ఐఎన్ఐ సెట్ - 2023 అడ్మిట్ కార్డులు వచ్చేశాయ్! ఇలా డౌన్‌లోడ్ చేసుకోండి!
పీజీ వైద్య కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే 'ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ నేషనల్ ఇంపార్టెన్స్ కంబైన్డ్ ఎంట్రన్స్ టెస్ట్ (ఐఎన్ఐ-సెట్)- జనవరి 2023 సెషన్' అడ్మిట్ కార్డులను 'ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్-ఎయిమ్స్' నవంబరు 7న విడుదల చేసింది. అధికారిక వెబ్‌‌సైట్‌లో హాల్‌టికెట్లను అందుబాటులో ఉంచారు. ప్రవేశ పరీక్ష కోసం దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు తమ ఐడీ, పాస్‌వర్డ్ వివరాలను నమోదుచేసి అడ్మిట్ కార్డులు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
అడ్మిట్ కార్డుల కోసం క్లిక్ చేయండి...

మరిన్ని విద్యాసంబంధ వార్తల కోసం క్లిక్ చేయండి..

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

TGPSC: తెలంగాణలో గ్రూప్ - 3 పరీక్షలు - అభ్యర్థులకు కీలక సూచనలు
తెలంగాణలో గ్రూప్ - 3 పరీక్షలు - అభ్యర్థులకు కీలక సూచనలు
CM Chandrababu: 'సోషల్ మీడియా సైకోలను కట్టడి చేయాలి' - జైలు జీవితం పట్టుదల పెరిగేలా చేసిందన్న సీఎం చంద్రబాబు
'సోషల్ మీడియా సైకోలను కట్టడి చేయాలి' - జైలు జీవితం పట్టుదల పెరిగేలా చేసిందన్న సీఎం చంద్రబాబు
Toyota Camry Hybrid Facelift: టయోటా క్యామ్రీ ఫేస్‌లిఫ్ట్ లాంచ్ త్వరలోనే - స్ట్రాంగ్ హైబ్రిడ్ వెర్షన్‌లో మార్కెట్లోకి?
టయోటా క్యామ్రీ ఫేస్‌లిఫ్ట్ లాంచ్ త్వరలోనే - స్ట్రాంగ్ హైబ్రిడ్ వెర్షన్‌లో మార్కెట్లోకి?
Samsung Galaxy S25: శాంసంగ్ గెలాక్సీ ఎస్25 సిరీస్ లాంచ్ అప్పుడే - లీక్స్ వచ్చేశాయ్!
శాంసంగ్ గెలాక్సీ ఎస్25 సిరీస్ లాంచ్ అప్పుడే - లీక్స్ వచ్చేశాయ్!
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Nayanthara vs Dhanush Netflix Documentary | తమిళ్ సినీ ఇండస్ట్రీలో వివాదం..నయనతార vs ధనుష్ | ABP Desamరోహిత్ కి ధోని చేసిన మేలు, తిలక్ కి సూర్య చేస్తున్నాడుసఫారీలను సెంచరీతో చితక్కొట్టిన సంజూ శాంసన్మైక్ టైసన్ ను చిత్తు చేశాడు, 300 కోట్ల ప్రైజ్ మనీని కొల్లగొట్టాడు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
TGPSC: తెలంగాణలో గ్రూప్ - 3 పరీక్షలు - అభ్యర్థులకు కీలక సూచనలు
తెలంగాణలో గ్రూప్ - 3 పరీక్షలు - అభ్యర్థులకు కీలక సూచనలు
CM Chandrababu: 'సోషల్ మీడియా సైకోలను కట్టడి చేయాలి' - జైలు జీవితం పట్టుదల పెరిగేలా చేసిందన్న సీఎం చంద్రబాబు
'సోషల్ మీడియా సైకోలను కట్టడి చేయాలి' - జైలు జీవితం పట్టుదల పెరిగేలా చేసిందన్న సీఎం చంద్రబాబు
Toyota Camry Hybrid Facelift: టయోటా క్యామ్రీ ఫేస్‌లిఫ్ట్ లాంచ్ త్వరలోనే - స్ట్రాంగ్ హైబ్రిడ్ వెర్షన్‌లో మార్కెట్లోకి?
టయోటా క్యామ్రీ ఫేస్‌లిఫ్ట్ లాంచ్ త్వరలోనే - స్ట్రాంగ్ హైబ్రిడ్ వెర్షన్‌లో మార్కెట్లోకి?
Samsung Galaxy S25: శాంసంగ్ గెలాక్సీ ఎస్25 సిరీస్ లాంచ్ అప్పుడే - లీక్స్ వచ్చేశాయ్!
శాంసంగ్ గెలాక్సీ ఎస్25 సిరీస్ లాంచ్ అప్పుడే - లీక్స్ వచ్చేశాయ్!
Actress Kasthuri Arrested: తెలుగు ప్రజలపై అనుచిత వ్యాఖ్యలు - సినీ నటి కస్తూరిని అరెస్ట్ చేసిన తమిళనాడు పోలీసులు
తెలుగు ప్రజలపై అనుచిత వ్యాఖ్యలు - సినీ నటి కస్తూరిని అరెస్ట్ చేసిన తమిళనాడు పోలీసులు
Best Selling Hatchback: అక్టోబర్‌లో బెస్ట్ సెల్లింగ్ హ్యాచ్‌బ్యాక్ ఇదే - మార్కెట్‌ను ఏలుతున్న మారుతి!
అక్టోబర్‌లో బెస్ట్ సెల్లింగ్ హ్యాచ్‌బ్యాక్ ఇదే - మార్కెట్‌ను ఏలుతున్న మారుతి!
Chandrababu Brother Passes Away: సోదరుడు రామ్మూర్తి నాయుడు పార్థీవ దేహానికి సీఎం చంద్రబాబు నివాళి
సోదరుడు రామ్మూర్తి నాయుడు పార్థీవ దేహానికి సీఎం చంద్రబాబు నివాళి
Lagacharla Case: 'పోలీసులపై అత్యాచార కేసులు పెట్టాలి' - లగచర్ల ఘటనపై ఎస్సీ, ఎస్టీ కమిషన్‌కు బీఆర్ఎస్ నేతల బృందం ఫిర్యాదు
'పోలీసులపై అత్యాచార కేసులు పెట్టాలి' - లగచర్ల ఘటనపై ఎస్సీ, ఎస్టీ కమిషన్‌కు బీఆర్ఎస్ నేతల బృందం ఫిర్యాదు
Embed widget