టీఎస్ ఎంసెట్‌కు దరఖాస్తుల వెల్లువ, ఆరేళ్లలో ఎన్నడూ రాని అప్లికేషన్లు!
మొత్తంగా ఎంసెట్‌కు 3,05,185 దరఖాస్తులు వచ్చినట్లు ఆయన తెలిపారు. ఏపీ నుంచి టీఎస్ ఎంసెట్ ఇంజినీరింగ్, అగ్రికల్చర్, మెడికల్ కోర్సులకు ఈసారి భారీగా దరఖాస్తులు చేసుకున్నారు.
టీఎస్ ఎంసెట్-2023 ప్రవేశ పరీక్షకు రికార్డు స్థాయిలో దరఖాస్తులు వచ్చాయి. గత ఆరేళ్లలో ఎన్నడూ రానంతగా ఈసారి వచ్చాయి. ఏప్రిల్ 10న సాయంత్రం 5 గంటల వరకు ఇంజినీరింగ్ కోర్సులకు 1,95,515 దరఖాస్తులు వచ్చినట్లు ఎంసెట్ కన్వీనర్ డా. బి.దీన్ కుమార్ పేర్కొన్నారు. అగ్రికల్చర్, మెడికల్ కోర్సుల్లో 1,09,335 దరఖాస్తులు అందినట్లు తెలిపారు. ఇంజినీరింగ్, అగ్రికల్చర్, మెడికల్ కోర్సులకు కలిపి 335 దరఖాస్తులు వచ్చాయి. మొత్తంగా ఎంసెట్‌కు 3,05,185 దరఖాస్తులు వచ్చినట్లు ఆయన తెలిపారు. ఏపీ నుంచి టీఎస్ ఎంసెట్ ఇంజినీరింగ్, అగ్రికల్చర్, మెడికల్ కోర్సులకు ఈసారి భారీగా దరఖాస్తులు చేసుకున్నారు.
ఆలస్య రుసుముతో అవకాశం..
విద్యార్థులు రూ.250 - రూ.5000 వరకు ఆలస్య రుసుముతో ఏప్రిల్ 15 నుంచి మే 2 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఇందులో రూ.250 అపరాధ రుసుముతో ఏప్రిల్ 15 వరకు, రూ.1000 అపరాధ రుసుముతో ఏప్రిల్ 20 వరకు, రూ.2500 అపరాధ రుసుముతో ఏప్రిల్ 25 వరకు, రూ.5000 అపరాధ రుసుముతో దరఖాస్తుకు మే 2 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఇప్పటికే దరఖాస్తు చేసుకున్నవారు ఏప్రిల్ 12, 14 తేదీల మధ్య దరఖాస్తు వివరాల్లో ఏమైనా తప్పుంటే సరి చేసుకోవచ్చు.
దరఖాస్తు ఫీజు ఇలా..
దరఖాస్తు ఫీజుగా ఎస్సీ, ఎస్టీ, పీహెచ్ అభ్యర్థులు రూ.500, మిగతా కేటగిరిల అభ్యర్థులు రూ. 1000 చెల్లించి ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. ఇంజినీరింగ్, మెడికల్ ప్రవేశ పరీక్ష రాసే ఎస్సీ, ఎస్టీ, పీహెచ్ అభ్యర్థులు రూ.1000, మిగతా కేటగిరిల అభ్యర్థులు రూ. 1800 చెల్లించాల్సి ఉంటుంది.
షెడ్యూలు ప్రకారం ఎంసెట్ ఇంజినీరింగ్ పరీక్షలను మే 12, 13, 14 తేదీల్లో నిర్వహించనున్నట్లు అధికారులు ప్రకటించారు. నీట్, టీఎస్‌పీఎస్సీ నిర్వహించే పరీక్షల కారణంగా షెడ్యూల్‌లో మార్పులు చేస్తున్నట్లు తెలిపారు. అయితే.. మే 10, 11 తేదీల్లో ఎంసెట్ అగ్రికల్చర్ పరీక్షను మాత్రం యథాతథంగా నిర్వహిస్తామని ఉన్నత విద్యామండలి తెలిపింది.
ఎంసెట్ షెడ్యూల్ ఇలా..
➥ ఎంసెట్ నోటిఫికేషన్ వెల్లడి: 28.02.2023
➥ ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 03.03.2023.
➥ దరఖాస్తుకు చివరితేదీ (అపరాధ రుసుము లేకుండా): 10.04.2023.
➥ దరఖాస్తుల సవరణ: 12.04.2023 - 14.04.2023.
➥ రూ.250 అపరాధ రుసుముతో దరఖాస్తుకు చివరితేదీ: 15.04.2023.
➥ రూ.1000 అపరాధ రుసుముతో దరఖాస్తుకు చివరితేదీ: 20.04.2023.
➥ రూ.2500 అపరాధ రుసుముతో దరఖాస్తుకు చివరితేదీ: 25.04.2023.
➥ రూ.5000 అపరాధ రుసుముతో దరఖాస్తుకు చివరితేదీ: 02.05.2023.
➥ హాల్‌టికెట్ల డౌన్‌లోడ్: 30.04.2023 నుంచి
➥ పరీక్ష తేదీలు: మే 12 నుంచి 14 వరకు ఇంజినీరింగ్; మే 10, 11 తేదీల్లో ఫార్మసీ, అగ్రికల్చర్ పరీక్షలు.
Also Read:
ఇంటర్ అకడమిక్ క్యాలెండర్ విడుదల, ఈ ఏడాది వచ్చే సెలవులివే!
తెలంగాణలో జూనియర్ కళాశాలల అకడమిక్ క్యాలెండర్‌ని ఇంటర్మీడియట్ బోర్డు ప్రకటించింది. రాష్ట్రంలోని అన్ని జూనియర్ కళాశాలలు జూన్ 1న ప్రారంభమవుతాయిన బోర్డు అధికారులు ఏప్రిల్ 1న వెల్లడించారు. జూన్ 1 నుంచే తరగతులు కూడా ప్రారంభమవుతాయని తెలిపారు. ఈ మేరకు 2023-24 విద్యా సంవత్సరానికి సంబంధించిన తాత్కాలిక విద్యా క్యాలెండర్ బోర్డు వెలువరించింది.
పూర్తివివరాల కోసం క్లిక్ చేయండి..
CUET UG 2023: సీయూఈటీ యూజీ రిజిస్ట్రేషన్‌కు మళ్లీ అవకాశం, చివరితేది ఇదే!
దేశంలోని సెంట్రల్ యూనివర్సిటీల్లో డిగ్రీ కోర్సుల్లో ప్రవేవశాలకు నిర్వహించే 'కామన్ యూనివర్సిటీ ఎంట్రెన్స్ టెస్ట్ యూజీ-2023' పరీక్షకు దరఖాస్తు చేసుకోవడానికి నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ మరో అవకాశం కల్పించింది. దరఖాస్తు గడువు మార్చి 30న ముగిసిన సంగతి తెలిసిందే. అయితే దరఖాస్తు చేసుకోలేకపోయిన అభ్యర్థులకు ఏప్రిల్ 9 నుంచి 11 వరకు దరఖాస్తు చేసుకునేందుకు మరోసారి అవకాశం కల్పించింది.
పూర్తివివరాల కోసం క్లిక్ చేయండి..