UGC NET Answer Key: యూజీసీ నెట్-2022 ఆన్సర్ కీ విడుదల, అభ్యంతరాలకు అవకాశం!
ఈ పరీక్షకు సంబంధించిన ఆన్సర్ కీని తాజాగా NTA విడుదల చేసింది. ఆన్సర్ కీపై అభ్యంతరాలకు అవకాశం కల్పించింది. అభ్యంతరాల స్వీకరణ అనంతరం ఫైనల్ కీతోపాటు పరీక్ష ఫలితాలను కూడా ఎన్టీఏ విడుదల చేయనుంది.
యూజీసీ నెట్-2023 పరీక్ష ఆన్సర్ కీని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ మార్చి 23న విడుదల చేసింది. అధికారిక వెబ్‌సైట్‌లో ఆన్సర్ కీని అందుబాటులో ఉంచింది. పరీక్షకు హాజరైన అభ్యర్థులు వెబ్‌సైట్ ద్వారా ఆన్సర్ కీ చూసుకోవచ్చు. అభ్యర్థులు అప్లికేషన్ నెంబర్, పాస్‌వర్డ్ లేదా పుట్టినతేదీ వివరాలు నమోదుచేసి ఆన్సర్ కీ చూసుకోవచ్చు. ఆన్సర్ కీతోపాటు ప్రశ్నపత్రాలను కూడా అందుబాటులో ఉంచారు.
నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఫిబ్రవరి 21 నుంచి మార్చి 21 వరకు ఆన్‌లైన్ విధానంలో యూజీసీ నెట్- డిసెంబరు 2023 పరీక్షను నిర్వహించి సంగతి తెలిసిందే. దేశవ్యాప్తంగా 186 నగరాల్లో 663 పరీక్ష కేంద్రాల్లో పరీక్ష నిర్వహించింది. మొత్తం 83 సబ్జెక్టులకు నిర్వహించిన ఈ పరీక్షకు దేశవ్యాప్తంగా మొత్తం 8.34 లక్షల మంది అభ్యర్థులు హాజరయ్యారు. ఈ పరీక్షకు సంబంధించిన ఆన్సర్ కీని తాజాగా నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ విడుదల చేసింది. ఆన్సర్ కీపై అభ్యంతరాలకు అవకాశం కల్పించింది. అభ్యంతరాల స్వీకరణ అనంతరం ఫైనల్ కీతోపాటు పరీక్ష ఫలితాలను కూడా ఎన్టీఏ విడుదల చేయనుంది.
యూజీసీ నెట్ 2023 ఆన్సర్ కీ కోసం క్లిక్ చేయండి..
కీపై అభ్యంతరాలకు అవకాశం..
యూజీసీ నెట్-2023 పరీక్ష ఆన్సర్ కీపై అభ్యంతరాలకు అవకాశం కల్పించారు. ఆన్సర్ కీపై ఏమైనా అభ్యంతరాలుంటే మార్చి 25న రాత్రి 8 గంటల వరకు తెలపవచ్చు. రాత్రి 11.50 గం. వరకు ఫీజు చెల్లించవచ్చు. అభ్యర్థులు అభ్యంతరాలు తెలిపే ఒక్కో ప్రశ్నకు రూ.200 ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. క్రెడిట్/డెబిట్/నెట్ బ్యాంకింగ్ ద్వారా ఫీజు చెల్లించవచ్చు. ఇంకా ఏమైనా సందేహాలుంటే ఫోన్: 011- 40759000 లేదా ఈమెయిల్: ugcnet@nta.ac.in ద్వారా సంప్రదించవచ్చు.
అభ్యంతరాలు ఇలా తెలపండి..
Direct Link for Key Objections
దేశంలోని యూనివర్సిటీలలో లెక్చరర్‌షిప్ (అసిస్టెంట్ ప్రొఫెసర్), జూనియర్ రిసెర్చ్ ఫెలోషిప్ కోసం యూజీసీ నెట్ పరీక్షను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్‌టీఏ) నిర్వహిస్తుంటుంది. కనీసం 55 శాతం మార్కులతో పీజీ ఉత్తీర్ణులైనవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు 50 శాతం మార్కులు ఉంటే సరిపోతుంది. పీజీ చివరి సంవత్సరం పరీక్షలకు హాజరయ్యేవారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. ఏటా రెండుసార్లు (జూన్, డిసెంబరు) యూజీసీ నెట్ పరీక్షలకు ఎన్టీఏ నోటిఫికేషన్ విడుదల చేస్తారు.
Also Read:
టీసీఎస్ 'సిగ్మా హైరింగ్-2023' - ఫార్మసీ విద్యార్హతతో ఉద్యోగాలు
టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ సంస్థ టీసీఎస్-సిగ్మా 2023 కింద ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. నాలుగేళ్ల బీ-ఫార్మసీ లేదా రెండేళ్ల ఎం-ఫార్మసీ విద్యార్హత ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. రాతపరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిచేస్తారు. అభ్యర్థుల వయసు 18 - 28 సంవత్సరాల మధ్య ఉండాలి. సరైన అర్హతలున్నవారు మార్చి 30లోగా దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. ఏప్రిల్ 9న పరీక్ష నిర్వహించనున్నారు.
దరఖాస్తు, ఇతర వివరాల కోసం క్లిక్ చేయండి..
అమెరికాలో ఉద్యోగం చేయాలని ఉందా? అయితే ఇలా వెళ్లి జాబ్ చేసుకోండి!
అమెరికాలో ఉద్యోగం చేయాలనుకునే వారికి అక్కడి ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. టూరిస్ట్, బిజినెస్ వీసాపై తమ దేశానికి వచ్చిన వారు ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకుని, ఇంటర్వ్యూలకు హాజరయ్యే విధంగా వెసులుబాటును కల్పించింది. అయితే ఉద్యోగంలో చేరేముందే ఆ వీసాను మార్చుకోవాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. బీ1 వీసాను వ్యాపార పనుల మీద వచ్చిన వారికి, బీ2 వీసాను పర్యాటకులకు అమెరికా జారీ చేస్తుంటుంది. ఆ దేశ తాజా నిర్ణయంతో ఈ రెండు వీసాల కేటగిరీలవారు ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చని యూఎస్ సిటిజెన్షిప్ అండ్ ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్ (యూఎస్సీఐఎస్) మార్చి 23న ట్వీట్ చేసింది.
పూర్తివివరాల కోసం క్లిక్ చేయండి..