అన్వేషించండి

TS Polytechnic Syllabus: పాలిటెక్నిక్‌ కోర్సుల్లో సరికొత్త సిలబస్‌, వచ్చే విద్యాసంవత్సరం నుంచే అమల్లోకి

తెలంగాణలోని పాలిటెక్నిక్ కోర్సుల్లో కొత్త సిలబస్ ప్రవేశపెట్టనున్నారు. వచ్చే విద్యాసంవత్సరం (2024-25) నుంచే ఈ కొత్త సిలబస్ అమల్లోకి రానుంది.

తెలంగాణలోని పాలిటెక్నిక్ కోర్సుల్లో కొత్త సిలబస్ ప్రవేశపెట్టనున్నారు. వచ్చే విద్యాసంవత్సరం (2024-25) నుంచే ఈ కొత్త సిలబస్ అమల్లోకి రానుంది. విదేశాల్లోని డిప్లొమా విద్యల్లో అమలవుతున్న సిలబస్‌ను పరిశీలించి.. వచ్చే అయిదేళ్ల కోసం నూతన సిలబస్‌ను రూపొందించనున్నారు. ఈ మేరకు వచ్చే ఏడాది జూన్/జులైలో ప్రారంభమయ్యే పాలిటెక్నిక్ తొలి సంవత్సరం విద్యార్థులకు కొత్త పాఠ్యప్రణాళిక అమలవుతుంది.

రాష్ట్ర సాంకేతిక విద్య, శిక్షణ మండలి (ఎస్‌బీటెట్) ఇటీవలే ఒక్కో డిప్లొమా బ్రాంచీకి ఒక్కో నిపుణుల కమిటీ చొప్పున మొత్తం 24 కమిటీలను నియమించింది. ఒక్కో కమిటీలో ఆరుగురు సభ్యులుండగా.. అందులో ముగ్గురు పాలిటెక్నిక్ నిపుణులు; ఎన్‌ఐటీ, ఐఐటీల నుంచి ఇద్దరు; పారిశ్రామిక రంగాలకు చెందిన ఓ నిపుణుడు ఉన్నారు. ఈ కసరత్తు అంతా సాంకేతిక విద్యాశాఖ కమిషనర్, ఎస్‌బీటెట్ ఛైర్మన్ అయిన వాకాటి కరుణ ఆధ్వర్యంలో కొనసాగుతోంది. ఈ సిలబస్ 2028-29 విద్యాసంవత్సరం వరకు అమల్లో ఉంటుంది. ఆ తర్వాత అప్పటి పరిస్థితులకు అనుగుణంగా మారుస్తారు. ప్రస్తుతం రాష్ట్రంలో ఏటా సుమారు 34 వేల మంది విద్యార్థులు డిప్లొమా కోర్సుల్లో చేరుతున్నారు.

కమిటీల సభ్యులు ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా, మార్కెట్ అవసరాలను దృష్టిలో ఉంచుకొని దేశంలోని వివిధ రాష్ట్రాల్లోని పాలిటెక్నిక్ సిలబస్‌లతో పాటు ప్రపంచవ్యాప్తంగా 24 దేశాల్లోని ప్రముఖ డిప్లొమా కోర్సులను అందించే విద్యాసంస్థల సిలబస్‌లను కూడా అధ్యయనం చేసి అవసరమైన అంశాలను చేరుస్తారు. సింగపూర్, జర్మనీ, అమెరికా, చైనా తదితర 24 దేశాల్లోని సిలబస్‌లను ఆయా కమిటీలు పరిశీలిస్తున్నాయి. పాలిటెక్నిక్ విద్యలో ఇంటర్న్‌షిప్, ఆన్‌లైన్ మూల్యాంకనం, ఓపెన్ బుక్ విధానం తదితర ఎన్నో వినూత్న సంస్కరణలను అమలు చేయడంలో ఎస్‌బీటెట్ ఇప్పటికే ముందుంది. సిలబస్‌లోనూ ఆదర్శంగా ఉండాలన్న సంకల్పంతో ఇతర దేశాల పాఠ్యప్రణాళికలను కూడా అధ్యయనం చేయాలని నిర్ణయించారు.

కొత్త పాఠ్యప్రణాళికను మార్చి 15 నాటికి సిద్ధం చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని, దీనికి అనుగుణంగా కమిటీ భేటీలు, కార్యశాలలు నిర్వహిస్తున్నట్లు SBTET కార్యదర్శి ఎ.పుల్లయ్య తెలిపారు. 2024 విద్యాసంవత్సరం నుంచే పాలిటెక్నిక్‌లో చేరే విద్యార్థులు కొత్త సిలబస్‌ను చదవాల్సి ఉంటుందని ఆయన తెలిపారు. అయితే ద్వితీయ, తృతీయ సంవత్సరం చదివేవారికి మాత్రం పాత సిలబస్సే ఉంటుంది. మొత్తం 58 ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలకు గాను 28 కళాశాలల్లోని పలు కోర్సులకు నేషనల్ బోర్డు ఆఫ్ అక్రిడిటేషన్ (ఎన్‌బీఏ) గుర్తింపు సాధించి దేశంలో ముందంజలో ఉన్నాం. అఖిల భారత సాంకేతిక విద్యామండలి మోడల్ కరిక్యులమ్ ప్రకారం సిలబస్‌ను, ఇతర కార్యక్రమాలను అమలు చేస్తున్నాం. గతంలో ఆంగ్లం, గణితం సబ్జెక్టులకు ఓపెన్ బుక్ విధానం అమలు చేయగా ప్రస్తుత విద్యాసంవత్సరం ఇండస్ట్రియల్ మేనేజ్‌మెంట్ సబ్జెక్టుకు కూడా అమలు చేస్తున్నాం.

Related Article:

పాలిటెక్నిక్‌ కళాశాలల్లో 16 బ్రాంచిలకు ఎన్‌బీఏ గుర్తింపు
ఏపీలో 9 పాలిటెక్నిక్‌ కళాశాలల్లో 16 బ్రాంచ్‌లకు నేషనల్‌ బోర్డు ఆఫ్‌ అక్రిడిటేషన్‌ (National Board of Accreditation) గుర్తింపు లభించింది. ఈ మేరకు సాంకేతిక విద్యాశాఖ కమిషనర్‌ నాగరాణి నవంబరు 25న ఒక ప్రకటనలో తెలిపారు. ప్రభుత్వ పాలిటెక్నిక్‌ కళాశాలలను ఉన్నత స్థాయి ప్రమాణాలకు అనుగుణంగా తీర్చిదిద్దేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు ఆమె వెల్లడించారు. మొదటి దశలో 41 పాలిటెక్నిక్‌లకు ఎన్‌బీఏ కోసం ప్రయత్నించగా ఇప్పటి వరకు 18 పాలిటెక్నిక్‌లకు ఈ గుర్తింపు లభించిందని నాగమణి తెలిపారు.
పూర్తివివరాల కోసం క్లిక్ చేయండి..

మరిన్ని విద్యాసంబంధ వార్తల కోసం క్లిక్ చేయండి...

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Vangalapudi Anitha: 'పవన్ కల్యాణ్ అన్నదాంట్లో తప్పేం లేదు' - డిప్యూటీ సీఎం వ్యాఖ్యలపై హోంమంత్రి అనిత స్పందన
'పవన్ కల్యాణ్ అన్నదాంట్లో తప్పేం లేదు' - డిప్యూటీ సీఎం వ్యాఖ్యలపై హోంమంత్రి అనిత స్పందన
Telangana: బీసీ రిజర్వేషన్ల కోసం స్పెషల్ కమిషన్ ఏర్పాటు, తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు
బీసీ రిజర్వేషన్ల కోసం స్పెషల్ కమిషన్ ఏర్పాటు, తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు
Actress Kasturi: తమిళనాడులో ప్రతిరోజూ టార్చర్, తెలుగు పాలిటిక్స్ లోకి వస్తున్న - నటి కస్తూరి సంచలన ప్రకటన
తమిళనాడులో ప్రతిరోజూ టార్చర్, తెలుగు పాలిటిక్స్ లోకి వస్తున్న - నటి కస్తూరి సంచలన ప్రకటన
Andhra News: ఉద్యోగాల్లో ఆ కోటా పెంపు - ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం
ఉద్యోగాల్లో ఆ కోటా పెంపు - ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Andhra Pradesh Assembly on Nov 11th | వైసీపీనే వెంటాడుతూనే ఉన్న 11వ నెంబర్ | ABP DesamKasturi Entry Telangana Politics | జనసేనలో చేరుతున్న నటి కస్తూరీ..? | ABP DesamKasturi Insult Telugu People | తెలుగువాళ్లపై నోరు పారేసుకున్న కస్తూరి | ABP DesamMysore Pak Sweet History | మహారాజును మెప్పించేందుకు తయారైన మైసూరుపాక్ | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Vangalapudi Anitha: 'పవన్ కల్యాణ్ అన్నదాంట్లో తప్పేం లేదు' - డిప్యూటీ సీఎం వ్యాఖ్యలపై హోంమంత్రి అనిత స్పందన
'పవన్ కల్యాణ్ అన్నదాంట్లో తప్పేం లేదు' - డిప్యూటీ సీఎం వ్యాఖ్యలపై హోంమంత్రి అనిత స్పందన
Telangana: బీసీ రిజర్వేషన్ల కోసం స్పెషల్ కమిషన్ ఏర్పాటు, తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు
బీసీ రిజర్వేషన్ల కోసం స్పెషల్ కమిషన్ ఏర్పాటు, తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు
Actress Kasturi: తమిళనాడులో ప్రతిరోజూ టార్చర్, తెలుగు పాలిటిక్స్ లోకి వస్తున్న - నటి కస్తూరి సంచలన ప్రకటన
తమిళనాడులో ప్రతిరోజూ టార్చర్, తెలుగు పాలిటిక్స్ లోకి వస్తున్న - నటి కస్తూరి సంచలన ప్రకటన
Andhra News: ఉద్యోగాల్లో ఆ కోటా పెంపు - ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం
ఉద్యోగాల్లో ఆ కోటా పెంపు - ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం
Naga Chaitanya Sobhita Wedding Date: నాగచైతన్య, శోభిత ధూళిపాల పెళ్లి డేట్ ఫిక్స్.. వచ్చే ఏడాది కాదు, ఈ సంవత్సరమేనట
నాగచైతన్య, శోభిత ధూళిపాల పెళ్లి డేట్ ఫిక్స్.. వచ్చే ఏడాది కాదు, ఈ సంవత్సరమేనట
Ola News: కస్టమర్ ఫిర్యాదు, రూ.1.73 లక్షలు చెల్లించాలని ఓలాకు కోర్టు ఆదేశాలు
కస్టమర్ ఫిర్యాదు, రూ.1.73 లక్షలు చెల్లించాలని ఓలాకు కోర్టు ఆదేశాలు
Realme GT 7 Pro Launched: మోస్ట్ అవైటెడ్ రియల్‌మీ జీటీ 7 ప్రో వచ్చేసింది - భారీ బ్యాటరీతో ఎంట్రీ!
మోస్ట్ అవైటెడ్ రియల్‌మీ జీటీ 7 ప్రో వచ్చేసింది - భారీ బ్యాటరీతో ఎంట్రీ!
CM Revanth Reddy: ఈ నెల 8న సీఎం రేవంత్ రెడ్డి పాదయాత్ర - ఎక్కడంటే?
ఈ నెల 8న సీఎం రేవంత్ రెడ్డి పాదయాత్ర - ఎక్కడంటే?
Embed widget