News
News
abp shortsABP షార్ట్స్వీడియోలు ఆటలు
X

NEET Answer Key: నీట్ ఆన్సర్ కీ వచ్చేస్తోంది, ఫలితాలు ఎప్పుడంటే?

నీట్ పరీక్షలో జనరల్ కేటగిరి అభ్యర్థులకు కనీస అర్హత మార్కులను 50 పర్సెంట్‌గా.. ఎస్టీ, ఎస్సీ అభ్యర్థులకు 40 పర్సంటైల్‌గా, దివ్యాంగులకు 45 పర్సంటైల్‌గా నిర్ణయించారు.

FOLLOW US: 
Share:

జాతీయ స్థాయి మెడికల్ ప్రవేశ పరీక్ష నీట్ యూజీ - 2022 పరీక్ష ఆన్సర్ కీ, ఫలితాల వెల్లడి తేదీలకు సంబంధించి నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ కీలక అప్‌డేట్ ఇచ్చింది. నీట్-2022 పరీక్ష ఆన్సర్ కీని ఆగస్టు 30న విడుదల చేసి, సెప్టెంబరు 7న ఫలితాలను విడుదల చేయనున్నట్లు ప్రకటించింది. ఆన్సర్ కీతో పాటు అభ్యర్థుల ఆన్సర్ షీట్లను కూడా విడుదల చేయనున్నారు.


అభ్యర్థుల ఓఎంఆర్ ఆన్సర్ కీ స్కాన్ కాపీలను అభ్యర్థుల ఈమెయిల్ ఐడీలకు పంపుతారు. ప్రిలిమినరీ ఆన్సర్ కీపై అభ్యంతరాలు స్వీకరిస్తారు. ఆన్సర్ కీలో అభ్యంతరాలు తెలిపే అభ్యర్థులు ప్రతి ప్రశ్నకు రూ.200గా ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. అభ్యర్థులు తెలిపిన అభ్యంతరాలను సబ్జెక్ట్ నిపుణుల ప్యానెల్ పరిశీలిస్తుంది. ఒకవేళ అభ్యర్థుల వాదన సరైనది అనిపిస్తే.. ఆన్సర్‌ కీలో మార్పులు చేస్తుంది. రెస్పాన్స్ చాలెంజ్ కోసం కూడా అభ్యర్థులు రూ200 చెల్లించాల్సి ఉంటుంది. ఆ తర్వాత నిపుణులు ఖరారు చేసిన ఫైనల్ కీని విడుదల చేస్తుంది. ఫైనల్ కీ ఆధారంగానే తుది ఫలితాలను ప్రకటిస్తారు. 

Also Read:   స్విమ్స్‌'లో అండర్ గ్రాడ్యుయేట్ ప్రవేశాలు, అర్హతలివే!

 

జులై 17న దేశవ్యాప్తంగా దాదాపు 3,570 పరీక్షా కేంద్రాల్లో పరీక్షను నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈసారి నీట్ పరీక్షకు 18.72 లక్షల మంది అభ్యర్థులు రిజిష్టర్ చేసుకోగా.. 17.78 లక్షల మంది అభ్యర్థులు పరీక్షకు హాజరయ్యారు. రికార్డు స్థాయిలో 95 శాతం హాజరు నమోదైంది. సాధారణంగా నీట్ ఫలితాలను పరీక్ష జరిగిన నెలన్నరలోపు ఎన్టీఏ విడుదల చేస్తుంటుంది. గతేడాది నీట్ పరీక్ష సెప్టెంబర్ 12న జరగ్గా, ఫలితాలు నవంబర్ 1న విడుదలయ్యాయి. 2020లో సెప్టెంబర్ 13న నీట్ జరగ్గా, అక్టోబర్ 16న ఫలితాలు వెలువడ్డాయి. దీనిప్రకారం జులై 17న నీట్ పరీక్ష జరగ్గా..  సెప్టెంబరు 7ప ఫలితాలు వెల్లడించనున్నారు. 


ఆన్సర్ కీ కోసం వెబ్‌సైట్: https://neet.nta.nic.in/ 

కటాఫ్ మార్కులు ఇలా..?
నీట్ పరీక్షలో జనరల్ కేటగిరి అభ్యర్థులకు కనీస అర్హత మార్కులను 50 పర్సెంట్‌గా.. ఎస్టీ, ఎస్సీ అభ్యర్థులకు 40 పర్సంటైల్‌గా, దివ్యాంగులకు 45 పర్సంటైల్‌గా నిర్ణయించారు. గతేడాది కటాఫ్‌ మార్కులు జనరల్‌-138, ఓబీసీ, ఎస్సీ, ఎస్టీలకు 108గా నిర్ణయించారు. ఈసారి అర్హత మార్కులు 5-10 మార్కులు తగ్గే అవకాశం ఉంది. కటాఫ్‌ మార్కు 125-130 మధ్యలో ఉండే అవకాశం ఉంది. ఫలితాల వెల్లడి తర్వాత నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ కౌన్సెలింగ్ షెడ్యూలును ప్రకటించనుంది. మెడికల్ కౌన్సెలింగ్ కమిటీ వెబ్‌సైట్‌లో కౌన్సెలింగ్ షెడ్యూలును అప్‌లోడ్ చేయనుంది. 


నీట్‌ ర్యాంకుల ఆధారంగానే రాష్ట్రాల వారీగా మెరిట్ జాబితా రూపొందించి ప్రవేశాలు కల్పిస్తారు. నీట్ పరీక్షలో అర్హత సాధించిన విద్యార్థుల మెరిట్ జాబితాను 'మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్' ఆధ్వర్యంలోని డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ హెల్త్ సర్వీసెస్‌తో పాటు మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా, డెంటల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా రూపొందిస్తాయి. నీట్ మెడికల్ మెరిట్ లిస్ట్ ఆధారంగానే ప్రవేశ ప్రక్రియ జరుగుతుంది. 

 

Also Read:   NTR Health University: పారా మెడికల్‌ కోర్సుల్లో ప్రవేశాలు, చివరితేది ఇదే!


టై బ్రేకింగ్ ప్రకారమే ర్యాంకులు..

ఈ సారి ర్యాంకింగ్ విధానంలో టై బ్రేకింగ్ విధానాన్ని అమలుచేయనున్నారు. దీనిప్రకారం..
▶ బయాలజీ (బోటనీ & జువాలజీ), కెమిస్ట్రీ, ఫిజిక్స్‌లో ఎక్కువ మార్కులు/పర్సెంటైల్ స్కోర్ ఉన్నవారికి ప్రాధాన్యం ఉంటంది. 
▶ అన్ని సబ్జెక్టులలో మార్కులు ఒకేలా ఉంటే, తక్కువ ప్రశ్నలకు ప్రయత్నించిన విద్యార్థులకు ఎక్కువ ర్యాంక్ ఇవ్వబడుతుంది, తరువాత బయాలజీ, కెమిస్ట్రీ మరియు ఫిజిక్స్‌లలో తక్కువ తప్పులు చేసినవారికి ప్రాధాన్యమిస్తారు.
▶ ఈ మార్కులన్నీ కూడా సరిపోలితే, వయసులో ఎక్కువ వయస్సు ఉన్న అభ్యర్థులకు ఎక్కువ ర్యాంక్ ఇవ్వబడుతుంది.
▶ ఒకవేళ అభ్యర్థులు తమ పుట్టినరోజును పరిగణనలోకి తీసుకుంటే, ముందుగా నీట్ పరీక్షకు దరఖాస్తు చేసిన అభ్యర్థికి ఎక్కువ ర్యాంకు లభిస్తుంది. 

 

మరిన్ని విద్యాసంబంధ వార్తల కోసం క్లిక్ చేయండి..

 

Published at : 28 Aug 2022 11:47 PM (IST) Tags: NEET UG 2022 answer key NEET UG 2022 Result Date NEET UG 2022 Results NTA NEET 2022 result

ఇవి కూడా చూడండి

AP Tenth: 'టెన్త్‌' విద్యార్థులకు అలర్ట్, వివరాల్లో తప్పులుంటే మార్చుకోవచ్చు!

AP Tenth: 'టెన్త్‌' విద్యార్థులకు అలర్ట్, వివరాల్లో తప్పులుంటే మార్చుకోవచ్చు!

TS SET: టీఎస్‌ సెట్‌ - 2023 ఫలితాలు విడుదల, ర్యాంక్ కార్డుల డౌన్‌లోడ్ లింక్ ఇదే

TS SET: టీఎస్‌ సెట్‌ - 2023 ఫలితాలు విడుదల, ర్యాంక్ కార్డుల డౌన్‌లోడ్ లింక్ ఇదే

GATE Schedule: గేట్ - 2024 పరీక్షల షెడ్యూల్ విడుదల, పేపర్లవారీగా తేదీలివే

GATE Schedule: గేట్ - 2024 పరీక్షల షెడ్యూల్ విడుదల, పేపర్లవారీగా తేదీలివే

CPGET: పీజీ సీట్లు సగానికి పైగా ఖాళీ, అయినా ప్రవేశాలు గతేడాది కంటే ఎక్కువే!

CPGET: పీజీ సీట్లు సగానికి పైగా ఖాళీ, అయినా ప్రవేశాలు గతేడాది కంటే ఎక్కువే!

AP Inter Fees: ‘ఇంటర్‌’ పరీక్ష ఫీజు చెల్లించడానికి నేడే ఆఖరు, ఆలస్య రుసుముతో ఎప్పటివరకు అవకాశమంటే?

AP Inter Fees: ‘ఇంటర్‌’ పరీక్ష ఫీజు చెల్లించడానికి నేడే ఆఖరు, ఆలస్య రుసుముతో ఎప్పటివరకు అవకాశమంటే?

టాప్ స్టోరీస్

ప్రజాభవన్‌ వద్ద కేసీఆర్‌ పేరుపై మట్టిపూత- సెల్ఫీలు తీసుకుంటున్న సందర్శకులు - వద్దని వారించిన బండ్ల గణేష్

ప్రజాభవన్‌ వద్ద కేసీఆర్‌ పేరుపై మట్టిపూత- సెల్ఫీలు తీసుకుంటున్న సందర్శకులు - వద్దని వారించిన బండ్ల గణేష్

Chandrababu on Telangana Election Results: 'అహంకార ఫలితం తెలంగాణలో చూశాం' - ఏపీలోనూ అదే రిపీట్ అవుతుందంటూ చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు

Chandrababu on Telangana Election Results: 'అహంకార ఫలితం తెలంగాణలో చూశాం' - ఏపీలోనూ అదే రిపీట్ అవుతుందంటూ చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు

Extra Ordinary Man Review - ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్ రివ్యూ: నితిన్ నవ్వించారా? హిట్ అందుకుంటారా?

Extra Ordinary Man Review - ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్ రివ్యూ: నితిన్ నవ్వించారా? హిట్ అందుకుంటారా?

APPSC Group-1: ఏపీపీఎస్సీ 'గ్రూప్-1' నోటిఫికేషన్ విడుదల, పోస్టుల వివరాలు ఇలా

APPSC Group-1:  ఏపీపీఎస్సీ 'గ్రూప్-1' నోటిఫికేషన్ విడుదల, పోస్టుల వివరాలు ఇలా