X

NEET Phase 2 Registration: నీట్ యూజీ దరఖాస్తు సవరణ గడువు పొడిగింపు.. రేపటి వరకు ఛాన్స్..

నీట్- 2021 దరఖాస్తు సవరణ విండో ఆఖరు గడువును పొడిగిస్తున్నట్లు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) ప్రకటించింది. అభ్యర్థులు రేపు (అక్టోబర్ 13) రాత్రి 11:50 వరకు దరఖాస్తు సవరణలను చేసుకోవచ్చని తెలిపింది.

FOLLOW US: 

దేశవ్యాప్తంగా వైద్య విద్య ప్రవేశాలకు నిర్వహించే నేష‌న‌ల్ ఎలిజిబిలిటీ క‌మ్ ఎంట్రెన్స్ టెస్ట్ (నీట్ ) - 2021 యూజీ (అండర్ గ్రాడ్యుయేషన్) విద్యార్థులకు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) గుడ్ న్యూస్ అందించింది. దరఖాస్తు సవరణలకు ఉద్దేశించిన నీట్ యూజీ ఫేజ్ 2 (NEET UG Phase 2) ప్రక్రియను రేపటి (అక్టోబర్ 13) వరకు పొడిగిస్తున్నట్లు ప్రకటించింది. అభ్యర్థులు అక్టోబర్ 13వ తేదీ రాత్రి 11:50 వరకు తమ దరఖాస్తులను సవరించుకోవచ్చని వెల్లడించింది. నీట్ యూజీ ఫేజ్ 2 ప్రక్రియ అక్టోబర్ 1వ తేదీన ప్రారంభమైంది. దీని ద్వారా అభ్యర్థులు ఫేజ్ 1లో నమోదు చేసుకున్న వివరాలను ఎడిట్ చేసుకోవడంతో పాటు.. ఫేజ్ 2లో భాగంగా మరిన్ని వివరాలను నమోదు చేసుకోవాల్సి ఉంటుంది.

గతంలో విడుదల చేసిన షెడ్యూల్ ప్రకారం ఫేజ్ 2 ప్రక్రియ 10వ తేదీతో ముగియాల్సి ఉండగా... ఎన్టీఏ దీనిని పొడిగించింది. ఫేజ్ 2లో భాగంగా తమ వివరాలను అందించని వారికి నీట్ యూజీ ఫలితాలను సైతం వెల్లడించబోమని ఎన్టీఏ పేర్కొంది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాల కోసం www.nta.ac.in, https://neet.nta.nic.in/  వెబ్‌సైట్లను లేదా neet@nta.ac.in ఈమెయిల్‌ను సంప్రదించవచ్చని సూచించింది. 

Also Read: సివిల్స్ ప్రిలిమ్స్ అభ్యర్థుల రియాక్షన్ ఇదే.. కేటగిరీల వారీగా కటాఫ్ ఎంత ఉండొచ్చంటే! 

ఫేజ్ 1 సవరణలకు అవకాశం.. 
నీట్ యూజీ మొదటి దశలో (ఫేజ్ 1) భాగంగా అభ్యర్థులు తమ వివరాలను అందించి రిజిస్టర్ చేసుకోవడంతో పాటు పరీక్ష ఫీజు చెల్లించారు. ఇక రెండో దశలో (ఫేజ్ 2) భాగంగా 11, 12 (XI, XII) తరగతుల వివరాలను అందించాల్సి ఉంటుంది. దీంతో పాటు ఫేజ్ 1 ప్రక్రియలో నమోదు చేసుకున్న జెండర్, ఈ-మెయిల్, కేటగిరీ, నేషనాలటీ తదితర వివరాలను సవరించుకునే (ఎడిట్) అవకాశాన్ని ఎన్టీఏ కల్పించింది. ఈ ప్రక్రియకు ఎలాంటి రుసుం చెల్లించాల్సిన అవసరం లేదు. ఫేజ్ 2 రిజిస్ట్రేషన్లను పూర్తి చేయని వారి అభ్యర్థిత్వాన్ని పరిగణనలోకి తీసుకోబోమని ఎన్టీఏ స్పష్టం చేసింది. అలాంటి వారి నీట్ ఫలితాలను సైతం వెల్లడించబోమని తెలిపింది. రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తయిన తర్వాత ప్రొవిజనల్ ఆన్సర్ కీని విడుదల చేస్తామని చెప్పింది. 

Also Read: కోవిడ్ బాధిత విద్యార్థులకు ఎస్‌బీఐ స్కాల‌ర్‌షిప్‌.. ఏడాదికి రూ.38,500 సాయం.. 

నీట్ ఫేజ్ 2లో అందించాల్సిన వివరాలివే..  
నివాస ప్రదేశం (Place of Residence).. మోడ్ ఆఫ్ ప్రిపరేషన్ (Mode of preparation).. 11, 12 తరగతులను ఏ ఏడాదిలో పూర్తి చేశారు, పాఠశాల పేరు, మార్కులు.. తల్లిదండ్రుల ఆదాయ వివరాలు  తదితర వివరాలను అందించాలి. 

Also Read: ఏపీ నిట్‌లో ఎంబీఏ కోర్సు.. అక్టోబర్ 30తో ముగియనున్న దరఖాస్తు గడువు.. ముఖ్యమైన వివరాలివే..

Also Read: విద్యార్థుల కోసం స్కాల‌ర్‌షిప్స్.. వచ్చే నెలతో ముగియనున్న గడువు.. ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి 

Tags: NEET 2021 NEET NEET UG NEET 2021 phase 2 Registration

సంబంధిత కథనాలు

Army College: తొలిసారి ఆర్మీ కాలేజీలో బాలికలకూ ప్రవేశం... దరఖాస్తులకు చివరి తేదీ ఎప్పుడంటే

Army College: తొలిసారి ఆర్మీ కాలేజీలో బాలికలకూ ప్రవేశం... దరఖాస్తులకు చివరి తేదీ ఎప్పుడంటే

UPSC Recruitment 2021: యూపీఎస్సీ నుంచి జాబ్ నోటిఫికేషన్లు... ఆ ఉద్యోగాలేంటంటే...

UPSC Recruitment 2021: యూపీఎస్సీ నుంచి  జాబ్ నోటిఫికేషన్లు... ఆ ఉద్యోగాలేంటంటే...

CBSE Term 1 Boards: 10, 12వ తరగతి టర్మ్ 1 ఎగ్జామ్స్.. విద్యార్థులకు సీబీఎస్ఈ బోర్డు సూచనలు ఇవే..

CBSE Term 1 Boards: 10, 12వ తరగతి టర్మ్ 1 ఎగ్జామ్స్.. విద్యార్థులకు సీబీఎస్ఈ బోర్డు సూచనలు ఇవే..

Inter Supplementary Results: ఏపీ ఇంటర్ అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ ఫలితాలు విడుదల... రిజెల్ట్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Inter Supplementary Results: ఏపీ ఇంటర్ అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ ఫలితాలు విడుదల... రిజెల్ట్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

TS EAMCET 2021: తెలంగాణ ఎంసెట్‌ ఇంజినీరింగ్‌ కౌన్సెలింగ్‌ షెడ్యూల్‌ వచ్చేసింది.. తేదీలు, పూర్తి వివరాలివే 

TS EAMCET 2021: తెలంగాణ ఎంసెట్‌ ఇంజినీరింగ్‌ కౌన్సెలింగ్‌ షెడ్యూల్‌ వచ్చేసింది.. తేదీలు, పూర్తి వివరాలివే 

టాప్ స్టోరీస్

Team India New Coach: బ్రేకింగ్‌..! అన్నట్టుగానే కోచ్‌ పదవికి రాహుల్‌ ద్రవిడ్‌ దరఖాస్తు.. NCA చీఫ్ రేసులో లక్మణ్.. వివరాలు ఇవే!

Team India New Coach: బ్రేకింగ్‌..! అన్నట్టుగానే కోచ్‌ పదవికి రాహుల్‌ ద్రవిడ్‌ దరఖాస్తు.. NCA చీఫ్ రేసులో లక్మణ్.. వివరాలు ఇవే!

Ghani Anthem Promo: 'గని' యాంథెమ్.. 'They Call Him Ghani.. కనివిని ఎరుగని'.. 

Ghani Anthem Promo: 'గని' యాంథెమ్.. 'They Call Him Ghani.. కనివిని ఎరుగని'.. 

Aryan Khan Bail Hearing: 'ఆర్యన్ ఖాన్ వెనుక అంతర్జాతీయ డ్రగ్స్ ముఠా.. బెయిల్ ఇవ్వొద్దు మైలార్డ్'

Aryan Khan Bail Hearing: 'ఆర్యన్ ఖాన్ వెనుక అంతర్జాతీయ డ్రగ్స్ ముఠా.. బెయిల్ ఇవ్వొద్దు మైలార్డ్'

Seven Week Jewellery: ఏడు వారాల నగలు వేసుకోవడం వెనుక ఆంతర్యం ఏంటి... ఏ రోజు ఏ రాళ్లు ధరిస్తారు..!

Seven Week Jewellery: ఏడు వారాల నగలు వేసుకోవడం వెనుక ఆంతర్యం ఏంటి... ఏ రోజు ఏ రాళ్లు ధరిస్తారు..!