UPSC CSE Prelims 2021 Analysis: సివిల్స్ ప్రిలిమ్స్ అభ్యర్థుల రియాక్షన్ ఇదే.. కేటగిరీల వారీగా కటాఫ్ ఎంత ఉండొచ్చంటే!
యూనియన్ పబ్లిక్ సర్వీసెస్ (UPSC) సివిల్ సర్వీసెస్ ప్రిలిమినరీ పరీక్షను ఆదివారం నిర్వహించారు. యూపీఎస్సీ ప్రిలిమ్స్ 2021 కటాఫ్ మార్కులు, పరీక్షల అనాలిసిస్‌పై ప్రత్యేక ఆసక్తి నెలకొంది.
UPSC CSE Prelims 2021 Expected Cut-off: యూనియన్ పబ్లిక్ సర్వీసెస్ (UPSC) సివిల్ సర్వీసెస్ ప్రిలిమినరీ పరీక్షను ఆదివారం నిర్వహించారు. దేశవ్యాప్తంగా 77 నగరాలలో రెండు సెషన్లలో పరీక్ష ప్రశాంతంగా జరిగింది. అభ్యర్థులకు తెలంగాణలో ఆర్టీసీలో ఎలాంటి టిక్కెట్లు అవసరం లేదని, హాల్ టిక్కెట్ చూపిస్తే చాలని ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించారు. యూపీఎస్సీ ప్రిలిమ్స్ 2021 కటాఫ్ మార్కులు, పరీక్షల అనాలిసిస్‌పై ప్రత్యేక ఆసక్తి చూపుతున్నారు.
కటాఫ్ మార్కులు..
గత ఏడాదితో పోల్చితే జీఎస్ 1 పేపర్ ఈజీగా ఉందని ఓ అభ్యర్థి చెప్పారు. ఎన్విరాన్‌మెంట్ సబ్జెక్ట్ కోసం అధిక సమయం కేటాయించాల్సి వచ్చిందని కొందరు అన్నారు. గత ఏడాదితో పోల్చితే కటాఫ్ మార్కులు పెరిగే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేశారు. సివిల్స్‌లో తొలి అంశం ప్రిలిమ్స్ కాగా, దాదాపు ప్రతి సబ్జెక్ట్ లోనూ కటాఫ్ దాదాపు సమానంగా ఉంటుంది. జనరల్ కటాఫ్ 90కి మించి ఉండొచ్చునని అంచనా వేస్తున్నారు. హిస్టరీ, పాలిటీ, ఎన్విరాన్ మెంటల్ సైన్సెస్ నుంచి అధిక ప్రశ్నలు వచ్చాయి. టెక్ట్స్ బుక్ నాలెడ్జ్ ఉన్నవారికి పాలిటీ చాలా ఈజీ అని అభ్యర్థులు చెబుతున్నారు. ఎకనామిక్స్ మాత్రం సబ్జెక్ట్ పై పూర్తి అవగాహన ఉంటేనే సరైన సమాధానం ఇవ్వగలమని చెప్పారు. గత ఏడాదికి సంబంధించి, కరోనాపై ఎక్కువ ప్రశ్నలు అడిగారు.
ప్రిలిమ్స్ 2021 జీఎస్ పేపర్ 1 లో ప్రశ్నలు ఇలా..
పాలిటీ నుంచి 14 ప్రశ్నలు,
ఎకనామిక్స్ నుంచి 15,
ఎన్విరాన్‌మెంటల్ సైన్సెస్ 15,
హిస్టరీ 20,
జాగ్రఫీ 10,
సైన్స్ అండ్ టెక్నాలజీ 12,
స్పోర్ట్స్, ఆర్ట్ అండ్ కల్చర్ నుంచి 14 వరకు ప్రశ్నలు వచ్చాయి.
హిస్టరీ నుంచి ఎక్కువ ప్రశ్నలు రాగా, ఆ తరువాత ఎకనామిక్స్, ఈవీఎస్ నుంచి ప్రశ్నలు అడిగారు. స్పోర్ట్స్ నుంచి ఒలింపిక్స్ కు సంబంధించి అభ్యర్థులు సమాధానం ఇవ్వగలిగేలా ఉన్నాయని అభ్యర్థులు చెబుతున్నారు.
Also Read: ఏపీలో 190 ఉద్యోగాలు.. రూ.85 వేల వరకు జీతం.. దరఖాస్తు గడువు ఎప్పటివరకు అంటే..
యూపీఎస్సీ ప్రిలిమ్స్ గత నాలుగేళ్ల కటాఫ్ వివరాలు..
- గత నాలుగేళ్లుగా సబ్జెక్టుల వారీగా కటాఫ్ మార్కులను పరిశీలిస్తే మీకు ఓ అవగాహన వస్తుంది. జనరల్ అభ్యర్థులకు 2017లో 105.34 కటాఫ్ కాగా, 2018, 2019, 2020లో వరుసగా 98, 98, 92.51గా ఉంది.
- ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు 2019, 2020లో కటాఫ్ వరుసగా 90, 77.55 గా ఉంది.
- ఓబీసీ అభ్యర్థులకు 2017లో కటాఫ్ 102.66 కాగా, 2018, 2019, 2020లో వరుసగా 96.6, 95.34, 89.12
- ఎస్సీ అభ్యర్థులకు 2017లో కటాఫ్ 88.66 కాగా, 2018, 2019, 2020లో వరుసగా 84, 82, 74.84
- ఎస్టీ అభ్యర్థులకు 2017లో కటాఫ్ 88.66.. 2018, 2019, 2020లో వరుసగా 83.34, 77.34, 68.71
- PwBD-1 /PH1 కేటగిరి అభ్యర్థులకు 2017లో కటాఫ్ 85.34.. 2018, 2019, 2020లో వరుసగా 73.34, 55.34, 70.06
- PwBD-2 /PH2 కేటగిరి అభ్యర్థులకు 2017లో కటాఫ్ 61.34.. 2018, 2019, 2020లో వరుసగా 53.34, 44.66, 63.94
- PwBD-3 /PH3 కేటగిరి అభ్యర్థులకు 2017లో కటాఫ్ 40.. 2018, 2019, 2020లో వరుసగా 40, 40.66, 40.82
- PwBD-5 కేటగిరి అభ్యర్థులకు 2018లో 45.34, 2019లో 61.34, గత ఏడాది కటాఫ్ 42.86 గా ఉంది.
Also Read: అభ్యర్థులకు అలర్ట్.. యూజీసీ నెట్ మళ్లీ వాయిదా.. త్వరలో కొత్త తేదీల ప్రకటన..
యూపీఎస్సీ ప్రిలిమ్స్ 2021 కటాఫ్ అంచనాలు..
జనరల్ కటాఫ్ అంచనా 98.46. ప్రతి కేటగిరిలోనూ 5 మార్కులు ఎక్కువ లేదా తక్కువ
ఈడబ్ల్యూఎస్ కటాఫ్ అంచనా 84 ± 5
ఓబీసీ కటాఫ్ అంచనా 96 ± 5
ఎస్సీ కటాఫ్ అంచనా 83 ± 5
ఎస్టీ కటాఫ్ అంచనా 80 ± 5
పీడబ్ల్యూబీడీ 1 అభ్యర్థుల కటాఫ్ అంచనా 71.02 ± 5
పీడబ్ల్యూబీడీ 2 అభ్యర్థుల కటాఫ్ అంచనా 55.82 ± 5
పీడబ్ల్యూబీడీ 3 అభ్యర్థుల కటాఫ్ అంచనా 40.37 ± 5
పీడబ్ల్యూబీడీ 5 అభ్యర్థుల కటాఫ్ అంచనా 49.84 ± 5
అభ్యర్థులు మెయిన్స్‌కు అర్హత సాధించాలంటే సీఎస్‌ఏటీ పేపర్ (CSAT Paper) క్వాలిఫై తప్పనిసరి. ఇందుకోసం అభ్యర్థులు ఇందులో 33 శాతం మార్కులు రావాలి. ఈ పేపర్ క్వాలిఫై అవ్వని అభ్యర్థుల పేపర్ 1ను కరెక్షన్ చేయరు.