అన్వేషించండి

NEET PG: నీట్ పీజీ పరీక్ష వాయిదా, సుప్రీంకోర్లు ఆదేశాల నేపథ్యంలో ఎన్‌బీఈ కీలక నిర్ణయం

NEET-PG: దేశవ్యాప్తంగా జూన్ 15న నిర్వహించనున్న నీట్ పీజీ ప్రవేశ పరీక్షను వాయిదా వేస్తున్నట్లు నేషనల్ బోర్డ్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (NBEMS) ఒక ప్రకటనలో తెలిపింది.

NEET PG 2025: దేశంలోని వైద్యకళాశాలల్లో పీజీ కోర్సుల్లో ప్రవేశాలకు సంబంధించి జూన్ 15న నిర్వహించనున్న 'నేషనల్‌ ఎలిజిబిలిటీ కం ఎంట్రన్స్‌ టెస్ట్‌ ఫర్‌ పోస్ట్‌ గ్రాడ్యుయేట్స్‌ (NEET-PG)' ప్రవేశ పరీక్ష వాయిదా పడింది. ఈ మేరకు 'నేషనల్ బోర్డ్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (NBEMS)' జూన్ 2న ఒక ప్రకటన విడుదల చేసింది. సుప్రీంకోర్టు ఆదేశాల నేపథ్యంలో పరీక్షను రద్దు చేసినట్లు తెలుస్తోంది. వాయిదాపడిన నీట్‌ పీజీ పరీక్ష తేదీని త్వరలోనే ప్రకటించనునట్లు వెల్లడించింది. ఇటీవల సుప్రీంకోర్టు విద్యార్థులకు సమాన అవకాశాలను కల్పించడంతో పాటు, పరీక్ష ప్రక్రియలో పారదర్శకతను నిర్ధారించేందుకు ఒకే షిఫ్ట్‌లో పరీక్షలను నిర్వహించాలని ఆదేశించిన సంగతి తెలిసిందే. పరీక్ష నిర్వహణ కోసం కేంద్రాలు, సమయం సరిపోదంటూ ఎన్‌బీఈ చేసిన వాదనలు సుప్రీంకోర్టు తోసిపుచ్చింది.

కోర్టు ఆదేశాల నేపథ్యంలో నీట్‌ రద్దు..
కోర్టు ఆదేశాల నేపథ్యంలో ఎన్‌బీఈ నీట్‌ పీజీ పరీక్షను రద్దు చేసింది. పరీక్ష కేంద్రాలు ఇంకా ఏర్పాటు చేయాల్సి ఉన్నందున పరీక్షలను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది. ఎన్‌బీఈ నిర్వహించే నీట్ పీజీ ప్రవేశ పరీక్ష ద్వారా ఎండీ, ఎంఎస్, పీజీ డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తారు. అదేవిధంగా నీట్‌ ద్వారానే దేశవ్యాప్తంగా అనేక మెడికల్ కాలేజీల్లో పీజీ సీట్లను భర్తీ చేస్తుంటారు. 

ఒకే షిఫ్ట్‌లో పరీక్షలు..
2024లో నీట్‌ పీజీ రెండు షిఫ్టుల్లో నిర్వహించారు. ఈ రెండు షిఫ్ట్‌లలో వేర్వేరు ప్రశ్నపత్రాలు ఉండడంతో ఒక షిఫ్ట్‌లోని ప్రశ్నలు సులభంగా, మరొక షిఫ్ట్‌లోని ప్రశ్నలు కఠినంగా ఉన్నాయని విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో విద్యార్థులు సుప్రీంకోర్టును ఆశ్రయించగా.. ఒకే షిఫ్ట్‌లో నిర్వహించాలని ఆదేశించింది. 2024లో నీట్ పరీక్ష పత్రాల లీకేజీ తీవ్ర దుమారం రేపిన విషయం తెలిసిందే. గత అనుభవాల దృష్ట్యా ఈ సారి అలాంటి ఘటనలు చేసుకోకుండా ఎన్టీఏ పకడ్బందీ చర్యలు తీసుకుంటుంది. ఇందులో భాగంగానే పరీక్ష నిర్వహణలో ఈ మార్పులు చేసింది.

నీట్ పీజీ పరీక్ష విధానం..
నీట్ పీజీ పరీక్షను మొత్తం 800 మార్కులకు నిర్వహిస్తారు. కంప్యూటర్ ఆధారితంగా నిర్వహించే పరీక్షలో మొత్తం మూడు విభాగాల నుంచి 200 ప్రశ్నలు అడుగుతారు. ప్రతి పరీక్షకు 4 మార్కులు కేటాయించారు. పరీక్షలో నెగెటివ్ మార్కులు ఉంటాయి. ప్రతి తప్పు సమాధానానికి 1 మార్కు కోత విధిస్తారు. పరీక్ష సమయం మూడున్నర గంటలు. ఇంగ్లిష్‌ మాధ్యమంలో మాత్రమే ప్రశ్నలు అడుగుతారు.

ఒకే షిఫ్టులో పరీక్షపై చర్చ..
నీట్ పీజీ పరీక్షను రెండు షిఫ్టుల్లో నిర్వహించాలనే నిర్ణయంపై గతేడాది కూడా జాతీయ స్థాయిలో చర్చ జరిగింది. మేధావులు, డాక్టర్లు, విద్యార్థుల నుంచి విమర్శలు వ్యక్తమయ్యాయి. నీట్ పీజీ పరీక్షను రెండు దశల్లో నిర్వహించాలని చూడటం సరైంది కాదని వారు ప్రశ్నించారు. దీనివల్ల అన్‌ఫెయిర్ స్కోరింగ్, న్యాయపరమైన వివాదాలు, అభ్యర్ధుల్లో ఒత్తిడి ఉంటుందని అభిప్రాయపడ్డారు. అదే తప్పుల్ని ఎందుకు రిపీట్ చేస్తున్నారని ప్రశ్నించారు. ఒకే షిఫ్ట్‌లో నీట్ పీజీ పరీక్ష నిర్వహించాలని కేంద్ర మంత్రి జేపీ నడ్డాకు గతేడాది యునైటెడ్ డాక్టర్స్ ఫోరమ్ లేఖ రాసిన సంగతి తెలిసిందే. 

NEET PG: నీట్ పీజీ పరీక్ష వాయిదా, సుప్రీంకోర్లు ఆదేశాల నేపథ్యంలో ఎన్‌బీఈ కీలక నిర్ణయం

టాప్ హెడ్ లైన్స్

How To Become Guest Faculty: కేంద్రీయ విశ్వవిద్యాలయంలో అతిథి అధ్యాపకులుగా ఎలా చేరాలి? ఎలా అప్లై చేసుకోవాలి?
కేంద్రీయ విశ్వవిద్యాలయంలో అతిథి అధ్యాపకులుగా ఎలా చేరాలి? ఎలా అప్లై చేసుకోవాలి?
Free NEET Coaching: నీట్ ఫ్రీ లాంగ్ టర్మ్ కోచింగ్.. అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానించిన TGSWREIS
నీట్ ఫ్రీ లాంగ్ టర్మ్ కోచింగ్.. అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానించిన TGSWREIS
Khudiram Bose:18 ఏళ్లకే ఉరి పీఠాన్ని ముద్దాడిన విప్లవ వీరుడు! ఖుదీరామ్‌ బోస్‌ బలిదానానికి 116 ఏళ్లు!
18 ఏళ్లకే ఉరి పీఠాన్ని ముద్దాడిన విప్లవ వీరుడు! ఖుదీరామ్‌ బోస్‌ బలిదానానికి 116 ఏళ్లు!
Fact Check: విద్యార్థులకు కేంద్రం ఉచితంగా ల్యాప్‌టాప్‌లు ఇస్తుందా? విద్యా మంత్రిత్వ శాఖ ఏం చెప్పింది?
విద్యార్థులకు కేంద్రం ఉచితంగా ల్యాప్‌టాప్‌లు ఇస్తుందా? విద్యా మంత్రిత్వ శాఖ ఏం చెప్పింది?

వీడియోలు

IND Spin Attack Strategy vs SL Revealed | గాలే టెస్టులో ముగ్గురు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్లు
Gundenininda Gudigantalu Serial August 14 | రోహిణి మైండ్ గేమ్‌కు మనోజ్ పడిపోతాడా?
Sreesanth Open Challenge To Harbhajan Singh | భజ్జీకి శ్రీశాంత్ ఓపెన్ ఛాలెంజ్
Vindhya Vishaka in Bigg Boss 10 Telugu | బిగ్ బాస్ 10లో ఐపీఎల్ యాంకర్ వింధ్యా విశాఖ?
VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Chandrababu Naidu: అమరావతి అసైన్డ్‌ భూముల కేసులో కీలక పరిణామం! చంద్రబాబు, నారాయణకు భారీ ఊరట!
అమరావతి అసైన్డ్‌ భూముల కేసులో కీలక పరిణామం! చంద్రబాబు, నారాయణకు భారీ ఊరట!
Komatireddy Rajgopal Reddy vs Mahesh Kumar Goud: తెలంగాణ కాంగ్రెస్‌లో రాజగోపాల్ రెడ్డి కామెంట్స్ రచ్చ! పీసీసీ చీఫ్‌ సీరియస్ వార్నింగ్!
తెలంగాణ కాంగ్రెస్‌లో రాజగోపాల్ రెడ్డి కామెంట్స్ రచ్చ! పీసీసీ చీఫ్‌ సీరియస్ వార్నింగ్!
Telangana Ration Card Security Features: తెలంగాణలో ఆగస్టు 15న ఆవిష్కరించే స్మార్ట్ రేషన్ కార్డు ఫీచర్స్ ఏంటీ?
తెలంగాణలో ఆగస్టు 15న ఆవిష్కరించే స్మార్ట్ రేషన్ కార్డు ఫీచర్స్ ఏంటీ?
Venkatesh: కల్నల్ వెంకట్ రెడ్డిగా వెంకటేష్... అనిల్ రావిపూడితో కొత్త సినిమాలో ఆయన ఫస్ట్ లుక్ చూశారా?
కల్నల్ వెంకట్ రెడ్డిగా వెంకటేష్... అనిల్ రావిపూడితో కొత్త సినిమాలో ఆయన ఫస్ట్ లుక్ చూశారా?
CJI-NALSAR వివాదంలో బీసీఐ వెనక్కి తగ్గడానికి కారణమేంటీ? జెన్‌జీ ఒత్తిడి ఫలితమేనా? 
CJI-NALSAR వివాదంలో బీసీఐ వెనక్కి తగ్గడానికి కారణమేంటీ? జెన్‌జీ ఒత్తిడి ఫలితమేనా? 
Prabhas Fauzi : బాహుబలి To ఫౌజీ - ఏడేళ్ల తర్వాత డీపీ మార్చిన డార్లింగ్... అసలు రీజన్ అదేనా?
బాహుబలి To ఫౌజీ - ఏడేళ్ల తర్వాత డీపీ మార్చిన డార్లింగ్... అసలు రీజన్ అదేనా?
TDP YSRCP Polavaram Credit War: పోలవరం నిధులపై టీడీపీ-వైఎస్‌ఆర్‌సీపీ క్రెడిట్ వార్! అసలు పోలవరం ఎప్పటికి పూర్తవుతుంది? రైతులకు నీళ్లు ఎప్పుడు అందుతాయి?
పోలవరం నిధులపై టీడీపీ-వైఎస్‌ఆర్‌సీపీ క్రెడిట్ వార్! అసలు పోలవరం ఎప్పటికి పూర్తవుతుంది? రైతులకు నీళ్లు ఎప్పుడు అందుతాయి?
Makutam Review - మకుటం రివ్యూ: దర్శకుడుగా విశాల్ మొదటి సినిమా హిట్టా? ఫట్టా?
మకుటం రివ్యూ: దర్శకుడుగా విశాల్ మొదటి సినిమా హిట్టా? ఫట్టా?
Embed widget