అన్వేషించండి

TG ICET Hall Tickets: తెలంగాణ ఐసెట్‌-2024 హాల్‌టికెట్లు విడుదల, పరీక్ష ఎప్పుడంటే?

TS ICET 2024 Admitcard: తెలంగాణ ఐసెట్ ప్రవేశ పరీక్ష హాల్‌టికెట్లను కాకతీయ యూనివర్సిటీ మే 31న విడుదల చేసింది. వెబ్‌సైట్‌లో ఐసెట్ హాల్‌టికెట్లను అందుబాటులో ఉంచింది.

TG ICET 2024 Halltickets Download: తెలంగాణలోని పీజీ కళాశాలల్లో ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించనున్న 'TS ICET 2024' ప్రవేశ పరీక్ష హాల్‌టికెట్లను తెలంగాణ ఉన్నత విద్యామండలి మే 31న విడుదల చేసింది. అధికారిక వెబ్‌సైట్‌లో ఐసెట్ హాల్‌టికెట్లను అందుబాటులో ఉంచింది. పరీక్ష కోసం దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు తమ రిజిస్ట్రేషన్ నెంబరు, పుట్టినతేది, క్వాలిఫైయింగ్ ఎగ్జామ్ హాల్‌టికెట్ నెంబరు వివరాలు నమోదుచేసి ఐసెట్ హాల్‌టికెట్లు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఈ ఏడాది వరంగల్‌లోని కాకతీయ విశ్వవిద్యాలయం ఐసెట్ నిర్వహణ బాధ్యతను చేపట్టిన సంగతి తెలిసిందే.

ప్రకటించిన షెడ్యూలు ప్రకారం జూన్ 5, 6 తేదీల్లో  టీఎస్ ఐసెట్-2023 పరీక్ష నిర్వహించనున్నారు. జూన్ 5, 6 తేదీల్లో ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు మొదటి సెషన్‌లో, మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు రెండో సెషన్‌లో ఆన్‌లైన్ విధానంలో ఐసెట్ పరీక్ష నిర్వహిస్తారు. జూన్ 15న ప్రాథమిక కీ విడుదల చేయనున్నారు. ఒకవేళ ఆన్సర్ కీపై ఏమైనా అభ్యంతరాలుంటే జూన్ 16 నుంచి 19న సాయంత్రం 5 గంటల వరకు అభ్యంతరాలను స్వీకరిస్తారు. జూన్ 28న ఫైనల్ కీతో పాటు ఫలితాలను విడుదల చేయనున్నారు.

TG ICET 2024 హాల్‌టికెట్లు ఇలా డౌన్‌లోడ్ చేసుకోండి..

➥ తెలంగాణ ఐసెట్ పరీక్ష హాల్‌టికెట్ల కోసం అభ్యర్థులు మొదటగా అధికారిక వెబ్‌సైట్‌లోకి వెళ్లాలి- https://icet.tsche.ac.in/TSICET_HomePage.aspx

➥ అక్కడ హోంపేజీలో కింది భాగంలో కనిపించే  Download HallTicket లింక్ మీద క్లిక్ చేయాలి. 

➥ ఆ తర్వాత వచ్చే పేజీలో అభ్యర్థులు తమ రిజిస్ట్రేషన్ నెంబరు, పుట్టినతేది, క్వాలిఫైయింగ్ ఎగ్జామ్ హాల్‌టికెట్ నెంబరు వివరాలు నమోదు చేయాలి.

➥ ఐసెట్ హాల్‌టికెట్లు కంప్యూటర్ స్క్రీన్ మీద కనిపిస్తాయి.

➥ అభ్యర్థుల హాల్‌టికెట్ డౌన్‌లోడ్ చేసుకొని, ప్రింట్ తీసుకోవాలి. పరీక్ష రోజు తప్పనిసరిగా హాల్‌టికెట్ వెంటతీసుకెళ్లాలి. 

DOWNLOAD TG ICET - 2024 Halltickets..

పరీక్ష విధానం..
మొత్తం 200 మార్కులకు ఐసెట్ 2024 కంప్యూటర్ ఆధారిత ప్రవేశ పరీక్ష నిర్వహిస్తారు. పరీక్షలో మొత్తం 200 ప్రశ్నలు ఉంటాయి. ఒక్కో ప్రశ్నకు ఒకమార్కు. పరీక్ష సమయం 150 నిమిషాలు. పరీక్షలో మొత్తం మూడు సెక్షన్లు (సెక్షన్-ఎ, బి, సి) ఉంటాయి. వీటిలో సెక్షన్-ఎ: అనలిటికల్ ఎబిలిటీ-75 ప్రశ్నలు-75 మార్కులు, సెక్షన్-బి: మ్యాథమెటికల్ ఎబిలిటీ-75 ప్రశ్నలు-75 మార్కులు, సెక్షన్-సి: కమ్యూనికేషన్  ఎబిలిటీ-50 ప్రశ్నలు-50 మార్కులు ఉంటాయి. పరీక్షలో నెగెటివ్ మార్కులు ఉండవు.

పరీక్ష సిలబస్ వివరాల కోసం క్లిక్ చేయండి..

 అర్హత మార్కులు..
ఐసెట్ పరీక్షలో కనీస అర్హత మార్కులను 25 శాతంగా నిర్ణయించారు. అంటే 200 మార్కులకుగాను 50 మార్కులను అర్హతగా నిర్ణయించారు. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఎలాంటి అర్హత మార్కులు లేవు.  

పరీక్ష కేంద్రాలు: హైదరాబాద్, నల్గొండ, కోదాడ, ఖమ్మం, బద్రాద్రి కొత్తగూడెం, సత్తుపల్లి, కరీంగనర్, మహబూబ్ నగర్, సంగారెడ్డి, ఆదిలాబాద్, నిజామాబాద్, వరంగల్, నర్సంపేట, కర్నూలు, విజయవాడ, తిరుపతి, విశాఖపట్నం.

టీఎస్ ఐసెట్‌ ముఖ్యమైన తేదీలు..

➥ టీఎస్ ఐసెట్‌-2024 నోటిఫికేష‌న్‌: 05.03.2024. 

➥ ఆన్‌లైన్ ద‌ర‌ఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 07.03.2024.   

➥ ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరితేది: 30.04.2024. 

➥ రూ.250 ఆల‌స్య రుసుముతో దరఖాస్తుకు చివరితేది: 17.05.2024.

➥ రూ.500 ఆల‌స్య రుసుముతో దరఖాస్తుకు చివరితేది: 27.05.2024.

➥ దరఖాస్తుల సవరణ: 17.05.2024 - 20.05.2024. 

➥ హాల్‌టికెట్ డౌన్‌లోడ్: 28.05.2024 నుంచి. 

ఐసెట్ పరీక్ష తేది: 04.06.2024, 05.06.2024 (కంప్యూట‌ర్ బేస్డ్ విధానంలో).
సమయం: సెషన్-1: 10.00 A.M. to 12.30 P.M, సెషన్-2: 2.30 P.M. to 5.00 P.M, సెషన్-2: 10.00 A.M. to 12.30 P.M.

➥ ఐసెట్ ప్రాథమిక కీ: 15.06.2024.

➥ ప్రాథమిక కీపై అభ్యంతరాల స్వీకరణ: 16.06.2024 - 19.06.2024 మధ్య

➥ ఐసెట్ ఫలితాల వెల్లడి: 28.06.2024. 

Notification

మరిన్ని విద్యాసంబంధ వార్తల కోసం క్లిక్ చేయండి..

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Nara Lokesh: డిజిటల్ గవర్నెన్స్‌కు సహకరించండి- అమెజాన్‌ను కోరిన లోకేష్‌   
డిజిటల్ గవర్నెన్స్‌కు సహకరించండి- అమెజాన్‌ను కోరిన లోకేష్‌   
Hyderabad News: మోకిల పోలీస్ స్టేషన్‌కు వచ్చిన రాజ్‌ పాకాల- జన్వాడ ఫామ్‌ హౌస్‌ కేసులో విచారణకు హాజరు
మోకిల పోలీస్ స్టేషన్‌కు వచ్చిన రాజ్‌ పాకాల- జన్వాడ ఫామ్‌ హౌస్‌ కేసులో విచారణకు హాజరు
Best Car Under Rs 8 Lakh: రూ.8 లక్షల్లో బెస్ట్ కారు ఇదే - మంచి మైలేజీ, సూపర్ సేఫ్టీ!
రూ.8 లక్షల్లో బెస్ట్ కారు ఇదే - మంచి మైలేజీ, సూపర్ సేఫ్టీ!
Telangana Congress: బీఆర్ఎస్‌పై దీపావళి బాంబులు పేల్చనున్న కాంగ్రెస్ - కీలక అరెస్టులకు గవర్నర్ అనుమతి వచ్చేసిందా ?
బీఆర్ఎస్‌పై దీపావళి బాంబులు పేల్చనున్న కాంగ్రెస్ - కీలక అరెస్టులకు గవర్నర్ అనుమతి వచ్చేసిందా ?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

వివాదంలో సాయి పల్లవి, పాత వీడియో తీసి విపరీతంగా ట్రోల్రతన్‌ టాటా వీలునామాలో శంతను పేరు, ఏమిచ్చారంటే?మహేశ్ రాజమౌళి సినిమాకు సంబంధించి కొత్త అప్డేట్ | ABP DesamNara Lokesh Met Satya Nadella | మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్యనాదెళ్లతో లోకేశ్ భేటీ | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Nara Lokesh: డిజిటల్ గవర్నెన్స్‌కు సహకరించండి- అమెజాన్‌ను కోరిన లోకేష్‌   
డిజిటల్ గవర్నెన్స్‌కు సహకరించండి- అమెజాన్‌ను కోరిన లోకేష్‌   
Hyderabad News: మోకిల పోలీస్ స్టేషన్‌కు వచ్చిన రాజ్‌ పాకాల- జన్వాడ ఫామ్‌ హౌస్‌ కేసులో విచారణకు హాజరు
మోకిల పోలీస్ స్టేషన్‌కు వచ్చిన రాజ్‌ పాకాల- జన్వాడ ఫామ్‌ హౌస్‌ కేసులో విచారణకు హాజరు
Best Car Under Rs 8 Lakh: రూ.8 లక్షల్లో బెస్ట్ కారు ఇదే - మంచి మైలేజీ, సూపర్ సేఫ్టీ!
రూ.8 లక్షల్లో బెస్ట్ కారు ఇదే - మంచి మైలేజీ, సూపర్ సేఫ్టీ!
Telangana Congress: బీఆర్ఎస్‌పై దీపావళి బాంబులు పేల్చనున్న కాంగ్రెస్ - కీలక అరెస్టులకు గవర్నర్ అనుమతి వచ్చేసిందా ?
బీఆర్ఎస్‌పై దీపావళి బాంబులు పేల్చనున్న కాంగ్రెస్ - కీలక అరెస్టులకు గవర్నర్ అనుమతి వచ్చేసిందా ?
YS family property dispute: విజయమ్మ బహిరంగలేఖతో జగన్‌కు చిక్కులు - ఆస్తుల వివాదం మరింత ముదరడం ఖాయమేనా ?
విజయమ్మ బహిరంగలేఖతో జగన్‌కు చిక్కులు - ఆస్తుల వివాదం మరింత ముదరడం ఖాయమేనా ?
Kaleshwaram Case: కాళేశ్వరం కేసు కేసీఆర్ దగ్గరకు - నేడో రేపో పీసీ ఘోష్ కమిషన్ నోటీసులు ?
కాళేశ్వరం కేసు కేసీఆర్ దగ్గరకు - నేడో రేపో పీసీ ఘోష్ కమిషన్ నోటీసులు ?
Kiran Abbavaram: ‘క‘ బాగాలేదనిపిస్తే సినిమాలు వదిలేస్తా... ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో కిరణ్ అబ్బవరం ఎమోషనల్ స్పీచ్
‘క‘ బాగాలేదనిపిస్తే సినిమాలు వదిలేస్తా... ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో కిరణ్ అబ్బవరం ఎమోషనల్ స్పీచ్
iMac 24 inch 2024: కొత్త ఐమ్యాక్ 24 లాంచ్ చేసిన యాపిల్ - ప్రొఫెషనల్స్‌కి ఇది పర్ఫెక్ట్ ఛాయిస్!
కొత్త ఐమ్యాక్ 24 లాంచ్ చేసిన యాపిల్ - ప్రొఫెషనల్స్‌కి ఇది పర్ఫెక్ట్ ఛాయిస్!
Embed widget