By: ABP Desam | Updated at : 07 Sep 2021 06:19 PM (IST)
ప్రతీకాత్మక చిత్రం
దేశవ్యాప్తంగా వైద్య విద్య ప్రవేశాలకు నిర్వహించే నేషనల్ ఎలిజిబులిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ (నీట్) యూజీ 2021 పరీక్షలను వాయిదా వేయాలని విద్యార్థులు కోరుతున్నారు. నీట్ యూజీ పరీక్షను వాయిదా వేయబోమన్న సుప్రీంకోర్టు తీర్పుకు వ్యతిరేకంగా విద్యార్థులు గళం విప్పారు. పరీక్షను వాయిదా వేసి, తమకు న్యాయం చేయాలని కోరుతూ.. ట్వీట్లు చేస్తున్నారు. వీరికి కాంగ్రెస్ పార్టీ సైతం మద్దతిస్తోంది.
విద్యార్థుల పోస్టులతో జస్టిస్ ఫర్ నీట్ యాస్పిరెంట్స్ (#JusticeForNEETAspirants) అనే హ్యాష్ ట్యాగ్ ట్విట్టర్లో మొదటి స్థానంలో ట్రెండ్ అవుతోంది. విద్యార్థులకు మద్దతిస్తూ.. కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ, కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ ప్రియాంకా గాంధీ ట్వీట్ చేశారు. విద్యార్థుల భవిష్యత్ తో చెలగాటం తగదని అభిప్రాయపడ్డారు. నీట్ యూజీ పరీక్షలను వాయిదా వేయాలని డిమాండ్ చేశారు.
రాహుల్ గాంధీ ట్వీట్..
GOI is blind to students’ distress.
— Rahul Gandhi (@RahulGandhi) September 7, 2021
Postpone #NEET exam. Let them have a fair chance.
కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ ప్రియాంకా గాంధీ ట్వీట్
Time after time the government pushes on against the legitimate demands of students across India. Why is it so hard for those in power to hear out and help those who are the future of our nation? Does their mental health and well being not matter?#JusticeForNEETAspirants
— Priyanka Gandhi Vadra (@priyankagandhi) September 7, 2021
కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ ట్వీట్
I am inundated w/ messages from NEET aspirants asking for their exams to be rescheduled &for more exam centres to be allocated whenn they are. Subjecting them to unreasonable exactions is shameful. It's time the BJP worked for people, not for bureaucrats!#JusticeForNEETAspirants
— Shashi Tharoor (@ShashiTharoor) September 7, 2021
సుప్రీంకోర్టు ఏం చెప్పింది?
నీట్ యూజీ పరీక్ష ఈ నెల 12న జరగాల్సి ఉంది. దీని ద్వారా దేశవ్యాప్తంగా ఉన్న మెడికల్ కాలేజీలలో ప్రవేశాలు కల్పిస్తారు. ఈ పరీక్షను వాయిదా వేయాలని పలువురు విద్యార్థులు సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. నీట్ యూజీ పరీక్ష జరిగే రోజునే ఇతర ముఖ్యమైన పరీక్షలు ఉండటంతో ఈ పరీక్షను వాయిదా చేయాలని సుప్రీంకోర్టును కోరారు. వీటిపై విచారణ జరిపిన ధర్మాసనం.. పరీక్షల రద్దు లేదా రీ షెడ్యూల్ చేయడం కుదరదని స్పష్టం చేసింది. ఈ పిటిషన్లను విచారణకు స్వీకరించలేమని జస్టిస్ ఏఎం ఖాన్విల్కర్ నేతృత్వంలోని ధర్మాసనం పేర్కొంది.
కేవలం ఒక్క శాతం మంది విద్యార్థులు మాత్రమే పరీక్ష వాయిదా వేయాలని కోరుతున్నారని.. వీరి కోసం మిగతా 99 శాతం మందికి అసౌకర్యం కల్పించలేమని తెలిపింది. ఒకటి కంటే ఎక్కువ పరీక్షలు ఒకే రోజు షెడ్యూల్ అయితే వాటిలో ఏది ముఖ్యమో అదే ఎంచుకోవాలని సూచించింది. బోర్డులు పరీక్షల నిర్వహణకు ఏర్పాట్లు చేసుకుంటాయని, అందులో తాము జోక్యం చేసుకోవడం లేదని స్పష్టం చేసింది.
Also Read: AP EAPCET Result 2021: రేపే ఈఏపీసెట్ ఫలితాలు.. 18 నుంచి మొదటి విడత కౌన్సెలింగ్!
Also Read: Career Guidance: 2021లో డిమాండ్ ఉన్న 5 కోర్సులు ఇవే.. వీటిలో మీకేం కావాలో ఎంచుకోండి..
UGC NET 2023: యూజీసీనెట్ సిటీ ఇంటిమేషన్ స్లిప్స్ వచ్చేశాయ్, పరీక్ష ఎప్పుడంటే?
Merit Scholarship: వెబ్‌సైట్‌లో నేషనల్ మీన్స్ కమ్ మెరిట్ స్కాలర్‌షిప్ పరీక్ష హాల్‌టికెట్లు, ఎగ్జామ్ ఎప్పుడంటే?
TS Polytechnic Syllabus: పాలిటెక్నిక్ కోర్సుల్లో సరికొత్త సిలబస్, వచ్చే విద్యాసంవత్సరం నుంచే అమల్లోకి
CBSE: సీబీఎస్‌ఈ 10, 12వ తరగతి ఫలితాల్లో మార్కులపై బోర్డు కీలక నిర్ణయం, ఇకపై అవి ఉండవు
LAWCET: లాసెట్ సీట్ల కేటాయింపు, తొలి విడతలో 5912 మందికి ప్రవేశాలు
Supritha Congratulates Revanth Reddy: రేవంత్ రెడ్డికి కంగ్రాట్స్ - ప్లేట్ తిప్పేసిన సురేఖా వాణి కుమార్తె!
Dil Raju : 'యానిమల్' లాంటి సినిమాల్ని మేమూ తీస్తాం - ‘గేమ్ ఛేంజర్’ 90 శాతం పూర్తయింది : దిల్ రాజు
Best Browser: మైక్రోసాఫ్ట్ ఎడ్జ్ వర్సెస్ గూగుల్ క్రోమ్ - ఈ మూడు విషయాల్లో ‘ఎడ్జ్’నే బెస్ట్!
Yash 19: కొత్త సినిమాపై హింట్ ఇచ్చిన రాకీ భాయ్ - ఫ్యాన్స్‌కు పూనకాలే
/body>