అన్వేషించండి

JIPMAT 2023: ఇంటర్ అర్హతతో ఎంబీఏ ప్రవేశానికి 'జిప్‌మ్యాట్‌' మార్గం, నోటిఫికేషన్ విడుదల!

ఐఐఎం బోధ్‌గయ, ఐఐఎం జమ్మూ ఉమ్మడిగా అందిస్తున్న ఐపీఎం కోర్సులో ప్రవేశాలకు జిప్‌మ్యాట్- 2023 నోటిఫికేషన్‌‌ను నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ విడుదల చేసింది. ఇంటర్ అర్హతతో ఐదేళ్ల కోర్సులో ప్రవేశాలు పొందవచ్చు.

ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ (ఐఐఎం) బోధ్‌గయ, ఐఐఎం జమ్మూ ఉమ్మడిగా అందిస్తున్న 'ఇంటిగ్రేటెడ్‌ ప్రోగ్రాం ఇన్‌ మేనేజ్‌మెంట్‌(ఐపీఎం)లో ప్రవేశాలకు సంబంధించి జాయింట్ ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రామ్ ఇన్ మేనేజ్‌మెంట్ అడ్మిషన్ టెస్ట్ (జిప్‌మ్యాట్) - 2023 నోటిఫికేషన్‌‌ను నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ విడుదల చేసింది. ఇంటర్ అర్హతతో ప్రవేశ పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులు ఐదేళ్ల ఇంటిగ్రేడెట్ ఎంబీఏ కోర్సులో చేరవచ్చు. 

వివరాలు..

* జాయింట్ ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రామ్ ఇన్ మేనేజ్‌మెంట్ అడ్మిషన్ టెస్ట్ (జిప్‌మ్యాట్‌) – 2023

సీట్ల సంఖ్య: 120.

కోర్సు వ్యవధి: అయిదేళ్లు.

బోధనాంశాలు: లాంగ్వేజ్‌ స్కిల్స్‌, ఓరల్‌ కమ్యూనికేషన్‌ స్కిల్స్‌, మేనేజ్‌మెంట్‌ స్టడీస్‌, ఎథికల్‌ అండర్‌స్టాండిగ్‌, ఫిజికల్ వెల్ బీయింగ్.

అర్హత: 60 శాతం మార్కులతో ఇంటర్మీడియట్‌ (ఆర్ట్స్/కామర్స్/సైన్స్ గ్రూప్‌) ఉత్తీర్ణులై ఉండాలి. 2021, 2022 సంవత్సరాల్లో లేదా 2023 చివరి సంవత్సరం పరీక్షలు రాసిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు.

దరఖాస్తు ఫీజు: జనరల్/ ఓబీసీ(ఎన్‌సీఎల్‌) రూ.2000; జనరల్‌(ఈడబ్ల్యూఎస్‌)/ ఎస్సీ/ ఎస్టీ/ దివ్యాంగులకు రూ.1000; ట్రాన్స్‌జెండర్‌ అభ్యర్థులకు రూ.1000.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.

ఎంపిక విధానం: ప్రవేశ పరీక్ష ఆధారంగా సీటు కేటాయిస్తారు.

పరీక్ష విధానం: మొత్తం 400 మార్కులకు ప్రవేశ పరీక్ష నిర్వహిస్తారు. పరీక్షలో మొత్తం 100 పశ్నలు ఉంటాయి. వీటిలో క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ నుంచి 33 ప్రశ్నలు-132 మార్కులు, డేటా ఇంటర్‌ప్రిటేషన్ & లాజికల్ రీజనింగ్ నుంచి 33 ప్రశ్నలు-132 మార్కులు, వెర్బల్ ఎబిలిటీ & రీడింగ్ కాంప్రహెన్షన్ నుంచి 34 ప్రశ్నలు-136 మార్కులు ఉంటాయి. ఒక్కో ప్రశ్నకు 4 మార్కులు ఇస్తారు.

ముఖ్యమైన తేదీలు..

➥ ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 06.04.2023.

➥ ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 30.04.2023. (11.50 P.M.)

➥ దరఖాస్తు సవరణ తేదీలు: 02.05.2023 నుంచి 04.05.2023.

➥ పరీక్ష తేదీ: 28.05.2023.

Public Notice
Notification
Online Application

Website

                                   

Also Read:

ఇంటర్‌ అర్హతతో ఎంబీఏ, ప్రవేశ ప్రకటన విడుదల చేసిన ఇండోర్ ఐఐఎం!
ఇండోర్‌లోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ (ఐఐఎం) ఐదేళ్ల 'ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రాం ఇన్ మేనేజ్‌మెంట్(ఐపీఎం)' కోర్సులో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇంటర్ అర్హత ఉన్నవారు ఈ కోర్సుకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. ప్రస్తుతం ఇంటర్ సెకండియర్ చదువుతున్నవారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. రాతపరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా ప్రవేశాలు కల్పిస్తారు. కోర్సులో ప్రధానంగా రెండు భాగాలు ఉంటాయి. మొదటి మూడేళ్లు ఫౌండేషన్, తర్వాత రెండేళ్లు మేనేజ్‌మెంట్ విద్యపై దృష్టి సారిస్తారు. తొలి భాగంలో భాష, భావవ్యక్తీకరణ నైపుణ్యాలు; మేనేజ్‌మెంట్ విద్య ప్రాథమికాంశాలు, నైతిక విలువలు అర్థం చేసుకునే నైపుణ్యం, శారీరక ఆరోగ్యంపై దృష్టి సారిస్తారు. చివరి రెండేళ్లు లక్ష్యం దిశగా బోధన ఉంటుంది.
ప్రవేశపరీక్ష, ఇతర వివరాల కోసం క్లిక్ చేయండి.. 

వచ్చే ఏడాది నుంచి సాధారణ డిగ్రీలో మార్పులు, డిగ్రీతోపాటు ఆనర్స్ డిగ్రీ చేయొచ్చు!
తెలంగాణ ఉన్నత విద్యామండలి డిగ్రీ విద్యలో మార్పులకు శ్రీకారం చుట్టబోతుంది. ఒకేసారి రెండు డిగ్రీలను పూర్తి చేసేందుకు యూజీసీ వెసులుబాటు కల్పించిన నేపథ్యంలో వచ్చే విద్యా సంవత్సరం నుంచి సాధారణ డిగ్రీలో ఒక పక్క ఆనర్స్, మరో పక్క ఒకే సబ్జెక్టు ప్రాధాన్య కోర్సును తీసుకురానున్నారు. 2020-21లో ప్రవేశపెట్టిన ఆనర్స్‌ డిగ్రీకి సంబంధించి నాలుగో ఏడాది సిలబస్‌ను ఖరారు చేశారు. దీంతోపాటు ఇప్పటివరకు మూడు సబ్జెక్టుల ప్రాధాన్యంగా ఉన్న డిగ్రీని ఒక సబ్జెక్టు విధానానికి మార్చుతున్నారు. యూజీసీ, జాతీయ విద్యా విధానం సూచనల ప్రకారం ఉన్నత విద్యామండలి ఈ మార్పులు చేస్తోంది. 
పూర్తివివరాల కోసం క్లిక్ చేయండి..

మరిన్ని విద్యాసంబంధ వార్తల కోసం క్లిక్ చేయండి..

టాప్ హెడ్ లైన్స్

BAN Defeats AUS In 1st Test: ఆస్ట్రేలియా గడ్డపై బంగ్లాదేశ్ చారిత్రాత్మ‌క‌ టెస్ట్ విక్టరీ.. 9 వికెట్ల‌తో కంగారులపై ఘ‌న విజ‌యం.. ఆసియా ఆవ‌త‌ల అతిపెద్ద గెలుపు, సిరీస్ పై క‌న్ను!
ఆస్ట్రేలియా గడ్డపై బంగ్లాదేశ్ చారిత్రాత్మ‌క‌ టెస్ట్ విక్టరీ.. 9 వికెట్ల‌తో కంగారులపై ఘ‌న విజ‌యం.. ఆసియా ఆవ‌త‌ల అతిపెద్ద గెలుపు, సిరీస్ పై క‌న్ను!
Tirumala Viral Video: తిరుమల అలిపిరి మెట్ల మార్గంలో దర్జాగా స్మోకింగ్ చేసిన వ్యక్తి.. భక్తులు ఆగ్రహం
తిరుమల అలిపిరి మెట్ల మార్గంలో దర్జాగా స్మోకింగ్ చేసిన వ్యక్తి.. భక్తులు ఆగ్రహం
TTD Online Booking: తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్.. నవంబర్ నెల దర్శన కోటా విడుదల షెడ్యూల్
తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్.. నవంబర్ నెల దర్శన కోటా విడుదల షెడ్యూల్
భారత్‌లో చిన్న కార్ల టైమ్‌ వచ్చిందా? మిడ్‌సైజ్‌ SUVల జోరు తగ్గుతుందా?
SUVల హవాకు చెక్.. ఇక చిన్న కార్లదే జోరు, ట్రెండ్‌ మారుతోందా?

వీడియోలు

Bindu Madhavi Reacts to Uppal Balu Controversy | ఉప్పల్ బాలు vs బిందు మాధవి
Devdutt Padikkal Historic Test Century | స్వతంత్ర దినోత్సవం రోజు పడిక్కల్ సెంచరీ
Devdutt Padikkal Century vs Sri Lanka | శ్రీలంకపై దేవదత్ పడిక్కల్ సూప‌ర్ సెంచ‌రీ
KL Rahul Retired Hurt Near Century | సెంచరీకి చేరువలో కేఎల్ రాహుల్ రిటైర్డ్ హర్ట్
IND Spin Attack Strategy vs SL Revealed | గాలే టెస్టులో ముగ్గురు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్లు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
BAN Defeats AUS In 1st Test: ఆస్ట్రేలియా గడ్డపై బంగ్లాదేశ్ చారిత్రాత్మ‌క‌ టెస్ట్ విక్టరీ.. 9 వికెట్ల‌తో కంగారులపై ఘ‌న విజ‌యం.. ఆసియా ఆవ‌త‌ల అతిపెద్ద గెలుపు, సిరీస్ పై క‌న్ను!
ఆస్ట్రేలియా గడ్డపై బంగ్లాదేశ్ చారిత్రాత్మ‌క‌ టెస్ట్ విక్టరీ.. 9 వికెట్ల‌తో కంగారులపై ఘ‌న విజ‌యం.. ఆసియా ఆవ‌త‌ల అతిపెద్ద గెలుపు, సిరీస్ పై క‌న్ను!
Tirumala Viral Video: తిరుమల అలిపిరి మెట్ల మార్గంలో దర్జాగా స్మోకింగ్ చేసిన వ్యక్తి.. భక్తులు ఆగ్రహం
తిరుమల అలిపిరి మెట్ల మార్గంలో దర్జాగా స్మోకింగ్ చేసిన వ్యక్తి.. భక్తులు ఆగ్రహం
TTD Online Booking: తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్.. నవంబర్ నెల దర్శన కోటా విడుదల షెడ్యూల్
తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్.. నవంబర్ నెల దర్శన కోటా విడుదల షెడ్యూల్
భారత్‌లో చిన్న కార్ల టైమ్‌ వచ్చిందా? మిడ్‌సైజ్‌ SUVల జోరు తగ్గుతుందా?
SUVల హవాకు చెక్.. ఇక చిన్న కార్లదే జోరు, ట్రెండ్‌ మారుతోందా?
రూ.19.45 లక్షల నుంచి మహీంద్రా BE 6 Sporteq.. మీ అవసరానికి సరిపోయే వేరియంట్‌ ఇదే!
మహీంద్రా BE 6 Sporteqలో ఏ వేరియంట్‌ బెస్ట్? ధర, బ్యాటరీ, ఫీచర్ల పూర్తి వివరాలు!
Indiramma Housing Scheme: ఇందిరమ్మ ఇళ్ల దరఖాస్తుల గడువు పూర్తి.. లబ్ధిదారుల ఎంపిక ఎప్పుడంటే
ఇందిరమ్మ ఇళ్ల దరఖాస్తుల గడువు పూర్తి.. లబ్ధిదారుల ఎంపిక ఎప్పుడంటే
RRB JE Posts 2026: రైల్వేలో 3,993 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్.. ముఖ్యమైన తేదీలు, అభ్యర్థుల అర్హతలు
RRB JE Posts: రైల్వేలో 3,993 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్.. ముఖ్యమైన తేదీలు, అభ్యర్థుల అర్హతలు
Deputy CM Pawan Kalyan: పవన్ కళ్యాణ్‌కు అస్వస్థత.. డాక్టర్ల సూచన మేరకు హైదరాబాద్‌కు ఏపీ డిప్యూటీ సీఎం
పవన్ కళ్యాణ్‌కు అస్వస్థత.. డాక్టర్ల సూచన మేరకు హైదరాబాద్‌కు ఏపీ డిప్యూటీ సీఎం
Embed widget