అన్వేషించండి

IPM Admissions: ఇంటర్‌ అర్హతతో ఎంబీఏ, ప్రవేశ ప్రకటన విడుదల చేసిన ఇండోర్ ఐఐఎం

ఇంటర్ అర్హత ఉన్నవారు ఈ కోర్సుకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. ప్రస్తుతం ఇంటర్ సెకండియర్ చదువుతున్నవారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. రాతపరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా ప్రవేశాలు కల్పిస్తారు.

ఇండోర్‌లోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ (ఐఐఎం) ఐదేళ్ల 'ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రాం ఇన్ మేనేజ్‌మెంట్(ఐపీఎం)' కోర్సులో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇంటర్ అర్హత ఉన్నవారు ఈ కోర్సుకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. ప్రస్తుతం ఇంటర్ సెకండియర్ చదువుతున్నవారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.

రాతపరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా ప్రవేశాలు కల్పిస్తారు. కోర్సులో ప్రధానంగా రెండు భాగాలు ఉంటాయి. మొదటి మూడేళ్లు ఫౌండేషన్, తర్వాత రెండేళ్లు మేనేజ్‌మెంట్ విద్యపై దృష్టి సారిస్తారు. తొలి భాగంలో భాష, భావవ్యక్తీకరణ నైపుణ్యాలు; మేనేజ్‌మెంట్ విద్య ప్రాథమికాంశాలు, నైతిక విలువలు అర్థం చేసుకునే నైపుణ్యం, శారీరక ఆరోగ్యంపై దృష్టి సారిస్తారు. చివరి రెండేళ్లు లక్ష్యం దిశగా బోధన ఉంటుంది.

Also Read: GATB-BET 2023: 'బయోటెక్నాలజీ'లో పీజీ, జేఆర్‌ఎఫ్ ప్రవేశాలకు నోటిఫికేషన్, పరీక్షలు ఎప్పుడంటే?

వివరాలు...

* ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రాం ఇన్ మేనేజ్‌మెంట్(ఐపీఎం) 

కోర్సు వ్యవధి: 5 సంవత్సరాలు.

సీట్ల సంఖ్య: 150.

అర్హత: 2021, 2022లో ఇంటర్మీడియట్ పూర్తిచేసుకున్నవారు, ప్రస్తుతం ద్వితీయ సంవత్సరం కోర్సులు చదువుతున్నవారు దరఖాస్తు చేసుకోవచ్చు. పదో తరగతి, ఇంటర్‌లో కనీసం 60 శాతం మార్కులు సాధించడం తప్పనిసరి. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులైతే 55 శాతం మార్కులు ఉండాలి.

వయసు: ఆగస్టు 1, 2003 తర్వాత జన్మించినవారే అర్హులు. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు ఆగస్టు 1, 1998 తర్వాత జన్మించినా దరఖాస్తు చేసుకోవచ్చు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.

ఎంపిక విధానం: ఆప్టిట్యూడ్ టెస్టు, పర్సనల్ ఇంటర్వ్యూ ఆధారంగా. పరీక్షకు 65 మార్కులు, ఇంటర్వ్యూకు 35 మార్కులు ఉంటాయి.

పరీక్ష విధానం: ఆప్టిట్యూడ్ పరీక్షలో మొత్తం మూడు సెక్షన్ల నుంచి 100 ప్రశ్నలు అడుగుతారు. వీటిలో క్వాంటిటేటివ్ ఎబిలిటి (మల్టిపుల్ ఛాయిస్) నుంచి 25 ప్రశ్నలు, క్వాంటిటేటివ్ ఎబిలిటి (షార్ట్ ఆన్సర్స్) నుంచి 25 ప్రశ్నలు వెర్బల్ ఎబిలిటి (మల్టిపుల్ ఛాయిస్) నుంచి 50 ప్రశ్నలు అడుగుతారు. ప్రతి ప్రశ్నకు 4 మార్కులు. పరీక్షలో నెగెటివ్ మార్కులు ఉంటాయి. ప్రతి తప్పు సమాధానానికి ఒక మార్కు కోత విధిస్తారు. అయితే షార్ట్ ఆన్సర్స్ ప్రశ్నలకు నెగెటివ్ మార్కులు లేవు. పరీక్ష సమయం 120 నిమిషాలు (2 గంటలు). ఒక్కో విభాగానికి 40 నిమిషాల సమయం కేటాయించారు. 

Also Read: 'సీఎంఐ'లో చదివితే లైఫ్ సెటిల్ అయినట్లే! ప్రవేశ ప్రకటన విడుదల!

కోర్సు, ఫీజు వివరాలు..

➥ ఐదేళ్ల ఐపీఎం కోర్సులో ఏడాదికి 3 చొప్పున మొత్తం 15 టర్మ్‌లు ఉంటాయి. ఒక్కో టర్మ్ వ్యవధి 3 నెలలు ఉంటుంది. 

➥ మొదటి మూడేళ్లు మ్యాథ్స్, స్టాటిస్టిక్స్, ఎకనామిక్స్, సైకాలజీ, సోషియాలజీ, పొలిటికల్ సైన్స్, హ్యుమానిటీస్, లిటరేచర్, ఫైన్ ఆర్ట్స్ సబ్జెక్టుల్లో మేనేజ్‌మెంట్‌కు సంబంధించిన అంశాలను బోధిస్తారు. 

➥ రెండేళ్ల కోర్సు అనంతరం సోషల్ ఇంటర్న్‌షిప్, నాలుగేళ్ల తర్వాత బిజినెస్ ఇంటర్న్‌షిప్ పూర్తిచేయాలి. 

➥ ఐదేళ్ల కోర్సు పూర్తిచేసుకున్నవారికి బ్యాచిలర్ ఆఫ్ ఆర్ట్స్(ఫౌండేషన్ ఆఫ్ మేనేజ్‌మెంట్), మాస్టర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ (ఎంబీఏ) డ్యూయల్ డిగ్రీలను ప్రదానం చేస్తారు. 

➥ కోర్సు ఫీజు, వసతి, ఇతర సౌకర్యాలు కలుపుకుని మొదటి మూడేళ్లు ఏడాదికి రూ.5 లక్షలు. చివరి రెండేళ్లు డిగ్రీ తర్వాత క్యాట్‌తో పీజీపీలో చేరినవారు చెల్లించే ఫీజును వసూలు చేస్తారు.

ముఖ్యమైన తేదీలు...

➥ ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 14.04.2023.

➥ పరీక్షతేది: 16.06.2023.

నోటిఫికేషన్ 

ఆన్‌లైన్ అప్లికేషన్

వెబ్‌సైట్

మరిన్ని విద్యాసంబంధ వార్తల కోసం క్లిక్ చేయండి..

ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

North Andhra Flash Floods: ఉత్తరాంధ్ర జిల్లాలకు ఫ్లాష్ ఫ్లడ్స్ ప్రమాదం - అప్రమత్తమయిన  ప్రభుత్వం
ఉత్తరాంధ్ర జిల్లాలకు ఫ్లాష్ ఫ్లడ్స్ ప్రమాదం - అప్రమత్తమయిన ప్రభుత్వం
Janasena Ram Talluri: జనసేన పార్టీలో కీలక మార్పు - నాగబాబు పదవి రామ్ తాళ్లూరికి - ఎం జరిగిందంటే ?
జనసేన పార్టీలో కీలక మార్పు - నాగబాబు పదవి రామ్ తాళ్లూరికి - ఎం జరిగిందంటే ?
Andhra Pradesh Weather: ఉత్తారంధ్ర అతలాకుతలం: తీరం వెంబడి కొనసాగుతున్న తీవ్ర వాయుగుండం ; జోరువానలు, ఈదురుగాలుల బీభత్సం
ఉత్తారంధ్ర అతలాకుతలం: తీరం వెంబడి కొనసాగుతున్న తీవ్ర వాయుగుండం ; జోరువానలు, ఈదురుగాలుల బీభత్సం
Pawan Kalyan: ఫ్యాన్ వార్స్‌లో సినిమాను చంపెయ్యొద్దు - మూవీ రివ్యూయర్స్‌, పైరసీలపై పవన్ స్ట్రాంగ్ కౌంటర్
ఫ్యాన్ వార్స్‌లో సినిమాను చంపెయ్యొద్దు - మూవీ రివ్యూయర్స్‌, పైరసీలపై పవన్ స్ట్రాంగ్ కౌంటర్
Advertisement

వీడియోలు

Rishabh Shetty Kantara chapter 1 review | కాంతార చాప్టర్ 1 రివ్యూ | ABP Desam
Ind vs WI Test Series |  వెస్టిండీస్ ను ఫామ్ లో లేదని తక్కువ అంచనా వేయొద్దు | ABP Desam
India vs West Indies Test Series | ప్రాక్టీస్‌ సెషన్‌కి హాజరుకాని టీమిండియా స్టార్ ప్లేయర్ల | ABP Desam
Ind vs Pak ICC ODI WC 2025 | అక్టోబర్ 5న ఇండియా, పాక్ వన్డే వరల్డ్ కప్ మ్యాచ్ | ABP Desam
Ind vs Pak ICC ODI WC 2025 | మరోసారి ఇండియా, పాక్ పోరు | ABP Desam
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement
ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
North Andhra Flash Floods: ఉత్తరాంధ్ర జిల్లాలకు ఫ్లాష్ ఫ్లడ్స్ ప్రమాదం - అప్రమత్తమయిన  ప్రభుత్వం
ఉత్తరాంధ్ర జిల్లాలకు ఫ్లాష్ ఫ్లడ్స్ ప్రమాదం - అప్రమత్తమయిన ప్రభుత్వం
Janasena Ram Talluri: జనసేన పార్టీలో కీలక మార్పు - నాగబాబు పదవి రామ్ తాళ్లూరికి - ఎం జరిగిందంటే ?
జనసేన పార్టీలో కీలక మార్పు - నాగబాబు పదవి రామ్ తాళ్లూరికి - ఎం జరిగిందంటే ?
Andhra Pradesh Weather: ఉత్తారంధ్ర అతలాకుతలం: తీరం వెంబడి కొనసాగుతున్న తీవ్ర వాయుగుండం ; జోరువానలు, ఈదురుగాలుల బీభత్సం
ఉత్తారంధ్ర అతలాకుతలం: తీరం వెంబడి కొనసాగుతున్న తీవ్ర వాయుగుండం ; జోరువానలు, ఈదురుగాలుల బీభత్సం
Pawan Kalyan: ఫ్యాన్ వార్స్‌లో సినిమాను చంపెయ్యొద్దు - మూవీ రివ్యూయర్స్‌, పైరసీలపై పవన్ స్ట్రాంగ్ కౌంటర్
ఫ్యాన్ వార్స్‌లో సినిమాను చంపెయ్యొద్దు - మూవీ రివ్యూయర్స్‌, పైరసీలపై పవన్ స్ట్రాంగ్ కౌంటర్
Raju Gari Gadhi 4 Update: 'రాజుగారి గది' తలుపులు ఓపెన్ - ఆరేళ్ల తర్వాత హారర్ థ్రిల్లర్‌కు సీక్వెల్...
'రాజుగారి గది' తలుపులు ఓపెన్ - ఆరేళ్ల తర్వాత హారర్ థ్రిల్లర్‌కు సీక్వెల్...
Scorpion Venom Price: లీటర్‌ తేలు విషం 120 కిలోల బంగారంతో సమానం; ఎందుకింత ఖరీదు?   
లీటర్‌ తేలు విషం 120 కిలోల బంగారంతో సమానం; ఎందుకింత ఖరీదు?   
Kantara Chapter 1 OTT: 'కాంతార చాప్టర్ 1' ఓటీటీ పార్ట్‌నర్ ఫిక్స్ - ఓటీటీ ఆడియన్స్ కాస్త వెయిట్ చేయాల్సిందే!
'కాంతార చాప్టర్ 1' ఓటీటీ పార్ట్‌నర్ ఫిక్స్ - ఓటీటీ ఆడియన్స్ కాస్త వెయిట్ చేయాల్సిందే!
Nani Sujeeth Movie: నేచరల్ స్టార్ నానితో 'OG' డైరెక్టర్ సుజిత్ మూవీ స్టార్ట్ - సిల్వర్ స్క్రీన్ ఆన్ ఫైర్
నేచరల్ స్టార్ నానితో 'OG' డైరెక్టర్ సుజిత్ మూవీ స్టార్ట్ - సిల్వర్ స్క్రీన్ ఆన్ ఫైర్
Embed widget