అన్వేషించండి

'సీఎంఐ'లో చదివితే లైఫ్ సెటిల్ అయినట్లే! ప్రవేశ ప్రకటన విడుదల!

చెన్నై మ్యాథమెటికల్ ఇన్‌స్టిట్యూట్(సీఎంఐ) మ్యాథ్స్, ఫిజిక్స్, కంప్యూటర్ సైన్స్‌ విభాగాల్లో బీఎస్సీ, ఎంఎస్సీ, ఎంఎస్సీ(డేటా సైన్స్), పీహెచ్‌డీ కోర్సుల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల చేసింది.

చెన్నై మ్యాథమెటికల్ ఇన్‌స్టిట్యూట్(సీఎంఐ) మ్యాథ్స్, ఫిజిక్స్, కంప్యూటర్ సైన్స్‌ విభాగాల్లో బీఎస్సీ, ఎంఎస్సీ, ఎంఎస్సీ(డేటా సైన్స్), పీహెచ్‌డీ కోర్సుల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల చేసింది. పరీక్ష ఆధారంగా సంబంధిత కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తారు. సీట్లు పొందిన పేద విద్యార్థులకు ఫీజు మినహాయింపుతోపాటు, ప్రతిభావంతులకు స్టైపెండ్ కూడా అందజేస్తారు. మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కంప్యూటర్ సైన్స్, డేటా సైన్స్ కోర్సుల్లో చేరాలనుకున్నవారు, పరిశోధనల దిశగా అడుగులేయాలనుకున్నవారు సీఎంఐలో చేరితే మంచి అవకాశాలు ఉంటాయి. దేశంలోని టాప్ యూనివర్సిటీలకు చెందినవారితోపాటు, విదేశాల నుంచి ప్రొఫెసర్లు వచ్చి సీఎంఐ విద్యార్థులకు పాఠాలు బోధిస్తారు.

ఇన్ఫోసిస్, టీసీఎస్, మైక్రోసాఫ్ట్, తదితర కార్పొరేట్ సంస్థలతోపాటు కేంద్ర ప్రభుత్వ పరిధిలోని డిపార్ట్‌మెంట్ ఆఫ్ అటామిక్ ఎనర్జీ, డిపార్ట్‌మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ దీనికి నిధులు సమకూరుస్తున్నాయి. యూజీసీ 2006లో ఈ సంస్థకు యూనివర్సిటీ హోదా ఇచ్చింది. ఇక్కడి విద్యార్థులు దేశీయంగానే కాకుండా ప్రపంచ స్థాయి సంస్థల్లో బోధన, పరిశోధనలో గొప్ప అవకాశాలు సొంతం చేసుకుంటున్నారు. గతేడాది ప్రాంగణ నియామకాల్లో గరిష్ఠంగా రూ.62 లక్షల ప్యాకేజీ లభించింది. సగటున రూ.16 లక్షల వార్షిక వేతనం సీఎంఐలో చదువుకున్నవారు పొందుతున్నారు. ఇంటర్న్‌షిప్స్‌లో రూ.80వేల వరకు స్టైపెండ్ అందుతోంది. 

ఫీజు, ఫెలోషిప్స్ ఇలా..
రెసిడెన్షియల్ విధానంలోనే ఇక్కడ కోర్సులు అందిస్తున్నారు. అన్ని కోర్సులకు ట్యూషన్ ఫీజు ప్రతి సెమిస్టర్‌కు రూ.1.25 లక్షలు చెల్లించాలి. ఎంఎస్సీ డేటా సైన్స్‌కు అధికంగా రూ.2.5 లక్షల ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. విద్యార్థుల ఆర్థిక నేపథ్యం బట్టి అన్ని కోర్సుల్లోనూ పూర్తిగా లేదా పాక్షికంగా ఫీజు మినహాయింపు లభిస్తుంది. అలాగే ప్రతిభావంతులకు యూజీ కోర్సులకు ప్రతి నెలా రూ.5000 ఫెలోషిప్ చెల్లిస్తారు. ఎమ్మెస్సీ కోర్సులైతే రూ.6000 అందిస్తారు. పీహెచ్‌డీలకు మొదటి రెండేళ్లూ నెలకు రూ.31,000 తర్వాత మూడేళ్లు రూ.35,000 చెల్లిస్తారు. పీహెచ్‌డీలో చేరి, ప్రాంగణంలో వసతి సౌకర్యం పొందనివారు స్టైపెండ్‌లో 24 శాతం హెచ్‌ఆర్‌ఏ అందుకోవచ్చు. వీరికి ఏటా బుక్ గ్రాంట్ రూ.10,000 ఇస్తారు.

ప్రవేశం ఎలా?
అన్ని కోర్సుల్లోనూ పరీక్షలో చూపిన ప్రతిభతో ప్రవేశం కల్పిస్తారు. నేషనల్ ఒలింపియాడ్‌ల్లో ప్రతిభ చూపినవారికి నేరుగా యూజీ కోర్సుల్లో ప్రవేశాలకు అవకాశం ఉంటుంది. పీజీ, పీహెచ్‌డీలకు పరీక్షలతోపాటు ఇంటర్వ్యూలూ ఉంటాయి. ఫిజిక్స్‌లో పీహెచ్‌డీకి పరీక్ష నిర్వహించరు. జాయింట్‌ ఎంట్రన్స్ స్క్రీనింగ్ టెస్ట్ (జెస్ట్) స్కోరుతో నేరుగా ఇంటర్వ్యూకి అవకాశం కల్పిస్తారు. అలాగే మ్యాథ్స్‌లో పీహెచ్‌డీ చేయాలనుకున్నవారు నేషనల్ బోర్డు ఫర్ హయ్యర్ మ్యాథమెటిక్స్(ఎన్‌బీహెచ్‌ఎం) ఫెలోషిప్పునకు ఎంపికైతే పరీక్ష రాయకుండా నేరుగా ఇంటర్వ్యూకు హాజరు కావచ్చు. ఇదే మాదిరిగా జస్ట్‌తో కంప్యూటర్ సైన్స్‌లో రిసెర్చ్ అర్హత పొందినవారు సైతం నేరుగా ఇంటర్వ్యూతో ప్రవేశం పొందవచ్చు.

కోర్సుల వివరాలు.. 

1) బీఎస్సీ ఆనర్స్ 


విభాగాలు:
మ్యాథ్స్ & కంప్యూటర్ సైన్స్, మ్యాథ్స్ అండ్ ఫిజిక్స్.

అర్హత:
ఇంటర్ ఉత్తీర్ణులు, ద్వితీయ సంవత్సరం విద్యార్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.

2) ఎంఎస్సీ

విభాగాలు: మ్యాథ్స్, కంప్యూటర్ సైన్స్, డేటా సైన్స్.

అర్హత: డిగ్రీలో మ్యాథ్స్ లేదా బీస్టాట్ లేదా బీటెక్ చదువుకున్నవారు ఎంఎస్సీ మ్యాథ్స్‌కు అర్హులు. కంప్యూటర్ సైన్స్ బ్యాక్ గ్రౌండ్‌తో బీఎస్సీ, బీటెక్ కోర్సులు చదివినవారు ఎంఎస్సీ కంప్యూటర్ సైన్స్‌కు దరఖాస్తు చేసుకోవచ్చు. మ్యాథ్స్, స్టాటిస్టిక్స్ లేదా కంప్యూటర్. సైన్స్ నేపథ్యంతో యూజీ కోర్సులు చదివినవారు ఎంఎస్సీ డేటా సైన్స్‌కు అర్హులు. సంబంధిత సబ్జెక్టుల్లో ఆఖరు సంవత్సరం కోర్సులు చదువుతోన్న విద్యార్థులు కూడా అర్హులు.

3) పీహెచ్‌డీ

విభాగాలు: మ్యాథ్స్, కంప్యూటర్ సైన్స్, ఫిజిక్స్.

అర్హత: సంబంధిత విభాగాల్లో పీజీ ఉత్తీర్ణులు, చివరి ఏడాది కోర్సులు చదువుతున్నవారు దరఖాస్తు చేసుకోవచ్చు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.

దరఖాస్తు ఫీజు: రూ.1000. రెండు కోర్సులకు రూ.1200.

పరీక్ష విధానం..
* రెండు బీఎస్సీ కోర్సులకూ ఉమ్మడి పరీక్ష వంద పాయింట్లకు నిర్వహిస్తారు. ఇందులో 2 విభాగాలు ఉంటాయి. ఆబ్జెక్టివ్, డిస్క్రిప్టివ్ తరహా ప్రశ్నలు వస్తాయి. పార్ట్-ఎ 40, పార్ట్-బి 60 పాయింట్లు. పరీక్ష వ్యవధి 3 గంటలు. పార్ట్-ఎ స్క్రీనింగ్. ఇందులో కనీస పాయింట్లు సాధిస్తే పార్ట్-బి మూల్యాంకనం చేస్తారు. తుది ఎంపిక రెండు విభాగాల్లో సాధించిన పాయింట్లతో ఉంటుంది. పార్ట్-ఎలో 10 ప్రశ్నలు వస్తాయి. ఒక్కో దానికి 4 పాయింట్లు. పార్ట్-బిలో 6 ప్రశ్నలు ఉంటాయి. వీటికి 60 పాయింట్లు. ప్రశ్నలన్నీ ఇంటర్ మ్యాథ్స్‌లో ఆల్‌జీబ్రా, జామెట్రీ, ట్రిగనోమెట్రీ, కాలిక్యులస్ విభాగాల నుంచి అడుగుతారు.

* ఎమ్మెస్సీ, పీహెచ్‌డీ పరీక్షల్లోనూ రెండు పార్టులు ఉంటాయి. 'పార్ట్-ఎ'లో కనీస మార్కులు సాధిస్తేనే పార్ట్-బి మూల్యాంకనం చేస్తారు. రెండు విభాగాల్లో సాధించిన మార్కులతో ప్రవేశం కల్పిస్తారు. ప్రశ్నలన్నీ సంబంధిత సబ్జెక్టుల్లో యూజీ పాఠ్యాంశాల నుంచి వస్తాయి. ఎమ్మెస్సీ డేటా సైన్స్ ప్రశ్నలు మ్యాథ్స్, స్టాటిస్టిక్స్, కంప్యూటర్ సైన్స్ నుంచి అడుగుతారు. పాత ప్రశ్నపత్రాలు, సొల్యూషన్లు సీఎంఐ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచారు. వాటిని పరిశీలిస్తే ప్రశ్నల స్థాయి, చదవాల్సిన అంశాలపై అవగాహన పొందవచ్చు.

తెలుగు రాష్ట్రాల్లో పరీక్ష కేంద్రాలు: హైదరాబాద్, విశాఖ పట్నం.

ముఖ్య తేదీలు...

➥ ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరి తేదీ: 09.04.2023. 

➥ పరీక్ష తేదీ: 07.05.2023.

Website 

మరిన్ని విద్యాసంబంధ వార్తల కోసం క్లిక్ చేయండి..

టాప్ హెడ్ లైన్స్

Re-NEET UG 2026 Result: నీట్‌ రీటెస్ట్ 2026 ఫలితాలు విడుదల! 11.21 లక్షల మంది అభ్యర్థులు అర్హత!  
నీట్‌ రీటెస్ట్ 2026 ఫలితాలు విడుదల! 11.21 లక్షల మంది అభ్యర్థులు అర్హత!  
Supreme Court On Third Language: 9వ తరగతిలో మూడో భాష వద్దు - కేంద్రానికి సుప్రీంకోర్టు కీలక సూచన!
9వ తరగతిలో మూడో భాష వద్దు - కేంద్రానికి సుప్రీంకోర్టు కీలక సూచన!
How To Join ISRO After Graduation: ఇస్రోలో ఎలాంటి ఉద్యోగాలు ఉంటాయి? టైమింగ్స్ ఏంటీ? ఇప్పుడు కొత్తగా రిక్రూట్‌మెంట్ జరుగుతోందా?
ఇస్రోలో ఎలాంటి ఉద్యోగాలు ఉంటాయి? టైమింగ్స్ ఏంటీ? ఇప్పుడు కొత్తగా రిక్రూట్‌మెంట్ జరుగుతోందా?
ISRO Scientists Resign:ఇస్రోలో 100 మందికిపైగా శాస్త్రవేత్తలు ఎందుకు రాజీనామా చేశారు? కేంద్రం తీసుకున్న చర్యలు ఏంటి?
ఇస్రోలో 100 మందికిపైగా శాస్త్రవేత్తలు ఎందుకు రాజీనామా చేశారు? కేంద్రం తీసుకున్న చర్యలు ఏంటి?

వీడియోలు

IND vs ENG 2nd T20 Highlights | రెండో టీ20లో భారత్‌కు షాక్
Vaibhav Sooryavanshi Debut vs ENG | 15 ఏళ్లకే వైభవ్ సూర్యవంశీ హిస్టారిక్ డెబ్యూ
Shreyas Iyer Worst Captaincy Record | శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో భారత్ రికార్డు
Who Is Podarillu Serial Heroine Kruthika? | హీరోయిన్ కృతిక బ్యాక్‌గ్రౌండ్ తెలుసా?
Shreyas Iyer about T20 Loss vs ENG | రవి బిష్ణోయ్‌పై కెప్టెన్ శ్రేయస్ హాట్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Sonam Wangchuk:సోనమ్‌ వాంగ్‌చుక్‌ దీక్ష విరమణ- జంతర్‌మంతర్‌ వద్ద హైటెనషన్
సోనమ్‌ వాంగ్‌చుక్‌ దీక్ష విరమణ- జంతర్‌మంతర్‌ వద్ద హైటెనషన్
US Iran War Updates 2026: ఏడో రోజూ ఇరాన్‌కు కాళరాత్రి! అమెరికా బాంబుల వర్షం! హోర్మూజ్‌ జలసంధిలో హైటెన్షన్!
ఏడో రోజూ ఇరాన్‌కు కాళరాత్రి! అమెరికా బాంబుల వర్షం! హోర్మూజ్‌ జలసంధిలో హైటెన్షన్!
The Odyssey Box Office Collection Day 1: ది ఒడిస్సీ ఓపెనింగ్ డే కలెక్షన్స్... తెలుగు రాష్ట్రాల్లో దుమ్ము దుమారమే... ఇండియాలో ఫస్ట్ డే ఎన్ని కోట్లు వచ్చాయంటే?
ది ఒడిస్సీ ఓపెనింగ్ డే కలెక్షన్స్... తెలుగు రాష్ట్రాల్లో దుమ్ము దుమారమే... ఇండియాలో ఫస్ట్ డే ఎన్ని కోట్లు వచ్చాయంటే?
Prashant Kadiyam: ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ చందు.. క్రికెట్ అంటే పిచ్చి.. సాఫ్ట్ వేర్ నుంచి బుల్లితెర వైపు
ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ చందు.. క్రికెట్ అంటే పిచ్చి.. సాఫ్ట్ వేర్ నుంచి బుల్లితెర వైపు
కుప్పం vs మంగళగిరి: మా నుంచి నేర్చుకోవాల్సింది చాలా ఉంది - నారా లోకేష్
కుప్పం vs మంగళగిరి: మా నుంచి నేర్చుకోవాల్సింది చాలా ఉంది - నారా లోకేష్
What Is Stair Test For Heart Blockage: మెట్లు ఎక్కేటప్పుడు ఆయాసమా? సాధారణ అలసట అనుకుంటే ప్రమాదమే!
మెట్లు ఎక్కేటప్పుడు ఆయాసమా? సాధారణ అలసట అనుకుంటే ప్రమాదమే!
YS Jagan Digital Politics: డిజిటల్ లూప్‌లో వైఎస్సార్‌సీపీ - ఫీల్డ్ వదిలి యాప్స్‌ను నమ్ముకుంటే రాజకీయాల్లో రాత మారుతుందా?
డిజిటల్ లూప్‌లో వైఎస్సార్‌సీపీ - ఫీల్డ్ వదిలి యాప్స్‌ను నమ్ముకుంటే రాజకీయాల్లో రాత మారుతుందా?
సోనమ్‌ వాంగ్‌చుక్ దీక్ష భగ్నం - ఆరోగ్యం క్షీణించంతో ఆసుపత్రికి తరలింపు 
సోనమ్‌ వాంగ్‌చుక్ దీక్ష భగ్నం - ఆరోగ్యం క్షీణించంతో ఆసుపత్రికి తరలింపు 
Embed widget