(Source: ECI/ABP News/ABP Majha)
GATB-BET 2023: 'బయోటెక్నాలజీ'లో పీజీ, జేఆర్‌ఎఫ్ ప్రవేశాలకు నోటిఫికేషన్, పరీక్షలు ఎప్పుడంటే?
ప్రవేశ పరీక్షలకు సంబంధించిన దరఖాస్తు ప్రక్రియ మార్చి 10న ప్రారంభమైంది. ఏప్రిల్ 10 వరకు ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. ఏప్రిల్ 23న రెండు ప్రవేశ పరీక్షలు నిర్వహించనున్నారు.
బయోటెక్నాలజీ, దాని అనుబంధ విభాగాల్లో పీజీ కోర్సుల్లో 2023 -24 ప్రవేశాలకు సంబంధించి 'గ్రాడ్యుయేట్ ఆప్టిట్యూడ్ టెస్ట్ - బయోటెక్నాలజీ (GAT-B) 2023' నోటిఫికేషన్ వెలువడింది. అదేవిధంగా జూనియర్ రిసెర్చ్ ఫెలోషిప్‌ల కోసం నిర్వహించే 'బయోటెక్నాలజీ ఎలిజిబిలిటీ టెస్ట్ (BET)-2023' నోటిఫికేషన్‌ను కూడా నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ విడుదల చేసింది. ఈ పరీక్షలో సాధించిన మెరిట్ ద్వారా వివిధ విద్యాసంస్థలు, యూనివర్సిటీల్లో ప్రవేశాలు కల్పిస్తారు. ప్రవేశ పరీక్షలకు సంబంధించిన దరఖాస్తు ప్రక్రియ మార్చి 10న ప్రారంభమైంది. సరైన అర్హతలున్నవారు ఏప్రిల్ 10 వరకు ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. ఏప్రిల్ 23న రెండు ప్రవేశ పరీక్షలు నిర్వహించనున్నారు. ఉదయం సెషన్‌లో GAT-B పరీక్ష, మధ్యాహ్నం సెషన్‌లో BET పరీక్ష నిర్వహించనున్నారు.
పరీక్ష వివరాలు..
* జీఏటీ-బీ-2023/ బీఈటీ-2023
🔰 గ్రాడ్యుయేట్ ఆప్టిట్యూడ్ టెస్ట్-బయోటెక్నాలజీ (జీఏటీ-బి)-2023
జీఏటీ-బీ కోర్సులు..
➥ ఎంఎస్సీ(బయోటెక్నాలజీ, అగ్రి బయోటెక్నాలజీ, సంబంధిత విభాగాలు)
➥ ఎంటెక్(బయోటెక్నాలజీ, సంబంధిత విభాగాలు)
➥ ఎంవీఎస్సీ(యానిమల్ బయోటెక్నాలజీ)
అర్హత: కనీసం 55 శాతం మార్కులతో సంబంధిత విభాగంలో బీఎస్సీ, ఎంబీబీఎస్, బీడీఎస్, బీవీఎస్సీ, బీఎఫ్ఎస్‌సీ, బీఏఎంఎస్, బీహెచ్‌ఎంఎస్, బీపీటీ, బీటెక్, అయిదేళ్ల ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రాం ఉత్తీర్ణులై ఉండాలి.
వయోపరిమితి: ఎలాంటి వయోపరిమితి నిబంధనలు లేవు.
దరఖాస్తు ఫీజు: రూ.1200. ఎస్సీ/ ఎస్టీ/ దివ్యాంగులకు రూ.600 చెల్లించాలి.
స్టైపెండ్: ఎంఎస్సీ బయోటెక్నాలజీ & అనుబంధ కోర్సులకు ఎంపికైన విద్యార్థులకు నెలకు రూ.5000; ఎంఎస్సీ అగ్రికల్చరల్ బయోటెక్నాలజీ కోర్సులకు ఎంపికైన విద్యార్థులకు నెలకు రూ.7,500; ఎంటెక్/ఎంవీఎ ప్రోగ్రామ్స్‌కు ఎంపికైన విద్యార్థులకు నెలకు రూ.12,000 స్టైపెండ్‌గా ఇస్తారు.
పరీక్ష విధానం: మొత్తం 240 మార్కులకు జీఏటీ-బి పరీక్ష నిర్వహిస్తారు. కంప్యూటర్ ఆధారిత విధానంలో పరీక్ష నిర్వహిస్తారు. మల్టిపుల్ ఛాయిస్ విధానంలో ప్రశ్నలు అడుగుతారు. పరీక్ష సమయం 180 నిమిషాలు.
🔰 బయోటెక్నాలజీ ఎలిజిబిలిటీ టెస్ట్ (బీఈటీ)-2023
కోర్సులు..
➥ జూనియర్ రిసెర్చ్ ఫెలోషిప్ (పీహెచ్‌డీ) ప్రోగ్రాంలో ప్రవేశాలు.
అర్హత: కనీసం 60 శాతం మార్కులతో సంబంధిత విభాగంలో బీఈ, బీటెక్, ఎంబీబీఎస్, ఎంటెక్, ఎంఎస్సీ, ఎంవీఎస్సీ, ఎంఫార్మసీ, ఇంటిగ్రేడెట్ ఎంఎస్సీ ఉత్తీర్ణులై ఉండాలి.
వయోపరిమితి: జనరల్ అభ్యర్థులకు 28 సంవత్సరాలు మించకూడదు. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 33 సంవత్సరాలు.. దివ్యాంగులు, మహిళలు 31 సంవత్సరాలకు మించకూడదు.
పరీక్ష విధానం: మొత్తం 300 మార్కులకు జీఏటీ-బి పరీక్ష నిర్వహిస్తారు. కంప్యూటర్ ఆధారిత విధానంలో పరీక్ష నిర్వహిస్తారు. మల్టిపుల్ ఛాయిస్ విధానంలో ప్రశ్నలు అడుగుతారు. పరీక్ష సమయం 180 నిమిషాలు.
దరఖాస్తు ఫీజు: ఒక్కో పరీక్షకు అభ్యర్థులు రూ.1200 చెల్లించాల్సి ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు రూ.600 చెల్లిస్తే సరిపోతుంది. రెండు పరీక్షలూ (జీఏటీ-బీ, బీఈటీ) రాసేవారు రూ.2400 చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు రూ.1200 చెల్లిస్తే సరిపోతుంది.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.
ఎంపిక విధానం: ప్రవేశ పరీక్ష ఆధారంగా.
ముఖ్యమైన తేదీలు...
➥ ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 10.03.2023.
➥ ఆన్‌లైన్ దరఖాస్తు, పరీక్ష ఫీజు చెల్లింపుకు చివరి తేదీ: 31.03.2023.
➥ దరఖాస్తు సవరణ తేదీలు: 03.04.2023 నుంచి 04.04.2023 వరకు.
➥ పరీక్ష తేదీ: 23.04.2023.
పరీక్ష సమయం:
⏩ GAT-B పరీక్ష: ఉ.9.00 గం. - మ.12.00 గం. వరకు.
⏩ BET-2023 పరీక్ష: మ.3.00 గం. - సా.6 గం. వరకు.
Online Application For GAT-B/BET 2023
Also Read:
సీఎస్‌ఐఆర్-యూజీసీ నెట్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం, చివరితేది ఎప్పుడంటే?
దేశంలోని వివిధ యూనివర్సిటీలు, అనుబంధ కళాశాలల్లో సైన్స్ విభాగంలో లెక్చరర్‌షిప్, జూనియర్ రిసెర్చ్ ఫెలోషిప్స్ (జేఆర్‌ఎఫ్) అర్హత కోసం 'సీఎస్‌ఐఆర్-యూజీసీ నెట్' పరీక్ష నిర్వహిస్తున్న సంగతి విదితమే. కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ & ఇండస్ట్రియల్ రిసెర్చ్ (సీఎస్ఐఆర్), నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్‌టీఏ) సంయుక్తంగా ఏడాదికి రెండుసార్లు (జూన్, డిసెంబరు) ఈ అర్హత పరీక్షను నిర్వహిస్తాయి. ఈ ఏడాదికి గాను 'సీఎస్‌ఐఆర్-యూజీసీ నెట్- డిసెంబరు 202/ జూన్ 2023' నోటిఫికేషన్ వెలువడింది. దీనికి సంబంధించిన రిజిస్ట్రేషన్ ప్రక్రియ మార్చి 10న ప్రారంభమైంది. అభ్యర్థులు ఏప్రిల్ 10 వరకు నిర్ణీత ఫీజు చెల్లించి దరఖాస్తులు సమర్పించవచ్చు.
సీఎస్‌ఐఆర్-యూజీసీ నెట్ దరఖాస్తు కోసం క్లిక్ చేయండి..