News
News
X

CSIR UGC NET 2023: సీఎస్‌ఐఆర్-యూజీసీ నెట్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం, చివరితేది ఎప్పుడంటే?

సీఎస్‌ఐఆర్-యూజీసీ నెట్- డిసెంబరు 202/ జూన్ 2023 రిజిస్ట్రేషన్ ప్రక్రియ మార్చి 10న ప్రారంభమైంది. అభ్యర్థులు ఏప్రిల్ 10 వరకు నిర్ణీత ఫీజు చెల్లించి దరఖాస్తులు సమర్పించవచ్చు .

FOLLOW US: 
Share:

దేశంలోని వివిధ యూనివర్సిటీలు, అనుబంధ కళాశాలల్లో సైన్స్ విభాగంలో లెక్చరర్‌షిప్, జూనియర్ రిసెర్చ్ ఫెలోషిప్స్ (జేఆర్‌ఎఫ్) అర్హత కోసం  'సీఎస్‌ఐఆర్-యూజీసీ నెట్' పరీక్ష నిర్వహిస్తున్న సంగతి విదితమే. కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ & ఇండస్ట్రియల్ రిసెర్చ్ (సీఎస్ఐఆర్), నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్‌టీఏ) సంయుక్తంగా ఏడాదికి రెండుసార్లు (జూన్, డిసెంబరు) ఈ అర్హత పరీక్షను నిర్వహిస్తాయి. ఈ ఏడాదికి గాను 'సీఎస్‌ఐఆర్-యూజీసీ నెట్- డిసెంబరు 202/ జూన్ 2023' నోటిఫికేషన్ వెలువడింది. దీనికి సంబంధించిన రిజిస్ట్రేషన్ ప్రక్రియ మార్చి 10న ప్రారంభమైంది. అభ్యర్థులు ఏప్రిల్ 10 వరకు నిర్ణీత ఫీజు చెల్లించి దరఖాస్తులు సమర్పించవచ్చు .

వివరాలు... 

★ సీఎస్‌ఐఆర్-యూజీసీ నెట్- డిసెంబరు 202/ జూన్ 2023

ఎవరు అర్హులు..?

సంబంధిత విభాగంలో పీజీ డిగ్రీ (ఎంఎస్సీ)/ తత్సమాన డిగ్రీ ఉండాలి. (లేదా) ఇంటిగ్రేటెడ్ బ్యాచిలర్స్/ మాస్టర్స్ డిగ్రీ ఉండాలి.

55 శాతం మార్కులతో బీఈ/బీఎస్/ బీటెక్/ బీఫార్మసీ/ ఎంబీబీఎస్. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు 50 శాతం మార్కులు ఉంటే సరిపోతుంది.

వయోపరిమితి ఎంత..
?
జూనియర్ రిసెర్చ్ ఫెలోషిప్స్ (జేఆర్ఎఫ్) కోసం దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు 01.07.2022 నాటికి 28 సంవత్సరాలకు మించకూడదు. వయోపరిమితిలో ఓబీసీలకు 3 సంవత్సరాలు; ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, మహిళలు, థర్డ్ జెండర్ అభ్యర్థులకు 5 సంవత్సరాలు సడలింపు ఉంది.

లెక్చరర్‌షిప్ కోసం దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు ఎలాంటి గరిష్ఠ వయోపరిమితి లేదు.

ఎలా దరఖాస్తు చేసుకోవాలి..
?
అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. దరఖాస్తు ఫీజుగా జనరల్ అభ్యర్థులు రూ.1100; ఓబీసీ అభ్యర్థులు రూ.550; ఎస్సీ, ఎస్టీ, థర్డ్ జెండర్ అభ్యర్థులు రూ.275 చెల్లించాలి. దివ్యాంగులకు ఫీజు నుంచి మినహాయింపు ఉంది.

పరీక్ష విధానం ఎలా ఉంటుంది..?

➥ మొత్తం 5 సబ్జెక్టులకు కంప్యూటర్ ఆధారిత రాత పరీక్ష నిర్వహిస్తారు. ఇందులో కెమికల్ సైన్సెస్, ఎర్త్/ అట్మాస్ఫియరిక్/ ఓషియన్/ ప్లానెటరీ సైన్సెస్, లైఫ్ సైన్సెస్, మ్యాథమెటికల్ సైన్సెస్, ఫిజికల్ సైన్సెస్ సబ్జెక్టులు ఉంటాయి.

➥ ప్రతి సబ్జెక్టు నుంచి మొత్తం 200 మార్కులకు పరీక్ష ఉంటుంది. పరీక్ష సమయం 3 గంటలు. పరీక్షలో సబ్జెక్టుల వారీగా నెగెటివ్ మార్కులు ఉంటాయి.

పరీక్ష పేపర్‌లో మూడు (పార్ట్-ఎ, పార్ట్-బి, పార్ట్-సి) విభాగాలుంటాయి.
'పార్ట్-ఎ' విభాగంలో జనరల్ ఆప్టిట్యూడ్, లాజికల్ రీజనింగ్, గ్రాఫికల్ అనాలసిస్, అనలిటికల్ & న్యూమరికల్ ఎబిలిటీ, క్వాంటిటేటివ్ కంపారిజన్, సిరీస్, ఇతర అంశాల నుంచి ప్రశ్నలు అడుగుతారు.

'పార్ట్-బి', 'పార్ట్-సి' విభాగాల్లో సంబంధిత సబ్జెక్టు నుంచి ప్రశ్నలు అడుగుతారు.

రాత పరీక్ష ఎప్పుడు..?
జూన్  6, 7 8 తేదీల్లో రాతపరీక్ష నిర్వహించనున్నారు. మొత్తం రెండు సెషన్లలో పరీక్షలు నిర్వహిస్తారు. ఉ.9.00 గం.- మ.12.00 గం. వరకు మొదటి సెషన్‌లో, మ. 2.00 గం.-సా.5.00 గం. వరకు రెండో సెషన్‌లో పరీక్షలు నిర్వహిస్తారు. దేశవ్యాప్తంగా 225 నగరాల్లో పరీక్ష నిర్వహించనున్నారు. తెలుగు రాష్ట్రాల్లో అన్ని ప్రధాన నగరాల హైదరాబాద్, గుంటూరులో పరీక్ష నిర్వహణ ఉంటుంది.

తెలంగాణలో పరీక్ష కేంద్రాలు: హైదరాబాద్, కరీంనగర్, ఖమ్మం, మహబూబ్‌నగర్, నల్లగొండ, వరంగల్ నగరాల్లో పరీక్ష నిర్వహించనున్నారు. 

ఆంధ్రప్రదేశ్‌లో పరీక్ష కేంద్రాలు: అనంతపురం, భీమవరం, చీరాల, చిత్తూరు, ఏలూరు, గుంటూరు, కడప, కాకినాడ, కర్నూలు, నరసరావుపేట, నెల్లూరు, ఒంగోలు, ప్రొద్దుటూరు, రాజమహేంద్రవరం, శ్రీకాకుళం, సూరంపాలెం, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం, విజయనగరం.

ముఖ్యమైన తేదీలు..

➥ ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 10.03.2023.

➥ ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరితేది: 10.04.2023.

➥ దరఖాస్తు ఫీజు చెల్లించడానికి చివరితేది: 10.04.2023. 

➥ దరఖాస్తుల సవరణకు అవకాశం: 12.04.2023 to 18.04.2023.

➥ పరీక్ష తేదీలు: 2023, జూన్ 6,7,8 తేదీల్లో.

Notification

Online Registration

Published at : 13 Mar 2023 12:54 PM (IST) Tags: CSIR UGC-NET June 2023 NTA Joint CSIR-UGC NET December 2022 CSIR UGC-NET 2023 Registration CSIR UGC-NET 2022 Application Process CSIR UGC-NET 2023 CSIR UGC-NET June 2023 exam date

సంబంధిత కథనాలు

TS SSC Exams: తెలంగాణలో రేపట్నుంచి 'టెన్త్ క్లాస్' ఎగ్జామ్స్, విద్యార్థులకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం!

TS SSC Exams: తెలంగాణలో రేపట్నుంచి 'టెన్త్ క్లాస్' ఎగ్జామ్స్, విద్యార్థులకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం!

Inter Academic Calender: ఇంటర్ అకడమిక్ ​క్యాలెండర్​ విడుదల, ఈ ఏడాది వచ్చే సెలవులివే!

Inter Academic Calender: ఇంటర్ అకడమిక్ ​క్యాలెండర్​ విడుదల, ఈ ఏడాది వచ్చే సెలవులివే!

కొత్త విధానంలో ఇంటర్ మూల్యాంకనం, ఫలితాల వెల్లడి ఎప్పుడంటే? ​

కొత్త విధానంలో ఇంటర్ మూల్యాంకనం, ఫలితాల వెల్లడి ఎప్పుడంటే? ​

JEE Main 2023 City Intimation Slip: జేఈఈ మెయిన్‌ ఎగ్జామ్ సిటీ ఇంటిమేషన్ స్లిప్స్ వచ్చేశాయ్, ఇలా చెక్ చేసుకోండి!

JEE Main 2023 City Intimation Slip: జేఈఈ మెయిన్‌ ఎగ్జామ్ సిటీ ఇంటిమేషన్ స్లిప్స్ వచ్చేశాయ్, ఇలా చెక్ చేసుకోండి!

AP SSC Exams: 'పది' పరీక్షలకు పకడ్బందీ ఏర్పాట్లు, నిమిషం ఆలస్యమైనా 'నో' ఎంట్రీ - అయితే?

AP SSC Exams: 'పది' పరీక్షలకు పకడ్బందీ ఏర్పాట్లు, నిమిషం ఆలస్యమైనా 'నో' ఎంట్రీ - అయితే?

టాప్ స్టోరీస్

Nara Lokesh: చెప్పేవి నీతులు దోచేవి గుట్టలు, గుడ్‌మార్నింగ్ ధర్మవరం అబద్ధం - ఎమ్మెల్యే కేతిరెడ్డిపై లోకేష్

Nara Lokesh: చెప్పేవి నీతులు దోచేవి గుట్టలు, గుడ్‌మార్నింగ్ ధర్మవరం అబద్ధం - ఎమ్మెల్యే కేతిరెడ్డిపై లోకేష్

SRH Vs RR: టాస్ రైజర్స్‌దే - బౌలింగ్‌కు మొగ్గు చూపిన భువీ!

SRH Vs RR: టాస్ రైజర్స్‌దే - బౌలింగ్‌కు మొగ్గు చూపిన భువీ!

KTR On Vizag Steel: విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపండి - కేంద్రానికి TS మంత్రి కేటీఆర్ లేఖ

KTR On Vizag Steel: విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపండి - కేంద్రానికి TS మంత్రి కేటీఆర్ లేఖ

MLA Durgam Chinnaiah: ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్యకు వార్నింగ్! మావోయిస్టుల లేఖ కలకలం

MLA Durgam Chinnaiah: ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్యకు వార్నింగ్! మావోయిస్టుల లేఖ కలకలం