అన్వేషించండి

JEE Advanced: వెబ్‌సైట్‌లో జేఈఈ అడ్వాన్స్‌డ్-2022 క్వశ్చన్ పేపర్లు! ఆన్సర్ కీ, ఫలితాలు ఎప్పుడో తెలుసా?

జేఈఈ అడ్వాన్స్‌డ్ 2022  ప్రశ్నపత్రాల కూర్పుపై ఈ సారి మిశ్రమ స్పందన వస్తోంది. పేపర్-1 కఠినంగా ఉండగా.. పేపర్-2 సులభంగానే ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ప్రశ్నపత్రాలు మీకోసం...

తెలుగు రాష్ట్రాలు సహా దేశవ్యాప్తంగా ఆగస్టు 28న జేఈఈ అడ్వాన్స్‌డ్‌ 2022 పరీక్ష నిర్వహించిన సంగతి తెలిసిందే. దీంతో ఈ ఏడాది జేఈఈ పరీక్షల ప్రక్రియ ముగిసింది. దేశవ్యాప్తంగా ఉదయం, మధ్యాహ్నం సెషన్లలో కలిపి 360 (180+180) మార్కులకు పరీక్ష జరిగింది. తెలంగాణలో 14, ఏపీలో 28 కేంద్రాల్లో కలిపి దాదాపు 25 వేల మంది విద్యార్థులు పరీక్ష రాసినట్లు అంచనా. జేఈఈ అడ్వాన్స్‌డ్‌ పరీక్షలకు సంబంధించి పేపర్-1, పేపర్-2 ప్రశ్నపత్రాలను ఆగస్టు 29న అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచారు. పరీక్షలకు సంబంధించిన ఆన్సర్ కీని సెప్టెంబరు 3న విడుదల చేయనున్నారు. అంతకు ముందే అంటే సెప్టెంబరు 1న అభ్యర్థుల రెస్పాన్సెస్ (సమాధాన పత్రాలను) అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచనున్నారు. దీంతో ఆన్సర్ కీ సాయంతో అభ్యర్థులు మార్కులపై ఒక అంచనాకు వచ్చే వీలుంది.

 

JEE Advanced Question Papers: PAPER 1  and  PAPER 2

 

జేఈఈ అడ్వాన్స్‌డ్ 2022 ప్రశ్నపత్రాల సరళి ఇలా...
జేఈఈ అడ్వాన్స్‌డ్ 2022  ప్రశ్నపత్రాల కూర్పుపై ఈ సారి మిశ్రమ స్పందన వస్తోంది. పేపర్-1 కఠినంగా ఉండగా.. పేపర్-2 సులభంగానే ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

♠ భౌతికశాస్త్రం, గణితంలో ప్రశ్నలు మధ్యస్థంగా, రసాయనశాస్త్రంలో సులభంగా ఉన్నాయి.

♠ మూడు సబ్జెక్టుల్లోనూ 20 శాతం ప్రశ్నలు కఠినంగా ఉన్నాయి. 

♠ పేపర్ -1లో మూడు సెక్షన్లలో 54 ప్రశ్నలు వచ్చాయి. మొదటి సెక్షన్ లో నెగిటివ్  మార్కులు లేవు. రెండో సెక్షన్ లో ప్రతి రెండు తప్పులకు ఒక నెగిటివ్  మార్కు, మూడో సెక్షన్ లో ప్రతి తప్పునకు ఒక నెగిటివ్  మార్కు కేటాయించారు. 

♠ పేపర్ -2లోనూ మూడు సెక్షన్లలో 54 ప్రశ్నలు ఉంటాయి. అయితే పేపర్ -1 కంటే ఎక్కువ నెగిటివ్  మార్కులు ఉండటంతో విద్యార్థులు ఆచితూచి జవాబులు ఎంచుకోవాల్సి వచ్చింది. దీంతో ఎక్కువ సమయం వృథా అయినట్లు విద్యార్థులు చెబుతున్నారు.

♠ పేపర్ -1 కంటే పేపర్ -2 కొంచెం తేలికగా ఉంది. రెండింటిలోనూ సెక్షన్ -2 మంచి మార్కులు, ర్యాంకులు సాధించేందుకు కీలకం కానుంది. జనరల్  కేటగిరీ అభ్యర్థులకు 70-75 మధ్య కటాఫ్  మార్కులు ఉండే వీలుందని నిపుణుల అభిప్రాయం.

♠ రెండు పేపర్లనూ విశ్లేషిస్తే రసాయనశాస్త్రం బాగా తెలిసిన విద్యార్థులకు ఎక్కువ ర్యాంకులు వచ్చే వీలుంది. గణితం బాగా చేసి ఉంటే టాప్  ర్యాంకులు 

 

Also Read: NEET Answer Key: నీట్ ఆన్సర్ కీ వచ్చేస్తోంది, ఫలితాలు ఎప్పుడంటే?


అర్హత మార్కులు ఇవే? 
జేఈఈ అడ్వాన్స్‌డ్‌ 2022 పరీక్ష స్థాయి కష్టంగా ఉండటం వల్ల క్వాలిఫయింగ్‌ మార్కులు అదే రీతిలో ఉండే వీలుందని నిపుణులు అంటున్నారు. మొత్తం 360 మార్కులకు ప్రతి ప్రతి సబ్జెక్టులో 5 శాతం మార్కులతో ఓపెన్‌ కేటగిరీలో 60 మార్కులు తెచ్చుకుంటే అడ్వాన్స్‌డ్‌లో అర్హత సాధించినట్టేనని చెబుతున్నారు. ఓబీసీ–నాన్‌ క్రీమీలేయర్‌ కేటగిరీలు ప్రతి సబ్జెక్టులో 4 శాతంతో 50 కనీస మార్కులు, ఎస్సీలు ప్రతి సబ్జెక్టులో 2 శాతంతో 25 కనీస మార్కులు సాధిస్తే ఐఐటీల్లో సీట్ల పోటీకి అర్హత పొందినట్టేనని విశ్లేషిస్తున్నారు. పేపర్‌ విధానం, విద్యార్థుల ఫీడ్‌బ్యాక్‌ ప్రకారం వచ్చే మార్కులకు ర్యాంకులను జేఈఈ అధ్యాపకులు లెక్కగట్టారు.  


ఆన్సర్ కీపై అభ్యంతరాలకు అవకాశం..
జేఈఈ అడ్వాన్స్‌డ్-2022 ఆన్సర్ కీని సెప్టెంబరు 3న విడుదల చేయనున్నారు. ఆ తర్వాత సెప్టెంబరు 3న ఉదయం 10 గంటల నుంచి సెప్టెంబరు 4న సాయంత్రం 5 గంటల వరకు ఆన్సర్ కీపై అభ్యంతరాలు స్వీకరిస్తారు. సెప్టెంబరు 11న ఫైనల్ కీని విడుదల చేస్తారు. 


ఫలితాలు ఎప్పుడంటే?
జేఈఈ అడ్వాన్స్‌డ్-2022 ఫైనల్ కీతోపాటు ఫలితాలను కూడా సెప్టెంబర్‌ 11న విడుదల చేయనున్నారు. సెప్టెంబరు 12 నుంచి జోసా కౌన్సెలింగ్‌ ప్రక్రియ మొదలుకానుంది. జేఈఈ అడ్వాన్స్‌డ్‌ గత ఏడాదితో పోలిస్తే ఈసారి కాస్తా కష్టంగానే ఉన్నట్టు నిపుణులు, విద్యార్థులు తెలిపారు.


ఆర్కిటెక్చర్ ఆప్టిట్యూడ్ టెస్ట్ షెడ్యూలు..

♠ సెప్టెంబరు 11 నుంచి ఆర్కిటెక్చర్ ఆప్టిట్యూడ్ టెస్ట్ (AAT) కోసం రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభంకానుంది. 

♠
సెప్టెంబరు 14న పరీక్ష నిర్వహించనున్నారు. 

♠
AAT ఫలితాలను సెప్టెంబరు 17న విడుదల చేస్తారు.

 

Also Read: 

JoSAA 2022 Schedule: 'జోసా' కౌన్సెలింగ్ షెడ్యూలు వచ్చేసింది, ముఖ్యమైన తేదీలివే!
దేశవ్యాప్తంగా ఐఐటీలు, ఎన్‌ఐటీలు, ట్రిపుల్‌ఐటీలు, ఇతర కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సహకారంతో నడిచే విద్యాసంస్థల్లో బీటెక్‌ సీట్ల భర్తీకి నిర్దేశించిన జోసా(జాయింట్‌ సీట్‌ అలొకేషన్‌ అథారిటీ) షెడ్యూలును ఐఐటీ బాంబే ప్రకటించింది. షెడ్యూలు ప్రకారం సెప్టెంబరు 12 నుంచి జోసా కౌన్సెలింగ్ ప్రారంభంకానుంది. జేఈఈ మెయిన్‌లో అర్హత సాధించిన వారికి ఆగ‌స్టు 28న జేఈఈ అడ్వాన్స్‌డ్‌ నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ పరీక్ష ఫలితాలను సెప్టెంబరు 11న వెల్లడిస్తారు. ఆ మరుసటి రోజు నుంచి కౌన్సెలింగ్‌ ప్రారంభంకానుంది.
కౌన్సెలింగ్ పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి..

మరిన్ని విద్యాసంబంధ వార్తల కోసం క్లిక్ చేయండి..

 

టాప్ హెడ్ లైన్స్

Jantar Mantar: నిరసనల వేదిక నుంచి జంతర్ మంతర్‌ తొలగింపు.. డీనోటిఫై చేసిన కేంద్రం
నిరసనల వేదిక నుంచి జంతర్ మంతర్‌ తొలగింపు.. డీనోటిఫై చేసిన కేంద్రం
CM Revanth Reddy: ఢిల్లీ నిరసన మరో స్వాతంత్య్ర పోరాటం.. SIR జరిగిన రాష్ట్రాలో బీజేపీ గెలిచింది: సీఎం రేవంత్
ఢిల్లీ నిరసన మరో స్వాతంత్య్ర పోరాటం.. SIR జరిగిన రాష్ట్రాలో బీజేపీ గెలిచింది: సీఎం రేవంత్
AP ZPTC Election Reservations: ఏపీలో జెడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాలకు రిజర్వేషన్లు ఖరారు.. ఉత్తర్వులు జారీ
ఏపీలో జెడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాలకు రిజర్వేషన్లు ఖరారు.. ఉత్తర్వులు జారీ
Vijayasai Reddy Party: కొత్త పార్టీ ఆవిర్భావంపై విజయసాయి రెడ్డి కీలక ప్రకటన! అప్పటివరకు వెయిట్ చేయాలి
Vijayasai Reddy Party: కొత్త పార్టీ ఆవిర్భావంపై విజయసాయి రెడ్డి కీలక ప్రకటన! అప్పటివరకు వెయిట్ చేయాలి

వీడియోలు

West Bengal Bypoll Results BJP Landslide Victory | బెంగాల్ పోరులో బీజేపీ క్లీన్ స్వీప్ - ముస్లిం ఓటు బ్యాంక్‌లో కమలం సంచలనం
Elephant Drona Recovers Broken Leg Fibreglass Casting Treatment | కాలిగాయానికి ఫైబర్‌గ్లాస్ కట్టు.. కోలుకున్న ద్రోణ ఏనుగు
India players Catch Drops vs WI 2nd T20 | క్యాచ్ డ్రాప్ వల్ల గెలిచే మ్యాచ్ పోయిందా ?
India vs West Indies 2nd T20 | వెస్టిండీస్‌తో రెండో టీ20లో ఘోర ఓటమి
Morne Morkel Backs Vaibhav Suryavanshi | వైభవ్ పై మోర్నీ మోర్కెల్ ఆసక్తికర వ్యాఖ్యలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Jantar Mantar: నిరసనల వేదిక నుంచి జంతర్ మంతర్‌ తొలగింపు.. డీనోటిఫై చేసిన కేంద్రం
నిరసనల వేదిక నుంచి జంతర్ మంతర్‌ తొలగింపు.. డీనోటిఫై చేసిన కేంద్రం
CM Revanth Reddy: ఢిల్లీ నిరసన మరో స్వాతంత్య్ర పోరాటం.. SIR జరిగిన రాష్ట్రాలో బీజేపీ గెలిచింది: సీఎం రేవంత్
ఢిల్లీ నిరసన మరో స్వాతంత్య్ర పోరాటం.. SIR జరిగిన రాష్ట్రాలో బీజేపీ గెలిచింది: సీఎం రేవంత్
AP ZPTC Election Reservations: ఏపీలో జెడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాలకు రిజర్వేషన్లు ఖరారు.. ఉత్తర్వులు జారీ
ఏపీలో జెడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాలకు రిజర్వేషన్లు ఖరారు.. ఉత్తర్వులు జారీ
Vijayasai Reddy Party: కొత్త పార్టీ ఆవిర్భావంపై విజయసాయి రెడ్డి కీలక ప్రకటన! అప్పటివరకు వెయిట్ చేయాలి
Vijayasai Reddy Party: కొత్త పార్టీ ఆవిర్భావంపై విజయసాయి రెడ్డి కీలక ప్రకటన! అప్పటివరకు వెయిట్ చేయాలి
Hyderabad Crime News: బొల్లారంలో చిన్నారి హత్య కేసు ఛేదించిన పోలీసులు.. నిందితుడి అరెస్ట్
బొల్లారంలో చిన్నారి హత్య కేసు ఛేదించిన పోలీసులు.. నిందితుడి అరెస్ట్
Drishyam 3 OTT : అజయ్ దేవగణ్ 'దృశ్యం 3' న్యూ రికార్డ్ - 450 కోట్ల సీట్ ఎడ్జ్ క్రైమ్ థ్రిల్లర్ ఎప్పుడు, ఏ ఓటీటీలోకి వస్తుందంటే?
అజయ్ దేవగణ్ 'దృశ్యం 3' న్యూ రికార్డ్ - 450 కోట్ల సీట్ ఎడ్జ్ క్రైమ్ థ్రిల్లర్ ఎప్పుడు, ఏ ఓటీటీలోకి వస్తుందంటే?
October Smartphones Launch: అక్టోబర్ 12 - 18 మధ్య ఫ్లాగ్‌షిప్ ఫోన్ల లాంచ్‌.. వన్‌ప్లస్ 16, రెడ్‌మ్యాజిక్ 12 ప్రో+ ఇంకా మరెన్నో!
అక్టోబర్ 12 - 18 మధ్య ఫ్లాగ్‌షిప్ ఫోన్ల లాంచ్‌.. వన్‌ప్లస్ 16, రెడ్‌మ్యాజిక్ 12 ప్రో+ ఇంకా మరెన్నో!
మీ కారు RCని వేరే రాష్ట్రానికి ట్రాన్స్‌ఫర్ చేయాలా? ఆన్‌లైన్‌లోనే పని పూర్తి.. కావాల్సిన పత్రాలు, ఫీజుల వివరాలివే!
వెహికల్‌ RCని ట్రాన్స్‌ఫర్‌ చేయడం ఎలా? పూర్తి ప్రాసెస్‌, ఫీజుల వివరాలు
Embed widget