(Source: ECI/ABP News/ABP Majha)
Indian Students: రూటు మార్చిన భారత విద్యార్థులు, అంతర్జాతీయ పరిణామాలతో భారీ మార్పు- ఏం జరుగుతోంది?
అంతర్జాతీయ పరిణామాల నేపథ్యంలో విద్యార్థుల గమ్యస్థానాలు మారుతున్నాయి. అమెరికా, కెనడా, బ్రిటన్‌లకు దూసుకుపోయే విద్యార్థులు.. ఇప్పుడు ఇతర దేశాల బాట పడుతున్నారు. దీంతో అవకాశాలు పెరుగుతున్నాయి.
Indian students change their route: భారతీయ(Indian) విద్యార్థుల(Students) రూటు మారుతోంది. ఇప్పటి వరకు అగ్రరాజ్యం అమెరికా(America) సహా పొరుగునే ఉన్న కెనడా(Canada), మరోవైపు బ్రిటన్(Briton) దేశాలకు క్యూకట్టిన మన విద్యార్థులు.. ఆయా దేశాల్లో పెరుగుతున్న అరాచకాలు, కాల్పులు, విధ్వంసాలు వంటి వాటితో తమ రూటు మార్చుకుంటున్నారు. గత రెండేళ్లుగా అమెరికాలో పరిస్థితులు ఏమాత్రం ఆశాజనకంగా లేక పోవడం, కెనడాలోనూ దాడులు పెరుగుతుండడం, ఇక, బ్రిటన్‌లో కఠిన ఆంక్షలు, ఆర్థిక పరిస్థితులు, రాజకీయ పరిణామాల నేపథ్యంలో భారత దేశం నుంచి వెళ్లే విద్యార్థులు ప్రత్యామ్నాయ దేశాలను చూసుకుంటున్నారు.
పంజాబ్, హరియాణల నుంచి..
విదేశీ విద్య. ఈ మాట అనగానే.. సాధారణ విద్యార్థులు(Stuedents).. ఎంత అదృష్టమో అని తెగ సంబరపడిపోతారు. ఉన్నత విద్యను అభ్యసించేందుకు దేశ వ్యాప్తంగా అనేక రాష్ట్రాల్లో పోటీ కూడా ఎక్కువగానే ఉంది. ముఖ్యంగా పంజాబ్(Punjab), హరియాణా(Hariyana)లు ఈ జాబితాలో ఎక్కువగా ఉన్నాయి. ఇక్కడ నుంచి విదేశాలకు వెళ్లి చదువుతున్న వారి సంఖ్య పెరుగుతోంది. ఇక, 2017-18 మధ్య కాలంలో ఏపీలో చంద్రబాబు ప్రభుత్వం ప్రవేశ పెట్టిన విదేశీ విద్యా కానుక పథకం కూడా మంచి పలితాలు ఇచ్చింది.
ఏపీ నుంచి కూడా..
2017-19 మధ్య సుమారు 4 వేల మంది ఏపీ నుంచి విదేశాలకు వెళ్లి చదువుకున్న వారు ఉన్నారంటే.. అతి శయోక్తికాదు. ఇక, కర్ణాటక(Karnataka), AP, తెలంగాణ(Telangana) రాష్ట్రాలుదక్షిణాదిలో టాప్‌లో ఉండగా.. ఈ విషయంలో ప్రాంతీయ భాషకు పట్టం కట్టే తమిళనాడు వెనుక బడింది. ఇక, ఇతర రాష్ట్రాల్లో మహారాష్ట్ర ఉత్తరాదిలో తొలి మూడు స్తానాల్లో ఉంది. ఇలా.. విదేశాలకు వెళ్లి చదువుతున్న వారు.. పెరుగుతున్నారు. దీనికి ప్రధాన కారణం.. విదేశీ విద్యను నేర్చుకుంటే.. తక్షణే ఉద్యోగాలు రావడంతోపాటు.. ఉపాధి అవకాశాలు మరింతగా మెరుగు పడుతున్నాయి. ఇక, విదేశీ విద్యార్థులు ఎక్కువగా ఎంచుకుంటున్న దేశాలు.. అమెరికా, కెనడా తర్వాత ప్లేస్లో బ్రిటన్ ఉంది. బ్రిటన్‌కు తక్కువగానే వెళ్తున్నారు. దీనికి కారణం బ్రిటన్‌లో చదివే వారికి.. ఆంగ్లపై ప్రత్యేకంగా పరీక్షలు పెడతారు. దీనిలో పాసైన వారికే అక్కడ చదువుకునేందుకు అవకాశం కల్పిస్తున్నారు. అయినప్పటికీ.. భారతీయ విద్యార్థులు ఆ దేశానికి కూడా వెళ్లి చదువు కుంటున్నారు. ఇదిలావుంటే.. ఇప్పుడు ఈ మూడు దేశాలకు వెళ్తున్న వారి సంఖ్య తగ్గుముఖం పడుతోంది.
కారణాలు ఇవేనా..
తాజా లెక్కల ప్రకారం.. ఏటా భారత దేశం నుంచి 4 లక్షల పైచిలుకు విద్యార్థులు విదేశాలకు.. ముఖ్యంగా అమెరికా, బ్రిటన్, కెనడాలకు వెళ్తున్నారు. కానీ, ఇప్పుడు ఆయాదేశాల్లో పెరుగుతున్న దాడులు , తుపాకీ కాల్పులు కారణంగా భారతీయ విద్యార్థులు వేర్వేరు దేశాలను ఎంచుకుంటున్నారు. ఇటీవల కాలంలో అమెరికాలో తెలుగు విద్యార్థులు కాల్పుల దాడిలో మృత్యువాత పడిన విషయం తెలిసిందే. దీంతో ప్రశాంత వాతావరణం ఉండే దేశాలను వారు ఎంచుకుంటున్నారు. విద్యతోపాటు.. వాతావరణం, స్థానికంగా ఉన్న ప్రభుత్వాల ఆంక్షలు వంటివాటిని ఎక్కువగా పరిగణనలోకి తీసుకుంటున్నారు.
మన విద్యార్థులు జర్మనీ, పోలండ్, నెదర్లాండ్స్, బెల్జియం, న్యూజీలాండ్, హంగరీ దేశాల బాట పడుతున్నారు. ఇక్కడ కూడా నాణ్యమైన విద్య అందుతుండడంతోపాటు.. ఎలాంటి వివాదాలు లేకపోవడం విద్యార్థులకు కలిసి వస్తున్న పరిణామంగా చెబుతున్నారు. ఈ నేపథ్యంలోనే ఈ దేశాలకు విద్యార్థుల సంఖ్య పెరుగుతోందని అంతర్జాతీయ నిపుణులు చెబుతున్నారు. భవిష్యత్తులో అమెరికాలో ఏదైనా మార్పులు సంభవిస్తే.. తప్ప, విద్యార్థుల ఆలోచనలో మార్పు వచ్చే అవకాశం ఉండదని అంటున్నారు. ఒక్క మన దేశం నుంచే కాదు.. చైనా, పాకిస్థాన్‌ల నుంచి కూడా అమెరికాకు వెళ్లి చదువుతున్న వారి సంఖ్య గణనీయంగా తగ్గుముఖం పట్టినట్టు నివేదికలు స్పష్టం చేస్తున్నాయి.