News
News
వీడియోలు ఆటలు
X

IITR: రోపర్‌ ఐఐటీ ఎంటెక్‌ ప్రోగ్రాంలో ప్రవేశాలు, వివరాలు ఇలా!

పంజాబ్ రాష్ట్రంలోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ రోపర్ 2023-24 విద్యా సంవత్సరానికి ఎంటెక్ ప్రోగ్రాంలో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల చేసింది.

FOLLOW US: 
Share:

పంజాబ్ రాష్ట్రంలోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ రోపర్ 2023-24 విద్యా సంవత్సరానికి ఎంటెక్ ప్రోగ్రాంలో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తుచేయాలి. బీఈ, బీటెక్‌ లేదా ఎంఎస్సీ, ఎంసీఏ ఉత్తీర్ణతతో పాటు గేట్‌ 2023/ 2022/ 2021లో అర్హత సాధించి ఉండాలి.

వివరాలు..

* ఎంటెక్‌ ప్రోగ్రాం

మొత్తం సీట్ల ఖాళీలు: 200 సీట్లు.

విభాగాలు: బయోమెడికల్ ఇంజినీరింగ్, కెమికల్ ఇంజినీరింగ్, కెమిస్ట్రీ, సివిల్ ఇంజినీరింగ్, కంప్యూటర్ సైన్స్ అండ్‌ ఇంజినీరింగ్, ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్, హ్యుమానిటీస్ అండ్ సోషల్ సైన్సెస్, మ్యాథమెటిక్స్, మెకానికల్ ఇంజినీరింగ్, మెటలర్జికల్ అండ్‌ మెటీరియల్స్ ఇంజినీరింగ్, ఫిజిక్స్.

అర్హత: బీఈ, బీటెక్‌ లేదా ఎంఎస్సీ, ఎంసీఏ ఉత్తీర్ణతతో పాటు గేట్‌ 2023/ 2022/ 2021లో అర్హత సాధించి ఉండాలి.

దరఖాస్తు ఫీజు: జనరల్‌ / ఓబీసీ/ ఈడబ్ల్యూఎస్‌ కేటగిరీకి రూ.500; ఎస్సీ/ ఎస్టీ/ దివ్యాంగ అభ్యర్థులకు రూ.250.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తుచేయాలి.

ఎంపిక ప్రక్రియ: గేట్ స్కోరు తదితరాల ఆధారంగా ఎంపిక ఉంటుంది.

దరఖాస్తు సమర్పణకు చివరితేదీ: 23.04.2023.

Notification 

Website

Also Read:

'టోఫెల్‌' పరీక్షలో కీలక మార్పులు, జులై నుంచి అమల్లోకి!
విదేశాల్లో ఉన్నత విద్య కోసం వెళ్లేవారి ఇంగ్లిష్ భాషా ప్రావీణ్యతను పరీక్షించేందుకు నిర్వహించే టోఫెల్(టెస్ట్ ఆఫ్ ఇంగ్లిష్ యాజ్ ఏ ఫారెన్ లాంగ్వేజ్) పరీక్షలో కీలక మార్పులు చోటుచేసుకున్నాయి. ఇప్పటివరకు ఈ పరీక్ష పూర్తయ్యేందుకు మూడు గంటలకు పైగా సమయం పట్టగా.. ఇకపై రెండు గంటల్లోపే (గంటా 56 నిమిషాల్లో) పూర్తయ్యేలా కుదించారు. అంతేకాకుండా ఈ పరీక్ష పూర్తయిన వెంటనే విద్యార్థులు తమ అధికారిక స్కోర్ విడుదలయ్యే తేదీని సైతం తెలుసుకోవచ్చని ఎడ్యుకేషనల్ టెస్టింగ్ సర్వీస్ వెల్లడించింది. ఇంగ్లిష్ లాంగ్వేజ్ స్కిల్స్‌కు సంబంధించిన టోఫెల్, గ్రాడ్యుయేట్ రికార్డు ఎగ్జామినేషన్స్ రాసేవారికి అనుకూలంగా ఉండేలా కొన్ని మార్పులు చేసినట్లు ఈటీఎస్ సీఈవో అమిత్ సేవక్ వెల్లడించారు. ఈ మార్పులు జులై 26 నుంచి అమల్లోకి వస్తాయని ఆయన తెలిపారు.
పూర్తివివరాల కోసం క్లిక్ చేయండి..

సీఎస్‌ఐఆర్‌- యూజీసీ నెట్‌ దరఖాస్తు గడువు పొడిగింపు, చివరితేది ఎప్పుడంటే?
జాయింట్‌ సీఎస్‌ఐఆర్‌ యూజీసీ- నేషనల్‌ ఎలిజిబిలిటీ టెస్ట్‌(నెట్‌) డిసెంబర్‌-2022/ జూన్‌-2023 దరఖాస్తు గడువు వారం రోజులు పొడిగించినట్లు నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ(ఎన్‌టీఏ) ఒక ప్రకటనలో తెలిపింది. సీఎస్‌ఐఆర్‌ యూజీసీ-నెట్‌ దరఖాస్తు గడువు ఏప్రిల్ 10తో ముగిసిన సంగతి తెలిసిందే. అయితే వివిధ కార‌ణాల వల్ల చాలా మంది అభ్యర్థులు తమ దరఖాస్తులు సమర్పించలేకపోయారు. అభ్యర్థుల నుంచి వచ్చిన విజ్ఞప్తుల మేరకు ఏప్రిల్‌ 17 వ‌ర‌కు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం కల్పించింది. 
పూర్తివివరాల కోసం క్లిక్ చేయండి.. 

ఏపీలో పాలిటెక్నిక్‌ విద్యార్థులకు 'షాక్'! బీటెక్‌లో ప్రవేశాలకు 'బ్రేక్'?
ఏపీలోని పాలిటెక్నిక్ విద్యార్థులకు బీటెక్‌లో ప్రవేశాలకు ప్రభుత్వం బ్రేక్ వేసేలా కనిపిస్తోంది. పాలిటెక్నిక్ తర్వాత ఏడాది తప్పనిసరిగా పరిశ్రమలో పని చేయాలనే కొత్త నిబంధన తీసుకురానుండటమే ఇందుకు కారణం. ఇందుకు సంబంధించిన ప్రతిపాదనలను సాంకేతిక విద్యాశాఖ  ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపింది. కొత్త విధానం ప్రకారం మూడేళ్ల పాలిటెక్నిక్ విద్య పూర్తిచేసుకున్న తర్వాత, నాలుగో ఏడాది తప్పనిసరిగా పరిశ్రమలో పని చేయాల్సి వస్తుంది. దీంతో పాలిటెక్నిక్ ఇక నాలుగేళ్ల కోర్సుగా మారిపోతుంది. ఏటా పాలిటెక్నిక్ నుంచి 35 వేల మంది ఉత్తీర్ణత సాధిస్తుంటే వీరిలో 85 శాతం మంది ఇంజినీరింగ్ ఉమ్మడి ప్రవేశ పరీక్ష(ఈసెట్) ద్వారా బీటెక్ రెండో ఏడాదిలో ప్రవేశం పొందుతున్నారు.
పూర్తివివరాల కోసం క్లిక్ చేయండి..

మరిన్ని విద్యాసంబంధ వార్తల కోసం క్లిక్ చేయండి..

Published at : 12 Apr 2023 11:04 AM (IST) Tags: Indian Institute of Technology Ropar IITR Notification IITR Admissions M.Tech program

సంబంధిత కథనాలు

AP RGUKT IIIT admissions 2023: ఏపీ ట్రిపుల్‌ ఐటీల్లో 2023-24 ప్రవేశాలకు నోటిఫికేషన్‌ విడుదల, ఎంపిక ఇలా!

AP RGUKT IIIT admissions 2023: ఏపీ ట్రిపుల్‌ ఐటీల్లో 2023-24 ప్రవేశాలకు నోటిఫికేషన్‌ విడుదల, ఎంపిక ఇలా!

AP SSC Exams: నేటి నుంచి పదోతరగతి సప్లిమెంటరీ పరీక్షలు, హాజరుకానున్న 2 లక్షలకుపైగా విద్యార్థులు!

AP SSC Exams: నేటి నుంచి పదోతరగతి సప్లిమెంటరీ పరీక్షలు, హాజరుకానున్న 2 లక్షలకుపైగా విద్యార్థులు!

VIDYADHAN: పేద విద్యార్థులకు సహకారం - ‘విద్యాధన్’ ఉపకారం! ఎంపిక, స్కాలర్‌షిప్ వివరాలు ఇలా!

VIDYADHAN: పేద విద్యార్థులకు సహకారం - ‘విద్యాధన్’ ఉపకారం! ఎంపిక, స్కాలర్‌షిప్ వివరాలు ఇలా!

CBSE Exams: సీబీఎస్‌ఈ 10, 12 తరగతి సప్లిమెంటరీ పరీక్షల డేట్‌ షీట్స్‌ విడుదల! ఏ పరీక్ష ఎప్పుడంటే?

CBSE Exams: సీబీఎస్‌ఈ 10, 12 తరగతి సప్లిమెంటరీ పరీక్షల డేట్‌ షీట్స్‌ విడుదల! ఏ పరీక్ష ఎప్పుడంటే?

CMAT Result 2023: సీమ్యాట్-2023 ఫలితాలు విడుదల, స్కోరు కార్డు ఇలా పొందండి!

CMAT Result 2023: సీమ్యాట్-2023 ఫలితాలు విడుదల, స్కోరు కార్డు ఇలా పొందండి!

టాప్ స్టోరీస్

Coromandel Train Accident: కవచ్ సిస్టమ్ ఉండి ఉంటే ప్రమాదం జరిగేది కాదా? ప్రతిపక్షాల వాదనల్లో నిజమెంత?

Coromandel Train Accident: కవచ్ సిస్టమ్ ఉండి ఉంటే ప్రమాదం జరిగేది కాదా? ప్రతిపక్షాల వాదనల్లో నిజమెంత?

Chandra Babu Delhi Tour: ఈ సాయంత్రం ఢిల్లీకి చంద్రబాబు- నేడు అమిత్‌షాతో రేపు ప్రధానితో సమావేశం!

Chandra Babu Delhi Tour: ఈ సాయంత్రం ఢిల్లీకి చంద్రబాబు-  నేడు అమిత్‌షాతో రేపు ప్రధానితో సమావేశం!

Jabardasth Prasad Health : 'జబర్దస్త్' ప్రసాద్‌కి సీరియస్, ఆపరేషన్‌కు లక్షల్లో ఖర్చు - దాతల కోసం ఇమ్మాన్యుయేల్ పోస్ట్

Jabardasth Prasad Health : 'జబర్దస్త్' ప్రసాద్‌కి సీరియస్, ఆపరేషన్‌కు లక్షల్లో ఖర్చు - దాతల కోసం ఇమ్మాన్యుయేల్ పోస్ట్

Coromandel Train Accident: సరిగ్గా 14 ఏళ్ల క్రితం, ఇదే రైలు, శుక్రవారమే ఘోర ప్రమాదం

Coromandel Train Accident: సరిగ్గా 14 ఏళ్ల క్రితం, ఇదే రైలు, శుక్రవారమే ఘోర ప్రమాదం