IIAD: ఐఐఏడీ-న్యూఢిల్లీలో యూజీ, పీజీ కోర్సులు - వివరాలు ఇలా
న్యూఢిల్లీలోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఆర్ట్ అండ్ డిజైన్ (ఐఐఏడీ) 2023-24 విద్యా సంవత్సరానికి డిగ్రీ, పీజీ కోర్సు్ల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల చేసింది.
న్యూఢిల్లీలోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఆర్ట్ అండ్ డిజైన్ (ఐఐఏడీ) 2023-24 విద్యా సంవత్సరానికి డిగ్రీ, పీజీ కోర్సు్ల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల చేసింది. డిగ్రీ కోర్సులకు ఇంటర్ లేదా తత్సమాన విద్యార్హత, పీజీ కోర్సులకు సంబంధిత విభాగంలో డిగ్రీ అర్హత ఉండాలి. సరైన అర్హతలున్నవారు ఆన్‌లైన్ ద్వారా డిసెంబరు 6లోగా దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. రాతపరీక్ష ఆధారంగా ప్రవేశాలు కల్పిస్తారు. డిసెంబరు 16, 17 తేదీల్లో ప్రవేశపరీక్ష నిర్వహిస్తారు.
వివరాలు..
➥ డిగ్రీ (యూజీ) కోర్సులు
సీట్ల సంఖ్య: 200.
విభాగాలు: ఇంటీరియర్ ఆర్కిటెక్చర్ అండ్ డిజైన్, ఫ్యాషన్ డిజైన్, ఫ్యాషన్ బిజినెస్ మేనేజ్‌మెంట్, ఫ్యాషన్ కమ్యూనికేషన్, కమ్యూనికేషన్ డిజైన్.
కోర్సు వ్యవధి: 3/4 సంవత్సరాలు.
అర్హత: కనీసం 50% మొత్తంతో 10+2 (సైన్స్, కామర్స్, హ్యుమానిటీస్/ ఆర్ట్స్) లేదా తత్సమాన అర్హత ఉన్న అభ్యర్థులు అర్హులు. ప్రస్తుత విద్యా సంవత్సరంలో పన్నెండో తరగతి పరీక్షకు హాజరయ్యే లేదా ఫలితాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.
➥ పీజీ కోర్సు
సీట్ల సంఖ్య: 20.
విభాగాలు: ఫ్యాషన్ బిజినెస్ మేనేజ్‌మెంట్
అర్హత: గుర్తింపు పొందిన సంస్థ/ యూనివర్సిటీ నుంచి ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణులు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. చివరి సంవత్సరం డిగ్రీ విద్యార్థులు లేదా ఫలితాల కోసం ఎదురుచూస్తున్న విద్యార్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.
ఎంపిక ప్రక్రియ: ఐఐఏడీ డిజైన్ ఆప్టిట్యూడ్ టెస్ట్, ఐఐఏడీ మేనేజ్‌మెంట్ ఆప్టిట్యూడ్ టెస్ట్, పర్సనల్ ఇంటర్వ్యూ ఆధారంగా.
ముఖ్యమైన తేదీలు...
ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరితేది: 06.12.2023.
ప్రవేశ పరీక్షతేది: 16.12.2023, 17.12.2023.
ALSO READ:
నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ డిజైన్‌లో బ్యాచిలర్ డిగ్రీ కోర్సు, సీట్ల వివరాలు ఇలా!
నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ డిజైన్(ఎన్‌ఐడీ) 2023-2024 విద్యా సంవత్సరానికి సంబంధించి నాలుగేళ్ల బ్యాచిలర్ ఆఫ్ డిజైన్(బీడిజైన్) కోర్సులో ప్రవేశానికి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆంధ్రప్రదేశ్, అహ్మదాబాద్, హరియాణా, మధ్యప్రదేశ్, అసోంలో ఉన్న ఎన్‌ఐడీ క్యాంపస్‌లలో ప్రవేశాలు కల్పిస్తారు. ఇంటర్ లేదా తత్సమాన విద్యార్హత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలున్నవారు డిసెంబరు 1లోగా దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. రెండు దశల రాతపరీక్ష ఆధారంగా ప్రవేశాలు కల్పిస్తారు.
కోర్సు పూర్తివివరాల కోసం క్లిక్ చేయండి..
నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ డిజైన్‌లో మాస్టర్ డిగ్రీ కోర్సు, వివరాలు ఇలా
నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ డిజైన్(ఎన్‌ఐడీ) 2023-2024 విద్యా సంవత్సరానికి సంబంధించి రెండేళ్ల మాస్టర్ ఆఫ్ డిజైన్(బీడిజైన్) కోర్సులో ప్రవేశానికి నోటిఫికేషన్ విడుదల చేసింది. అహ్మదాబాద్, బెంగళూరు, గాంధీనగర్‌లో ఉన్న ఎన్‌ఐడీ క్యాంపస్‌లలో ప్రవేశాలు కల్పిస్తారు. ఇంటర్ లేదా తత్సమాన విద్యార్హత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలున్నవారు డిసెంబరు 1లోగా దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. రెండు దశల రాతపరీక్ష ఆధారంగా ప్రవేశాలు కల్పిస్తారు.
కోర్సు పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..
జేఈఈ మెయిన్, నీట్ షెడ్యూలు విడుదల - ఇతర పరీక్షల తేదీలు ఇలా
దేశంలోని ఉన్నత విద్యాసంస్థల్లో ప్రవేశాలకు సంబంధించి 2024-25 విద్యా సంవత్సరానికి నిర్వహించే పలు ప్రవేశ పరీక్షల వార్షిక క్యాలెండర్‌ను 'నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(ఎన్టీఏ)' ప్రకటించింది. ఎన్టీఏ ప్రకటించిన పరీక్షల షెడ్యూలులో నీట్, జేఈఈ, సీయూఈటీ, నెట్ వంటి పరీక్షల తేదీలు ఉన్నాయి. అధికారిక వెబ్‌సైట్‌లో పరీక్షల షెడ్యూలును అందుబాటులో ఉంచింది.
పరీక్షల పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..