అన్వేషించండి

Telegram Ban: టెలిగ్రామ్ యాప్‌పై తాత్కాలిక నిషేధం.. నీట్ రీఎగ్జామ్ వేళ కేంద్రం కీలక నిర్ణయం

NEET UG 2026 | నీట్ యూజీ రీఎగ్జామ్ దగ్గరపడటంతో కేంద్రం పటిష్ట చర్యలు తీసుకుంటోంది. జూన్ 21 వరకు టెలిగ్రామ్ యాప్ మీద నిషేధం విధించగా.. ఎన్టీఏ ఈ నిర్ణయాన్ని స్వాగతించింది.

న్యూఢిల్లీ: నీట్ యూజీ రీ-ఎగ్జామ్‌ సమయంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. టెలిగ్రామ్‌ యాప్‌పై జూన్ 22 వరకు ప్రభుత్వం తాత్కాలిక నిషేధం విధించింది. పరీక్షను సురక్షితమైన పద్ధతిలో నిర్వహించడానికి, కాపీయింగ్ ముఠాలను అడ్డుకోవడానికి ఈ చర్య తీసుకున్నట్లు తెలుస్తోంది. జూన్ 21న నీట్ యూజీ రీఎగ్జామ్ నిర్వహించనున్నారు. దీంతో పాటు, జూన్ 30 వరకు టెలిగ్రామ్‌లో మెసేజ్ ఎడిట్ చేసే ఫీచర్ కూడా తాత్కాలికంగా నిలిపివేయనున్నారు. నీట్ రీఎగ్జామ్ నిర్వహణలో అవకతవకలు జరగకుండా చూడటంలో భాగంగా కేంద్ర ప్రభుత్వ తీసుకున్న ఈ నిర్ణయాన్ని ఎన్‌టీఏ (NTA) స్వాగతించింది.

జూన్ 21న నీట్ యూజీ రీ-ఎగ్జామ్
నీట్ యూజీ 2026 పరీక్ష జూన్ 21న ఎన్టీఏ నిర్వహిస్తోంది. ఈ క్రమంలో నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ నీట్ విద్యార్థులకు ఊరట కలిగిస్తూ పలు మార్పులను ప్రకటించింది. అన్నింటికంటే ముఖ్యమైన మార్పు పరీక్షా సమయానికి సంబంధించి చేశారు. ఈసారి ఎగ్జామ్ మధ్యాహ్నం 2 గంటల నుండి సాయంత్రం 5 గంటల 15 నిమిషాల వరకు నిర్వహించనున్నారు. మొత్తం 195 నిమిషాల ఈ వ్యవధిని పరీక్షకు కేటాయించారు. 

విద్యార్థుల అభిప్రాయం ప్రకారం, ఈ ఫార్మాలిటీల వల్ల పరీక్షకు సంబంధించిన అసలు సమయం ప్రభావితమవుతుంది. కొత్త విధానం ప్రకారం, విద్యార్థులకు పరీక్ష రాయడానికి తగినంత సమయం దొరికేలా ఎన్‌టీఏ చర్యలు చేపట్టింది. అదే సమయంలో, రఫ్ వర్క్ కోసం కూడా ఈసారి కొత్త సదుపాయం కల్పించారు. ప్రశ్నాపత్రంలో రఫ్ వర్క్ కోసం పేజీల సంఖ్యను పెంచారు. . ఇంతకుముందు విద్యార్థులకు కేవలం 2 పేజీలు లభించేవి, కానీ ఇప్పుడు 4 పేజీలు ఇస్తున్నారు. దాంతో లెక్కలు, రేఖాచిత్రాలు, లాజికల్ ప్రశ్నలను పరిష్కరించడంలో విద్యార్థులకు మరింత సౌకర్యంగా ఉంటుంది.

Also Read: NEET UG 2026 Retest:నీట్‌ యూజీ 2026 రీటెస్టులో కీలక మార్పులు! అదనంగా 15 నిమిషాల టైం! రఫ్‌ వర్క్ కోసం మరిన్ని పేజీలు!

గత నెలలో జరిగిన నీట్ యూజీ ఎగ్జామ్ పేపర్ లీక్ కావడంతో కేంద్ర ప్రభుత్వం పాత పరీక్షను రద్దు చేసింది. విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని, జూన్ 21న రీఎగ్జామ్ నిర్వహిస్తామని విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ప్రకటించారు. ఈసారి పరీక్ష నిర్వహణలో ఎలాంటి లోపాలు లేకుండా అత్యున్నత భద్రతా ప్రమాణాలను, స్ట్రిక్ట్ మానిటరింగ్‌ను ఎన్‌టీఏ (NTA) అమలు చేస్తోంది. పటిష్టమైన లాజిస్టిక్స్ ద్వారా పరీక్ష పారదర్శకతను కాపాడాలని అధికారులు నిర్ణయించారు.

ఈ మార్పులు విద్యార్థులపై ఒత్తిడిని తగ్గించి, వారు ప్రశాంతంగా పరీక్ష రాసేందుకు దోహదపడతాయని ఎన్‌టీఏ భావిస్తోంది. అభ్యర్థులు తమ అడ్మిట్ కార్డులపై ఉన్న సూచనలను క్షుణ్ణంగా చదివి, సకాలంలో పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలని సూచించింది. పరీక్షా కేంద్రాల్లో సిబ్బందికి సహకరించాలని కోరింది. ఈ కొత్త నిబంధనల వల్ల విద్యార్థులు అడ్మినిస్ట్రేటివ్ ఫార్మాలిటీస్ గురించి ఆందోళన చెందకుండా పూర్తిగా పరీక్షపైనే దృష్టి పెట్టవచ్చని నిపుణులు సూచించారు. 

కాక్రోచ్ జనతా పార్టీ నిరసన కార్యక్రమాలు
ప్రస్తుతం కాక్రోచ్ జనలా పార్టీ దేశ వ్యాప్తంగా పలు నగరాల్లో నిరసన కార్యక్రమాలు చేపడుతోంది. నీట్ యూజీ పేపర్ లీక్, సీబీఎస్ఈ పేపర్ లీకులకు బాధ్యత వహించి కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తన పదవికి రాజీనామా చేయాలని కాక్రోచ్ పార్టీ డిమాండ్ చేస్తోంది. లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్ గాలికొదిలేసిన మంత్రిని పదవి నుంచి బర్తరఫ్ చేయాలని కోరుతున్నారు. పేపర్ లీకులపై కేంద్రానికి బాధ్యత లేదా అని ప్రశ్నిస్తున్నారు. హైదరాబాద్ లోనూ కాక్రోచ్ జనతా పార్టీ ఇందిరా పార్క్ లో నిరసన చేపట్టడం తెలిసిందే.

Frequently Asked Questions

నీట్ యూజీ రీఎగ్జామ్ ఎప్పుడు నిర్వహిస్తారు?

నీట్ యూజీ రీఎగ్జామ్ జూన్ 21న ఎన్‌టీఏ (NTA) నిర్వహిస్తుంది. గత నెలలో జరిగిన పరీక్ష పేపర్ లీక్ కావడంతో పాత పరీక్షను రద్దు చేసి ఈ రీఎగ్జామ్ నిర్వహిస్తున్నారు.

నీట్ రీఎగ్జామ్ సమయంలో టెలిగ్రామ్ యాప్‌పై ప్రభుత్వం ఎందుకు నిషేధం విధించింది?

పరీక్షను సురక్షితంగా నిర్వహించడానికి, కాపీయింగ్ ముఠాలను అడ్డుకోవడానికి జూన్ 22 వరకు టెలిగ్రామ్‌పై తాత్కాలిక నిషేధం విధించారు. మెసేజ్ ఎడిట్ చేసే ఫీచర్‌ను కూడా జూన్ 30 వరకు నిలిపివేయనున్నారు.

నీట్ యూజీ రీఎగ్జామ్‌లో పరీక్ష సమయం లేదా ఇతర విధానాలలో ఏమైనా మార్పులు ఉన్నాయా?

అవును, పరీక్ష మధ్యాహ్నం 2 గంటల నుండి సాయంత్రం 5:15 వరకు (మొత్తం 195 నిమిషాలు) జరుగుతుంది. అలాగే, రఫ్ వర్క్ కోసం కేటాయించిన పేజీల సంఖ్యను 2 నుండి 4కి పెంచారు.

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Khudiram Bose:18 ఏళ్లకే ఉరి పీఠాన్ని ముద్దాడిన విప్లవ వీరుడు! ఖుదీరామ్‌ బోస్‌ బలిదానానికి 116 ఏళ్లు!
18 ఏళ్లకే ఉరి పీఠాన్ని ముద్దాడిన విప్లవ వీరుడు! ఖుదీరామ్‌ బోస్‌ బలిదానానికి 116 ఏళ్లు!
Fact Check: విద్యార్థులకు కేంద్రం ఉచితంగా ల్యాప్‌టాప్‌లు ఇస్తుందా? విద్యా మంత్రిత్వ శాఖ ఏం చెప్పింది?
విద్యార్థులకు కేంద్రం ఉచితంగా ల్యాప్‌టాప్‌లు ఇస్తుందా? విద్యా మంత్రిత్వ శాఖ ఏం చెప్పింది?
AP DSC Notification 2026: అక్టోబర్‌లో వచ్చే డీఎస్సీ  సిలబస్ ఇదేనా? మార్పులు ఉంటాయా?
అక్టోబర్‌లో వచ్చే డీఎస్సీ  సిలబస్ ఇదేనా? మార్పులు ఉంటాయా?
JNVST 2027 Registration: నవోదయ విద్యాలయాల్లో ప్రవేశానికి ఇదే చివరి అవకాశం! ఫారం నింపడానికి నేడే లాస్ట్‌ డేట్! 
నవోదయ విద్యాలయాల్లో ప్రవేశానికి ఇదే చివరి అవకాశం! ఫారం నింపడానికి నేడే లాస్ట్‌ డేట్! 
Advertisement

వీడియోలు

VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్
Sarfaraz Khan Makes India Test Comeback | టెస్టు టీమ్‌లోకి సర్ఫరాజ్ ఖాన్ బిగ్ కమ్‌బ్యాక్
Gundenininda Gudigantalu Serial August 11 | మనోజ్‌కు శీలా డార్లింగ్ వార్నింగ్
Who Is Mounisha Chowdary Snow Akka? | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో 'స్నో అక్క'
Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Chandrababu Review: ఎల్‌నినో ఉన్నా ప్రజలపై భారం పడొద్దు.. 15 శాతం వృద్ధిరేటే లక్ష్యం: సీఎం చంద్రబాబు
ఎల్‌నినో ఉన్నా ప్రజలపై భారం పడొద్దు.. 15 శాతం వృద్ధిరేటే లక్ష్యం: సీఎం చంద్రబాబు
Telangana Voter List 2026: తెలంగాణ ఓటర్ల జాబితా నుంచి భారీగా ఓట్లు గల్లంతు! టాప్‌లో హైదరాబాద్! పేరు లేకపోతే ఏం చేయాలి?
తెలంగాణ ఓటర్ల జాబితా నుంచి భారీగా ఓట్లు గల్లంతు! టాప్‌లో హైదరాబాద్! పేరు లేకపోతే ఏం చేయాలి?
Prakash Raj: బెంగళూరు ఓటర్ల జాబితా నుంచి ప్రకాష్‌రాజ్ పేరు తొలగింపు! గేమ్‌ ఆన్ అంటూ నటుడి రియాక్షన్ వైరల్!
బెంగళూరు ఓటర్ల జాబితా నుంచి ప్రకాష్‌రాజ్ పేరు తొలగింపు! గేమ్‌ ఆన్ అంటూ నటుడి రియాక్షన్ వైరల్!
పులిహోర అనే పదం ఎలా వచ్చింది? చరిత్ర, ఆరోగ్యం, ఆధ్యాత్మికత కలసిన దివ్య ప్రసాదం గురించి ఈ విషయాలు తెలుసా?
పులిహోర అనే పదం ఎలా వచ్చింది? చరిత్ర, ఆరోగ్యం, ఆధ్యాత్మికత కలసిన దివ్య ప్రసాదం గురించి ఈ విషయాలు తెలుసా?
17 కేజీల బరువు తగ్గితే.. రెండేళ్ల తర్వాత మళ్లీ ఛాన్స్
17 కేజీల బరువు తగ్గితే.. రెండేళ్ల తర్వాత మళ్లీ ఛాన్స్
Toxic: టాక్సిక్ ఐమ్యాక్స్ రిలీజ్... కన్నడ హీరోల్లో యశ్ రేర్ రికార్డు
టాక్సిక్ ఐమ్యాక్స్ రిలీజ్... కన్నడ హీరోల్లో యశ్ రేర్ రికార్డు
వరుస గాయాలపై BCCI ఫైర్ లక్ష్మణ్ సీక్రెట్ మీటింగ్
వరుస గాయాలపై BCCI ఫైర్ లక్ష్మణ్ సీక్రెట్ మీటింగ్
Kiran Abbavaram: అబ్బవరం ఫ్యామిలీ టూర్... కొడుకు, భార్యతో కిరణ్ ఫోటోలు
అబ్బవరం ఫ్యామిలీ టూర్... కొడుకు, భార్యతో కిరణ్ ఫోటోలు
Embed widget