అన్వేషించండి

NEET UG 2026 Retest:నీట్‌ యూజీ 2026 రీటెస్టులో కీలక మార్పులు! అదనంగా 15 నిమిషాల టైం! రఫ్‌ వర్క్ కోసం మరిన్ని పేజీలు!

NEET UG 2026 Retest:నీట్ యూజీ 2026 రీటెస్టు రాసే అభ్యర్థులకు ఎన్టీఏ కీలక వెసులుబాటు కల్పించింది. పరీక్ష సమయాన్ని 15నిమిషాలు పెంచింది. రఫ్‌ వర్క్ కోసం పేజీలను పెంచుతోంది. 

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • నీట్ యూజీ రీటెస్ట్ సమయం 195 నిమిషాలకు పెంచబడింది.
  • రఫ్ వర్క్ పేజీలు రెండు నుండి నాలుగుకు విస్తరించారు.
  • విద్యార్థుల ఒత్తిడి తగ్గించి, పరీక్షా అనుభవం మెరుగుపరచడమే లక్ష్యం.
  • పరీక్ష పారదర్శకతకు ఎన్టీఏ కఠిన భద్రతా చర్యలు అమలు చేస్తోంది.
  • గతంలో ఉన్న 180 నిమిషాల పరీక్షా సమయాన్ని 195నిమిషాలకు పెంచింది. 
  • ఫిజిక్స్‌, కెమిస్ట్రీ లెక్కల కోసం రఫ్‌ వర్క్ పేజీలను 2 నుంచి నాలుగుకు పెంచింది. 
  • విద్యార్థులపై ఒత్తిడి తగ్గించేందుకు ఈ చర్యలు తీసుకుంది. 

జూన్ 21న జరగనున్న నీట్ యూజీ 2026 రీటెస్ట్ కోసం నేషనల్‌ టెస్టింగ్ ఏజెన్సీ విప్లవాత్మక మార్పులను ప్రకటించింది. అభ్యర్థుల నుంచి వచ్చిన ఫీడ్‌ బ్యాక్ ఆధారంగా పరీక్ష అనుభవాన్ని మెరుగుపరిచేందుకు ఈ స్టూడెంట్‌ ఫ్రెండ్లీ నిర్ణయాలు తీసుకున్నట్టు ఎన్టీఏ స్పష్టం చేసింది. ముఖ్‌యంగా సమయపాలన, రఫ్‌ వర్క్ విషయంలో అభ్యర్థులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను ఈ కొత్త నిబంధనలు తొలగించనున్నాయి. 

అదనంగా 15 నిమిషాల టైం

సాధారణంగా నీట్ పరీక్ష 3 గంటల పాటు జరుగుతుంది. కానీ ఈసారి దానిని 195 నిమిషాలకు పొడిగించారు. పరీక్షా సమయంలో అటెండెన్స్ మార్కింగ్, ఇన్విజిలేషన్ ప్రక్రియలు, ఇతర అడ్మినిస్ట్రేటివ్ పనుల వల్ల విద్యార్థుల విలువైన సమయం వృథా అవుతోంది. ఈ అడ్మిస్ట్రేటివ్ పనుల వల్ల విద్యార్థులు సమాధానాలు రాసే సమయంలో ఎటువంటి కోత పడకూడదనే ఉద్దేశంతో 15నిమిషాలను అదనంగా కలిపారు. ఇప్పుడు పరీక్షా సమయం మధ్యాహ్నం 2 గంటలకు ప్రారంభమై సాయంత్రం 5.15 గంటలకు వరకు ఉంటుంది. 

రఫ్‌ వర్క్ కోసం డబుల్ స్పేస్

నీట్ పరీక్షలో ఫిజిక్స్, కెమిస్ట్రీ విభాగాలు విద్యార్థులకు సవాలుగా మారుతుంటాయి. వీటికి ఎక్కువ క్యాలిక్యులేషన్స్‌ అవసరమవుతాయి. గతంలో రఫ్‌ వర్క్‌ కోసం కేవలం రెండు పేజీలు మాత్రమే ఉండేవి. దీని వల్ల విద్యార్థులు ఇబ్బంది పడేవారు. ప్రస్తుతం ఈ పేజీల సంఖ్యను నాలుగుకు పెంచారు. అంటే విద్యార్థులకు లెక్కలు చేసుకునేందుకు రెట్టింపు స్థలం లభిస్తుంది. అంతేకాకుండా క్వశ్చన్ బుక్‌లెట్‌ చివరలోనే కాకుండా, ఇన్‌స్ట్రక్షన్ పేజీ తర్వాత వెంటనే రెండు పేజీలు చివరలో మరో రెండు పేజీలు కేటాయించారు ఈ సౌకర్యం ఇంగ్లీష్‌తోపాటు అన్ని ప్రాంతీయ భాషల క్వశ్చన్ పేపర్లలోనూ అందుబాటులో ఉంటుందని ఎన్టీఏ వెల్లడించింది. 

కఠిన భద్రతా చర్యలు 

నీట్ యూజీ 2026 పరీక్షపై లీక్‌ ఆరోపణలు రావడంతో పాత పరీక్షను రద్దు చేసి, ఈ రీటెస్టు నిర్వహిస్తున్నారు. అందుకే ఈసారి పరీక్ష నిర్వహణలో ఎటువంటి లోపాలు లేకుండా అత్యున్నత భద్రతా ప్రమాణాలను ఎన్టీఏ అమలు చేస్తోంది. స్ట్రిక్ట్ మానిటరింగ్, పటిష్టమైన లాజిస్టిక్స్ ద్వారా పరీక్ష పారదర్శకతను కాపాడాలని అధికారులు నిర్ణయించారు. చిన్నపాటి మార్పులు కూడా విద్యార్థులపై ఒత్తిడిని తగ్గించి, వారు ప్రశాంతంగా పరీక్ష రాసేలా చేస్తాయని ఎన్టీఏ నమ్ముతోంది. 

అభ్యర్థులకు సూచనలు 

అభ్యర్థులు తమ అడ్మిట్ కార్డులపై ఉన్న సూచనలను క్షుణ్ణంగా చదవాలని ఎన్టీఏ కోరింది. పరీక్షా కేంద్రాల్లో సిబ్బందికి సహకరిస్తూ, సకాలంలో కేంద్రానికి చేరుకోవడం చాలా అవసరం. జూన్ 21న జరిగే ఈ పరీక్ష అభ్యర్థుల భవిష్యత్‌ను నిర్ణయించే కీలక ఘట్టం కావడంతో ప్రతి నిమిషాన్ని సద్వినియోగ చేసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.  ఈ కొత్త నిబంధనల వల్ల విద్యార్థులు అడ్మినిస్ట్రేటివ్ ఫార్మాలిటీస్ గురించి ఆందోళన చెందకుండా పూర్తిగా పరీక్షపైనే దృష్టి పెట్టవచ్చు.                             

Frequently Asked Questions

నీట్ యూజీ పరీక్ష సమయం పెరిగిందా?

అవును, పరీక్ష సమయాన్ని 180 నిమిషాల నుండి 195 నిమిషాలకు పెంచారు. అడ్మినిస్ట్రేటివ్ పనుల వల్ల విలువైన సమయం వృథా కాకుండా ఈ నిర్ణయం తీసుకున్నారు.

రఫ్ వర్క్ కోసం కేటాయించిన పేజీల సంఖ్య పెరిగిందా?

అవును, ఫిజిక్స్, కెమిస్ట్రీ లెక్కల కోసం రఫ్ వర్క్ పేజీలను 2 నుండి 4కు పెంచారు. ఇది విద్యార్థులకు లెక్కలు చేసుకునేందుకు రెట్టింపు స్థలాన్ని అందిస్తుంది.

ఎన్టీఏ ఈ మార్పులను ఎందుకు చేసింది?

విద్యార్థులపై ఒత్తిడి తగ్గించడానికి, పరీక్ష అనుభవాన్ని మెరుగుపరచడానికి ఎన్టీఏ ఈ మార్పులను ప్రకటించింది. అభ్యర్థుల ఫీడ్‌బ్యాక్ ఆధారంగా ఈ నిర్ణయాలు తీసుకున్నారు.

టాప్ హెడ్ లైన్స్

Pilot Career : పైలట్ కావాలంటే 10 తర్వాత ఏం చదవాలి? కోర్సు, ట్రైనింగ్, జీతం పూర్తి వివరాలు ఇవే
పైలట్ కావాలంటే 10 తర్వాత ఏం చదవాలి? కోర్సు, ట్రైనింగ్, జీతం పూర్తి వివరాలు ఇవే
CBSE 10th Rules: సీబీఎస్ఈ 10వ తరగతి విద్యార్థులకు బిగ్ రిలీఫ్.. ఉత్తీర్ణత రూల్స్‌లో మార్పుల్లేవ్!
సీబీఎస్ఈ 10వ తరగతి విద్యార్థులకు బిగ్ రిలీఫ్.. ఉత్తీర్ణత రూల్స్‌లో మార్పుల్లేవ్!
Study in Germany: జర్మనీలో చదువు ఫ్రీ.. కానీ ట్యూషన్ ఫీజులు, అసలు ఖర్చుల గురించి తెలుసా?
జర్మనీలో చదువు ఫ్రీ.. కానీ ట్యూషన్ ఫీజులు, అసలు ఖర్చుల గురించి తెలుసా?
Local Reservation In Telangana: తెలంగాణలో స్థానికత అంశంపై సుప్రీంకోర్టు క్లారిటీ.. వారికి మాత్రమే లోకల్ రిజర్వేషన్
తెలంగాణలో స్థానికత అంశంపై సుప్రీంకోర్టు క్లారిటీ.. వారికి మాత్రమే లోకల్ రిజర్వేషన్ అని తీర్పు

వీడియోలు

India vs Pakistan Asian Games 2026 Final | భారత్ - పాకిస్థాన్ మ్యాచ్‌లో షేక్ హ్యాండ్ ఉంటుందా?
Gautam Gambhir Slams Flat Pitches vs WI | పిచ్‌ల తీరుపై గౌతమ్ గంభీర్ తీవ్ర అసహనం
Ishan Kishan Knock in Asian Games 2026 | శ్రీలంకపై ఘన విజయం సాధించి ఫైనల్‌లోకి భారత్
Rohit Virat Final Match in Guwahati? | గౌహతి వేదికగా రోహిత్, కోహ్లీ చివరి మ్యాచ్?
Reason for Virat Kohli Test Retirement | విరాట్ టెస్ట్ రిటైర్మెంట్ వెనుక అసలు నిజం ఇదే

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana Finances: బకాయిల సుడిగుండంలో తెలంగాణ: రూ. 65 వేల కోట్ల పెండింగ్ బిల్లులు - రేవంత్ ప్రభుత్వానికి ఆర్థిక సవాల్!
బకాయిల సుడిగుండంలో తెలంగాణ: రూ. 65 వేల కోట్ల పెండింగ్ బిల్లులు - రేవంత్ ప్రభుత్వానికి ఆర్థిక సవాల్!
AP NTR Bharosa New Pensions: ఏపీలో కొత్త పింఛన్ల చిక్కుముడి- 13 లక్షల దరఖాస్తులు - కూటమికి ఆర్థిక, రాజకీయ భారం - అసంతృప్తి తప్పదా?
ఏపీలో కొత్త పింఛన్ల చిక్కుముడి- 13 లక్షల దరఖాస్తులు - కూటమికి ఆర్థిక, రాజకీయ భారం - అసంతృప్తి తప్పదా?
Harish Rao Siddipet : సిరిసిల్ల తర్వాత సిద్ధిపేటపై రేవంత్ కన్ను - హరీష్ రావు కోటలో కాంగ్రెస్ రణభేరి ఫలిస్తుందా?
సిరిసిల్ల తర్వాత సిద్ధిపేటపై రేవంత్ కన్ను - హరీష్ రావు కోటలో కాంగ్రెస్ రణభేరి ఫలిస్తుందా?
YSRCP Local Elections Strategy: స్థానిక ఎన్నికల్లో జగన్ మార్క్ క్లాస్ - కూటమి విభేదాలపై వైఎస్సార్‌సీపీ పొలిటికల్ అటాక్ -
స్థానిక ఎన్నికల్లో జగన్ మార్క్ క్లాస్ - కూటమి విభేదాలపై వైఎస్సార్‌సీపీ పొలిటికల్ అటాక్ -
Weight Loss Journey : 100 కిలోల నుంచి 72 కిలోలు తగ్గిన డాక్టర్.. ఈ 3 అలవాట్లతో ఆరోగ్యంలో కూడా ఊహించని మార్పులు వచ్చాయట
100 కిలోల నుంచి 72 కిలోలు తగ్గిన డాక్టర్.. ఈ 3 అలవాట్లతో ఆరోగ్యంలో కూడా ఊహించని మార్పులు వచ్చాయట
MLA Chintamaneni Prabhakar: వెదురుపావులూరు టోల్ ప్లాజా ఘటనలో ఎమ్మెల్యే చింతమనేని ఏ సంబంధం లేదు, అసలేం జరిగిందంటే
వెదురుపావులూరు టోల్ ప్లాజా ఘటనలో ఎమ్మెల్యే చింతమనేని ఏ సంబంధం లేదు, అసలేం జరిగిందంటే
Flydubai Attack: నమాజ్ చేసుకుంటానని లేచి, వెనుక నుంచి గొడ్డలితో దాడి! ఏం జరిగిందో చెప్పిన స్మిత్ మచ్చర్‌
నమాజ్ చేసుకుంటానని లేచి, వెనుక నుంచి గొడ్డలితో దాడి! ఏం జరిగిందో చెప్పిన స్మిత్ మచ్చర్‌
Chickpeas Benefits : ఉదయాన్నే ఖాళీ కడుపుతో శనగలు తింటే కలిగే లాభాలివే.. రాత్రుళ్లు నానబెట్టి పచ్చిగా తినాలా? ఉడికించి తింటే బెటరా?
ఉదయాన్నే ఖాళీ కడుపుతో శనగలు తింటే కలిగే లాభాలివే.. రాత్రుళ్లు నానబెట్టి పచ్చిగా తినాలా? ఉడికించి తింటే బెటరా?
Embed widget