News
News
X

GATE 2023 Notification: 'గేట్-2023' నోటిఫికేషన్ వచ్చేసింది- అర్హత, దరఖాస్తు ఫీజు వివరాలు

గేట్-2023 పరీక్ష నిర్వహణ బాధ్యతలను ఐఐటీ కాన్పూర్ చేపట్టంది. సరైన అర్హతలు ఉన్నవారు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో పరీక్షలు నిర్వహిస్తారు

FOLLOW US: 

దేశంలోని ప్రతిష్ఠాత్మక విద్యాసంస్థల్లో పీజీ చదవాలన్నా, నేరుగా పీహెచ్‌డీ చేయాలన్నా.. 'గేట్' అర్హత ఉండాల్సిందే. గేట్‌లో వచ్చే స్కోరు ఆధారంగానే ఐఐటీలు, ఎన్ఐటీలు, ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్సెస్, యూనివర్సిటీలు, ప్రముఖ ఇంజినీరింగ్ కళాశాలల్లో ఇంజినీరింగ్, టెక్నాలజీ, ఆర్కిటెక్చర్, ఫార్మసీ విభాగాల్లో ప్రవేశాలు కల్పిస్తారు. ఈ క్రమంలోనే ఐఐటీ కాన్పూర్ 'గేట్-2023' నోటిఫికేషన్‌ను విడుదల చేసింది.

గేట్-2023 పరీక్షలను 2023లో ఫిబ్రవరి 4, 5, 11, 12 తేదీల్లో నిర్వహించనున్నారు. మొత్తం 29 సబ్జెక్టుల్లో గేట్ పరీక్ష నిర్వహిస్తారు.  మార్చి 16న ఫలితాలను వెల్లడించనున్నారు. ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ఆగస్టు 30 నుంచి ప్రారంభం కానుంది. సెప్టెంబరు 30 వరకు దరఖాస్తులు స్వీకరిస్తారు. అపరాధ రుసుముతో అక్టోబరు 7 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.

గేట్ ద్వారా దేశవ్యాప్తంగా ఉన్న 7 ఐఐటీలు (బొంబయి, ఢిల్లీ, గువాహటి, కాన్పూర్, ఖరగ్‌పూర్, మద్రాస్, రూర్కీ)తోపాటు బెంగళూరులోని ఇండియన్ ఇన్‌స్టిట్ ఆఫ్ సైన్స్, ఇతర ప్రభుత్వరంగ విద్యాసంస్థల్లో డిగ్రీ, పీహెచ్‌డీ కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తారు. ఇతర ప్రైవేట్ యూనివర్సిటీలు, విద్యాసంస్థలు కూడా గేట్ స్కోరునే ప్రవేశాలకు ప్రామాణికంగా తీసుకుంటాయి. కొన్ని ప్రభుత్వ సంస్థలు గేట్ స్కోరు ద్వారా ఉద్యోగావకాశాలు కూడా కల్పిస్తున్నాయి.

అర్హతలు..
✦ బ్యాచిలర్స్ డిగ్రీ (ఇంజినీరింగ్/టెక్నాలజీ).
✦ బ్యాచిలర్స్ డిగ్రీ (ఆర్కిటెక్చర్).
✦ బ్యాచిలర్ ఆఫ్ సైన్స్ విభాగంలో నాలుగేళ్ల డిగ్రీ.
✦ మాస్టర్ డిగ్రీ (సైన్స్/మ్యాథ్స్/స్టాటిస్టిక్స్/కంప్యూటర్ అప్లికేషన్స్).
✦ నాలుగేళ్ల ఇంటిగ్రేడెట్ మాస్టర్ డిగ్రీ (ఇంజినీరింగ్/టెక్నాలజీ).
✦ ఐదేళ్ల ఇంటిగ్రేడెట్ మాస్టర్ డిగ్రీ లేదా డ్యూయల్ డిగ్రీ (ఇంజినీరింగ్/టెక్నాలజీ).
✦ చివరి సంవత్సరం చదువుతున్న విద్యార్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.

దరఖాస్తు ఎలా?

✦ గేట్ పరీక్షకు దరఖాస్తు చేయగోరువారు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. సంబంధిత వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి.
✦ రిజిస్ట్రేషన్ తర్వాత అభ్యర్థికి యూజర్ ఐడీ, పాస్‌వర్డ్ వస్తాయి. వీటి ద్వారా గేట్‌కు సంబంధించిన భవిష్యత్ అవసరాలకు ఉపయోగపడుతుంది.
✦ దరఖాస్తు సమయంలో విద్యార్హతకు సంబంధించిన సర్టిఫికేట్ స్కాన్ కాపీలు, ప్రొవిజనల్ సర్టిఫికేట్లు అందుబాటులో ఉంచుకోవాలి.
✦ ఐడీ ప్రూఫ్ తప్పనిసరిగా అవసరమవుతుంది. ఐడీ ప్రూఫ్‌గా పాస్‌పోర్ట్, పాన్ కార్డు, ఓటరు కార్డు, ఆధార్ కార్డు, డ్రైవింగ్ లైసెన్స్, కాలేజీ ఐడీ, ఎంప్లాయ్ ఐడీకార్డుల్లో ఏదైనా ఒకటి తప్పనిసరిగా ఉండాలి.

దరఖాస్తు ఫీజు...

  • ఎస్సీ, ఎస్టీ, దివ్యాగులు, మహిళా అభ్యర్థులు రూ.850 (ఆలస్య రుసుముతో రూ.1350) చెల్లించాల్సి ఉంటుంది.
  • జనరల్/ ఓబీసీ అభ్యర్థులు రూ.1700 (ఆలస్య రుసుముతో రూ.2200) చెల్లించాల్సి ఉంటుంది.
  • ఢాకా, ఖాఠ్మండ్ దేశాల అభ్యర్థులు 100 యూఎస్ డాలర్లు, ఆలస్య రుసుముతో 150 యూఎస్ డాలర్లు చెల్లించాలి.
  • దుబాయి, సింగపూర్ దేశాల అభ్యర్థులు 200 యూఎస్ డాలర్లు 250 యూఎస్ డాలర్లు చెల్లించాలి.

పరీక్ష ఎలా ఉంటుంది?
✦ మొత్తం 29 సబ్జెక్టుల్లో గేట్ పరీక్ష నిర్వహిస్తారు. దేశంలోని అన్ని ప్రధాన నగరాలతోపాటు.. ఇతర దేశాలలోని నగరాల్లో కూడా గేట్ పరీక్ష నిర్వహిస్తారు.✦ ప్రకటించిన తేదీల్లో మొత్తం రెండు సెషన్లలో గేట్ పరీక్షలు నిర్వహిస్తారు. పరీక్ష సమయం 3 గంటలు.
✦ ఆన్‌లైన్ విధానంలో నిర్వహించే గేట్ పరీక్షలో 100 మార్కులకు 65 ప్రశ్నలు అడుగుతారు. వీటిలో జనరల్ ఆప్టిట్యూడ్ నుంచి 10 ప్రశ్నలకుగాను 15 మార్కులు; టెక్నికల్, ఇంజినీరింగ్, మ్యాథమెటిక్స్ విభాగాల నుంచి 55 ప్రశ్నలకుగాను 85 మార్కులు ఉంటాయి.
✦ నెగెటివ్ మార్కులు కూడా ఉన్నాయి. 1 మార్కు ప్రశ్నలకు ప్రతి తప్పు సమాధానానాకి 1/3 చొప్పున, 2 మార్కుల ప్రశ్నలకు ప్రతి తప్పు సమాధానానాకి 2/3 చొప్పున కోత విధిస్తారు.

ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో పరీక్ష కేంద్రాలు: అనంతపురం, కర్నూలు, ఏలూరు, కాకినాడ, రాజమహేంద్రవరం, శ్రీకాకుళం, తాడేపల్లిగూడెం, విజయవాడ, విశాఖపట్నం, విజయనగరం, చీరాల, చిత్తూరు, గూడూరు, గుంటూరు, నెల్లూరు, ఒంగోలు, తిరుపతి, హైదరాబాద్, కోదాడ, నిజామాబాద్, సూర్యాపేట, వరంగల్.

ముఖ్యమైన తేదీలు...

ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం               :           30.08.2022.

ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరితేది                          :           30.09.2022.

ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరితేది (ఎక్స్ టెండెడ్)  :          07.10.2022.

అడ్మిట్‌కార్డు డౌన్‌లోడ్                                         :           03.01.2023.

అభ్యర్థుల రెస్పాన్స్-అప్లికేషన్ పోర్టల్                 :           15.02.2023.

ఆన్సర్ కీ అందుబాటులో                                    :           21.02.2023.

ఆన్సర్ కీ పై అభ్యంతరాల సమర్పణ                 :           22 - 25.02.2023.

గేట్ పరీక్ష తేదీలు 2020                                      :           ఫిబ్రవరి 4, 5, 11, 12 తేదీల్లో.

ఫలితాల వెల్లడి                                                  :           16.03.2023.

గేట్ స్కోర్ కార్డు డౌన్‌లోడ్                                    :           22.03.2023

GATE - 2023 NOTIFICATION

INFORMATION BROCHURE

FEE DETAILS

GATE 2023 PAPERS & SYLLABUS

QUESTION PATTERN

WEBSITE

 

Published at : 29 Jul 2022 05:58 PM (IST) Tags: Gate exam dates GATE 2023 NOTIFICATION GATE 2023 Application

సంబంధిత కథనాలు

JEE Advanced 2022 Registration: జేఈఈ అడ్వాన్స్‌డ్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం, చివరితేది ఎప్పుడంటే?

JEE Advanced 2022 Registration: జేఈఈ అడ్వాన్స్‌డ్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం, చివరితేది ఎప్పుడంటే?

AP ICET 2022 Results: ఏపీ ఐసెట్‌ - 2022 ఫలితాలు విడుదల, రిజల్ట్స్ ఇక్కడ చూసుకోండి!

AP ICET 2022 Results: ఏపీ ఐసెట్‌ - 2022 ఫలితాలు విడుదల, రిజల్ట్స్ ఇక్కడ చూసుకోండి!

NTA JEE Main Result 2022: జేఈఈ మెయిన్ ఫలితాలు విడుదల - రిజల్ట్, ర్యాంక్ కార్డ్ ఇలా డౌన్‌లోడ్ చేసుకోండి

NTA JEE Main Result 2022: జేఈఈ మెయిన్ ఫలితాలు విడుదల - రిజల్ట్, ర్యాంక్ కార్డ్ ఇలా డౌన్‌లోడ్ చేసుకోండి

Employment Office: నిరుద్యోగులకు గుడ్ న్యూస్, ఉపాధి కల్పన వయోపరిమితి పెంపు!!

Employment Office: నిరుద్యోగులకు గుడ్ న్యూస్, ఉపాధి కల్పన వయోపరిమితి పెంపు!!

TS EAMCET Results: టీఎస్‌ ఎంసెట్‌ ఫలితాలు వచ్చేస్తున్నాయ్, రిజల్ట్స్ ఎప్పుడంటే?

TS EAMCET Results: టీఎస్‌ ఎంసెట్‌ ఫలితాలు వచ్చేస్తున్నాయ్, రిజల్ట్స్ ఎప్పుడంటే?

టాప్ స్టోరీస్

Dangerous Job: ప్రపంచంలో ప్రమాదకరమైన ఉద్యోగం ఇదే, ఈ పని చేసిన వారు 50 ఏళ్లు బతకడం చాలా కష్టం

Dangerous Job: ప్రపంచంలో ప్రమాదకరమైన ఉద్యోగం ఇదే, ఈ పని చేసిన వారు 50 ఏళ్లు బతకడం చాలా కష్టం

Maharashtra Cabinet Expansion: ఎట్టకేలకు 'మహా' కేబినెట్ విస్తరణ- 18 మందికి చోటు, మహిళలకు నో ఛాన్స్!

Maharashtra Cabinet Expansion: ఎట్టకేలకు 'మహా' కేబినెట్ విస్తరణ- 18 మందికి చోటు, మహిళలకు నో ఛాన్స్!

Happy Rakhi Pournami 2022: రక్షా బంధన్ శుభముహూర్తం ఎప్పుడు, రాఖీ ఏ టైమ్ లో కట్టాలి!

Happy Rakhi Pournami 2022: రక్షా బంధన్ శుభముహూర్తం ఎప్పుడు, రాఖీ ఏ టైమ్ లో కట్టాలి!

Munugodu ByElections : చలో మునుగోడు ! తెలంగాణ రాజకీయం అంతా ఇక అక్కడే

Munugodu ByElections : చలో మునుగోడు ! తెలంగాణ రాజకీయం అంతా ఇక అక్కడే