News
News
abp shortsABP షార్ట్స్వీడియోలు ఆటలు
X

IIT Delhi: ఐఐటీ ఢిల్లీలో న్యూ ఎంటెక్ కోర్సు.. చేస్తే ఉద్యోగావకాశలు ఎక్కువే!

ఎంటెక్ లో కొత్త కోర్సు చేయాలనుకుంటున్నారా? అయితే ఢిల్లీ ఐఐటీ కొత్త కోర్సను ఆఫర్ చేస్తోంది. పూర్తి వివరాలు తెలుసకోండి.

FOLLOW US: 
Share:

ఇండియన్​ ఇన్​స్టిట్యూట్ ఆఫ్​ టెక్నాలజీ ఢిల్లీ.. కొత్త పోస్ట్​ గ్రాడ్యుయేట్​ కోర్సును ప్రారంభించింది. స్కూల్​ ఆఫ్​ ఆర్టిఫిషియల్​ ఇంటెలిజెన్స్ కింద మెషిన్ ఇంటెలిజెన్స్ అండ్​ డేటా సైన్స్‌లో కొత్త ఎంటెక్​ కోర్సును ప్రకటించింది.

ఈ మధ్యకాలంలో దేశవ్యాప్తంగా ఉన్న ప్రతిష్టాత్మక విద్యాసంస్థలు... కంపెనీల అవసరాలకు సరిపోయేలా కోర్సులపై దృష్టి పెట్టాయి. కొత్తగా ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఢిల్లీ కొత్త పోస్ట్​ గ్రాడ్యుయేట్​ కోర్సును ప్రారంభించింది. స్కూల్​ ఆఫ్​ ఆర్టిఫిషియల్​ ఇంటెలిజెన్స్ కింద మెషిన్ ఇంటెలిజెన్స్ అండ్​ డేటా సైన్స్‌లో కొత్త ఎంటెక్​ కోర్సును విద్యార్థులకు ఆఫర్ చేస్తోంది. ఈ కోర్సు జులై 2022 నుంచి అందుబాటులోకి రానుంది.

ఇటీవలే ఐఐటీ ఢిల్లీ ‘ఎంటెక్​ ఇన్ మెషిన్ ఇంటెలిజెన్స్ అండ్ డేటా సైన్స్ (MINDS)’ పేరుతో ఓ కొత్త ప్రోగ్రామ్‌ను ఆమోదించింది. ఈ ప్రోగ్రామ్​కు అనుసంధానంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌లో పీహెచ్‌డీ కోర్సును ఇప్పటికే ప్రారంభించింది. దీనికి అదనంగా పోస్ట్​ గ్రాడ్యుయేట్​ ప్రోగ్రామ్​ను ఆఫర్ చేస్తోంది.

ఆర్టిఫిషియల్​ ఇంటెలిజెన్స్​ కోర్సు ప్రస్తుతం ట్రెండింగ్​లో ఉందని ప్రొఫెసర్ మౌసమ్ తెలిపారు. ఈ కోర్సు నేర్చుచుకున్న వారికి ఐటీ రంగంలో అపారమైన ఉద్యోగ అవకాశాలు ఉంటాయన్నారు. కిందటి సంవత్సరం ఆర్టిఫిషియల్​ ఇంటెలిజెన్స్​లో పీహెచ్‌డీ ప్రోగ్రామ్​ను ప్రారంభించామని..  ప్రోగ్రామ్​కు అనూహ్యమైన స్పందన లభించిందని చెప్పారు. ప్రస్తుతం పోస్ట్​ గ్రాడ్యుయేట్​ ప్రోగ్రామ్​ను ఆఫర్​ చేస్తున్నామన్నారు.

'మైక్రోసాఫ్ట్ రీసెర్చ్, గూగుల్ ఏఐ, ఐబీఎం రీసెర్చ్ వంటి ఇండస్ట్రీ రీసెర్చ్​ సెంటర్లలో పనిచేస్తున్న 40 మంది అనుభవజ్ఞులను ఫ్యాకల్టీలుగా నియమించాం. ఈ కొత్త ఎంటెక్ ప్రోగ్రామ్​ ఇండస్ట్రీ ఓరియెంటెడ్ విధానంలో ఉంటుంది. ఈ ప్రోగ్రామ్​లో ఐఐటీ ఢిల్లీ ప్రొఫెసర్, స్పాన్సరింగ్ కంపెనీకి చెందిన ఒక రిసెర్చ్​ స్కాలర్​ హెడ్​గా పనిచేస్తారు. సైన్స్​, కంప్యూటర్ విభాగంలో బీఈ/బీటెక్​ పూర్తి చేసిన విద్యార్థులందరూ MINDS ప్రోగ్రామ్‌లో చేరేందుకు అర్హులు.' అని ప్రొఫెసర్ మౌసమ్ తెలిపారు.

Also Read: SHE STEM 2021: విద్యార్థులకు లక్కీ ఛాన్స్.. ఇలా.. ఇన్ స్టా గ్రామ్ రీల్ చేయండి.. ప్రైజ్ గెలవండి 

Also Read: New Courses: ఇదిగో కొత్త కోర్సులు.. పూర్తి చేయగానే జాబ్ వచ్చేలా డిజైన్.. ఇక చేయడమే లేటు

Also Read: Cryptocurrency Payment: ఫర్ ది ఫస్ట్ టైమ్.. ఈ కాలేజీలో కోర్సుకు క్రిప్టో కరెన్సీలో ఫీజు చెల్లించొచ్చు  

Also Read: Army College: తొలిసారి ఆర్మీ కాలేజీలో బాలికలకూ ప్రవేశం... దరఖాస్తులకు చివరి తేదీ ఎప్పుడంటే

Published at : 03 Nov 2021 04:03 PM (IST) Tags: Artificial Intelligence IIT Delhi machine intelligence New Course In IIT Delhi

ఇవి కూడా చూడండి

Software Training: సాఫ్ట్‌వేర్‌ కోర్సులో ఉచిత ఉపాధి శిక్షణ, ఈ అర్హతలుండాలి

Software Training: సాఫ్ట్‌వేర్‌ కోర్సులో ఉచిత ఉపాధి శిక్షణ, ఈ అర్హతలుండాలి

CPGET: సీపీగెట్-2023 సీట్ల కేటాయింపు పూర్తి, అమ్మాయిలకే 73 శాతం సీట్లు

CPGET: సీపీగెట్-2023 సీట్ల కేటాయింపు పూర్తి, అమ్మాయిలకే 73 శాతం సీట్లు

Degree Seats: 'దోస్త్' స్పెషల్ రౌండ్ కౌన్సెలింగ్, మరో 6,843 మందికి విద్యార్థులకు సీట్లు

Degree Seats: 'దోస్త్' స్పెషల్ రౌండ్ కౌన్సెలింగ్, మరో 6,843 మందికి విద్యార్థులకు సీట్లు

ఇంటర్‌ ఫస్టియర్‌ విద్యార్థులకు ప్రాక్టికల్స్‌, ఈ ఏడాది నుంచే అమలు

ఇంటర్‌ ఫస్టియర్‌ విద్యార్థులకు ప్రాక్టికల్స్‌, ఈ ఏడాది నుంచే అమలు

తెలుగు యూనివర్సిటీ కోర్సుల్లో స్పాట్ ప్రవేశాలు

తెలుగు యూనివర్సిటీ కోర్సుల్లో స్పాట్ ప్రవేశాలు

టాప్ స్టోరీస్

Chandrababu Naidu Arrest : చంద్రబాబు మాజీ పీఎస్‌ సస్పెండ్ - అమెరికాకు వెళ్లి తిరిగిరాలేదన్న ప్రభుత్వం !

Chandrababu Naidu Arrest :  చంద్రబాబు మాజీ పీఎస్‌ సస్పెండ్ - అమెరికాకు వెళ్లి తిరిగిరాలేదన్న ప్రభుత్వం !

IND Vs ENG: ఇంగ్లండ్‌పై టాస్ గెలిచిన టీమిండియా - మొదట బ్యాటింగ్ ఎంచుకున్న రోహిత్!

IND Vs ENG: ఇంగ్లండ్‌పై టాస్ గెలిచిన టీమిండియా - మొదట బ్యాటింగ్ ఎంచుకున్న రోహిత్!

30 వచ్చేసింది కాంగ్రెస్‌లో వైఎస్‌ఆర్‌టీపీ విలీనం లేనట్టేనా! షర్మిల నెక్స్ట్‌ స్టెప్‌ ఏంటీ?

30 వచ్చేసింది కాంగ్రెస్‌లో వైఎస్‌ఆర్‌టీపీ విలీనం లేనట్టేనా! షర్మిల నెక్స్ట్‌ స్టెప్‌ ఏంటీ?

జగన్ ప్లాన్ సక్సెస్ అయినట్టేనా!- ప్రజాసమస్యలు వదిలేసి కేసుల చుట్టే టీడీపీ చర్చలు

జగన్ ప్లాన్ సక్సెస్ అయినట్టేనా!- ప్రజాసమస్యలు వదిలేసి కేసుల చుట్టే టీడీపీ చర్చలు