Cryptocurrency Payment: ఫర్ ది ఫస్ట్ టైమ్.. ఈ కాలేజీలో కోర్సుకు క్రిప్టో కరెన్సీలో ఫీజు చెల్లించొచ్చు
పరిస్థితులు మారుతున్నాయి.. రానురాను డిజిటల్ కరెన్సీతోనే లావాదేవీలు జరుగుతున్నాయి. తాజాగా ఓ కళాశాల కూడా.. తమ కళాశాలలో చెప్పే కోర్సుకు ఫీజు చెల్లించేందుకు క్రిప్టోకరెన్సీని అనుమతిచ్చింది.
క్రిప్టో కరెన్సీని చాలా మంది కంపెనీల్లో అనుమతి లభిస్తోంది. ఇటీవలే ఢిల్లీలోని ఓ హోటల్ లో పేమెంట్ చేసేందుకు కూడా క్రిప్టో కరెన్సీకి అనుమతించారు. అయితే తాజాగా ఓ కళాశాలలోనూ కోర్సు ఫీజు చెల్లించేందుకు ఈ క్రిప్టో కరెన్సీని అనుమతి లభించింది. ఇప్పటికే.. కొన్ని కంపెనీలు.. ఈ వర్చువల్ డిజిటల్ కరెన్సీని ఆమోదిస్తున్నాయి. తమ కంపెనీలలో చెల్లింపులకు దీనిని ఉపయోగిస్తున్నాయి.
యూఎస్ లోని పెన్సిల్వేనియా విశ్వవిద్యాలయానికి చెందిన వార్టన్ స్కూల్లో ఈ క్రిప్టోకరెన్సీని ఐవీ లీగ్ కళాశాలలో కోర్సు చేసే వారికి ఫీజు చెల్లించొచ్చని చెప్పింది. ఐవీ లీగ్ కళాశాల జనవరి 3, 2022 నుంచి ఓ కోర్సు ప్రారంభించనుంది. దానికి క్రిప్టో చెల్లింపులను అంగీకరిస్తున్నట్లు పేర్కొంది.
ఎకనామిక్స్ ఆఫ్ బ్లాక్‌చెయిన్ మరియు డిజిటల్ అసెట్స్ అనే కోర్సు జనవరి 3, 2022 నుంచి ఫిబ్రవరి 20, 2022 వరకు ఐవీ లీగ్ కళాశాలలో చెప్పనున్నారు. అయితే ఈ కోర్సుకు క్రిప్టో కరెన్సీలో ఫీజు చెల్లించొచ్చని ప్రకటించింది ఆ కళాశాల. ఈ కోర్సుకు $3,800 ఖర్చు అవుతుంది. ఇతర పద్ధతులతోపాటు క్రిప్టో కరెన్సీలో చెల్లింపులు చేయోచ్చు. అమెరికన్ క్రిప్టోకరెన్సీ ఎక్స్ఛేంజ్ ప్లాట్‌ఫారమ్ అయిన CoinBase ద్వారా క్రిప్టో చెల్లింపు జరుగుతాయి.
బ్లాక్‌చెయిన్‌లు మరియు డిజిటల్ ఆస్తుల గురించి తెలుసుకోవాలనే ఆసక్తి ఉన్న వ్యాపార మరియు సాంకేతిక రంగాలకు చెందిన నిపుణులు ఈ కోర్సు చేయోచ్చు. ప్రిస్మ్ గ్రూప్ భాగస్వామ్యంతో కోర్సును రూపొందించారు.
డిజిటల్ ఆస్తుల కోసం వాల్యుయేషన్ మెథడాలజీని పరిచయం చేయడం కోర్సు ఉద్దేశం. ప్రోగ్రామ్ యొక్క అకాడమిక్ డైరెక్టర్, కెవిన్ వెర్‌బాచ్ మాట్లాడుతూ, 'బ్లాక్‌చెయిన్ మరియు డిజిటల్ ఆస్తులు వేర్వేరుగా ఉండవు.. బ్లాక్ చెయిన్ చెక్నాలజీ ఆధారంగా ఈ కరెన్సీ చెలామణి అవుతుంది. ఈ వినూత్న సాంకేతికతలకు సంబంధించిన పరిష్కారాలను రూపొందించడంతోపాటు అవగాహన కల్పించడానికి వ్యాపార వేత్తలు, కన్సల్టెంట్‌లు సన్నద్ధం చేసేందుకు ఈ కోర్సును రూపొందించాం.' అని చెప్పారు.
ఆర్థిక స్వేచ్ఛను సృష్టించడం.. క్రిప్టో ఎకానమీపై వ్యాపారవేత్తలకు అవగాహన కల్పించడం కోసం వార్టన్ స్కూల్ ప్రోగ్రామ్ రూపొందిచడం అభినందనీయమని కాయిన్‌బేస్ వైస్ ప్రెసిడెంట్ సంచన్ సక్సేనా చెప్పారు.
ఈ కోర్సు కోసం ప్రోగ్రామింగ్ భాగస్వామ్యంలో అమెజాన్ వెబ్ సర్వీసెస్, అల్గోరాండ్‌లు ఉన్నాయి. ఈ కోర్సులో వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్, ఫోర్బ్స్, లిట్‌కాయిన్, US సెక్యూరిటీ అండ్ ఎక్స్ఛేంజ్ కమిషన్, ఇతర నిపుణులు గెస్ట్ లెక్చరర్స్ గా వస్తారు. వార్టన్ స్కూల్ క్రిప్టోకరెన్సీలను ఆమోదించిన మొదటి ఐవీ లీగ్ కళాశాలగా అవ్వనుండగా.. యూఎస్ లోని కింగ్స్ కాలేజ్ బిట్‌కాయిన్ ద్వారా చెల్లింపును ఆమోదించిన మొదటి విద్యా సంస్థ.
Also Read: NEET Result 2021: నీట్ పరీక్ష ఫలితాల విడుదలకు సుప్రీం గ్రీన్ సిగ్నల్
Also Read: Army College: తొలిసారి ఆర్మీ కాలేజీలో బాలికలకూ ప్రవేశం... దరఖాస్తులకు చివరి తేదీ ఎప్పుడంటే