News
News
X

తెలంగాణలో రేపటి నుంచి ఒంటి పూట బడులు, స్కూల్ టైమింగ్స్ ఇవే!

రాష్ట్రంలో క్రమేపి ఎండల తీవ్రత పెరుగుతుండడంతో విద్యార్థులకు ఇబ్బంది లేకుండా ఉండేంందుకు ఒంటిపూట బడులను ప్రారంభించాలని నిర్ణయించారు.

FOLLOW US: 
Share:

తెలంగాణలోని ప్రభుత్వ, ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలలకు  రేపటి నుంచి (మార్చి 15) ఒంటి పూట బడులు నిర్వహించనున్నారు. రాష్ట్రంలో క్రమేపి ఎండల తీవ్రత పెరుగుతుండడంతో విద్యార్థులకు ఇబ్బంది లేకుండా ఉండేంందుకు ఒంటిపూట బడులను ప్రారంభించాలని నిర్ణయించారు. ఈమేరకు పాఠశాల విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు పాఠశాలలు పనిచేయనున్నాయని అధికారులు తెలిపారు. ఈ ఒంటి పూట బడి సమయంలో ప్రవేట్ స్కూళ్లతో పాటు ప్రభుత్వ స్కూళ్లల్లో మెరుగైన మంచినీరు పిల్లలకు అందేలా చూడాలని విద్యాశాఖ సూచించింది.

ఈ ఆదేశాలను ప్రభుత్వ, ప్రైవేట్‌, ఎయిడెడ్‌ పాఠశాలల యాజమాన్యాలు పాటించాలని ఆదేశించారు. అయితే ప్రభుత్వ విద్యార్థులకు 12.30 గంటలకు మధ్యాహ్న భోజనం యధావిథిగా పెట్టనున్నట్లు తెలిపారు. పదో తరగతి విద్యార్థులకు మాత్రం స్పెషల్‌ క్లాసులు కొనసాగుతాయన్నారు. పదో తరగతి సెంటర్లు పడే పాఠశాలల పనివేళలు మాత్రం మధ్యాహ్నం 1 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు నడవనున్నాయి.

ఏప్రిల్‌ 23 నుంచి జూన్‌ 11వ తేదీ వరకు పాఠశాలలకు ఈ ఏడాది వేసవి సెలవులను ఇవ్వనున్నారు. ఈ నేపథ్యంలో మార్చి 15 నుంచి ఒంటి పూట బడులు ప్రారంభం కానున్నాయి. ఉదయం 7.45 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు విద్యార్థులకు క్లాసులు నిర్వహించనున్నారు. అన్ని పాఠశాలల్లో విద్యార్థులకు స్వచ్ఛమైన తాగునీరు అందించాలని విద్యాశాఖ సూచించింది.

అలాగే రాష్ట్రంలో పదోతరగతి పరీక్షలు ఏప్రిల్‌ 3 నుంచి 12 వరకు నిర్వహించనున్న సంగతి తెలిసిందే. మిగిలిన తరగతులకు ఏప్రిల్‌ 12 నుంచి ప్రారంభించాలని విద్యాశాఖ నిర్ణయించింది. 1-5 తరగతుల వారికి నాలుగు సబ్జెక్టులే ఉండడంతో వారికి ఏప్రిల్‌ 17తో పరీక్షలు ముగియనున్నాయి.

పదోతరగతి పరీక్షల షెడ్యూలు ఇలా...
షెడ్యూలు ప్రకారం వచ్చే ఏడాది ఏప్రిల్ 3న ప్రారంభంకానున్నాయి. ఏప్రిల్ 11తో ప్రధాన పరీక్షలు, 13న ఒకేషనల్ పరీక్షలు ముగియనున్నాయి. ఏప్రిల్ 3న ఫస్ట్ లాంగ్వేజ్, 4న సెకండ్ లాంగ్వేజ్, 6న ఇంగ్లిష్, 8న మ్యాథమెటిక్స్, 10న సైన్స్ (ఫిజిక్స్, బయాలజీ), 11న సోషల్, 12న ఓరియంటెల్ పేపర్-1, ఒకేషనల్ కోర్సులు, 13 ఓరియంటెల్ పేపర్-2 పరీక్షలు జరుగనున్నాయి.

ఆయాతేదీల్లో ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు పరీక్షలు నిర్వహించనున్నారు. అయితే సైన్స్‌ పరీక్షకు మాత్రం ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.50 వరకు, ఒకేషనల్ కోర్సుకు ఉదయం 9.30 నుంచి 11.30 గంటల వరకు పరీక్ష జరుగుతాయి. ఈ ఏడాది పదోతరగతి పరీక్షలకు దాదాపు 5.50 లక్షల మంది విద్యార్థలు హాజరుకానున్నారు.

పరీక్ష తేదీ పేపరు
ఏప్రిల్ 3 ఫస్ట్ లాంగ్వేజ్
ఏప్రిల్ 4 సెకండ్ లాంగ్వేజ్
ఏప్రిల్ 6 ఇంగ్లిష్
ఏప్రిల్ 8 మ్యాథమెటిక్స్
ఏప్రిల్ 10 సైన్స్ (ఫిజిక్స్, బయాలజీ)
ఏప్రిల్ 11 సోషల్
ఏప్రిల్ 12 ఓరియంటెల్ పేపర్-1, ఒకేషనల్ కోర్సులు
ఏప్రిల్ 13 ఓరియంటెల్ పేపర్-2

Also Read:

ఏపీలో ఒంటిపూట బడులు అప్పటి నుంచే! మరి సమ్మర్ హాలీడేస్ ఎప్పటినుంచంటే?
ఏపీలో ఒకవైపు ఎండలు మండిపోతున్నాయి. ఇప్పటికే పలు ప్రాంతాల్లో అధిక ఉష్ణోగ్రతలు అత్యధికంగా నమోదవుతున్నాయి. రాష్ట్రంలో ఇంత ఎండల్లోనూ చిన్న పిల్లలు ఉదయం నుంచి సాయంత్రం వరకూ బడుల్లోనే అవస్థలు పడుతున్నారు. అయినా ఒంటిపూట బడులపై ఏపీ పాఠశాల విద్యాశాఖ ఎలాంటి ప్రకటన చేయలేదు. అయితే తెలంగాణలో మార్చి 15 నుంచి ఒంటిపూట బడులు నిర్వహించనున్న నేపథ్యంలో ఏపీలోనూ మార్చి 15 నుంచే ఒకపూట బడులు నిర్వహించే అవకాశం ఉందని భావిస్తున్నారు. మరోవైపు H3N2 వైరస్ హడలెత్తిస్తోంది. దీంతో అనారోగ్యంతో ఉన్న పిల్లలను స్కూళ్లకు పంపొద్దని విద్యాశాఖ తల్లిదండ్రులను కోరింది.
పూర్తిసమాచారం కోసం క్లిక్ చేయండి..

మరిన్ని విద్యాసంబంధ వార్తల కోసం క్లిక్ చేయండి..

Published at : 14 Mar 2023 11:50 PM (IST) Tags: Half Day Schools Summer Holidays Education News in Telugu Half Day Schools in Telangana Telangana Half Day Schools TS School Timings

సంబంధిత కథనాలు

CMA Result 2023: ఐసీఎంఏఐ సీఎంఏ ఇంటర్, ఫైనల్ ఫలితాలు విడుదల, రిజల్ట్స్ లింక్ ఇదే!

CMA Result 2023: ఐసీఎంఏఐ సీఎంఏ ఇంటర్, ఫైనల్ ఫలితాలు విడుదల, రిజల్ట్స్ లింక్ ఇదే!

APOSS SSC Hall Tickets: ఏపీ ఓపెన్ స్కూల్ టెన్త్, ఇంటర్ పరీక్షల హాల్‌టికెట్లు విడుదల, డైరెక్ట్ లింక్ ఇదే!

APOSS SSC Hall Tickets: ఏపీ ఓపెన్ స్కూల్ టెన్త్, ఇంటర్ పరీక్షల హాల్‌టికెట్లు విడుదల, డైరెక్ట్ లింక్ ఇదే!

TSPSC : పేపర్ లీకేజీ కేసు సీబీఐ కి వెళ్తుందా ? ఎవరేం వాదించారంటే ?

TSPSC :  పేపర్ లీకేజీ కేసు సీబీఐ కి వెళ్తుందా ? ఎవరేం వాదించారంటే ?

GATE 2023: వెబ్‌సైట్‌లో 'గేట్-2023' స్కోరుకార్డులు, డైరెక్ట్ లింక్ ఇదే!

GATE 2023: వెబ్‌సైట్‌లో 'గేట్-2023' స్కోరుకార్డులు, డైరెక్ట్ లింక్ ఇదే!

CUET (PG) - 2023: సీయూఈటీ పీజీ రిజిస్ట్రేషన్ ప్రారంభం - దరఖాస్తు, పరీక్ష వివరాలు ఇలా!

CUET (PG) - 2023: సీయూఈటీ పీజీ రిజిస్ట్రేషన్ ప్రారంభం - దరఖాస్తు, పరీక్ష వివరాలు ఇలా!

టాప్ స్టోరీస్

Roja Fires on TDP Party: శవాల నోట్లో తులసి తీర్థం పోసినట్లు - టీడీపీపై మంత్రి రోజా ఘాటు వ్యాఖ్యలు

Roja Fires on TDP Party: శవాల నోట్లో తులసి తీర్థం పోసినట్లు - టీడీపీపై మంత్రి రోజా ఘాటు వ్యాఖ్యలు

Rangamarthanda Movie Review - 'రంగమార్తాండ' రివ్యూ : ప్రకాష్ రాజ్, బ్రహ్మానందం హీరోలుగా కృష్ణవంశీ తీసిన సినిమా

Rangamarthanda Movie Review - 'రంగమార్తాండ' రివ్యూ : ప్రకాష్ రాజ్, బ్రహ్మానందం హీరోలుగా కృష్ణవంశీ తీసిన సినిమా

AP BJP Vs Janasena : అడిగినా పవన్ సపోర్ట్ ఇవ్వలేదు - సొంతంగా ఎదుగుతామని ఏపీ బీజేపీ ప్రకటన !

AP BJP Vs Janasena : అడిగినా పవన్ సపోర్ట్ ఇవ్వలేదు - సొంతంగా ఎదుగుతామని ఏపీ బీజేపీ ప్రకటన !

1,540 ఆశా వ‌ర్క‌ర్ల పోస్టుల భ‌ర్తీకి ప్ర‌భుత్వం అనుమ‌తి, వివరాలు ఇలా!

1,540 ఆశా వ‌ర్క‌ర్ల పోస్టుల భ‌ర్తీకి ప్ర‌భుత్వం అనుమ‌తి, వివరాలు ఇలా!