అన్వేషించండి

GATE 2022 Exam Date: గేట్ పరీక్ష తేదీలు ఇవే.. ఈ సారి కొత్తగా రెండు పేపర్లు..

Graduate Aptitude Test in Engineering - 2022: గేట్ - 2022 పరీక్ష తేదీలు విడుదల అయ్యాయి. ఫిబ్రవరి 5, 6, 12, 13 తేదీల్లో గేట్ పరీక్షలను నిర్వహించనున్నట్లు ఐఐటీ ఖరగ్‌పూర్ తెలిపింది.

గ్రాడ్యుయేట్ ఆప్టిట్యూడ్ టెస్ట్ ఇన్ ఇంజనీరింగ్ (GATE)- 2022 పరీక్ష తేదీలు విడుదల అయ్యాయి. ఎంటెక్ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే ఈ పరీక్ష తేదీలను ఐఐటీ ఖరగ్‌పూర్ వెల్లడించింది. వచ్చే ఏడాది ఫిబ్రవరి 5, 6, 12, 13 తేదీల్లో గేట్ పరీక్షలను నిర్వహించనున్నట్లు తెలిపింది. ఈసారి కొత్తగా జియోమాటిక్స్ ఇంజనీరింగ్ (జీఈ- GE ), నావల్ ఆర్కిటెక్చర్ అండ్ మెరైన్ ఇంజనీరింగ్ (ఎన్ఎమ్- NM) అనే రెండు పేపర్లను ప్రవేశపెట్టినట్లు వెల్లడించింది. కొత్తగా ప్రవేశపెట్టిన రెండింటితో కలిపి మొత్తం గేట్ పేపర్ల సంఖ్య 29కి చేరింది. 

గేట్ - 2022 పరీక్షలను ఐఐటీ ఖరగ్‌పూర్ నిర్వహించనుంది. ఈ పరీక్షను కంప్యూటర్ ఆధారిత విధానం (CBT) ద్వారా నిర్వహించాలని నిర్ణయించింది. గేట్ పరీక్ష సమయం 180 నిమిషాలుగా ఉంది. గేట్ పరీక్షల కోసం దేశవ్యాప్తంగా 195 కేంద్రాలు అందుబాటులో ఉండనున్నాయి. గేట్ పరీక్షలకు సంబంధించిన మరిన్ని వివరాల కోసం ఐఐటీ ఖరగ్‌పూర్ అధికారిక వెబ్‌సైట్‌ www.iitkgp.ac.in ను సంప్రదించవచ్చు. 

ఈసారి ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్లతో పాటు.. బీడీఎస్, ఎంఫార్మసీ చదివిన వారికి కూడా గేట్ ద్వారా ప్రవేశాలు కల్పించనున్నట్లు ఐఐటీ ఖరగ్‌పూర్ డైరెక్టర్ వీకే తివారీ వెల్లడించారు. బీడీఎస్, ఎంఫార్మసీ గ్రాడ్యుయేట్లు ఈ పరీక్షలకు దరఖాస్తు చేసుకోవచ్చని సూచించారు. నౌకా నిర్మాణ పరిశ్రమలు, జియో ఇన్ఫర్మేటిక్స్ రంగాల్లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన వారికి భవిష్యత్తులో అనేక ఉద్యోగ అవకాశాలు ఉండటంతో ఈ బ్రాంచుల్లో కూడా గేట్ పరీక్ష నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. 

గేట్ స్కోర్‌తో లాభాలెన్నో..
గేట్​ స్కోర్​ ఆధారంగా ఐఐటీ, ఎన్​ఐటీ వంటి సంస్థలతో పాటు రాష్ట్రాల్లోని ప్రభుత్వ, ప్రైవేట్​ ఇంజనీరింగ్​ కాలేజీల్లో ఎంఈ లేదా ఎంటెక్ కోర్సులలో​ ప్రవేశాలు పొందవచ్చు. విదేశాల్లోని యూనివర్సిటీలు కూడా గేట్​ స్కోర్​ను ప్రామాణికంగా తీసుకుంటున్నాయి. గేట్​ స్కోర్​ ఆధారంగా పలు ప్రభుత్వ రంగ సంస్థల్లో ఉద్యోగాలు దక్కించుకోవచ్చు. బీహెచ్​ఈఎల్​, పవర్​ గ్రిడ్​, బెల్​, డీఆర్​డీఓ, గెయిల్​, హాల్, ఇండియన్​ ఆయిల్​ మొదలైన ప్రభుత్వ రంగ సంస్థలు.. కేవలం గేట్​ స్కార్​ ఆధారంగా అభ్యర్థులను షార్ట్​లిస్ట్​ చేసి, వారికి ఇంటర్వూ నిర్వహించి రిక్రూట్​ చేసుకుంటున్నాయి. 

టాప్ హెడ్ లైన్స్

AP New Universities: ఏపీలో 4 కొత్త యూనివర్సిటీలు.. రూ. 3,500 కోట్ల పెట్టుబడులు, 18 వేల మందికి ఉద్యోగాలు!
ఏపీలో 4 కొత్త యూనివర్సిటీలు.. రూ. 3,500 కోట్ల పెట్టుబడులు, 18 వేల మందికి ఉద్యోగాలు!
 Pallavi Model Schools TOEFL YSS: భారత్‌లో TOEFL YSS ప్రోగ్రామ్‌ చేపట్టిన  మొదటి పాఠశాలగా పల్లవి మోడల్ స్కూల్స్
 భారత్‌లో TOEFL YSS ప్రోగ్రామ్‌ చేపట్టిన  మొదటి పాఠశాలగా పల్లవి మోడల్ స్కూల్స్
Telangana Education System: తెలంగాణలో విద్యా సంస్కరణలు.. వచ్చే ఏడాది నుంచి 10+2 విధానం అమలు: సీఎం రేవంత్ రెడ్డి
తెలంగాణలో విద్యా సంస్కరణలు.. వచ్చే ఏడాది నుంచి 10+2 విధానం అమలు: సీఎం రేవంత్ రెడ్డి
School Holidays: మురసు తుపాను ఎఫెక్ట్.. ఏపీలో పలు జిల్లాల్లో విద్యాసంస్థలకు సెలవు
మురసు తుపాను ఎఫెక్ట్.. ఏపీలో పలు జిల్లాల్లో విద్యాసంస్థలకు సెలవు

వీడియోలు

Hyderabad's Korean Craze Taking Over Youth | హైదరాబాద్‌లో పెరుగుతున్న కొరియన్ కల్చర్ ప్రభావం
Bhuvneshwar Kumar Disastrous T20 Comeback | రీ-ఎంట్రీలో భువి ఘోర రికార్డు
India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Crime News: పోలీసు జీపు నుంచి లాగి మరీ చితక్కొట్టిన గ్రామస్తులు.. అంత దారుణం చేశాడు మరి!
పోలీసు జీపు నుంచి లాగి మరీ చితక్కొట్టిన గ్రామస్తులు.. అంత దారుణం చేశాడు మరి!
Adhav Arjuna Divorce: విడాకులు తీసుకున్న తమిళనాడు మంత్రి ఆధవ్ అర్జున.. భార్య డైసీ మార్టిన్‌ బ్యాగ్రౌండ్ తెలుసా ?
విడాకులు తీసుకున్న తమిళనాడు మంత్రి ఆధవ్ అర్జున.. భార్య డైసీ మార్టిన్‌ బ్యాగ్రౌండ్ తెలుసా ?
Bhimavaram Municipal Elections: భీమవరం మున్సిపల్ పోరు.. నన్ను కాదు, బీజేపీని అవమానించారు! కేంద్ర మంత్రి సంచలన వ్యాఖ్యలు
భీమవరం మున్సిపల్ పోరు.. నన్ను కాదు, బీజేపీని అవమానించారు! కేంద్ర మంత్రి సంచలన వ్యాఖ్యలు
AP Panchayat Elections: ఏపీలో రెండో విడత పంచాయతీ ఎన్నికలకు నోటిఫికేషన్ జారీ.. ముఖ్యమైన తేదీలివే
ఏపీలో రెండో విడత పంచాయతీ ఎన్నికలకు నోటిఫికేషన్ జారీ.. ముఖ్యమైన తేదీలివే
Cyclone Akwan Latest Update: ఏపీవైపు దూసుకొస్తున్న అక్వాన్ తుపాను.. పలు జిల్లాలకు 2 రోజులు భారీ వర్ష సూచన
ఏపీవైపు దూసుకొస్తున్న అక్వాన్ తుపాను.. పలు జిల్లాలకు 2 రోజులు భారీ వర్ష సూచన
ACB Raids: అక్రమాస్తుల కేసు.. మొయినాబాద్ టౌన్ ప్లానింగ్ అధికారి వాణి ఇంట్లో ఏసీబీ దాడులు
అక్రమాస్తుల కేసు.. మొయినాబాద్ టౌన్ ప్లానింగ్ అధికారి వాణి ఇంట్లో ఏసీబీ దాడులు
Prince Williams Batting: ముంబైలో గల్లీ క్రికెట్ ఆడిన ప్రిన్స్ విలియం దంపతులు.. కీపింగ్ చేస్తూ సచిన్ సందడి
ముంబైలో గల్లీ క్రికెట్ ఆడిన ప్రిన్స్ విలియం దంపతులు.. కీపింగ్ చేస్తూ సచిన్ సందడి
Ramayana Collections : రామాయణ రికార్డు కలెక్షన్స్ - ధురంధర్ 2 రికార్డ్ బ్రేక్... సెకండ్ వీకెండ్ వసూళ్లు ఎంతంటే?
రామాయణ రికార్డు కలెక్షన్స్ - ధురంధర్ 2 రికార్డ్ బ్రేక్... సెకండ్ వీకెండ్ వసూళ్లు ఎంతంటే?
Embed widget