(Source: ECI/ABP News/ABP Majha)
Agriculture: వ్యవసాయ, వ్యయసాయేతర రంగాల్లో ఉచిత శిక్షణ, ఎవరు అర్హులంటే?
తెలంగాణలోని యువతీ, యువకులకు వ్యవసాయ, వ్యయసాయేతర రంగాల్లో ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు 'సెంటర్ ఫర్ ఎంటర్ ప్రిన్యూర్‌షిప్ డెవలప్‌మెంట్' నోడల్ అధికారి విజయలక్ష్మి అక్టోబరు 18న ఒక ప్రకటనలో తెలిపారు.
తెలంగాణలోని యువతీ, యువకులకు వ్యవసాయ, వ్యయసాయేతర రంగాల్లో ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు 'సెంటర్ ఫర్ ఎంటర్ ప్రిన్యూర్‌షిప్ డెవలప్‌మెంట్ (సీఈడీ)' నోడల్ అధికారి విజయలక్ష్మి అక్టోబరు 18న ఒక ప్రకటనలో తెలిపారు. ఆసక్తి ఉన్నవారికి చెట్ల పెంపకం, పోషణ, అగ్రి బిజినెస్‌పై 45 రోజులపాటు హైదరాబాద్ కూకట్‌పల్లిలోని సీఈడీ సంస్థలో ఉచితంగా శిక్షణ ఇవ్వనున్నట్లు ఆమె తెలిపారు.
శిక్షణ పూర్తయిన తర్వాత వారికి సర్టిఫికెట్లు అందజేస్తామని ఆమె వెల్లడించారు. అభ్యర్థులు వ్యవసాయ అనుబంధ డిప్లొమా, డిగ్రీ, పీజీ కోర్సులను పూర్తి చేసి, తెలంగాణకు చెందిన వారై ఉండాలని సూచించారు. ఇంటర్వ్యూ ద్వారా ఎంపికైన అభ్యర్థులకు భోజన సదుపాయం కల్పిస్తామని చెప్పారు. వివరాలకు 7036666421/422/424 ఫోన్ నెంబర్లలో సంప్రదించవచ్చని విజయలక్ష్మి తెలిపారు.
వివరాలు...
➥ ఉచిత శిక్షణ
సంస్థ పేరు: సెంటర్ ఫర్ ఎంటర్ ప్రిన్యూర్‌షిప్ డెవలప్‌మెంట్ (సీఈడీ)
అర్హత: వ్యవసాయ డిప్లొమా, డిగ్రీ, పీజీ ఉత్తీర్ణులైనవారు దరఖాస్తుకు అర్హులు.
శిక్షణ అంశాలు: చెట్ల పెంపకం, పోషణ, అగ్రి బిజినెస్‌పై అవగాహన.
దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్ విధానంలో.
ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ఆధారంగా.
శిక్షణ కాలం: 45 రోజులు. శిక్షణ పూర్తియిన వారికి సర్టిఫికేట్ ఇస్తారు.
సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్లు: 7036666421, 7036666422, 7036666424.
ALSO READ:
ఎన్జీరంగా వ్యవసాయ వర్సిటీలో మాస్టర్స్ డిగ్రీ, పీహెచ్‌డీ కోర్సులు, ప్రవేశాలు ఇలా
గుంటూరులోని ఆచార్య ఎన్.జి. రంగా అగ్రికల్చరల్ యూనివర్సిటీ, 2023-24 విద్యా సంవత్సరానికి సంబంధించి యూనివర్సిటీ అనుబంధ కళాశాలల్లో పీజీ, పీహెచ్‌డీ కోర్సుల్లో ప్రవేశాల కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. పీజీ కోర్సులకు సంబంధిత విభాగంలో డిగ్రీ, పీహెచ్‌డీ కోర్సులకు సంబంధిత విభాగంలో మాస్టర్స్ డిగ్రీ అర్హత ఉన్నవారు అర్హులు. ఈ కోర్సుల ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ అక్టోబరు 13న ప్రారంభంకాగా.. నవంబరు 3 వరకు దరఖాస్తులు స్వీకరించనున్నారు. పీజీ కోర్సులకు డిగ్రీ మార్కులు, ఏఐఈఈఏ (ఐకార్) స్కోరు; పీహెచ్‌డీ కోర్సులకు డిగ్రీ, పీజీ మార్కులు, ఏఐసీఈ (ఐకార్) స్కోరు, ఇంటర్వ్యూ తదితరాల ఆధారంగా ప్రవేశాలు కల్పిస్తారు. అభ్యర్థులు దరఖాస్తు ఫీజు కింద రూ.1500 చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ అభ్యర్థులు రూ.750 చెల్లిస్తే సరిపోతుంది.
కోర్సుల పూర్తివివరాల కోసం క్లిక్ చేయండి..
తెలంగాణలో ఎంపీహెచ్‌డబ్ల్యూ (ఫీమేల్)/ ఏఎన్‌ఎం ట్రైనింగ్ కోర్సులో ప్రవేశాలు
తెలంగాణ రాష్ట్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ కమిషనర్ కార్యాలయం, 2023-24 విద్యాసంవత్సరానికి రాష్ట్రంలోని 27 ప్రభుత్వ, ప్రైవేటు విద్యాసంస్థల్లో ఎంపీహెచ్‌డబ్ల్యూ (ఫీమేల్)/ ఏఎన్‌ఎం ట్రైనింగ్ కోర్సులో ప్రవేశానికి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇంటర్మీడియట్ ఉత్తీర్ణత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలున్నవారు ఆన్‌లైన్ విధానంలో అక్టోబరు 20లోగా దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది.
కోర్సు పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..
నేషనల్ ఇన్సూరెన్స్ అకాడమీలో పీజీడీఎం ప్రోగ్రామ్, ఈ అర్హతలుండాలి
పుణెలోని నేషనల్ ఇన్సూరెన్స్ అకాడమీ, 2024 విద్యా సంవత్సరానికి పీజీడీఎం ప్రోగ్రామ్‌లో ప్రవేశానికి నోటిఫికేషన్ విడుదల చేసింది. కనీసం 50 శాతం మార్కులతో ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణతతో పాటు క్యాట్, ఎక్స్‌ఏటీ, సీమ్యాట్ అర్హత ఉన్నవారు దరఖాస్తుకు అర్హులు. సరైన అర్హతలున్నవారు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. విద్యార్హతలు, పని అనుభవం, గ్రూప్ డిస్కషన్, ఇంటర్వ్యూ నిర్వహించి ప్రవేశాలు కల్పిస్తారు.
కోర్సు వివరాల కోసం క్లిక్ చేయండి..