అన్వేషించండి

Good News: ఇక ఉచితంగా జీఆర్‌ఈ, జీమ్యాట్‌ తదితర పరీక్షలు - సీఎం జగన్ కీలక నిర్ణయం

దేశాల్లో విద్య చదవాలనుకుంటున్న విద్యార్థులకు జీఆర్‌ఈ, జీమ్యాట్ పరీక్షలను ఉచితంగా అందుబాటులోకి తీసుకురావాలని సీఎం జగన్ ఈ మేరకు సంబంధిత అధికారులను ఆదేశించారు.

ఏపీలో ప్రభుత్వ విద్యాసంస్థల్లో చదివే విద్యార్థులకు ప్రభుత్వం శుభవార్త వినిపించింది. విదేశాల్లో విద్య చదవాలనుకుంటున్న విద్యార్థులకు జీఆర్‌ఈ, జీమ్యాట్ పరీక్షలను ఉచితంగా అందుబాటులోకి తీసుకురావాలని సీఎం జగన్ ఈ మేరకు సంబంధిత అధికారులను ఆదేశించారు. వీటికి సంబంధించిన మెటీరియల్, శిక్షణను విద్యార్థులకు అందించాలని తెలిపారు. అదేవిధంగా అమెరికా పర్యటనకు వెళ్లిన విద్యార్థులకు మార్గనిర్దేశం చేయడానికి ఒక ఐఏఎస్ అధికారిని నియమించాలని సీఎం సూచించారు. 

ప్రభుత్వం తరఫున ఇటీవల అమెరికాలో పర్యటించిన విద్యార్థుల బృందం క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్‌ను అక్టోబరు 9న కలిసింది. ఈ సందర్భంగా సీఎం వారితో మాట్లాడారు. జీమ్యాట్, జీఆర్‌ఈ, టోఫెల్ లాంటి పరీక్షలు ఏమేమి ఉన్నాయో తెలుసుకుని, ఎలా సన్నద్ధం కావాలన్న దానిపై మీరు ఆలోచనలు చేయాలని సీఎం కోరారు. 

విదేశీ విద్యాదీవెన ద్వారా సీటు సాధించడమే లక్ష్యంగా విద్యార్థులు ఉండాలని ముఖ్యమంత్రి జగన్ వెల్లడించారు. ప్రపంచంతో పోటీ పడితేనే మన బతుకులు మారతాయని, బతుకులు మారాలంటే విద్య ఒక్కటే సాధనంమని జగన్ అన్నారు. మీరు చూసిన కొలంబియా విశ్వవిద్యాలయం వంటి వాటిల్లో సీట్లు సాధిస్తే ఫీజులు ప్రభుత్వమే చెల్లిస్తుందని, ఆ స్థాయి కళాశాలల నుంచి బయటకు వస్తేనే పెద్దపెద్ద కంపెనీలకు సీఈఓలు కావాలన్న మీ కలలు నిజమవుతాయని సీఎం తెలిపారు. 

విద్యార్థుల కోసం పాఠ్యప్రణాళికలో లేని 1,800 కోర్సులను సిలబస్‌లో ప్రవేశపెట్టనున్నట్లు ముఖ్యమంత్రి జగన్ పేర్కొన్నారు. ఎంఐటీ, హార్వర్డ్ లాంటి విశ్వవిద్యాలయాల ఆధ్వర్యంలో వీటిని రూపొందించారు. ఈ కోర్సులు పూర్తి చేసిన వారికి ఎడెక్స్‌తో కలిసి జాయింట్ సర్టిఫికేషన్ ఇస్తామని వెల్లడించారు.

ALSO READ:

విద్యార్థులకు 'ప్రత్యేక గుర్తింపు సంఖ్య', త్వరలోనే అమల్లోకి కొత్త విధానం!
దేశంలో కేజీ నుంచి పీజీ వరకు చదివే విద్యార్థుల సమగ్ర వివరాలు ఒకే గొడుగు కిందకు రానున్నాయి. విద్యార్థి ఎల్‌కేజీలో చేరినప్పట్నుంచి విద్యాభ్యాసం పూర్తయ్యే వరకు.. వీటికి సంబంధించిన పూర్తివివరాలను ఎప్పటికప్పుడు గుర్తించేందుకు వీలుగా కేంద్ర విద్యాశాఖ చర్యలు చేపట్టింది. దేశవ్యాప్తంగా ఒక్కో విద్యార్థికి, ఒక్కో ప్రత్యేక గుర్తింపు సంఖ్య కేటాయించాలని నిర్ణయించింది. దాన్ని ఆధార్ సంఖ్యతోపాటు 'అకడమిక్ బ్యాంక్ ఆఫ్ క్రెడిట్(ఏబీసీ)' అనే ఎడ్యులాకర్‌కు అనుసంధానించనుంది. ఈ విధానం త్వరలోనే అమల్లోకి తేనున్నారు. పాఠశాల విద్యలోని పిల్లలకు ప్రత్యేక గుర్తింపు సంఖ్య ఇచ్చే విధానాన్ని ఇప్పటికే కొన్ని రాష్ట్రాలు అమలు చేస్తున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో మాత్రం 'ఛైల్డ్ ఇన్ఫో' పేరిట ఒక్కో విద్యార్థికి, ఒక్కో సంఖ్య విధానాన్ని గత కొన్నేళ్లుగా అమలు చేస్తున్నారు. 
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..

వ్యవసాయ డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాలకు 'స్పాట్‌' కౌన్సెలింగ్‌, ఎప్పుడంటే?
గుంటూరులోని ఆచార్య ఎన్‌.జి.రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం పరిధిలో 2023-24 విద్యాసంవత్సరానికి వివిధ కోర్సుల్లో మిగిలిపోయిన సీట్ల భర్తీకి అక్టోబర్ 11న స్పాట్‌ కౌన్సెలింగ్‌ నిర్వహించనున్నారు. ఈమేరకు వర్సిటీ రిజిస్ట్రార్‌ జి.రామారావు అక్టోబరు 6న ఒక ప్రకటనలో తెలిపారు. ఈ కౌన్సెలింగ్ ద్వారా ఇంజినీరింగ్, పాలిటెక్నిక్‌ కళాశాలల్లో వ్యవసాయం, సేంద్రీయ వ్యవసాయం, విత్తన సాంకేతిక పరిజ్ఞానం కోర్సుల్లో మిగిలిపోయిన సీట్లను భర్తీ చేయనున్నారు. గుంటూరులోని లాం ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన కేంద్రం లాంఫాం పాలిటెక్నిక్‌ విభాగంలో కౌన్సెలింగ్‌ నిర్వహించనున్నారు. 
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..

మరిన్ని విద్యాసంబంధ వార్తల కోసం క్లిక్ చేయండి...

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

TS Election 2024 Voting Percentage: తెలంగాణ లోక్‌సభ ఎన్నికల్లో పోలింగ్ శాతాన్ని ప్రకటించిన ఈసీ, 2019 కంటే ఎక్కువే
తెలంగాణ లోక్‌సభ ఎన్నికల్లో పోలింగ్ శాతాన్ని ప్రకటించిన ఈసీ, 2019 కంటే ఎక్కువే
AP Elections 2024: ఏపీ ఎన్నికల యుద్ధం తరువాత సీఎం జగన్, వైఎస్ షర్మిల ఫస్ట్ రియాక్షన్ చూశారా!
ఏపీ ఎన్నికల యుద్ధం తరువాత సీఎం జగన్, వైఎస్ షర్మిల ఫస్ట్ రియాక్షన్ చూశారా!
Konaseema Accident: కోనసీమ జిల్లాలో ఘోర ప్రమాదం - అక్కడికక్కడే ఐదుగురు దుర్మరణం
కోనసీమ జిల్లాలో ఘోర ప్రమాదం - అక్కడికక్కడే ఐదుగురు దుర్మరణం
KTR In Sircilla: కాంగ్రెస్, బీజేపీలకు ముచ్చెమటలు! ఎన్నికల్లో జాతీయ పార్టీల పరిస్థితి ఇదీ: కేటీఆర్
కాంగ్రెస్, బీజేపీలకు ముచ్చెమటలు! ఎన్నికల్లో జాతీయ పార్టీల పరిస్థితి ఇదీ: కేటీఆర్
Advertisement
Advertisement
Advertisement
for smartphones
and tablets

వీడియోలు

YSRCP vs TDP Fight in Palnadu District | Karampudiలో టీడీపీ ఆఫీస్ పై వైసీపీ కార్యకర్తల దాడి | ABPJC Prabhakar Reddy vs Pedda Reddy | తాడిపత్రిలో రాళ్ల వర్షం.. పెద్దారెడ్డి ఇంటికి బయలుదేరిన జేసీJC Prabhakar Reddy vs Pedda Reddy | తాడిపత్రిలో రాళ్ల వర్షం.. పెద్దారెడ్డి ఇంటికి బయలుదేరిన జేసీAttack on Pulivarthi Nani | Tirupati |   పులివర్తి నానిపై దాడి..పోలీసుల రియాక్షన్  | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
TS Election 2024 Voting Percentage: తెలంగాణ లోక్‌సభ ఎన్నికల్లో పోలింగ్ శాతాన్ని ప్రకటించిన ఈసీ, 2019 కంటే ఎక్కువే
తెలంగాణ లోక్‌సభ ఎన్నికల్లో పోలింగ్ శాతాన్ని ప్రకటించిన ఈసీ, 2019 కంటే ఎక్కువే
AP Elections 2024: ఏపీ ఎన్నికల యుద్ధం తరువాత సీఎం జగన్, వైఎస్ షర్మిల ఫస్ట్ రియాక్షన్ చూశారా!
ఏపీ ఎన్నికల యుద్ధం తరువాత సీఎం జగన్, వైఎస్ షర్మిల ఫస్ట్ రియాక్షన్ చూశారా!
Konaseema Accident: కోనసీమ జిల్లాలో ఘోర ప్రమాదం - అక్కడికక్కడే ఐదుగురు దుర్మరణం
కోనసీమ జిల్లాలో ఘోర ప్రమాదం - అక్కడికక్కడే ఐదుగురు దుర్మరణం
KTR In Sircilla: కాంగ్రెస్, బీజేపీలకు ముచ్చెమటలు! ఎన్నికల్లో జాతీయ పార్టీల పరిస్థితి ఇదీ: కేటీఆర్
కాంగ్రెస్, బీజేపీలకు ముచ్చెమటలు! ఎన్నికల్లో జాతీయ పార్టీల పరిస్థితి ఇదీ: కేటీఆర్
Mukku Avinash: ‘జబర్దస్త్’ వాళ్లు రూ.10 లక్షలు కట్టాలన్నారు - చచ్చిపోవాలనుకున్న టైమ్‌లో ‘బిగ్ బాస్’ రక్షించింది: ముక్కు అవినాష్
‘జబర్దస్త్’ వాళ్లు రూ.10 లక్షలు కట్టాలన్నారు - చచ్చిపోవాలనుకున్న టైమ్‌లో ‘బిగ్ బాస్’ రక్షించింది: ముక్కు అవినాష్
Chandrababu: గవర్నర్ అబ్దుల్ నజీర్‌కు చంద్రబాబు లేఖ, జగన్ చేయబోయే పని వెంటనే అడ్డుకోవాలని వినతి
గవర్నర్ అబ్దుల్ నజీర్‌కు చంద్రబాబు లేఖ, జగన్ చేయబోయే పని వెంటనే అడ్డుకోవాలని వినతి
CM Jagan Tour: సీఎం జగన్ విదేశీ టూర్‌కు సీబీఐ కోర్టు గ్రీన్ సిగ్నల్
సీఎం జగన్ విదేశీ టూర్‌కు సీబీఐ కోర్టు గ్రీన్ సిగ్నల్
High Tension in Tadipatri: తాడిపత్రి పట్టణంలో ఉద్రిక్తత- టీడీపీ, వైసీపీ రాళ్ల దాడులతో పోలీసు వాహనాలు వెనక్కి! హై టెన్షన్
తాడిపత్రి పట్టణంలో ఉద్రిక్తత- టీడీపీ, వైసీపీ రాళ్ల దాడులతో పోలీసు వాహనాలు వెనక్కి! హై టెన్షన్
Embed widget