పాలిసెట్ – 2023 ప్రవేశ పరీక్షకు ఉచిత శిక్షణ, పరీక్ష వివరాలు ఇలా!
ఏపీలోని యువతను పాలిటెక్నిక్ విద్య వైపు మళ్లించే చర్యలలో భాగంగా అన్ని ప్రభుత్వ పాలిటెక్నిక్ లలో పాలిసెట్ – 2023 కోసం ఉచిత శిక్షణ ప్రారంభించారు. పాలిసెట్ దరఖాస్తుకు ఏప్రిల్ 30 వరకు అవకాశం ఉంది.
ఇంజినీరింగ్ అవసరం లేకుండా, చిన్న వయసులోనే సులువుగా ఉపాధి, ఉద్యోగ అవకాశాలు పొందడానికి 'పాలిటెక్నిక్ విద్య' ఉత్తమమైన మార్గమని రాష్ట్ర సాంకేతిక విద్యా శాఖ కమీషనర్ చదలవాడ నాగరాణి తెలిపారు. యువతను పాలిటెక్నిక్ విద్య వైపు మళ్లించే చర్యలలో భాగంగా అన్ని ప్రభుత్వ పాలిటెక్నిక్ లలో పాలిసెట్ – 2023 కోసం ఉచిత శిక్షణ అందిస్తున్నామన్నారు. పదోతరగతి విద్యార్ధుల్లో అవగాహన కలిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నామన్నారు. ఇప్పటికే పాలిసెట్ తొలివిడద కోచింగ్ ప్రక్రియ ఏప్రిల్ 17న ప్రారంభించగా, ఏప్రిల్ 24 నుండి మరో బ్యాచ్ ప్రారంభిస్తున్నామని నాగరాణి వివరించారు. శిక్షణ పొందిన ప్రతి విద్యార్ధికి ఇంగ్లీష్, తెలుగు మీడియంలలో ఉచిత స్టడీ మెటీరియల్ అందిస్తున్నామన్నారు.
ఏప్రిల్ 30 దరఖాస్తుకు చివరితేది..
పాలిసెట్ దరఖాస్తు ప్రక్రియ ఫిబవరి 16న ప్రారంభమైన సంగతి తెలిసిందే. విద్యార్థులు ఏప్రిల్ 30 వరకు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఉంది. ఏప్రిల్ 30న సాయంత్రం 5గంటల లోపు ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. ఈ ప్రవేశ పరీక్షకు హాజరయ్యే ఓసీ, బీసీ విద్యార్ధులు రూ.400 ఫీజుగా చెల్లించాలి. అదేవిధంగా ఎస్టీ, ఎస్సీ విద్యార్ధులు రూ.100 ఫీజు చెల్లించాలి. రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేట్ పాలిటెక్నిక్ ప్రవేశం కోసం మే 10న రాష్ట్రవ్యాప్తంగా 61 పట్టణాలలోని 410 పరీక్ష కేంద్రాల్లో పాలిసెట్ 2023 నిర్వహించనున్నారు. ఈ పరీక్షకు సుమారు 1,50,000 మంది విద్యార్థులు హాజరుకానున్నారు.
ఆన్‌లైన్/ ఆఫ్‌లైన్ రెండు విధానాల్లో దరఖాస్తులు సమర్పించవచ్చు. అర్హులైన ప్రతి విద్యార్ధినికి సంవత్సరమునకు రూ.50,000 చొప్పున మూడు సంవత్సరాల ప్రగతి స్కాలర్ షిప్ లభిస్తుందన్నారు. జగనన్న విద్యదీవేన, వసతి దీవెన ద్వారా విద్యార్ధులకు ఫీజు రీయింబెర్స్‌మెంట్ సదుపాయం కల్పిస్తున్నామన్నారు. ఆధునిక సాంకేతిక అవసరాలకు అనుగుణంగా రూపొందించిన పాలి-టె-క్నిక్ కోర్సులకు అత్యధిక అర్హతలు, అనుభవము కలిగిన అధ్యాపకులతో విద్యాబోధన సాగుతుందని కమీషనర్ స్పష్టం చేశారు.
* ఏపీ పాలిసెట్ - 2023
అర్హత: పదోతరగతి లేదా తత్సమాన విద్యను మ్యాథ్స్ ఒక సబ్జెక్టుగా కనీసం 35 శాతం మార్కులతో ఉత్తీర్ణత సాధించిన వారు పాలిసెట్ దరఖాస్తుకు అర్హులు.
దరఖాస్తు ఫీజు: ఓసీ, బీసీ అభ్యర్థులు రూ.400 చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు రూ.100 చెల్లిస్తే సరిపోతుంది.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్/ ఆఫ్‌లైన్ ద్వారా .
ప్రవేశాలు కల్పించే సంస్థలు: పాలిసెట్ ద్వారా ప్రభుత్వ, ప్రభుత్వ ఎయిడెడ్, ప్రయివేట్ పాలిటెక్నిక్ కళాశాలల్లో మూడేళ్లు, మూడున్నరేళ్ల కాలవ్యవధి గల డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాలు పొందవచ్చు. పాలిసెట్‌లో వచ్చిన స్కోర్ ఆధారంగా ఆయా కళాశాలల్లో ప్రవేశాలు కల్పిస్తారు.
పరీక్ష విధానం: పాలిసెట్ పరీక్షను పెన్ అండ్ పేపర్(ఆఫ్‌లైన్) విధానంలో నిర్వహిస్తారు. మల్టిపుల్ ఛాయిస్ పద్ధతిలో ప్రశ్నలు ఉంటాయి. మొత్తం మూడు విభాగాల నుంచి 120 ప్రశ్నలకు పరీక్ష ఉంటుంది. మ్యాథ్స్–50, ఫిజిక్స్–40, కెమిస్ట్రీ–30 చొప్పున ప్రశ్నలు వస్తాయి. పరీక్ష సమయం రెండున్నర గంటలు. పదోతరగతి స్థాయి సిలబస్ నుంచి ప్రశ్నలుంటాయి. ప్రతి సరైన సమాధానానికి ఒక మార్కు చొప్పున కేటాయిస్తారు. ఎటువంటి నెగిటివ్ మార్కింగ్ విధానంలో అమల్లో లేదు.
డిప్లొమా కోర్సులు: సివిల్, మెకానికల్, ఆటోమొబైల్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్, ఎలక్ట్రానిక్ అండ్ ఇన్‌స్ట్రుమెంటేషన్, కంప్యూటర్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, మెటలర్జికల్, కెమికల్ తదితర కోర్సులు అందుబాటులో ఉన్నాయి.
ముఖ్యమైన తేదీలు...
➥ ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 16.02.2023.
➥ ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరితేది: 30.04.2023.
➥ పాలిసెట్ పరీక్ష తేది: 10.05.2023 (ఉ.11:00 గం.-మ.1:00 గం.)
➥ ఫలితాల వెల్లడి: 25.05.2023.
పాలిసెట్ పాత ప్రశ్నపత్రాల కోసం క్లిక్ చేయండి..
AP POLYCET 2023 INFORMATION BROCHURE
Also Read:
సీయూఈటీ పీజీ - 2023 దరఖాస్తు గడువు పొడిగింపు, చివరితేది ఎప్పుడంటే?
దేశవ్యాప్తంగా మొత్తం 142 విద్యాసంస్థల్లో పీజీ కోర్సుల్లోకి ప్రవేశం కల్పించే కామన్ యూనివర్సిటీ ఎంట్రన్స్ టెస్టు (సీయూఈటీ) దరఖాస్తు గడువును నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ పొడిగించింది. ఈ మేరకు అధికారిక ప్రకటన విడుదల చేసింది. వాస్తవానికి ఏప్రిల్ 19తో ముగియాల్సిన గడువును మే 5 వరకు పొడిగించింది. ఇప్పటివరకు దరఖాస్తు చేసుకోని అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా వెంటనే తమ దరఖాస్తులు సమర్పించవచ్చు. ఇక దరఖాస్తుల్లో తప్పుల సవరణకు మే 6, 7, 8 తేదీల్లో అవకాశం కల్పించింది. పరీక్ష తేదీలు, అడ్మిట్ కార్డు డౌన్‌లోడ్, ఫలితాల ప్రకటన వివరాలు త్వరలోనే వెల్లడించనున్నట్లు ఎన్‌టీఏ తెలిపింది. అభ్యర్థులు ఒకటి కంటే ఎక్కువ దరఖాస్తులు చేసుకునేందుకు వీలు లేదని స్పష్టం చేసింది.
పూర్తివివరాల కోసం క్లిక్ చేయండి..
విద్యార్థులకు అలర్ట్, ఎంసెట్‌లో ఇంటర్ మార్కుల వెయిటేజీ రద్దు! జీవో జారీ చేసిన ప్రభుత్వం!
తెలంగాణ ఎంసెట్‌లో ఈసారి నుంచి ఇంటర్ మార్కులకు 25 శాతం వెయిటేజీని శాశ్వతంగా రద్దు చేస్తూ విద్యాశాఖ బుధవారం (ఏప్రిల్ 19) ఉత్తర్వులు జారీ చేసింది. ఇక నుంచి ఎంసెట్‌లో వచ్చిన మార్కులతోనే ర్యాంకు కేటాయించనున్నారు. ఇప్పటివరకు ఎంసెట్ మార్కులకు 75 శాతం వెయిటేజీ, ఇంటర్‌లోని భాషేతర సబ్జెక్టులకు... అంటే 600 మార్కులకు 25 శాతం వెయిటేజీ ఇచ్చి ర్యాంకు కేటాయించేవారు. ఇక నుంచి ఇంటర్ మార్కులతో సంబంధం లేకుండానే ఎంసెట్‌లో స్కోర్‌ను మాత్రమే పరిగణనలోకి తీసుకుంటారు. జేఈఈ మెయిన్, నీట్‌లలోనూ ఇంటర్ మార్కులకు వెయిటేజీ ఎత్తివేశారు.
పూర్తివివరాల కోసం క్లిక్ చేయండి..