News
News
abp shortsABP షార్ట్స్వీడియోలు ఆటలు
X

EAMCET Councelling: ఇంజినీరింగ్ 'స్పాట్‌ కౌన్సెలింగ్‌'లో 2,500 మంది విద్యార్థులకు ప్రవేశాలు

తెలంగాణలో ప్రైవేట్‌ ఇంజినీరింగ్‌ కళాశాలల్లో ప్రవేశాల కోసం 'స్పాట్‌ కౌన్సెలింగ్‌' నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ కౌన్సెలింగ్ ద్వారా 2,500 మంది విద్యార్థులు ప్రవేశాలు పొందారు.

FOLLOW US: 
Share:

తెలంగాణలో ప్రైవేట్‌ ఇంజినీరింగ్‌ కళాశాలల్లో ప్రవేశాల కోసం 'స్పాట్‌ కౌన్సెలింగ్‌' నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ కౌన్సెలింగ్ ద్వారా 2,500 మంది విద్యార్థులు ప్రవేశాలు పొందారు. అంతకుముందు కౌన్సెలింగ్‌ ద్వారా దాదాపు 66 వేల మంది చేరారు. స్పాట్‌ ప్రవేశాలతో కలిపి సుమారు 69 వేల మంది విద్యార్థులున్నట్లు ఎంసెట్‌ ప్రవేశాల కమిటీ వర్గాలు తెలిపాయి. మరోవైపు యాజమాన్య కోటా కింద సుమారు 25 వేల మంది వరకు చేరతారని అంచనా. గతేడాది ఈ సంఖ్య 20,605 మాత్రానికే పరిమితమైంది.

ఈ విద్యాసంవత్సరం రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేట్‌ ఇంజినీరింగ్‌ కళాశాలల్లో మొత్తం బీటెక్‌ ప్రవేశాలు 94 వేల వరకు ఉండొచ్చని అధికారులు భావిస్తున్నారు. యాజమాన్య కోటా(బీ-కేటగిరీ) కింద చేరిన విద్యార్థుల వివరాలను ఆయా కళాశాలలు సెప్టెంబర్‌ 20 నాటికి ఉన్నత విద్యామండలికి ఆన్‌లైన్‌ ద్వారా సమర్పించాలి. హార్డ్‌ కాపీలను కళాశాలల ప్రిన్సిపాళ్ల సంతకంతో కార్యాలయంలో అందజేయాలి. 

ALSO READ:

డిగ్రీలో 'సైబర్ సెక్యూరిటీ' కోర్సు ప్రారంభం, భవిష్యత్తులో మరిన్ని కొత్త కోర్సులు
తెలంగాణలోని డిగ్రీ విద్యలో కొత్తగా 'సైబర్ సెక్యూరిటీ' కోర్సును అందుబాటులోకి తెచ్చారు. డిగ్రీ స్థాయిలో సైబర్ సెక్యూరిటీ కోర్సును విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి సోమవారం (సెప్టెంబరు 11న) ప్రారంభించారు. ఉపాధికి, సమాజానికి అవసరయ్యే కొత్త కోర్సులను భవిష్యత్తులో మరిన్ని ప్రవేశ పెడతామని మంత్రి వెల్లడించారు. అదేవిధంగా ఉన్నత విద్యలో మూల్యాంకన పద్ధతులపై సిఫార్సులతో ఐఎస్‌బీ రూపొందించిన నివేదికను మంత్రి విడుదల చేశారు. బోధన మూస పద్ధతిలో కాకుండా.. మారుతున్న కాలానికి అనుగుణంగా ఆధునికంగా ఉండాలన్నారు.
పూర్తివివరాల కోసం క్లిక్ చేయండి..

జీఎన్‌ఎం కోర్సులో ప్రవేశాలకు నోటిఫికేషన్, ఇంటర్ అర్హత చాలు
తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ, ప్రైవేట్ నర్సింగ్ కళాశాలల్లో 2023-24 విద్యా సంవత్సరానికి జనరల్ నర్సింగ్ అండ్‌ మిడ్‌వైఫరీ (జీఎన్‌ఎం) ట్రైనింగ్ కోర్సులో ప్రవేశాలకు సంబంధించి తెలంగాణ రాష్ట్ర డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా రాష్ట్రంలోని 6 ప్రభుత్వ, 162 ప్రైవేటు నర్సింగ్‌ కళాశాలల్లో జీఎన్ఎం కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తారు. ఇంటర్‌ ఉత్తీర్ణులైన పురుష, మహిళా అభ్యర్థులు సెప్టెంబర్‌ 16లోగా దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. ఇంటర్‌ మార్కులు, రిజర్వేషన్ల ప్రకారం సీటు కేటాయిస్తారు.
కోర్సు వివరాల కోసం క్లిక్ చేయండి..

ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్‌లో సర్టిఫికేట్ ప్రోగ్రామ్, అర్హతలివే!
కోల్‌కతాలోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్, 2024-25 విద్యా సంవత్సరానికిగానను సర్టిఫికేట్ ప్రోగ్రామ్‌లో ప్రవేశానికి నోటిఫికేషన్ విడుదల చేసింది. 50 శాతం మార్కులతో ఏదైనా విభాగంలో డిగ్రీతో పాటు సంబంధిత రంగంలో మేనేజర్ స్థాయిలో కనీసం మూడేళ్ల పని అనుభవం ఉండాలి. (లేదా) పీజీ (ఇంజినీరింగ్, ఆర్కిటెక్చర్, మెడిసిన్, ఫార్మాస్యూటికల్, అగ్రికల్చర్, హార్టికల్చర్)తో పాటు సంబంధిత రంగంలో మేనేజర్ స్థాయిలో రెండేళ్ల పని అనుభవం ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. అభ్యర్థులు నవంబరు 15లోగా దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది.
కోర్సు పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..

ఫ్రాన్స్‌లో చదవాలనుకునే వాళ్లకు గుడ్ న్యూస్ - 30 వేల మంది విద్యార్థులకు ఆహ్వానం
భారతదేశం నుంచి అనేక మంది విద్యార్థులు ఉన్నత విద్యను అభ్యసించేందుకు ప్రతీ ఏటా వేలాది మంది విద్యార్థులు అనేక దేశాలకు వెళ్తుంటారు. అమెరికా, జపాన్, ఫ్రాన్స్, చైనా, ఆస్ట్రేలియా.. ఇలా ఆయా దేశాలకు వెళ్తుంటారు. అయితే ఈ ఏడాది ఫ్రాన్స్‌కు వెళ్లి చదవాలి అనుకునే విద్యార్థులకు ఆ దేశ సర్కారు శుభవార్త చెప్పింది. 2030 నాటికి మన దేశం నుంచి దాదాపు 30 వేల మంది విద్యార్థులను తమ దేశానికి ఆహ్వానించేందుకు సిద్ధమని ప్రకటించింది. 
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..

మరిన్ని విద్యాసంబంధ వార్తల కోసం క్లిక్ చేయండి..

Published at : 12 Sep 2023 11:44 PM (IST) Tags: Education News in Telugu ts eamcet seat allotment TS EAMCET 2023 Spot Counselling TS EAMCET Spot Counselling 2023 EAMCET Spot Counselling TS EAMCET Seat Allotment Result

ఇవి కూడా చూడండి

US Visa: రికార్డు స్థాయిలో స్టూడెంట్ వీసాలు- 3 నెలల్లో 90 వేల వీసాలు ఇచ్చిన అమెరికా

US Visa: రికార్డు స్థాయిలో స్టూడెంట్ వీసాలు- 3 నెలల్లో 90 వేల వీసాలు ఇచ్చిన అమెరికా

CTET 2023 Results: సీటెట్‌ (జులై) - 2023 ఫలితాలు విడుదల, రిజల్ట్స్‌ కోసం డైరెక్ట్ లింక్

CTET 2023 Results: సీటెట్‌ (జులై) - 2023 ఫలితాలు విడుదల, రిజల్ట్స్‌ కోసం డైరెక్ట్ లింక్

AP ECET: ఏపీఈసెట్‌ ఫార్మసీ కౌన్సెలింగ్‌ ప్రారంభం, సీట్ల కేటాయింపు ఎప్పుడంటే?

AP ECET: ఏపీఈసెట్‌ ఫార్మసీ కౌన్సెలింగ్‌ ప్రారంభం, సీట్ల కేటాయింపు ఎప్పుడంటే?

ANGRAU Admissions: ఎన్జీరంగా వ్యవసాయ వర్సిటీలో ప్రవేశాలకు 27 నుంచి వెబ్‌ ఆప్షన్లు

ANGRAU Admissions: ఎన్జీరంగా వ్యవసాయ వర్సిటీలో ప్రవేశాలకు 27 నుంచి వెబ్‌ ఆప్షన్లు

Scholarships: సంతూర్‌ స్కాలర్‌షిప్‌ ప్రోగ్రామ్‌ 2023-24, చివరితేది ఎప్పుడంటే?

Scholarships: సంతూర్‌ స్కాలర్‌షిప్‌ ప్రోగ్రామ్‌ 2023-24, చివరితేది ఎప్పుడంటే?

టాప్ స్టోరీస్

బీజేపీపార్టీ ప్ర‌తినిధా, రాష్ట్ర గవర్నరా ? తమిళిసై పై మంత్రి హరీశ్ రావు ఆగ్రహం

బీజేపీపార్టీ ప్ర‌తినిధా, రాష్ట్ర గవర్నరా ? తమిళిసై పై మంత్రి హరీశ్ రావు ఆగ్రహం

AP CAG: ఏపీలో గ్రామ, వార్డు సచివాలయాల ఏర్పాటును తప్పుపట్టిన కాగ్

AP CAG: ఏపీలో గ్రామ, వార్డు సచివాలయాల ఏర్పాటును తప్పుపట్టిన కాగ్

God Trailer: మీరు సెన్సిటివ్ అయితే ఈ ట్రైలర్ చూడకండి - డిస్టర్బింగ్ సైకోథ్రిల్లర్‌తో వచ్చిన జయం రవి!

God Trailer: మీరు సెన్సిటివ్ అయితే ఈ ట్రైలర్ చూడకండి - డిస్టర్బింగ్ సైకోథ్రిల్లర్‌తో వచ్చిన జయం రవి!

Hyundai Exter: ఈ కారు కొనాలంటే ఎనిమిది నెలల వరకు ఆగాల్సిందే - బ్లాక్‌బస్టర్ కదా ఆ మాత్రం ఉంటది!

Hyundai Exter: ఈ కారు కొనాలంటే ఎనిమిది నెలల వరకు ఆగాల్సిందే - బ్లాక్‌బస్టర్ కదా ఆ మాత్రం ఉంటది!