అన్వేషించండి

EAPCET 2021 Exams: కోవిడ్ పాజిటివ్ విద్యార్థులకు నో ఎంట్రీ.. ఎల్లుండి నుంచి ఈఏపీసెట్

ఈఏపీసెట్ ఇంజనీరింగ్ విభాగం పరీక్షలు ఆగస్టు 19, 20, 23, 24, 25 తేదీల్లో, అగ్రికల్చర్ & ఫార్మసీ విభాగం పరీక్షలను సెప్టెంబర్ 3, 6, 7 తేదీల్లో నిర్వహించనున్నట్లు మంత్రి ఆదిమూలపు సురేష్ వెల్లడించారు.

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇంజనీరింగ్‌, ఫార్మసీ, అగ్రికల్చర్‌ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే ఈఏపీసెట్‌ (ఇంజనీరింగ్, అగ్రికల్చర్ అండ్ ఫార్మసీ కామన్ ఎంట్రెన్స్ టెస్ట్) - పరీక్షల షెడ్యూల్‌ విడుదలైంది. ఈఏపీసెట్ ఇంజనీరింగ్ విభాగం పరీక్షలు ఆగస్టు 19, 20, 23, 24, 25 తేదీల్లో... అగ్రికల్చర్ అండ్ ఫార్మసీ విభాగం పరీక్షలను సెప్టెంబర్ 3, 6, 7 తేదీల్లో నిర్వహించనున్నట్లు రాష్ట్ర విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ వెల్లడించారు. మొత్తం 120 పరీక్ష కేంద్రాల్లో నిర్వహిస్తామని తెలిపారు. ఈ నెల 25న ఇంజనీరింగ్‌ ప్రాథమిక కీ విడుదల చేస్తామని పేర్కొన్నారు. ఈ పరీక్షల కోసం మొత్తం 2,59,156 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారని తెలిపారు. కోవిడ్ పాజిటివ్ విద్యార్థులకు పరీక్షకు అనుమతి ఉండదని స్పష్టం చేశారు.

Also Read: AP EAPCET 2021 Hall Ticket: ఈఏపీసెట్ హాల్ టికెట్లు విడుదల... మీ ఎగ్జామ్‌ ఎప్పుడో వెబ్‌సైట్‌లో చెక్ చేసుకోండి

రెండు సెషన్లలో పరీక్షలు..
ఈ పరీక్షలు మొత్తం రెండు సెషన్లలో జరగనున్నాయి. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు మొదటి సెషన్ .. మధ్యాహ్నం 3 నుంచి సాయంత్రం 6 గంటల వరకు రెండో సెషన్ ఉంటుంది. జేఎన్‌టీయూ కాకినాడ ఈ పరీక్షలు నిర్వహిస్తోంది. ఈఏపీసెట్‌ ద్వారా ఇంజనీరింగ్, బయోటెక్నాలజీ, బీటెక్‌ డెయిరీ టెక్నాలజీ, బీటెక్‌ అగ్రి ఇంజనీరింగ్, బీటెక్‌ ఫుడ్‌ సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ, బీఎస్సీ (హార్టికల్చర్‌), బీఎస్సీ (అగ్రి), బీవీఎస్సీ అండ్‌ ఏహెచ్‌/ బీఎఫ్‌ఎస్సీ, బీ-ఫార్మసీ, ఫార్మా డీ కోర్సులలో ప్రవేశాలు పొందవచ్చు. 

Also Read: CBSE Class 10, 12 Result Update: ఈ నెల 25 నుంచి సీబీఎస్ఈ ఇంప్రూవ్‌మెంట్ పరీక్షలు.. ఇవే పూర్తి వివరాలు

ఇంట‌ర్ వెయిటేజీ తొల‌గింపు..
ఇంజనీరింగ్‌, అగ్రికల్చర్‌, ఫార్మా కాలేజీల‌లో ప్రవేశాలకు ఇంటర్‌ వెయిటేజ్‌ మార్కుల‌ను తొల‌గించిన‌ట్లు రాష్ట్ర ఇంట‌ర్ బోర్డు వెల్లడించింది. కోవిడ్ కార‌ణంగా ఇంట‌ర్ ప‌రీక్ష‌ల‌ను స‌జావుగా నిర్వ‌హించ‌డానికి అవ‌కాశం లేక‌పోవ‌డంతో ఏపీ ఉన్న‌త విద్యా మండ‌లి కొన్ని మార్పులు చేసింది. ఈ ఎంట్ర‌న్స్ ప‌రీక్ష‌ల‌లో గ‌తేడాది వ‌ర‌కు విద్యార్థుల ఇంట‌ర్ మార్కులకు 25 శాతం వెయిటేజీ ఇచ్చేవారు. ఈ ఏడాది ఈఏపీసెట్ ఫ‌లితాన్ని 100శాతం రాత పరీక్ష మార్కులతో ఇవ్వ‌నున్న‌ట్లు అధికారులు వెల్ల‌డించారు. ఎంట్ర‌న్స్ ఎగ్జామ్ మార్కుల ఆధారంగా విద్యార్థులు ఇంజనీరింగ్, ఫార్మా, అగ్రిక‌ల్చ‌ర్ కాలేజీల‌లో ప్రవేశాలు పొందుతార‌ని ఏపీ ఉన్నత విద్యామండలి కార్యదర్శి సుధీర్‌ ప్రేమ్‌ కుమార్ తెలిపారు. 

Also Read: AP LPCET 2021: ఏపీలో లాంగ్వేజ్ పండిట్ కోర్సు ప్రవేశాలు.. ఎల్‌పీసెట్‌ నోటిఫికేషన్ విడుదల..

టాప్ హెడ్ లైన్స్

Congress Politics: గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై కాంగ్రెస్ స్పెషల్ ఫోకస్.. 77 మంది ఇంఛార్జిల నియామకం!
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై కాంగ్రెస్ స్పెషల్ ఫోకస్.. 77 మంది ఇంఛార్జిల నియామకం!
Indrakeeladri Dasara: కనకదుర్గమ్మకు పట్టువస్త్రాలు సమర్పించిన సీఎం చంద్రబాబు.. మూలానక్షత్రం కావడంతో పోటెత్తిన భక్తజనం
కనకదుర్గమ్మకు పట్టువస్త్రాలు సమర్పించిన సీఎం చంద్రబాబు.. మూలానక్షత్రం కావడంతో పోటెత్తిన భక్తజనం
Gade Sai Krishna CBI Investigation: సీబీఐ చేతికి గాదె సాయికృష్ణ కేసు.. తల్లికి రూ.25 లక్షల పరిహారం- హైకోర్టు కీలక తీర్పు
సీబీఐ చేతికి గాదె సాయికృష్ణ కేసు.. తల్లికి రూ.25 లక్షల పరిహారం- హైకోర్టు కీలక తీర్పు
Google Search: గూగుల్ సెర్చ్‌లో కీలక మార్పులు.. AI ఓవర్ వ్యూస్‌తో పాటు వెబ్‌సైట్ లింక్‌లకు చోటు
గూగుల్ సెర్చ్‌లో కీలక మార్పులు.. AI ఓవర్ వ్యూస్‌తో పాటు వెబ్‌సైట్ లింక్‌లకు చోటు

వీడియోలు

Why North India Worships Rama & South Devi on Dussehra | దసరా అసలు కథ ఇదే
Fresh Snowfall Blankets Gulmarg Apharwat Peak Tourists Thrilled As Winter Early Arrival Jammu Kashmir | జమ్మూకశ్మీర్‌లో మొదలైన మంచు పండగ.. గుల్‌మార్గ్ అఫర్వాత్ పీక్‌ను కప్పేసిన తెల్లటి హిమపాతం
Tilak Varma Breaks Silence on Run Out Confusion | రనౌట్ పై నోరు విప్పిన తిలక్
IND vs WI 4th T20 Shreyas Iyer | ఉప్పల్‌లో ఓటమిపై కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ కామెంట్స్
West Indies Beat India by 24 Runs | ఉప్పల్‌లో వెస్టిండీస్ విధ్వంసం.. నాలుగో టీ20లో భారత్ ఓటమి

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Congress Politics: గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై కాంగ్రెస్ స్పెషల్ ఫోకస్.. 77 మంది ఇంఛార్జిల నియామకం!
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై కాంగ్రెస్ స్పెషల్ ఫోకస్.. 77 మంది ఇంఛార్జిల నియామకం!
Indrakeeladri Dasara: కనకదుర్గమ్మకు పట్టువస్త్రాలు సమర్పించిన సీఎం చంద్రబాబు.. మూలానక్షత్రం కావడంతో పోటెత్తిన భక్తజనం
కనకదుర్గమ్మకు పట్టువస్త్రాలు సమర్పించిన సీఎం చంద్రబాబు.. మూలానక్షత్రం కావడంతో పోటెత్తిన భక్తజనం
Gade Sai Krishna CBI Investigation: సీబీఐ చేతికి గాదె సాయికృష్ణ కేసు.. తల్లికి రూ.25 లక్షల పరిహారం- హైకోర్టు కీలక తీర్పు
సీబీఐ చేతికి గాదె సాయికృష్ణ కేసు.. తల్లికి రూ.25 లక్షల పరిహారం- హైకోర్టు కీలక తీర్పు
Google Search: గూగుల్ సెర్చ్‌లో కీలక మార్పులు.. AI ఓవర్ వ్యూస్‌తో పాటు వెబ్‌సైట్ లింక్‌లకు చోటు
గూగుల్ సెర్చ్‌లో కీలక మార్పులు.. AI ఓవర్ వ్యూస్‌తో పాటు వెబ్‌సైట్ లింక్‌లకు చోటు
AP Local Body Elections: బెడిసికొట్టిన క్రేజీ కళ్యాణం.. పదవి కోసం హడావుడిగా టీడీపీ నేత పెళ్లి.. ఊహించని ట్విస్ట్
బెడిసికొట్టిన క్రేజీ కళ్యాణం.. పదవి కోసం హడావుడిగా టీడీపీ నేత పెళ్లి.. ఊహించని ట్విస్ట్
CJP Protest: అభిజీత్ దీప్కే ఇంటికి వెళ్లి నోటీసులు ఇచ్చిన ఢిల్లీ పోలీసులు.. జైలుకైనా సరే వెళ్తామన్న సీజేపీ నేత
అభిజీత్ దీప్కే ఇంటికి వెళ్లి నోటీసులు ఇచ్చిన ఢిల్లీ పోలీసులు.. జైలుకైనా సరే వెళ్తామన్న CJP నేత
Narnia Telugu Trailer : నార్నియా సరికొత్త ప్రపంచం - లేటెస్ట్ విజువల్ వండర్ తెలుగు ట్రైలర్ రివ్యూ
నార్నియా సరికొత్త ప్రపంచం - లేటెస్ట్ విజువల్ వండర్ తెలుగు ట్రైలర్ రివ్యూ
Vijaya Dairy Milk Price: విజయ పాల ధరల పెంపు... అక్టోబర్ 17 నుంచి కొత్త ధరలు అమల్లోకి
విజయ పాల ధరల పెంపు... అక్టోబర్ 17 నుంచి కొత్త ధరలు అమల్లోకి
Embed widget