Dr YSR UHS: డాక్టర్ వైఎస్సార్ హెల్త్ యూనివర్సిటీలో బీఎస్సీ నర్సింగ్ కోర్సు, దరఖాస్తుకు చివరితేది ఎప్పుడంటే?
విజయవాడలోని డాక్టర్ వైఎస్సార్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ కాంపిటెంట్ అథారిటీ కోటా కింద బీఎస్సీ(నర్సింగ్) కోర్సులో ప్రవేశానికి నోటిఫికేషన్ విడుదల చేసింది.
విజయవాడలోని డాక్టర్ వైఎస్సార్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్... 2023-24 విద్యా సంవత్సరానికి వర్సిటీ పరిధిలోని నర్సింగ్ కళాశాలల్లో కాంపిటెంట్ అథారిటీ కోటా కింద బీఎస్సీ(నర్సింగ్) కోర్సులో ప్రవేశానికి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇంటర్ (బైపీసీ)తోపాటు ఏపీ ఈఏపీసెట్-2023లో అర్హులైన అభ్యర్థులు ఆగస్టు 17 లోగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.
కోర్సు వివరాలు..
* బీఎస్సీ(నర్సింగ్) కోర్సు
వ్యవధి: నాలుగేళ్ల డిగ్రీ కోర్సు.
అర్హత: ఇంటర్మీడియట్(ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ) ఉత్తీర్ణతతో పాటు ఏపీ ఈఏపీసెట్-2023లో అర్హత సాధించి ఉండాలి.
ఏపీ ఈఏపీసెట్-2023 కటాఫ్ స్కోర్: జనరల్ కేటగిరీ-35682 ర్యాంకు వరకు, బీసీ/ ఎస్టీ/ ఎస్సీ, బీసీ/ ఎస్టీ/ ఎస్సీ, దివ్యాంగులు- 42820 ర్యాంకు వరకు, జనరల్ కేటగిరీ దివ్యాంగులు- 38058 ర్యాంకు వరకు.
వయోపరిమితి: 31.12.2023 నాటికి 17 నుంచి 35 సంవత్సరాల మధ్య ఉండాలి.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.
ఎంపిక ప్రక్రియ: ఏపీ ఈఏపీసెట్-2023 ర్యాంక్, రిజర్వేషన్ రూల్ ఆధారంగా.
ప్రాసెసింగ్ ఫీజు: ఓసీ అభ్యర్థులకు రూ.2,360, బీసీ/ ఎస్టీ/ ఎస్సీ అభ్యర్థులకు రూ.1,888.
ముఖ్యమైన తేదీలు..
➥ ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 29.07.2023.
➥ ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరితేది: 17.08.2023.
ALSO READ:
వైఎస్సార్ హెల్త్ యూనివర్సిటీలో పోస్ట్ బేసిక్ నర్సింగ్ కోర్సు, చివరితేదీ ఎప్పుడంటే?
విజయవాడలోని డాక్టర్ వైఎస్సార్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్... 2023-24 విద్యా సంవత్సరానికి వర్సిటీ పరిధిలోని నర్సింగ్ కళాశాలల్లో కాంపిటెంట్ అథారిటీ కోటా కింద పోస్ట్ బేసిక్ బీఎస్సీ(నర్సింగ్) కోర్సులో ప్రవేశానికి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇంటర్మీడియట్‌తో పాటు నర్సింగ్ కౌన్సిల్ గుర్తింపు పొందిన జీఎన్‌ఎం కోర్సులో ఉత్తీర్ణులై అర్హులైన అభ్యర్థులు కోర్సుకు అర్హులు. సరైన అర్హతున్నవారు ఆగస్టు 17లోగా ఆన్‌లైన్‌లో దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది.
నర్సింగ్ కోర్సు పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..
కొత్త మెడికల్ కాలేజీల కన్వీనర్ కోటా పీజీ సీట్లు తెలంగాణ విద్యార్థులకే, వైద్యారోగ్యశాఖ ఉత్తర్వులు
తెలంగాణలో 2014 జూన్ 2 తేదీ తర్వాత ప్రారంభించిన అన్ని మెడికల్ కాలేజీల్లో అందుబాటులో ఉన్న కన్వీనర్ కోటా పీజీ సీట్లన్నీ రాష్ట్ర విద్యార్థులకే దక్కనున్నాయి. ఈ మేరకు రిజర్వేషన్లలో మార్పులు చేస్తూ రాష్ట్ర వైద్యారోగ్యశాఖ కార్యదర్శి రిజ్వీ జులై 29న అధికారిక ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో 117 సీట్లు అదనంగా రాష్ట్ర విద్యార్థులకు దక్కనున్నాయి.
పూర్తివివరాల కోసం క్లిక్ చేయండి..
నీట్ పీజీ కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదల, నాలుగు దశల్లో కౌన్సెలింగ్ నిర్వహణ!
దేశవ్యాప్తంగా వైద్య కళాశాలల్లో 2023-24వ సంవత్సరానికి సంబంధించిన పీజీ మెడికల్ కౌన్సెలింగ్ షెడ్యూలును మెడికల్ కౌన్సెలింగ్ కమిటీ (ఎంసీసీ) ప్రకటించింది. ఆల్‌ఇండియా కోటా కింద మెడికల్ కాలేజీల్లోని 50 శాతం సీట్లతో పాటు డీమ్డ్, సెంట్రల్ యూనివర్సిటీల్లో ఎండీ, ఎంఎస్, డిప్లొమా, పీజీ డీఎన్‌బీ, ఎండీఎస్ కోర్సుల్లో ప్రవేశాల కోసం మొత్తం 4 రౌండ్లలో కౌన్సెలింగ్ నిర్వహించనున్నారు. నీట్ పీజీ పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులు కౌన్సెలింగ్ రిజిస్ట్రేషన్ ఫీజు కింద రూ.1000 చెల్లించాల్సి ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, పీడబ్ల్యూడీ అభ్యర్థులు రూ.500 చెల్లిస్తే సరిపోతుంది. డీమ్డ్ యూనివర్సిటీలకు దరఖాస్తు చేసుకునేవారు రూ.5000 చెల్లించాల్సి ఉంటుంది.
కౌన్సెలింగ్ పూర్తి షెడ్యూలు కోసం క్లిక్ చేయండి..