NEET-PG Counselling: నీట్ పీజీ కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదల, నాలుగు దశల్లో కౌన్సెలింగ్ నిర్వహణ!
దేశవ్యాప్తంగా వైద్య కళాశాలల్లో 2023-24వ సంవత్సరానికి సంబంధించిన పీజీ మెడికల్ కౌన్సెలింగ్ షెడ్యూలును మెడికల్ కౌన్సెలింగ్ కమిటీ (ఎంసీసీ) ప్రకటించింది.
దేశవ్యాప్తంగా వైద్య కళాశాలల్లో 2023-24వ సంవత్సరానికి సంబంధించిన పీజీ మెడికల్ కౌన్సెలింగ్ షెడ్యూలును మెడికల్ కౌన్సెలింగ్ కమిటీ (ఎంసీసీ) ప్రకటించింది. ఆల్‌ఇండియా కోటా కింద మెడికల్ కాలేజీల్లోని 50 శాతం సీట్లతో పాటు డీమ్డ్, సెంట్రల్ యూనివర్సిటీల్లో ఎండీ, ఎంఎస్, డిప్లొమా, పీజీ డీఎన్‌బీ, ఎండీఎస్ కోర్సుల్లో ప్రవేశాల కోసం మొత్తం 4 రౌండ్లలో కౌన్సెలింగ్ నిర్వహించనున్నారు. నీట్ పీజీ పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులు కౌన్సెలింగ్ రిజిస్ట్రేషన్ ఫీజు కింద రూ.1000 చెల్లించాల్సి ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, పీడబ్ల్యూడీ అభ్యర్థులు రూ.500 చెల్లిస్తే సరిపోతుంది. డీమ్డ్ యూనివర్సిటీలకు దరఖాస్తు చేసుకునేవారు రూ.5000 చెల్లించాల్సి ఉంటుంది.
ప్రకటించిన షెడ్యూలు ప్రకారం..
➥ మొదటి రౌండ్‌కు సంబంధించి జులై 27 నుంచి ఆగస్టు 1 వరకు రిజిస్ట్రేషన్ ప్రక్రియ కొనసాగనుంది. జులై 28 నుంచి ఆగస్టు 2 వరకు ఆప్షన్ల నమోదుకు అవకాశం కల్పించారు. ఆగస్టు 3, 4 తేదీల్లో సీట్ల కేటాపుంపు ప్రాసెస్ కొనసాగనుంది. అనంతరం ఆగస్టు 5న సీట్లను కేటాయించనున్నారు. సీట్లు పొందిన అభ్యర్థులు ఆగస్టు 6న సంబంధిత డాక్యుమెంట్లు అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది. ఆగస్టు 7 నుంచి 13 వరకు సంబంధిత కళాశాలలో రిపోర్టింగ్ చేయాల్సి ఉంటుంది.
➥ రెండో రౌండ్‌కు సంబంధించి ఆగస్టు 17 నుంచి 21 వరకు రిజిస్ట్రేషన్ ప్రక్రియ కొనసాగనుంది. ఆగస్టు 18 నుంచి 22 వరకు ఆప్షన్ల నమోదుకు అవకాశం కల్పించారు. ఆగస్టు 23, 24 తేదీల్లో సీట్ల కేటాపుంపు ప్రాసెస్ కొనసాగనుంది. అనంతరం ఆగస్టు 25న సీట్లను కేటాయించనున్నారు. సీట్లు పొందిన అభ్యర్థులు ఆగస్టు 26న సంబంధిత డాక్యుమెంట్లు అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది. ఆగస్టు 27 నుంచి సెప్టెంబరు 4 వరకు సంబంధిత కళాశాలలో రిపోర్టింగ్ చేయాల్సి ఉంటుంది.
➥ మూడో రౌండ్‌కు సంబంధించి సెప్టెంబరు 7 నుంచి 12 వరకు రిజిస్ట్రేషన్ ప్రక్రియ కొనసాగనుంది. సెప్టెంబరు 8 నుంచి 12 వరకు ఆప్షన్ల నమోదుకు అవకాశం కల్పించారు. సెప్టెంబరు 14, 15 తేదీల్లో సీట్ల కేటాపుంపు ప్రాసెస్ కొనసాగనుంది. అనంతరం సెప్టెంబరు 16న సీట్లను కేటాయించనున్నారు. సీట్లు పొందిన అభ్యర్థులు సెప్టెంబరు 17న సంబంధిత డాక్యుమెంట్లు అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది. సెప్టెంబరు 18 నుంచి 25 వరకు సంబంధిత కళాశాలలో రిపోర్టింగ్ చేయాల్సి ఉంటుంది.
మిగిలిన సీట్ల భర్తీకి 'స్ట్రే' వేకెన్సీ రౌండ్..
మూడు విడతల కౌన్సెలింగ్ తర్వాత మిగిలిన సీట్లను 'స్ట్రే' వేకెన్సీ రౌండ్ ద్వారా భర్తీ చేయనున్నారు. ఈ రౌండ్‌కు సంబంధించి సెప్టెంబరు 28 నుంచి 30 వరకు రిజిస్ట్రేషన్ ప్రక్రియ కొనసాగనుంది. సెప్టెంబరు 29 నుంచి అక్టోబరు 1 వరకు ఆప్షన్ల నమోదుకు అవకాశం కల్పించారు. అక్టోబరు 2, 3 తేదీల్లో సీట్ల కేటాపుంపు ప్రాసెస్ కొనసాగనుంది. అనంతరం అక్టోబరు 4న సీట్లను కేటాయించనున్నారు. సీట్లు పొందిన విద్యార్థులు అక్టోబరు 5న సంబంధిత కళాశాలలో రిపోర్టింగ్ చేయాల్సి ఉంటుంది.
కౌన్సెలింగ్ పూర్తి షెడ్యూలు ఇలా..
↪ మొదటి విడత కౌన్సెలింగ్..
* రిజిస్ట్రేషన్, ఫీజు చెల్లింపు: 27.07.2023 - 01.08.2023.
* ఛాయిస్ ఫిల్లింగ్, లాకింగ్: 28.07.2023 - 02.08.2023.
* సీటు కేటాయింపు ప్రాసెసింగ్: 03.08.2023, 04.08.2023.
* సీట్ల కేటాయింపు: 05.08.2023.
* అప్‌లోడింగ్ డాక్యుమెంట్స్: 06.08.2023.
* సంబంధిత కళాశాలలో రిపోర్టింగ్: 07.08.2023 - 13.08.2023.
↪ రెండో విడత కౌన్సెలింగ్..
* రిజిస్ట్రేషన్, ఫీజు చెల్లింపు: 17.08.2023 - 21.08.2023.
* ఛాయిస్ ఫిల్లింగ్, లాకింగ్: 18.08.2023 - 22.08.2023.
* సీటు కేటాయింపు ప్రాసెసింగ్: 23.08.2023, 24.08.2023.
* సీట్ల కేటాయింపు: 25.08.2023.
* అప్‌లోడింగ్ డాక్యుమెంట్స్: 26.08.2023.
* సంబంధిత కళాశాలలో రిపోర్టింగ్: 27.08.2023 - 04.09.2023.
↪ మూడో విడత కౌన్సెలింగ్..
* రిజిస్ట్రేషన్, ఫీజు చెల్లింపు: 07.09.2023 - 12.09 .2023.
* ఛాయిస్ ఫిల్లింగ్, లాకింగ్: 08.09.2023 - 13.09.2023.
* సీటు కేటాయింపు ప్రాసెసింగ్: 14.09.2023, 15.09.2023.
* సీట్ల కేటాయింపు: 16.09.2023.
* అప్‌లోడింగ్ డాక్యుమెంట్స్: 17.09.2023.
* సంబంధిత కళాశాలలో రిపోర్టింగ్: 18.09.2023 - 25.09.2023.
'స్ట్రే; వేకెన్సీ రౌండ్ కౌన్సెలింగ్..
* రిజిస్ట్రేషన్, ఫీజు చెల్లింపు: 28.09.2023 - 30.09 .2023.
* ఛాయిస్ ఫిల్లింగ్, లాకింగ్: 29.09.2023 - 01.10.2023.
* సీటు కేటాయింపు ప్రాసెసింగ్: 02.10.2023, 03.10.2023.
* సీట్ల కేటాయింపు: 04.10.2023.
* సంబంధిత కళాశాలలో రిపోర్టింగ్: 05.10.2023.